ADVERTISEMENT
home / ఫ్యాషన్
నటనతోనే కాదు.. తన ఫ్యాషన్స్ తోనూ ఆకట్టుకుంటోన్న తెలుగమ్మాయి ఈషా రెబ్బా..

నటనతోనే కాదు.. తన ఫ్యాషన్స్ తోనూ ఆకట్టుకుంటోన్న తెలుగమ్మాయి ఈషా రెబ్బా..

మన వెండితెరపై తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులకు కనువిందు చేస్తోన్న అతి తక్కువమంది తెలుగమ్మాయిల్లో ఈషా రెబ్బా (Eesha rebba) కూడా ఒకరు. ‘అంతకుముందు.. ఆ తర్వాత..’ అనే సినిమాతో తన కెరీర్ ను ప్రారంభించిన ఈ చిన్నది ఆ తర్వాత బందిపోటు, అమీతుమీ, దర్శకుడు, అ.., అరవింద సమేత వీర రాఘవ.. మొదలైన చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం కన్నడ సినీ పరిశ్రమలో తన లక్ ఎలా ఉందో పరీక్షించుకునేందుకు సిద్ధమవుతోంది. అయితే వెండితెరపై ఈ అమ్మడి అందానికి అభిమానులు ఉన్నట్లే ఈమె ధరించే ఫ్యాషన్స్ ను కూడా కొందరు అనుసరించడానికి బాగా ఇష్టపడుతుంటారు. అందుకే ఈ అందాల భామ స్టైల్ ఫైల్ లోని కొన్ని ఫ్యాషన్స్ పై మనమూ ఓ లుక్కేద్దాం రండి..

సీజన్ ఏదైనా సరే.. మనం కొన్ని కొన్ని శుభకార్యాలకు హాజరుకాక తప్పదు. అలాగని ఇప్పుడున్న ఎండ వేడిని తట్టుకుంటూ హెవీగా డిజైన్ చేసిన అవుట్ ఫిట్స్ ధరించడం కూడా కష్టమే. పైగా యాక్సెసరీస్ కూడా మితంగానే పెట్టుకోవాలని భావిస్తూ ఉంటాం. మీరూ అంతేనా?? అయితే ఈషా ధరించిన ఈ అవుట్ ఫిట్ ఎంపిక చేసుకుంటే సరి.. పెప్లమ్ తరహాలో డిజైన్ చేసిన టాప్ కి అక్కడక్కడా సీక్వెన్ వర్క్ ఉన్న బాటమ్ జత చేసి స్టైలిష్ లుక్ సొంతం చేసుకుందీ ముద్దుగుమ్మ. దానికి మ్యాచయ్యే విధంగా వేవీ హెయిర్ స్టైల్, హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకుని సింపుల్ గానే సూపర్బ్ అనిపించేలా రడీ అయింది కదూ..

హాట్ సమ్మర్ ని కూల్ గా ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో చాలామంది ఈ సీజన్ లో స్లీవ్ లెస్ అవుట్ ఫిట్స్ ఎక్కువగా ఎంపిక చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో జరిగే పార్టీలు, ఫంక్షన్స్.. వంటి వాటికి ఇవి చక్కని ఎంపిక అని చెప్పచ్చు. అందుకే ఈషా కూడా ఇదే రూల్ ఫాలో అయింది. బ్లూ షేడ్ వేవీ లాంగ్ ఫ్రాక్ కు డైమండ్ జ్యుయలరీ తరహా యాక్సెసరీస్ జత చేసి కూల్ లుక్ సొంతం చేసుకుంది.

అసలే ఎండలు మండిపోతున్నాయి.. అందుకే చాలామంది మామూలు సందర్భాల్లో కాటన్ మినహా ఇతర ఫ్యాబ్రిక్స్ ఏవీ ధరించేందుకు అంతగా ఇష్టపడరు. అయితే సింపుల్ అవుట్ ఫిట్ ధరించినా సరే.. అందులో ఫ్యాషనబుల్ గా ఎలా కనిపించాలో మాత్రం మనం ఈషాను చూసి సులభంగా తెలుసుకోవచ్చు. లైట్ పర్పుల్ కలర్ ప్రింటెడ్ అసిమెట్రికల్ టాప్ కు హ్యాంగింగ్స్ మ్యాచ్ చేసి స్టైలిష్ గా ఎలా మెరిసిపోతోందో చూడండి.

