ADVERTISEMENT
home / Family
#ToMaaWithLove అమ్మ సోషల్ మీడియాలో ఉంటే.. ఎలా ఉంటుందంటే..?

#ToMaaWithLove అమ్మ సోషల్ మీడియాలో ఉంటే.. ఎలా ఉంటుందంటే..?

సోషల్ మీడియా (Social media).. ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తోన్న మాధ్యమం. కాలంతో పాటు అప్‌డేటెడ్‌గా ఉండడానికి మాత్రమే కాదు.. స్నేహితులతో టచ్‌లో ఉండేందుకు, ప్రపంచంలో జరుగుతున్న విషయాలన్నీ తెలుసుకునేందుకు.. ఇలా మనకు సోషల్ మీడియా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. మరి, ఈ సోషల్ మీడియా కేవలం మనలాంటివారికే ఎందుకు సొంతం కావాలి?

అందుకే వయసైన వారు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. అయితే వారికి సోషల్ మీడియా నాలెడ్జ్ కాస్త తక్కువగా ఉండడం సహజం. మన అమ్మే (Mom) గనుక ఒకవేళ సోషల్ మీడియాలో ఉంటే కాస్త వింత పరిస్థితులు  ఆమెకు ఎదురవడం ఖాయం. ఇవి అందరి విషయాల్లోనూ జరుగుతాయని రూలేం లేదు. కొందరు ప్రతి విషయాన్ని చూసి నేర్చుకోవడం, అప్‌డేటెడ్‌గా ఉండడం వంటివి చేస్తారు. ఈ క్రమంలో మనం సంప్రదాయబద్దంగా ఉండే అమ్మలు వాట్సాప్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా వేదికలను ఉపయోగిస్తే ఎలా ఉంటుందో చూద్దాం రండి..

fb1

1. మీ పాత ఫొటోలన్నీ బయటకొచ్చేస్తాయి..

మీ అమ్మ దగ్గర మీ చిన్నప్పటి ఫొటోలు బోలెడన్ని ఉంటాయి. మీకు వివిధ గెటప్స్ వేసి తీసిన ఫోటోలు కూడా అందులో ఉండవచ్చు. ఒకవేళ మీ అమ్మ సోషల్ మీడియాలో అడుగుపెడితే.. “నా బుజ్జి పాప.. నా బంగారం” అంటూ క్యాప్షన్లతో ఈ ఫొటోలన్నీ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఒకవేళ ఈ ఫోటోలను పోస్ట్ చేయడంతో పాటు వాటికి మిమ్మల్ని ట్యాగ్ చేసినా ఆశ్చర్యపోవద్దు. ఆ ఫొటోలన్నీ మీ స్నేహితులు చూసి.. మిమ్మల్ని అడుగుతుంటే మీ ఫీలింగ్ గురించి మళ్లీ చెప్పాలా?

2. మీ ప్రతి ఫొటోపై కామెంట్ తప్పనిసరి..

తన కూతురు లేదా కొడుకు ఎలా ఉన్నా సరే.. అమ్మకు చాలా ముద్దుగానే కనిపిస్తారు. ఎంత పెద్దవాళ్లయినా అమ్మ కళ్లకు ఇంకా చిన్నపిల్లల్లాగే ఉంటారు. అందుకే తమ పిల్లలు ఫేస్‌బుక్‌లో ఫోటో పెట్టినప్పుడల్లా తల్లులు “నా ముద్దుల పాప, నా బ్యూటిఫుల్ బేబీ, నా హ్యాండ్ సమ్ కొడుకు, నా అందాల రాజు” అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తుంటారు. ఇవి మీ స్నేహితులకు మిమ్మల్ని ఏడిపించడానికి.. ఓ అస్త్రంగా మారుతాయన్న సంగతి తెలిసిందే..

ADVERTISEMENT

fb3

3. ఫేస్‌బుక్‌లో మీరు పెట్టే పోస్టులు, మీ స్నేహితులపై నజర్ తప్పనిసరి..

సాధారణంగా మన స్నేహితులు పెట్టే పోస్టులు, మనం పెట్టే పోస్టులు చాలా వెరైటీగా ఉంటాయి. అందులో ప్రేమ, పెళ్లి వంటి వాటికి సంబంధించి కూడా ఎన్నో ఉంటాయి. కానీ అమ్మ మనకు సోషల్ మీడియా ఫ్రెండ్‌గా ఉందంటే మాత్రం కాస్త ఆలోచించి పోస్టులు పెట్టాల్సిందే. ఎందుకంటే మనం పెట్టే ప్రతి పోస్ట్ పైనా అమ్మ నజర్ తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టడం మనమే మానేస్తాం.

4. ఫార్వార్డ్ మెసేజ్‌లు వరుస కట్టేస్తాయి..

అమ్మ ఫోన్లో వాట్సాప్ ఉంటే.. మనకు ఫార్వార్డ్ మెసేజ్‌లు కట్టకట్టలుగా వచ్చేస్తుంటాయి. “నాకు ఆరోగ్యం బాగాలేదు. దీన్ని షేర్ చేస్తే నాకు ఒక పైసా వస్తుంది” అని రాసి ఉండే పోస్టులను జాలితో వారు ఎక్కువగా ఫార్వార్డ్ చేస్తుంటారు. వీటితో పాటు  “ఫలానా ఆహారంలో పురుగుల మందు కలిసింది. ఫలానా కూరగాయలు తినడం మంచిది కాదు..” అని ఉండే మెసేజ్‌లను కూడా మన మీద అక్కరతో పంపిస్తారు.ఎంతైనా మన ఆరోగ్యం విషయంలో తనకెంతో శ్రద్ధ ఉంటుంది కదా..

fb5

5. రోజూ గుడ్ మార్నింగ్, గుడ్ నైట్లే కాదు.. కొటేషన్లు కూడా..

