ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
కన్సెంట్ కండోమ్ ప్యాకెట్ తెరవడానికి ఇద్దరు కావాలి. ఎందుకో తెలుసా?

కన్సెంట్ కండోమ్ ప్యాకెట్ తెరవడానికి ఇద్దరు కావాలి. ఎందుకో తెలుసా?

నిజమండీ… ఈ కండోమ్ ప్యాకెట్ తెరవాలంటే ఇద్దరు మనుషులు, నాలుగు చేతులు కావాలి. ఆ ప్యాకెట్‌ను అలా డిజైన్ చేశారు మరి.. అంతేకాదు.. దానికి ‘కన్సెంట్ కండోమ్’(consent condom) అని పేరు కూడా పెట్టారు. పేరుకు తగ్గట్టుగానే భాగస్వాములు ఇద్దరి అంగీకారంతోనే ఈ కండోమ్ ప్యాకెట్ తెరవాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా సంభోగంలో పాల్గొనేవారికి ఓ సందేశాన్ని కూడా ఇస్తోంది ఈ సంస్థ. చదవడానికి చాలా ఆసక్తికరంగా ఉంది కదా.. అయితే ఈ కండోమ్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకొందాం..

సాధారణంగా మహిళలకు వివాహం జరిగినప్పటికీ తమ అంగీకారంతో ప్రమేయం లేకుండా వారు సెక్స్‌లో పాల్గొనాల్సిన సందర్భాలు చాలానే ఉంటాయి. ఇంకొందరైతే భార్యకు ఇష్టం లేకపోయినా బలవంతంగా వారితో లైంగిక చర్య జరుపుతూ ఉంటారు. దీన్నే మారిటల్ రేప్‌గా పరిగణిస్తాం. అయితే మన చట్టాల్లో దీనికి అనుమతి ఉంది కాబట్టి.. ఎవరూ దాన్ని తప్పుగా పరిగణించరు. సంభోగంలో పాల్గొనడానికి స్త్రీ అంగీకారాన్ని పరిగణనలోకి తీసుకోరు. ఈ పరిస్థితి మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇలానే ఉంది.

దీన్ని గుర్తించిన తులిపన్ అర్జెంటీనా అనే సంస్థ కన్సెంట్ కండోమ్స్‌ను రూపొందించింది. ఈ సంస్థ సెక్స్ టాయ్స్ రూపొందిస్తుంది. ఈ కండోమ్స్ ద్వారా ‘రిలేషన్ షిప్‌లో సెక్స్ అవసరం. అవసరం మాత్రమే కాదు ముఖ్యం కూడా. ఆ సౌఖ్యాన్ని పొందాలంటే దానికి ఇద్దరి ఆమోదం ఉండాలి’ అనే సందేశాన్ని అందరికీ అందిస్తోంది. అంతేకాదు.. భాగస్వాములిద్దరిలో సంభోగం విషయంలో.. ఎవరైనా దానికి అంగీకారం తెలపనట్లయితే.. అది వద్దనే అర్థం అని కూడా గుర్తించాలి’ అని ఈ కన్సెంట్ కండోమ్ ద్వారా సందేశాన్నిస్తోంది.

అసలు ఈ కండోమ్ ప్యాకెట్ ఎలా తెరవాలి? అనే కదా మీరు ఆలోచిస్తున్నారు. అక్కడికే వస్తున్నాం. తులిపన్ అర్జెంటీనా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన వీడియోను బట్టి చూస్తే.. ఈ కండోమ్ ప్యాకెట్‌కు నాలుగు వైపులా బటన్స్ ఉంటాయి. వీటన్నింటినీ ఒకేసారి ప్రెస్ చేస్తేనే అది తెరుచుకొంటుంది. ఒకరు రెండు వైపుల ఉన్న బటన్స్ నొక్కితే.. మరొకరు మిగిలిన రెండు వైపుల ఉన్న బటన్స్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఈ ప్యాకెట్ ఓపెన్ అవుతుంది. దీని గురించి మరింత బాగా తెలుసుకోవాలంటే ఈ వీడియోను వీక్షించండి.

ADVERTISEMENT

కండోమ్ ప్యాకెట్ ద్వారా సందేశాన్నివ్వడం మాత్రమే కాదు.. ప్యాకెట్ పై సైతం కొన్ని స్లోగన్లను ముద్రించి దాని ద్వారా ఆరోగ్యకరమైన లైంగిక జీవితానికి బాటలు వేసుకొనేలా ప్రజలను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తోంది ఈ సంస్థ. కన్సెంట్ కండోమ్ ప్యాక్ పైన ‘కన్సెంటెడ్ ప్లెజర్’, ‘ప్లెజర్ విత్ సెన్స్’ అనే స్లోగన్లను ముద్రించింది. ఇవి ఆరోగ్యకరమైన లైంగిక జీవిత ఆవశ్యకతను తెలియజేస్తున్నాయి.

ప్రస్తుతానికి ఈ కండోమ్ ప్యాకెట్లను అర్జెంటీనాలో ప్రయోగాత్మక ఫలితాలు తెలుసుకోవడానికి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత వాటిని మార్కెట్లో విడుదల చేయనున్నారు.

కన్సెంట్ కండోమ్స్ విషయంలో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. లైంగిక హింసను నిరోధించే దిశగా వేసిన అడుగుగా కొందరు భావిస్తున్నారు. ఆలోచన మంచిదే అయినప్పటికీ మహిళలపై లైంగిక వేధింపులు తగ్గవని, ఆమె ఆమోదం లేకుండానే.. ఆమెతో లైంగిక చర్యలో పాల్గొనేవారిలో ఏ మాత్రం మార్పు రాదని కొందరు చెబుతున్నారు.

వీరు చెప్పింది నిజమే.. ఈ కండోమ్ ప్యాకెట్ వల్ల మహిళలపై జరిగే అత్యాచారాలు, అఘాయిత్యాలు ఆగిపోకపోవచ్చు. కానీ.. సెక్స్ విషయంలో భాగస్వామి ఇష్టాన్ని గుర్తించాలనే కనీస అవగాహన పెరిగే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో తులిప్ అర్జెంటీనా చేసిన పనిని మెచ్చుకోవాల్సిందే..

ADVERTISEMENT

ఇవి కూడా చదవండి

మహిళల కండోమ్ గురించి మీరు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

ధైర్యం చేసి కండోమ్ కొనే అమ్మాయి ఎలాంటి పరిస్థిితి ఎదుర్కొంటుందంటే..

పీరియడ్స్ విషయంలో అబ్బాయిలకు ఉండే అపోహలివే..

ADVERTISEMENT
08 Apr 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT