ప్రేమ ఉన్న చోట.. బాధ కూడా ఉంటుంది (మజిలీ మూవీ రివ్యూ)

ప్రేమ ఉన్న చోట.. బాధ కూడా ఉంటుంది (మజిలీ మూవీ రివ్యూ)

తెలుగు ప్రేక్ష‌కులు ప్రేమ‌క‌థ‌ల‌ను ఎప్పుడూ ఆద‌రిస్తూనే ఉంటారు. అందుకే సంవ‌త్స‌రానికి రెండు లేదా మూడు ఫ‌క్తు ప్రేమ క‌థా చిత్రాలు మ‌న ముందుకు వ‌స్తూ ఉంటాయి. అలా ఈ సంవ‌త్స‌రం తాజాగా విడుద‌లైన ప్రేమ క‌థా చిత్రం- మ‌జిలీ (Majili). నాగ‌చైత‌న్య (Naga Chaitanya) - స‌మంతల (Samantha) కాంబినేష‌న్ ఈ చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌గా; పెళ్లి త‌ర్వాత వీరిద్ద‌రూ క‌లిసి న‌టించిన తొలి చిత్రం ఇదే కావ‌డం విశేషం.


శివ నిర్వాణ వంటి హిట్ ద‌ర్శ‌కుడితో క‌లిసి చై - సామ్ ప‌ని చేస్తున్నార‌ని ప్ర‌క‌టించిన‌ప్పుడే.. ఈ ప్రాజెక్ట్ పై ప్రేక్ష‌కుల్లో ఎన్నో అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మ‌రి, ద‌ర్శ‌కుడు ఈ అంచ‌నాల‌ను అందుకోగ‌లిగారా? సినిమా ప్రేక్షకులను నిజంగానే మెప్పించిందా అనే విషయం తెలియాలంటే ముందు క‌థ‌లోకి వెళ్లాల్సిందే..


 
 

 

 


View this post on Instagram


A post shared by Nagachaitanya Akkineni (@chaitanya.akkineni) on
టీనేజ్ నుండి మధ్య వయస్కుడిగా మారే వరకూ.. పూర్ణ (నాగ‌చైత‌న్య‌) అనే కుర్రాడి జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనల సమాహారమే ఈ చిత్రం. చిన్న వయసులో క్రికెట్ పై మ‌క్కువ పెంచుకోవ‌డం ఒక ఎత్తైతే.. ఆ త‌ర్వాత అన్షుతో (దివ్యాంషా కౌశిక్) పూర్ణ ప్రేమ‌లో ప‌డ‌డం మరో ఎత్తు. ఆ తర్వాత తను ప్రేమించిన అమ్మాయితో విడిపోయాక.. అనుకోని ప‌రిస్థితులలో శ్రావ‌ణి (స‌మంత‌) పూర్ణ జీవితంలోకి అడుగుపెట్ట‌డంతో కథ మరో ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. అస‌లు పూర్ణ & అన్షు విడిపోవ‌డానికి గ‌ల కార‌ణాలేంటి? శ‌్రావ‌ణిని పూర్ణ మ‌న‌స్ఫూర్తిగా త‌న జీవితంలోకి ఆహ్వానిస్తాడా? లేదా?? అన్న‌ది మాత్రం వెండితెర‌పైనే చూడాలి.


ఒక రకంగా చెప్పాలంటే పాత్రలే ఈ చిత్రానికి బలం. పూర్ణ‌, శ్రావ‌ణి, అన్షు పాత్ర‌ల‌కు నాగ‌చైత‌న్య‌, స‌మంత‌, దివ్యాంషా కౌశిక్ చ‌క్క‌గా స‌రిపోయారు. తమ పాత్ర‌ల్లో ఒదిగిపోయి త‌మ ప‌రిధి మేర‌కు పూర్తి న్యాయం చేశారు. ఫ‌లితంగా ద‌ర్శ‌కుడు ప్రేక్ష‌కుల‌కు చెప్పాల‌నుకున్న క‌థను స్ప‌ష్టంగా చెప్పడానికి వీలైంది. ముఖ్యంగా సినిమా రెండవ భాగంలో పూర్ణ - శ్రావ‌ణిల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంటాయి. ఇక, సినిమాలో ముఖ్య పాత్ర‌లు పోషించిన రావు ర‌మేష్, పోసాని కృష్ణ‌ముర‌ళి , నాగచైత‌న్య స్నేహితులుగా న‌టించిన వారంతా తమకున్న పరిధి మేరకు బాగానే నటించారు. క‌థను పండించ‌డానికి త‌మ వంతు ప్ర‌య‌త్నం చేశారు.


