కలర్ ఫుల్ అండ్ కూల్ ఫ్యాషన్స్.. 'జెర్సీ' ఫేమ్ శ్రద్ధ శ్రీ‌నాథ్ సొంతం..!

కలర్ ఫుల్ అండ్ కూల్ ఫ్యాషన్స్.. 'జెర్సీ' ఫేమ్ శ్రద్ధ శ్రీ‌నాథ్ సొంతం..!

శ్రద్ధ శ్రీ‌నాథ్ (Shraddha srinath).. ప్ర‌స్తుతం తెలుగు సినీ అభిమానుల‌కు ప్ర‌త్యేకించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. తొలిచిత్రం జెర్సీతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సొంతం చేసుకున్న ఈ సుంద‌రి ఫ్యాష‌న్స్ విష‌యంలో ఎవ‌రికీ తీసిపోద‌ని మీకు తెలుసా??


పైగా ఆమె ఫాలో అయ్యే ఫ్యాష‌న్స్ సైతం క‌ల‌ర్ ఫుల్‌గా ఉండ‌డం మాత్ర‌మే కాదు.. కూల్ లుక్‌ని ఇస్తూ న‌లుగురిలోనూ ఆమెను ప్ర‌త్యేకంగా క‌నిపించేలానూ చేస్తాయి. కావాలంటే ఆమె స్టైల్ ఫైల్‌లోని కొన్ని అవుట్ ఫిట్స్‌ని మీరే చూడండి.. మేం చెప్పింది నిజ‌మే అని స‌మ్మ‌తించ‌క మాన‌రు.

* మ‌నం ధ‌రించే డ్ర‌స్ చాలా సింపుల్‌గా ఉండాలి. అలాగే అది మ‌న‌ల్ని న‌లుగురిలోనూ స‌మ్ థింగ్ స్పెష‌ల్ అనిపించేలా చేయాలని ఆశించ‌ని అమ్మాయిలుంటారా??


అందులోనూ కాలేజీ అమ్మాయిల‌కైతే ఈ ఆశ ఇంకాస్త బ‌లంగానే ఉంటుంది. అందుకే అలాంటి వారు శ్ర‌ద్ధ ధ‌రించిన ఇలాంటి సింపుల్ అవుట్ ఫిట్స్‌తో స్పెష‌ల్‌గా మెరిసిపోవ‌చ్చు. లైట్ అండ్ డార్క్ క‌ల‌ర్ కాంబినేష‌న్‌లో కేప్‌తో డిజైన్ చేసిన ఈ అవుట్ ఫిట్ చూస్తే సింప్లీ సూప‌ర్బ్ అనిపిస్తోంది క‌దూ!

* వేసుకున్న డ్ర‌స్ అందంగా క‌నిపించాలంటే అది హెవీగా డిజైన్ చేసి ఉండాల్సిన అవ‌స‌రం లేదు. మంచి క‌ల‌ర్ ఫుల‌్ కాంబినేష‌న్ ఉన్నా స‌రిపోతుంది. కావాలంటే మీరే చూడండి.. వైట్ అండ్ ఆరెంజ్ క‌ల‌ర్ కాంబోకి వైట్ అండ్ గ్రీన్ క‌ల‌ర్ స్టోన్స్ పొదిగి ఉన్న నెక్లెస్‌ని జ‌త చేస్తే ఎంత బాగుందో క‌దూ..

* మ‌ల్టీ క‌ల‌ర్ అవుట్ ఫిట్స్ వేసుకోవ‌డం కూడా ఒక ఆర్ట్. అందుకే అది అంద‌రికీ సెట్ కాక‌పోవ‌చ్చు. దాన్ని వేసుకునేట‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది. లైట్ క‌ల‌ర్ ఎక్కువ‌గా హైలైట్ చేస్తూ మిగ‌తా క‌ల‌ర్స్‌తో కాంబినేష‌న్‌‌గా రూపొందించిన ఈ లాంగ్ ఫ్రాక్‌‌లో శ్ర‌ద్ధ ఎంత అందంగా మెరిసిపోతోందో చూడండి.. పైగా యాక్సెస‌రీస్ కూడా పెద్ద‌గా ఏమీ ఉప‌యోగించ‌లేదు.