ADVERTISEMENT

కాలేజీలకు వెళ్లే అమ్మాయిలకు సీజన్ ఏదైనా సరే.. స్టైలిష్ లుక్ అంటే అది కేవలం జీన్స్ తోనే సొంతమవుతుందని బలంగా నమ్ముతుంటారు. మీ నమ్మకం కూడా ఇదేనా?? అయితే ఈషాని ఫాలో అయితే సరి.. చూడండి.. జీన్స్ కు ప్లెయిన్ టాప్ జత చేసి స్కార్ఫ్ తో స్టైలిష్ లుక్ ఎలా సొంతం చేసుకుందో..

పార్టీలు, శుభకార్యాలు వంటివి జరిగినప్పుడు నలుగురిలోనూ మనం స్పెషల్ గా, అందంగా కనిపించాలని ఆశించడం సహజమే. అందుకు అనుగుణంగా మన అవుట్ ఫిట్స్ కూడా ఎంపిక చేసుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. ఈషా కూడా అదే పని చేసింది. నెట్టెడ్ అండ్ రఫెల్డ్ హ్యాండ్స్ ఉన్న టాప్, లెహెంగాలో భలే అందంగా మెరిసిపోయింది.

ఫ్యాషన్ ప్రపంచంలో ఎన్ని కలర్స్ ఉన్నా.. ఎక్కువమంది అమ్మాయిలు బాగా ఇష్టపడే కలర్స్ లో నలుపు కూడా ఒకటి. సమ్మర్ సందర్భంగా కూల్ గా ఉండే ప్రదేశాలకు వెళ్లినప్పుడు లేదా రాత్రి సమయంలో జరిగే పార్టీలు, ఫ్రెండ్స్ మీట్.. వంటి వాటికి ఈ కలర్ మంచి ఎంపిక. ప్లెయిన్ బ్లాక్ కలర్ లో ఉన్న డ్రస్ కు ఆకర్షణీయమైన డైమండ్ సెట్ జత చేసి ఈషా అందంగా ఎలా మెరిసిపోతోందో చూడండి.

సమ్మర్ లో ఎక్కడికైనా ప్రయాణించాలంటే ఎండ వేడికి భయపడేవారు ఎందరో.. అయితే కూల్ గా ఉండే అవుట్ ఫిట్ ఎంపిక చేసుకుంటే ఇలా భయపడాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఈషాని చూడండి.. లైట్ బ్రౌన్ ప్రింటెడ్ టాప్ కి మ్యాచింగ్ హ్యాంగింగ్స్, ఫుట్ వేర్, హ్యాండ్ బ్యాగ్ యాక్సెసరీస్ గా ఎంపిక చేసుకుని కూల్ లుక్ లో ఎలా మెరిసిపోతోందో.. అంతేనా.. డ్రస్ కు ఆమె జత చేసిన సన్నని బెల్ట్ కూడా అవుట్ ఫిట్ అందాన్ని రెట్టింపయ్యేలా చేసిందంటే అతిశయోక్తి కాదు.

ADVERTISEMENT

వేసవిలో ధరించే దుస్తులు సింపుల్ గానే ఉండాలి.. కానీ మనల్ని హుందాగా కనిపించేలా చేయాలని భావించేవారు ఎందరో.. అయితే ఈషా పాటించిన స్టైల్ టిప్స్ ఫాలో అయితే సరి.. కోల్డ్ షోల్డర్డ్ లాంగ్ గౌన్ కి స్టేట్ మెంట్ ఇయర్ రింగ్స్, హెయిర్ స్టైల్ జత చేసి ఎండ కంటే ఎక్కువ వేడి పుట్టిస్తోంది ఈషా.

ఇవి ఈ అమ్మడి స్టైల్ ఫైల్ లో కొన్ని మాత్రమే.. ఇలాంటి మరిన్ని ఫ్యాషన్స్ గురించి తెలుసుకునేందుకు ఈషా ఇన్ స్టాగ్రామ్ పై మీరూ ఓ లుక్కేయండి..

ఇవి కూడా చదవండి

వావ్.. అనిపించే ఫ్యాషన్స్‌తో అదరగొడుతున్న విష్ణుప్రియ..!

ADVERTISEMENT

ఫ్యాషన్ క్వీన్ ‘అను ఇమ్మాన్యుయెల్’ను ఫాలో అవ్వండి .. మీరూ స్టైలిష్ లుక్‌లో మెరిసిపోండి..!

అందంలోనే కాదు.. ఫ్యాష‌న్స్‌లో కూడా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ అదుర్సే..!

10 Apr 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT