మన అందాల 'వ‌ర్షిణి' ఫ్యాష‌న్స్ ఫాలో అయిపోండి.. మీరూ క్యూట్ అనిపించుకోండి..!

మన అందాల 'వ‌ర్షిణి' ఫ్యాష‌న్స్ ఫాలో అయిపోండి.. మీరూ క్యూట్ అనిపించుకోండి..!

వ‌ర్షిణి సౌంద‌రాజ‌న్ (Varshini).. ప్ర‌స్తుతం ఉన్న బెస్ట్ యాంక‌ర్ల‌లో ఆమె కూడా ఒక‌రు. ప‌క్కా హైద‌రాబాదీ అయిన ఈ చిన్న‌ది జాతీయ అవార్డు గెలుచుకున్న 'చంద‌మామ క‌థ‌లు' అనే చిత్రంతో వెండితెర‌కు ప‌రిచ‌యం అయింది. అలాగే మోడ‌ల్‌గా కూడా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకుందీ చిన్న‌ది. ఇక పెళ్లి గోల వెబ్ సిరీస్‌తో న‌టిగా తానేంటో అంద‌రికీ నిరూపించి చూపించింది. కాస్త గ‌మ‌నించాలే కానీ.. వ‌ర్షిణిలానే ఆమె ధ‌రించే ఫ్యాష‌న్స్ కూడా చాలా క్యూట్‌గా ఉంటూ ఉంటాయి. కావాలంటే ఆమె ధ‌రించిన ఈ బెస్ట్ ఫ్యాష‌న్స్ ని చూడండి.. మీరే అవునంటారు..
 

 

 


View this post on Instagram


Catch me on #paatas today #etvplus #mallemala Costume @justlikethatbyanju thank you so much for this Pretty costume!!


A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan) on
ప్ర‌త్యేక‌మైన సంద‌ర్భాలు వ‌స్తే చాలు.. చాలామంది అమ్మాయిలు ప్రిన్సెస్‌లా మెరిసిపోవాల‌ని ఆశ‌ప‌డుతూ ఉంటారు. కానీ అందుకు అనుగుణ‌మైన వ‌స్త్రధార‌ణ ఎంపిక చేసుకునే విష‌యంలో మాత్రం విఫ‌ల‌మ‌వుతూ ఉంటారు. కానీ వ‌ర్షిణి మాత్రం చ‌క్క‌గా ర‌డీ అయిపోయింది చూడండి.. లైట్ పింక్ క‌ల‌ర్ స్ట్రాప్ లెస్ లాంగ్ ఫ్రాక్‌కు స్టోన్డ్ ఇయ‌ర్ రింగ్స్ జ‌త చేసి సింపుల్‌గా యువ‌రాణిలా భ‌లే అందంగా మెరిసిపోయింది క‌దూ!
 

 

 


View this post on Instagram


Think of all the beauty still left around you and be happy. From the sets of #pelligola3 Costume @bohodresscode


A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan) on
ధ‌రించే దుస్తులు మ‌న‌కు సౌక‌ర్య‌వంతంగా ఉంటూ; మ‌న ఆత్మ‌విశ్వాసాన్ని ప్ర‌తిబింబించేవైతే చాలు.. ఫ్యాష‌నబుల్ లుక్ దానంత‌ట‌దే వ‌స్తుందంటారు ఫ్యాష‌న్ డిజైన‌ర్లు. బ్లాక్ క‌ల‌ర్ అనార్క‌లీ ధ‌రించిన వ‌ర్షిణిని చూస్తే ఈ మాట‌లు త‌ప్ప‌కుండా నిజ‌మే అనిపిస్తాయి. చాలా సింపుల్‌గా ఉన్న బ్లాక్ అండ్ వైట్ అనార్క‌లీకి వైట్ బాటమ్ జ‌త చేసి స్టైలిష్‌గా క‌నిపిస్తోంది చూశారా..!
 

 

 


View this post on Instagram


SIIMA-Day 2 Wearing @designerkavitaagarwal Makeup @nehaashah21 Hair @sabasmua PC @kkathirravan


A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan) on
ఫ్రాక్స్‌లో ఎన్ని డిజైన్స్ వ‌చ్చినా వ‌న్ షోల్డ‌ర్ లాంగ్ గౌన్‌తో వ‌చ్చే లుక్ చాలా ప్ర‌త్యేక‌మ‌నే చెప్పాలి. తెలుపు రంగు ప్లెయిన్ ఫ్రాక్‌కు న‌డుం భాగం వ‌ద్ద వెడ‌ల్పాటి బెల్ట్‌లా ఇచ్చిన ప్యాచ్ వ‌ర్క్.. అవుట్ ఫిట్ అందాన్ని మ‌రింత పెంచింద‌నే చెప్పాలి. ఏది ఏమైనా తెలుపు రంగులో ఎవ‌రైనా స‌రే.. తార‌క‌లా మెరిసిపోతారుగా!!