 
 

 

 


View this post on Instagram


A post shared by Shiva Nirvana (@shivanirvana621) on
అయితే ప్రేమ క‌థా చిత్రం అన‌గానే ప్రేక్షకుడి మదిలో మెదిలేవి.. "ఒక అబ్బాయి.. ఒక అమ్మాయి.. వారి మ‌ధ్య సాగే ల‌వ్ ట్రాక్..".. ఇవి మాత్రమే. ఏ సినిమా చూసినా ఇవి సాధారణంగా కనిపించే అంశాలే . అయితే ఇంత సింపుల్ ప్రేమ  క‌థ‌ను కూడా.. చెప్పే విధానంలో ద‌ర్శ‌కుడు వైవిధ్యాన్ని కనబరిస్తే... విజయం సాధించినట్లే లెక్క. 


మ‌జిలీ ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ కూడా త‌న క‌థ‌తో.. ప్రేక్ష‌కుల‌ను వైవిధ్యంగా అల‌రించేందుకు ప్ర‌య‌త్నించారు. ముఖ్యంగా పాత్ర‌ల మ‌ధ్య జ‌రిగే సంభాష‌ణ‌లు, వైజాగ్ నేప‌థ్యంలో అక్క‌డ జ‌న‌సామాన్యం మాట్లాడుకునే మాండ‌లికాలు.. మొద‌లైన‌వి పాత్ర‌ల్లో చూపించడం ద్వారా సినిమాకు స‌హ‌జ‌త్వాన్ని తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేశారు.


 
 

 

 


View this post on Instagram


Chaysam .. lucky to have you both in this beautiful journey majili .. you both are awesome and adorable 💕


A post shared by Shiva Nirvana (@shivanirvana621) on
"మ‌నం ల‌వ్ లెట‌ర్ పై రాసుకున్న అమ్మాయి పేరు.. వెడ్డింగ్ కార్డ్ మీద ఉండ‌దురా.." వంటి డైలాగ్స్ ఈ సినిమాలో భావోద్వేగాన్ని పండించాయనే చెప్పవచ్చు. అయితే దర్శకుడు క‌థ‌ను.. సినిమాగా వివ‌రించే క్ర‌మంలో మాత్రం ప్రేక్ష‌కుల‌కు కాస్త సాగ‌దీత‌గా అనిపించ‌వ‌చ్చు.


సినిమా నిడివి 154 నిమిషాలు ఉండ‌డం.. చిత్రం కాస్త స్లోగా ఉండడం .. వంటి కార‌ణాల వ‌ల్ల ప్రేక్ష‌కులు కొన్ని చోట్ల క‌థ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసే అవకాశం కూడా ఉంది.


ఇక సినిమా సాంకేతిక వ‌ర్గ విష‌యానికి వ‌స్తే విష్ణు శ‌ర్మ (Vishnu Sharma) ఛాయాగ్రహణం సినిమాకు ఎంత‌గానో తోడ్ప‌డ‌గా; గోపీ సుంద‌ర్ (Gopi Sunder) అందించిన సంగీతం, త‌మ‌న్ (Thaman) ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ క‌థకు ప్రాణం పోశాయ‌ని చెప్ప‌చ్చు. షైన్ స్క్రీన్స్ (Shine Screens) వారి నిర్మాణ‌పు విలువ‌లు కూడా బాగున్నాయి.


మ‌రి, ఇన్ని ఆక‌ర్ష‌ణ‌లు, బ‌లాలు ఉన్న ఈ మ‌జిలీ చిత్రం ప్రేక్ష‌కుల మ‌దిని చేర‌డంలో ఎంత వ‌ర‌కు విజ‌యం సాధిస్తుంది? నాగ‌చైత‌న్య‌కు హిట్ అందిస్తుందా? లేదా ?? అన్న‌ది తెలియాలంటే ఇంకాస్త వేచి చూడాల్సిందే!


ఇవి కూడా చ‌ద‌వండి


#RRR సినిమా గురించి.. ఎస్ ఎస్ రాజమౌళి చెప్పిన టాప్ 10 ఆసక్తికర పాయింట్స్..!


విజయ్ దేవరకొండ "డియర్ కామ్రేడ్" సినిమా గురించి.. మరిన్ని విషయాలు తెలుసుకుందామా..?


కమర్షియల్ హంగులతో నిండిన.. ఎన్టీఆర్: మ‌హానాయ‌కుడు (సినిమా రివ్యూ)