తన భాగస్వామిలో ఈ లక్షణాలుండాలని.. ప్రతి అబ్బాయి కోరుకుంటాడు..!

తన భాగస్వామిలో ఈ లక్షణాలుండాలని.. ప్రతి అబ్బాయి కోరుకుంటాడు..!

ప్రేమైక బంధం అనేది తమ మధ్య చిరకాలం కొనసాగాలని.. చిలకా గోరింకల్లా తాము ఎల్లప్పుడూ కలిసుండాలని భార్యా భర్తలు ఎప్పుడూ కోరుకొంటారు. అయితే అలా చివరి వరకూ ఇద్దరూ ఒక్కటిగా ఉండాలంటే.. కొన్ని విషయాలను మనస్ఫూర్తిగా అనుసరించాల్సి ఉంటుంది. భాగస్వామి మనసుని ఆకట్టుకొనేలా మనం వ్యవహరించాలి. ఈ విషయంలో పురుషులు(men) సైతం తమ భార్య లేదా ప్రేయసిలో కొన్ని లక్షణాలు ఉండాలని భావిస్తారట..! మరి అవేంటో మీరూ తెలుసుకొంటే..  మీ భాగస్వామిని మీ కొంగున ఇట్టే కట్టేసుకోవచ్చు.


బాధను పంచుకోండి.


అబ్బాయిలు తమ భాగస్వామితో తమ సంతోషాన్నే కాదు.. బాధను కూడా పంచుకోవాలనుకొంటారు. మీ భర్త లేదా బాయ్ ఫ్రెండ్ ఏదైనా సమస్యను ఎదుర్కొంటే అతడు తీవ్రమైన ఒత్తిడికి గురవుతాడు. ఆ సమయంలో మీరు అతనికి.. మీకు తోచిన సలహాలను ఇవ్వకండి. ఎందుకంటే సమస్యను ఎదుర్కొంటున్న వారికి దాన్ని పరిష్కరించుకొనే మార్గం కూడా తెలుసు. అయితే ఆ సమయంలో కలిగే ఒత్తిడి కారణంగా.. సమస్యను పరిష్కరించుకోవడానికి బదులు మరింత జటిలం చేసుకొనే అవకాశం ఉంది. అందుకే అతని బాధను పంచుకోండి.


తన సమస్య గురించి చెబుతున్నప్పుడు పూర్తిగా వినండి. తను అలా చేయడానికి గల కారణాలను కూడా మీకు చెబుతాడు. ఆ సమయంలో అతని నిర్ణయాలను విమర్శించకుండా.. అతను చెప్పేది మాత్రమే వినండి. మీ భాగస్వామి లేదా భర్త చెప్పడం పూర్తి చేసిన తర్వాత ‘ఈ సమస్యను హ్యాండిల్ చేయడానికి నేను నీకు ఓ చిన్న సూచన ఇవ్వాలనుకొంటున్నాను. చెప్పమంటావా?’ అని అడగండి. అతడు దానికి అంగీకరిస్తే.. మీరేమనుకొంటున్నారో సూటిగా, క్లుప్తంగా చెప్పండి.


1-relationshiprules


Image: Pixabay


అతని అయిష్టాలను సైతం అంగీకరించాలి


మీలాగే అతనికి కూడా నచ్చని విషయాలు చాలానే ఉంటాయి. అవి వస్తువులైనా కావచ్చు.. వంటలైనా కావచ్చు. కనుక మీరు అతన్ని భాగస్వామిగా అంగీకరించినప్పుడు అతని అయిష్టాలను కూడా మీరు అంగీకరించాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు మీకు నచ్చినది.. అతనికి నచ్చకపోవడం.. అతనికి నచ్చింది మీకు నచ్చకపోవడం కారణంగా చిన్న చిన్న మనస్పర్థలు తలెత్తే అవకాశం ఉంటుంది.