* ప‌ర్పుల్ క‌ల‌ర్‌కి కాంబినేష‌న్‌గా ఏ క‌ల‌ర్ ఎంపిక చేసుకోవాల‌న్నా.. చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది. లేదంటే లుక్ మొత్తం ఎబ్బెట్టుగా క‌నిపించ‌వ‌చ్చు. అయితే శ్ర‌ద్ధ ధ‌రించిన ఈ ప‌ర్పుల్ అండ్ గ్రీన్ కాంబినేష‌న్ మాత్రం భ‌లేగా ఉంద‌నిపిస్తోంది క‌దూ. పైగా కాలేజీ‌లో జ‌రిగే ఫెస్టివ‌ల్ సెల‌బ్రేష‌న్స్‌కి ఇది చ‌క్క‌ని ఎంపిక‌.

* ప్ర‌కాశ‌వంత‌మైన క‌ల‌ర్ కాంబోలో రెడ్ అండ్ బ్లూ కూడా ఒక‌టి. అలాంటి అదిరిపోయే కాంబినేష‌న్‌లో డ్ర‌స్ చేసుకుంటే ఆ లుక్ ఎలా ఉంటుందో తెలుసా?? ఒక్క‌సారి శ్ర‌ద్ధ ధ‌రించిన అవుట్ ఫిట్ చూస్తే మీకే అర్థ‌మ‌వుతుంది. చ‌క్క‌ని చోక‌ర్ ఒక్క‌టి జ‌త చేసి సింపుల్‌గా ఎలా మెరిసిపోతోందో చూడండి.

* కాలేజీ అమ్మాయిలు అమితంగా ఇష్ట‌ప‌డే ఫ్యాష‌న్స్‌లో బొహీమియ‌న్ ఫ్యాష‌న్ కూడా ఒక‌టి. అలాంటి బొహీమియ‌న్ ట్రెండ్ బాట‌మ్ ఎంపిక చేసుకుని.. దానికి ప్లెయిన్ వైట్ క‌ల‌ర్ టాప్‌ని జ‌త చేసి క్యూట్‌గా ఎలా క‌నిపిస్తోందో చూడండి. పైగా దానికి స్టేట్ మెంట్ చెయిన్ త‌ప్ప యాక్సెస‌రీస్ కూడా పెద్ద‌గా పెట్టుకోక‌పోవ‌డం విశేషం.

* లెహెంగా ధ‌రించిన‌ప్పుడు దానికి జ‌త‌గా దుప‌ట్టా ధ‌రించ‌డం అంద‌రూ చేసే ప‌నే. మ‌రి, మ‌న ట్రెండ్ అంటూ కాస్త ప్ర‌త్యేకంగా ఉండాలి క‌దా.. అందుకే లెహెంగాకు జ‌త‌గా కేప్ లేదా ఓవ‌ర్ కోట్ ధ‌రిస్తే ఎలా ఉంటుంది?? అదెలా ఉంటుందో తెలియాలంటే శ్ర‌ద్ధ ధ‌రించిన బ్లాక్ క‌ల‌ర్ లెహెంగా చూడాల్సిందే..

* ర‌ఫెల్డ్ ఫ్యాష‌న్స్‌లో ఫ్రాక్ ధ‌రిస్తే ఎంత బాగుంటుందో మ‌నంద‌రికీ తెలుసు. అయితే అది చిన్న‌పిల్ల‌ల‌కే ప‌రిమితం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. మీరూ అలానే అనుకుంటున్నారా?? అయితే మీరు పొర‌ప‌డిన‌ట్లే. శ్ర‌ద్ధ ధ‌రించిన ర‌ఫెల్డ్ ఫ్రాక్‌ని చూడండి. పోల్కా డాట్స్‌తో వైట్ లేస్ లైనింగ్‌తో సింపుల్ గానే సూప‌ర్బ్‌గా క‌నిపిస్తోంది.


ఇవి కూడా చదవండి


భిన్నమైన లెహెంగా డిజైన్స్ తో స్టైల్ ఐకాన్ గా గుర్తింపు తెచ్చుకున్న కియారా..


స్టైలిస్ట్ అవుట్ ఫిట్స్‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా.. నిలుస్తోన్న సంజ‌నా గ‌ల్రానీ..!


నటనతోనే కాదు.. తన ఫ్యాషన్స్ తోనూ ఆకట్టుకుంటోన్న తెలుగమ్మాయి ఈషా రెబ్బా..