ప్లెయిన్ రాయ‌ల్ బ్లూ క‌ల‌ర్ లాంగ్ గౌన్‌కు సిల్వ‌ర్ షేడెడ్ కేప్ ధ‌రించిన వ‌ర్షిణిని చూశారా?? రాయ‌ల్ లుక్‌లో భ‌లే అందంగా క‌నిపిస్తోంది క‌దూ! కాస్త శ్ర‌ద్ధ‌గా గ‌మ‌నిస్తే.. వ‌ర్షిణి ధ‌రించిన కేప్ కాల‌ర్ మోడ‌ల్‌లో ఉన్న‌ట్లు మ‌న‌కు స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది.

లాంగ్ టాప్‌కు మ్యాచ‌య్యే బాట‌మ్‌ని ధ‌రించ‌డం పాత ఫ్యాష‌న్. ఇప్పుడు టాప్‌కు మ్యాచ‌య్యే స్క‌ర్ట్ లేదా మిడ్డీని ధ‌రించ‌డ‌మే ట్రెండీ అంటున్నారు నేటి అమ్మాయిలు. వ‌ర్షిణి కూడా అదే ఫ్యాష‌న్ ఫాలో అయ్యింది చూడండి. చూడ‌డానికి భిన్నంగా, స్టైలిష్‌గా కూడా ఉంది క‌దూ!

అమ్మాయిలు ధ‌రించే టాప్స్ నార్మ‌ల్‌గానే అనిపించినా బోట‌మ్స్‌లో మాత్రం ఎన్నో ట్రెండ్స్ వ‌స్తూ ఉంటాయి. వ‌ర్షిణి ధ‌రించిన ఈ అవుట్ ఫిట్ చూశారా?? కాల‌ర్ మోడ‌ల్ టాప్‌కు ప‌లాజో త‌ర‌హాలో ఉన్న బాట‌మ్‌ని జ‌త చేసింది. అలాగ‌ని అది ప‌లాజో అనుకుంటే మీరు పొర‌ప‌డిన‌ట్లే! ఎందుకంటే ఈ ఫ్యాష‌న్‌ను ష‌రారా అంటారు. ప్ర‌స్తుతం యువ‌త‌ను ఎక్కువ‌గా ఆక‌ట్టుకొంటున్న ట్రెండ్స్‌లో ఇదీ ఒక‌టి.
 

 

 


View this post on Instagram


For #Dhee10 tonight in #etv Costume @divya_varun_official Styling @dhiyuu PC @chinthuu1132


A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan) on
అమ్మాయిలు ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే స్కై బ్లూ క‌ల‌ర్ స్లీవ్ లెస్ టాప్‌కు అదే రంగులో 3/4 బాట‌మ్ ధ‌రించిన వ‌ర్షిణిని చూడండి. ఫ్యాష‌నబుల్‌గా క‌నిపిస్తోంది క‌దూ!
 

 

 


View this post on Instagram


For #dhee10 tonight #etv in @duta_couture @sandeepgudalaphotography MUA #shyam #shravanthi


A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan) on
ఎరుపు, న‌లుపు రంగుల క‌ల‌యిక‌లో ఉన్న ఈ టాప్‌ని చూడండి. ఈజీ హెయిర్ స్టైల్‌తో, మ్యాచింగ్ ఇయ‌ర్ రింగ్స్‌తో సింపుల్ స్టైలిష్‌గా మెరిసిపోయింది వ‌ర్షిణి.


ఇవి కూడా చ‌ద‌వండి


ఫ్యాష‌న్స్‌లో కూడా "హ‌నీ ఈజ్ ది బెస్ట్" అనిపిస్తోన్న మెహ‌రీన్..!


క‌ళ్లు చెదిరే అంద‌మే కాదు.. చ‌క్క‌ని ఫ్యాష‌న్ సెన్స్ కూడా పాయ‌ల్ సొంతం..!


శ్రీ‌ముఖి ఫ్యాష‌న్స్.. భిన్న‌మే కాదు.. భ‌లే అందంగా కూడా ఉంటాయి..!