అలా జరగకుండా ఉండాలంటే.. ఇష్టాలతో పాటు ఒకరి అయిష్టాలను మరొకరు తెలుసుకోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు ఘర్షణ పడకుండా.. అతన్ని ఒప్పించే ప్రయత్నం చేయండి. మీకు నచ్చని పని ఏదైనా చేస్తుంటే సున్నితంగా అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించండి.


అబ్బాయిలూ.. ప్రేమతో మీ భాగస్వామికి మీరు చేయాల్సిన పనులివే..


నొప్పించకుండా మాట్లాడటం..


ఇద్దరి మధ్య ఏదైనా గొడవ వచ్చినప్పుడు నోరు జారడం సహజం. అయితే కొన్నిసార్లు కోపంతో పరుషంగా మాట్లాడుతుంటాం. అక్కడితో దాన్ని వదిలేస్తే బాగుంటుంది. కానీ  కొంతమంది మళ్లీ మళ్లీ దాన్ని గుర్తు చేస్తూ.. మనసును నొప్పిస్తుంటారు. అయితే ఇలా చేయడం అబ్బాయిలకు అసలు ఇష్టం ఉండదు. అలాగని మీరు పడుతున్న బాధ గురించి వారు వినడానికి సిద్ధంగా ఉండరనుకోవద్దు.


ఎందుకంటే.. ఆ సమయంలో మీతో దురుసుగా ప్రవర్తించినందుకు వారు కూడా బాధపడుతూనే ఉంటారు. కాబట్టి వారి మనసు నొచ్చుకోని విధంగా మీరు మాట్లాడితే.. వారు మిమ్మల్ని అర్థం చేసుకొంటారు. అందుకే ఇలాంటి సమయాల్లో ‘అప్పుడు నువ్వు చాలా రూడ్‌గా మాట్లాడావు. నాకు నీపై కోపం వచ్చింది. చిరాకేసింది’.. లాంటి వాక్యాలు వాడవద్దు.


 ‘ఆ రోజు నువ్వన్న మాటలు నన్ను బాధించాయి. ఒక్కసారిగా నేను నీకు  దూరమైపోయినట్టనిపించింది’.. ఇలా సున్నితంగా చెప్పండి.. అప్పుడు వారు మరోసారి మిమ్మల్ని బాధించేలా మాట్లాడరు.


డేట్‌కు వెళ్తున్నారా? ఇలా రెడీ అవ్వండి


చనువుంది కదా అని మీకు నచ్చినట్లు ప్రవర్తించకూడదు.


అబ్బాయిలు తమ భాగస్వామిలో కచ్చితంగా ఉండాలని కోరుకొనే లక్షణాల్లో ఇది కూడా ఒకటి. అయితే చ‌నువు తీసుకోమ‌న్నాం క‌దా అని.. వారి స్వేచ్ఛ‌ను హ‌రించే విధంగా వ్య‌వ‌హ‌రించ‌కండి. వారు మీకిచ్చిన చనువును దుర్వినియోగం చేయ‌కూడ‌దు. మీరేం చేసినా.. మీ మీద ఉన్న ప్రేమతో.. వారు ఏమీ అనరులే అనుకోవద్దు. ఒక పరిమితి వరకు ఎవరైనా సహిస్తారు. అది దాటితేనే అనుబంధం విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నియమం అమ్మాయిలకే కాదు. అబ్బాయిలకూ వర్తిస్తుంది. ఎందుకంటే.. అనుబంధాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఇద్దరికీ సమానంగానే ఉంటుంది.


ల‌వ్ మేకింగ్.. సెక్స్ కు మ‌ధ్య ఉన్న తేడా మీకు తెలుసా??


వీటితో పాటు తన బంధువులు, సన్నిహితులతో.. తన భాగస్వామి స్నేహపూర్వకంగా వ్యవహరించడం.. పరిస్థితులకు తగినట్లుగా సమయస్ఫూర్తితో వ్యవహరించడం.. చలాకీగా మసలడం.. ఇవన్నీ ప్ర‌తి అబ్బాయి, తన భాగస్వామి నుండి తప్పకుండా కోరుకుంటాడు సుమా..!