సెక్స్‌కు సంబంధించి.. కొత్త దంప‌తుల‌కు ఉండే సందేహాలు ఇవే..!

సెక్స్‌కు సంబంధించి.. కొత్త దంప‌తుల‌కు ఉండే సందేహాలు ఇవే..!

పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించే ప్ర‌తి అమ్మాయి మ‌న‌సులోనూ త‌న వైవాహిక జీవితానికి సంబంధించిన అనేక సందేహాలు ఉండ‌డం స‌హ‌జం. లైంగిక ప‌ర‌మైన క‌ల‌యిక (Sex) గురించి ఉన్న అనేక సందేహాలు కూడా అందులో భాగ‌మే!


అయితే కొంద‌రు లైంగిక‌ప‌రంగా అనుభ‌వం ఉన్న త‌మ స్నేహితుల‌ను అడిగి త‌మ సందేహాల‌ను నివృత్తి చేసుకుంటే ఇంకొంద‌రు మాత్రం ఇబ్బందిక‌ర‌మైన త‌మ సందేహాల గురించి ఎవ‌రితో మాట్లాడాలో కూడా తెలియ‌క మిన్న‌కుండిపోతుంటారు.


ఫ‌లితంగా తొలిరేయి స‌మ‌యానికి వారి గుండెల్లో మ‌రింత భ‌యం పెరిగిపోతుంది. ఇలాంటివారి కోస‌మే సెక్స్‌కు సంబంధించి అంద‌రు అమ్మాయిల్లో ఉండే కొన్ని ఇబ్బందిక‌ర‌మైన సందేహాల‌కు మేం జ‌వాబులిస్తున్నాం.. అవి..


1. సెక్స్ చేసే స‌మ‌యంలో మూత్రం వస్తుందా..!
లేదు.. సెక్స్‌లో పాల్గొనే స‌మ‌యంలో మూత్రం వ‌చ్చిన‌ట్లుగా అనిపిస్తుంటుంది. కానీ నిజంగా మూత్రం రాదు. వాస్త‌వానికి మీకు ఇలా అనిపిస్తుందంటే క‌ల‌యిక ద్వారా మీకు చ‌క్క‌ని తృప్తి ల‌భిస్తున్న‌ట్లే! అయితే సెక్స్ చేసేట‌ప్పుడు యోని నుంచి స్రావాలు విడుద‌ల‌వుతాయి. ఒక‌వేళ క‌ల‌యిక‌లో పాల్గొనే స‌మ‌యంలో మీకు మూత్రం వ‌స్తుందేమోన‌నే సందేహం ఉంటే.. సెక్స్కు సిద్ధం కావ‌డానికి ముందే మూత్ర‌విస‌ర్జ‌న చేసి వెజైనాను శుభ్రం చేసుకోండి.


gif1


2. జ‌న‌నాంగాన్ని నోటితో స్పృశిస్తే..!


క‌ల‌యిక‌లో ఇది కూడా ఒక భాగ‌మే. ముఖ్యంగా దీనిని ఓర‌ల్ సెక్స్ లో ఒక భాగం అని చెప్ప‌వ‌చ్చు. పైగా ఇది మంచి అనుభూతిని కూడా ఇస్తుంది. ఇందులో భ‌య‌ప‌డాల్సిన విష‌యం ఏమీ లేదు. కాక‌పోతే ఈ విధ‌మైన శృంగారంలో పాల్గొనేవారు జ‌న‌నాంగాల‌ను చాలా శుభ్రంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. క‌ల‌యిక‌కు ముందు త‌ర్వాత యోనిని త‌ప్ప‌నిస‌రిగా శుభ్రం చేసుకోవాలి.


4. యోని లోప‌ల కండోమ్ చిరిగిపోతే..
ఇందులో భ‌య‌ప‌డాల్సిన విష‌యం ఏమీ లేదు. కండోమ్ ఉప‌యోగించి క‌ల‌యిక‌లో పాల్గొనేట‌ప్పుడు జ‌రిగే పొర‌పాట్లలో ఇదీ ఒక‌టి. చిరిగిపోయిన కండోమ్‌ను సుల‌భంగానే యోని నుంచి బ‌య‌ట‌కు తీసేయ‌చ్చు. కాబ‌ట్టి అది లోప‌ల‌కు వెళ్లిపోతుందేమోన‌ని మీరు భ‌య‌ప‌డన‌వ‌స‌రం లేదు. అయితే కండోమ్ నుంచి వీర్యాన్ని యోనిలో ప‌డ‌కుండా ఉండేలా మాత్రం చూసుకోవాలి. అలాగే అన‌వ‌స‌ర గ‌ర్భం దాల్చ‌కుండా ముందే మీ గైన‌కాల‌జిస్ట్‌ని సంప్ర‌దిస్తే మ‌రీ మంచిది.


