ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
Real love story: నువ్వీ దరినీ.. నేనా దరినీ.. వాట్సాప్ కలిపింది ఇద్దరినీ..

Real love story: నువ్వీ దరినీ.. నేనా దరినీ.. వాట్సాప్ కలిపింది ఇద్దరినీ..

ఇద్దరు వ్యక్తుల మధ్య పుట్టే ప్రేమ చాలా గొప్పది. దాన్నినిలబెట్టుకోవడానికి అంత కంటే గొప్ప శ్రమ అవసరం. అలా జరగనప్పుడు ఆ ప్రేమ బంధం విఫలమవుతుంది. బహుశా.. నా ప్రేమ కూడా అలాగే విఫలమై ఉంటుంది. ఒకరి మీద ప్రేమ పుట్టడం ఎంత కష్టమో.. అది విఫలమైనప్పుడు ఆ బాధ నుంచి బయటపడటం కూడా అంతే కష్టం. అది మనసుని మెలిపెడుతుంది. మనిషిని కుంగదీస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడే నాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. మా తాతయ్యకు ఆరోగ్యం సరిగా లేదని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని దాని సారాంశం.

నేను వెంటనే స్పెయిన్ నుంచి ఇండియా వెళ్లాను. తిరుగు ప్రయాణం మధ్యలో ఫిన్లాండ్లో విమానం ఆగింది. అప్పుడే నాకు నితిన్ నుంచి వాట్సాప్‌లో మెసేజ్ వచ్చింది. ఈ సంఘటన జరిగి దాదాపు ఆరేళ్లవుతోంది. అప్పటికి వాట్సాప్ (WhatsApp) గురించి ఎక్కువ మందికి తెలియదు. నేను కూడా పెద్దగా దాన్ని ఉపయోగించే దాన్ని కాదు. వారాల తరబడి నాకొచ్చిన వాట్సాప్ మెసేజ్‌లు అలా అన్‌రీడ్ గానే ఉండేవి.

‘హాయ్ రిధిమ.. కొన్ని రోజుల నుంచి నీతో మాట్లాడటానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఏమైపోయావ్?’ అని మెసేజ్ పెట్టాడు నితిన్. నిజం చెప్పాలంటే అప్పటికి నాకు, నితిన్‌కు మధ్య స్నేహం లేదు. ఇంకా చెప్పాలంటే పెద్దగా పరిచయమూ లేదు. ఆరు నెలల క్రితం ఓ కార్నివాల్‌లో అతన్ని నేను కలుసుకొన్నాను. ఆ తర్వాత మేం కలుసుకున్నదీ లేదు.. మాట్లాడుకున్నదీ లేదు. అలాంటి నితిన్ దగ్గర నుంచి మెసేజ్ రావడం నాకు ఆశ్చర్యమనిపించింది.

నేను ఇండియా వెళుతున్నట్టు తనకెందుకు చెప్పలేదని అడిగాడు. నేను మా తాతయ్యకు ఆరోగ్యం బాగాలేదని.. ఆయన్ను చూడటానికి వెళ్లానని చెప్పాను. ‘ఇప్పుడు ఆయనకు బాగానే ఉంది కదా..? నువ్వు బాగానే ఉన్నావు కదా?’ అని అడిగాడు. నేను బాగున్నానని చెప్పి స్పెయిన్ తిరిగి వస్తున్నానని చెప్పాను.

ADVERTISEMENT

2-whatsapp-love-story

ఆ తర్వాత అతనికి నేను నా ఫోన్ నంబర్ ఇవ్వలేదన్న విషయం గుర్తొచ్చింది. ఆ విషయమే నేను నితిన్‌ను అడిగాను. ‘కొన్ని రోజుల క్రితం మన ఇద్దరి కామన్ ఫ్రెండ్ సాన్యాను కలుసుకొన్నాను. తన దగ్గరి నుంచి నేను నీ నంబర్ తీసుకొన్నాను’ అని చెప్పాడు. ఆ క్షణంలో నా స్నేహితురాలు అతనికి.. నా నంబర్ ఇవ్వడం నాకు నచ్చలేదు. ఎందుకంటే నితిన్‌తో నాకు ముఖపరిచయం ఉంది కానీ.. ఫోన్ నంబర్ ఇచ్చేంత పరిచయం లేదు. అయినా మా ఇద్దరి మధ్య మాటలు కొనసాగాయి. మా ఇష్టాయిష్టాల గురించి ఒకరికొకరు చెప్పుకొనేంతగా.. ఇద్దరూ కలసి లంచ్‌కి వెళ్లేంతగా మా పరిచయం పెరిగింది. ఎప్పుడూ వాట్సాప్‌లో చాటింగ్ చేసుకొంటూనే ఉండేవాళ్లం.

కొన్ని రోజుల తర్వాత నితిన్ నుంచి నాకు ప్రేమ ప్రతిపాదన వచ్చింది. కానీ నేను ఈ విషయంలో అంత పాజిటివ్‌గా లేను. ఎందుకంటే అప్పటికే ఈ విషయంలో నాకో చేదు అనుభవం ఉంది కదా. నేను మరోసారి ప్రేమలో పడటానికి సిద్ధంగా లేను. అందుకే ఈ విషయంతో పాటు, నా బ్రేకప్ విషయాన్ని సైతం అతనికి నేను చెప్పాను. ‘ఇప్పుడు మనిద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని చెడగొట్టుకోవడం నాకిష్టం’ లేదని చెప్పాను.

అప్పటి నుంచి సుమారుగా నాలుగు నెలల పాటు ప్రతి రోజూ నిద్రపోయే ముందు నాకు ఫోన్  చేసేవాడు. నాకు గుడ్ నైట్ చెప్పి.. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పేవాడు. అంతేకాదు నా సమాధానం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పేవాడు. అప్పుడు నేను గుడ్ నైట్ చెప్పి కాల్ కట్ చేసేదాన్ని. ఎందుకంటే అంతకుమించి ఏం చేయాలో నాకు తోచేది కాదు. రోజూ దాదాపు ఇలాగే జరిగేది.

ADVERTISEMENT

1-whatsapp-love-story

ఓ రోజు క్లాస్‌కి వెళ్లే ముందు ‘నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఫోన్ చేయమని’ నితిన్‌కు మెసేజ్ పెట్టాను. తను నాకు కాల్ చేశాడు. ‘నువ్వంటే నాకు ఇష్టమే. కానీ నీతో సీరియస్ రిలేషన్ షిప్‌లోకి అడుగుపెట్టాలనుకోవడం లేదు’ అని చెప్పాను. తనని ఓసారి కలవాలనుకొంటున్నానని కూడా చెప్పాను.

నిజానికి మేమిద్దరమూ చదువుకొనేది బార్సిలోనాలోనే. కానీ నగరానికి నేనో వైపు ఉంటే.. నితిన్ మరో వైపు ఉంటాడు. నెల రోజుల తర్వాత క్రిస్మస్ పండగకు నేనుండే చోటకు నితిన్ వచ్చాడు. మేమిద్దరం చాలా సేపు మాట్లాడుకొన్నాం. ఒకరి గురించి మరొకరు తెలుసుకొన్నాం. ముద్దు పెట్టుకొన్నాం.

ఆ క్షణం నుంచి మేమిద్దరం ఒక్కటయ్యాం. ఒక్కటిగానే బతుకుతున్నాం. జీవితంలో స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నాం. నేను ఫార్మసీ పూర్తి చేసి ఉద్యోగం తెచ్చుకొన్నాను. నితిన్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. నా మెడలో మూడుముళ్లు పడటానికి ముందే మాస్టర్స్ డిగ్రీ కూడా పూర్తి చేసి ఇద్దరూ జీవితంలో బాగా సెటిల్ అవ్వాలనుకొంటున్నాం. ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ నాకు పర్ఫెక్ట్ లవ్ స్టోరీని అందించింది. నా జీవితాన్ని ఆనందమయం చేసింది.

ADVERTISEMENT

గోప్యత కోసం పేర్లు మార్చాం.

Images: Shutterstock

మీది కూడా ఇలాంటి అందమైన ప్రేమకథేనా? అయితే మీ ప్రేమకథను(Love story) మాకు మెయిల్ చేయండి. సబ్జెక్ట్ లైన్లో #MyStory అని టైప్ చేయడం మరిచిపోవద్దు. అది ప్రచురణార్హం అయితే మేం మిమ్మల్ని సంప్రదిస్తాం.

ఇవి కూడా చదవండి:

ADVERTISEMENT

#నా ప్రేమకథ: బెదిరించారు.. భయపెట్టారు.. అయినా మా ప్రేమను గెలిపించుకున్నాం..!

వెడ్డింగ్ స్పెషల్: కొత్త కోడలికి సరికొత్త లుక్ ఇచ్చే డిజైనర్ నగలు ఇవే

మిమ్మల్ని స్టైలిష్ గా మార్చే టాప్ 10 చెవిపోగులు

07 Apr 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT