ఈ రోజు రాశిఫలాలు చదవండి.. మీ జీవన గమనానికి బాటలు వేయండి..!

ఈ రోజు రాశిఫలాలు చదవండి.. మీ జీవన గమనానికి బాటలు వేయండి..!

ఈ రోజు (ఏప్రిల్ 26) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం..


మేషం (Aries) – గతం నుండి నేర్చుకున్న పాఠాల ఆధారంగా భద్రమైన భవిష్యత్తుని ఏర్పాటు చేసుకొనేందుకు ప్రయత్నించండి. అనవసరంగా పాత విషయాలను గురించి ఆలోచిస్తూ సమయం వ్యర్థం చేసుకోకండి. మీరు ఏం చేయాలన్నా; ఎలాంటి ఫలితం పొందాలని అనుకున్నా అందుకు ఇదే సరైన సమయం.


వృషభం (Tarus) – మీకు ఇప్పటివరకు ఉన్న ప్రతి అనుభవం మీకు ఏదో ఒక పాఠం నేర్పే ఉంటుంది. మీ జీవితంలో ఏం జరిగినా అది మీ మంచికే అని గ్రహించండి. మీరేం చేయాలో అది చేయండి


మిథునం (Gemini) – ప్రస్తుతం మీ ప్రయాణాన్ని ఒంటరిగా, స్వతంత్రంగానే కొనసాగించండి. మీకున్న శక్తి, సామర్థ్యాలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. మీరు దేనినైనా సాధించగలరు.


కర్కాటకం (Cancer) – ప్రతి చిన్న విషయాన్నీ స్పష్టంగా గమనించండి. మీతో ఇతరులు చెప్పే మాటల వెనుక ఉన్న అర్థాలను తెలుసుకునేందుకు ప్రయత్నించండి. ఏవైనా పత్రాలపై సంతకం చేసే ముందు పూర్తిగా చదవడం చాలా మంచిది. ఒక నిర్ణయాన్ని తీసుకొనేముందుకు.. నూటికి పదిసార్లు ఆలోచించి ఒక కొలిక్కి రావడం మంచిది. 


సింహం (Leo) – మీకు కొన్ని ప్రశ్నలకు లేదా సమస్యలకు పరిష్కార మార్గాలు తెలియాలంటే స్పష్టత చాలా అవసరం. ఇందుకోసం ధ్యానం చేయండి. దీని ద్వారా మీరు పునరుత్తేజం పొందడమే కాదు.. మీరు భవిష్యత్తులో ఏం చేయాలనే విషయంలోనూ స్పష్టత వస్తుంది.


క‌న్య (Virgo) – మీరెప్పటి వరకు నీతి, నిజాయతీలతో జీవిస్తారో అప్పటివరకు మీరనుకున్నవన్నీ తప్పకుండా సాధిస్తారు. ఒక్కోసారి మీరు సరైన మార్గంలో లేరని మీకనిపించినా అది నిజం కాకపోవచ్చు. ధైర్యంగా, నిజాయితీగా జీవించండి. మీ నమ్మకం వమ్ము కాదు.


తుల (Libra) – మీకున్న ఆలోచనలు, నమ్మకాలు, భావాలే మీ జీవితంలో జరిగే సంఘటనలను నిర్దేశిస్తాయి. మరి, మీ ఆలోచనలను మీరు గమనించుకుంటున్నారా? పాజిటివ్‌గా ఆలోచించండి. ముఖ్యంగా మీరు మీలానే ఉండండి.


వృశ్చికం (Scorpio) – క్షమాగుణం కలిగి ఉండడం చాలా ముఖ్యం. లేదంటే అందరిపై ఉన్న కోపం, చిరాకు కారణంగా ప్రశాంతంగా జీవించడం సాధ్యం కాదు. ఎక్కువ నీళ్లు తాగండి. సరిపడా నిద్రపోండి. మీ చుట్టూ ఉన్నవారినే కాదు.. మిమ్మల్నీ మీరు క్షమించుకోండి. చేసిన తప్పుడు మళ్లీ చేయకుండా జాగ్రత్తపడండి.


ధనుస్సు (Saggitarius) – ప్రేమను పంచుకోవడమే కాదు.. దానిని వ్యక్తం చేయడం కూడా ముఖ్యమే. మీకు ఈ భావన త్వరలోనే కలగనుంది. అయితే అది తల్లిదండ్రులు లేదా తోబుట్టువులు.. మీ జీవిత భాగస్వామి.. ఇలా ఎవరి నుంచైనా కావచ్చు. త్వరలోనే మీరు, మీ భాగస్వామి ఓ కొత్త ప్రేమైక జీవితాన్ని ప్రారంభిస్తారు.


మకరం (Capricorn) – మీరు ముందుకు వెళ్లే దారిలో ఉండే అడ్డంకులను తొలగించుకోవడంలో మీ తెలివితేటలే మీకు ఉపయోగపడతాయి. మున్ముందు కూడా ఇలాగే ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి. మీ ఊహించని సంఘటన మీ జీవితాన్ని మలుపు తిప్పనుంది. 


కుంభం (Aquarius) – మీలో ఉన్న క్రియేటివిటీ పై నమ్మకంతో సానుకూల భావధోరణితో ఆలోచించి ముందుకు వెళ్లండి. మీ బుర్రలో ఉన్న ఆలోచనలను క్రమంగా అమల్లో పెట్టండి. ప్రస్తుతం మీ జీవితంలో కొన్ని బంధాలు లేదా కెరీర్ కొత్తగా ప్రారంభమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


మీనం (Pisces) – మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన మీకు ఒక పాఠం నేర్పిస్తుంది. అలాగే ప్రతి వ్యక్తి నుంచి మీరు నేర్చుకోవాల్సిన ఏదో ఒక అంశం తప్పకుండా ఉంటుంది. కాబట్టి మీకు అవసరమైన నైపుణ్యాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్లండి. 


Credit: Asha Shah


ఇవి కూడా చ‌ద‌వండి


నేటి రాశిఫలాలు చదవండి.. మీ జీవిత లక్ష్యాలను సాధించుకోండి..!


ఈ రోజు రాశిఫలాలు వీక్షించండి - మీ లక్ష్యసాధనలోని ఆటంకాలను తొలిగించుకోండి


ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!