gif2


5. ఎంత‌సేపు సెక్స్‌లో పాల్గొన‌వ‌చ్చు?
ప్ర‌తి జంట విష‌యంలోనూ ఈ సమయం మారుతూ ఉంటుంది. ఒక జంట ఎంత‌సేపు క‌ల‌యిక‌లో పాల్గొంటార‌నేది వారిలో ఉన్న కోరిక‌లు, సంతృప్తి చెందే స‌మ‌యంపై ఆధార‌ప‌డి ఉంటుంది. సాధార‌ణంగా ఇది 5 నిమిషాల నుంచి గంట వ‌ర‌కు కూడా ఉండ‌చ్చు. అయితే మీరు క‌ల‌యిక‌లో పాల్గొనేట‌ప్పుడు ఇంత స‌మ‌యం అని ఏమీ పెట్టుకోకండి. సెక్స్‌కు ముందు ఫోర్ ప్లే ఎంత ఎక్కువ సేపు ఉంటే.. అంత‌గా క‌ల‌యిక‌ను ఆస్వాదించ‌వచ్చు.


6. సెక్స్ చేసేట‌ప్పుడు యోని ప్ర‌దేశం త‌డిగా అవుతుందా??
క‌ల‌యిక స‌మ‌యంలో ల్యూబ్రికేష‌న్ చాలా అవ‌స‌రం. అయితే మీ యోని వ‌ద్ద స్రావాలు ఎక్కువ‌గా విడుదల అవుతున్నాయంటే.. అందుకు మీ ఓవ్యులేష‌న్ (అండం విడుద‌ల కావ‌డం), గ‌ర్భ‌నిరోధ‌క మాత్ర‌లు కార‌ణం కావ‌చ్చు. ఇదేమీ అంత పెద్ద స‌మ‌స్య కాదు.


7. ఎక్కువ‌సార్లు సెక్స్‌లో పాల్గొంటే వెజైనా వ‌దులైపోతుందా?
క‌ల‌యిక జ‌రిగిన ప్ర‌తిసారీ యోని కండ‌రాలు వ్యాకోచించ‌డం.. తిరిగి సంకోచించ‌డం మామూలే! ఇది స‌హ‌జ‌సిద్ధంగా జ‌రిగే ప్ర‌క్రియ‌. కాబ‌ట్టి మీరు ఎక్కువ‌సార్లు సెక్స్‌లో పాల్గొన‌డం వ‌ల్ల ఈ యోని కండ‌రాలు శాశ్వ‌తంగా వ‌దులైపోతాయ‌ని భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. కాస్త స‌మ‌యం తీసుకున్నా ఆ కండ‌రాలు తిరిగి య‌థాస్థితికి చేరుకుంటాయి.


gif3


8. ఓర‌ల్ సెక్స్ కార‌ణంగా గ‌ర్భం దాల్చుతారా?
అసంభ‌వం. ఒక మ‌హిళ గ‌ర్భం దాల్చాలంటే యోని ద్వారా.. వీర్యం శ‌రీరం లోప‌ల‌కు ప్ర‌వేశించాల్సి ఉంటుంది. మ‌రే మార్గం లేదు. కాబ‌ట్టి ఓర‌ల్ సెక్స్ ద్వారా గ‌ర్భం దాల్చుతార‌ని అనుకుంటే అది అపోహే! అయితే ప‌రిశుభ్ర‌త స‌రిగా పాటించ‌క‌పోతే మాత్రం ఈ ఓర‌ల్ సెక్స్ కార‌ణంగా.. కొన్ని ఇన్‌ఫెక్ష‌న్స్ ఒక‌రి నుంచి మ‌రొక‌రికి సంక్ర‌మించే అవ‌కాశం ఉంటుంది. కాబ‌ట్టి క‌ల‌యిక‌లో పాల్గొనే ముందు.. త‌ర్వాత ప‌రిశుభ్రంగా ఉండ‌డం చాలా మంచిది.


10. పురుషాంగం మ‌రీ చిన్న‌గా లేక పెద్ద‌గా ఉంటే??


సెక్స్‌లో పాల్గొని సంతృప్తి చెందే క్ర‌మంలో పురుషాంగం ప‌రిమాణం కూడా పెద్ద‌గా లెక్క‌లోకి రాదు. సాధార‌ణంగా మ‌హిళ‌ల యోనిలోకి పురుషాంగం రెండంగుళాల వ‌ర‌కు వెళ్తే చాలు.. ఆలుమ‌గ‌లిద్ద‌రూ చ‌క్క‌ని తృప్తి పొంద‌వ‌చ్చు. అలాగే పురుషాంగం మ‌రీ పెద్ద‌దిగా ఉంటే క‌ల‌యిక స‌మ‌యంలో ల్యూబ్రికెంట్ ఏదైనా ఉప‌యోగించాల్సి రావ‌చ్చు.


Gif4


ఇవండీ.. కొత్త‌గా పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టే అమ్మాయిల్లో చాలావ‌ర‌కు ఉండే సందేహాలు.. వాటికి స‌మాధానాలు. అయితే మీకు సాధార‌ణంగా కాకుండా ఏదైనా భిన్న‌మైన అనుభ‌వం ఎదురైతే మాత్రం వైద్యుల‌ను సంప్ర‌దించ‌డం మంచిది.