అమ్మ వాట్సాప్‌లో ఉంటే రోజూ మనం నిద్రలేవక ముందే “గుడ్ మార్నింగ్ మెసేజ్‌లు, రాత్రి గుడ్ నైట్ మెసేజ్‌లు” పంపిస్తే ఆశ్చర్యపోవద్దు. వీటితో పాటు.. ప్రతి చిన్న పండక్కి కూడా శుభాకాంక్షలు మన మొబైల్‌కే వచ్చేస్తాయి. అలాగే అప్పుడప్పుడూ బోనస్‌గా “అమ్మానాన్నలను, పెద్దలను గౌరవించాలి.. పెద్దల మాట చద్ది మూట” వంటి కోట్స్ కూడా మనకు పంపుతూ ఉంటారు.

6. ఫ్యామిలీ గ్రూప్‌లో మాట్లాడమని పోరు తప్పనిసరి.

అమ్మానాన్నలు వాట్సాప్‌లో ఉన్నారంటే.. మావయ్యలు, చిన్నాన్నలు కూడా ఉన్నట్లే. కాబట్టి తప్పనిసరిగా ఫ్యామిలీ గ్రూప్ కూడా ఉండాల్సిందే. అందులో వాళ్లు వాళ్లు మాట్లాడుకోవడం మాత్రమే కాదు.. మిమ్మల్ని కూడా మాట్లాడమని పోరు పెడతారు. బంధువులతో టచ్‌లో ఉండాలని అమ్మ మనకు పదే పదే చెప్పడం కూడా సహజం. మనకేమో స్నేహితులతో చాటింగ్ చేయడంతోనే సరిపోతుందాయె.. అందుకే ఈ విషయంలో గొడవ తప్పనిసరి.

ADVERTISEMENT

fb7

7. అబ్బాయిల ఫొటోలూ వాట్సాప్‌లోనే..

మీకు ఇప్పుడు పెళ్లి అవసరం లేదు అని చెబుతున్నా.. అబ్బాయి ఫొటో నచ్చితేనైనా పెళ్లికి ఒప్పుకుంటారేమో అనేది మీ అమ్మ అభిప్రాయం కావచ్చు. అందుకే బంధువులు పంపిన ప్రతి ఫొటోని మీకు వాట్సాప్‌లో పంపి మీ అభిప్రాయం అడుగుతూ ఉంటుంది అమ్మ. అలాగే ఏ పెళ్లి కొడుకు  ఫోటో తన వద్దకు వచ్చినా.. ఉత్సాహంగా మీకు ఫార్వార్డ్ చేసేస్తుంది అమ్మ.  ఆ ఫోటోలు గనుక మీ స్నేహితులు చూస్తే.. ఇక తర్వాత పరిస్థితి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఏడిపించి గానీ వదలరు.

8. మీ లాస్ట్ సీన్ గురించి చర్చ తప్పనిసరి..

రోజూ రాత్రి తమ పిల్లలు.. టైం ప్రకారం నిద్రపోతున్నారో లేదో చెక్ చేయడం తల్లికి అలవాటు. అలా చెక్ చేస్తే గానీ తనకు నిద్రపట్టదు. కానీ మనం ఏం చేస్తాం.. తను చూసి వెళ్లిన తర్వాత వాట్సాప్ ఛాటింగ్ ప్రారంభిస్తాం. అర్ధరాత్రి వరకూ ఛాటింగ్ చేస్తాం. ఇంతకుముందైతే అమ్మకు ఈ విషయం తెలిసేది కాదు. కానీ ఇప్పుడు తనకూ వాట్సాప్ ఉంది కాబట్టి.. ఉదయాన్నే మీ లాస్ట్ సీన్ చూసి గొడవ పెట్టుకునే అమ్మలు కూడా ఉంటారండోయ్.. కాబట్టి జాగ్రత్త..

fb9

9. మెసేజ్‌లు వరుస కట్టేస్తాయి..

వాట్సాప్ లేనప్పుడైతే ఫోన్‌లు రాజ్యమేలేవి. మనం అమ్మకు ఫోన్  చేస్తే “ఎప్పుడొస్తావు.. ఏం తింటావు? తిన్నావా? లేదా?” ఇలా కొన్ని ప్రశ్నలు అడిగి వదిలేసేది అమ్మ. వాట్సాప్ వచ్చిన తర్వాత ఫ్రీ కాబట్టి ఉదయాన్నే ఆఫీస్‌కి టైంకి వెళ్లావా? అనే ప్రశ్న నుండి ప్రారంభమై.. “అన్నం తిన్నావా? భోజనం వదిలేయకు..నీకు నచ్చిన కూర చేశాను. సాయంత్రం టీ తాగు.. లేకపోతే తలనొప్పి వస్తుంది. వచ్చేటప్పుడు ఫలానా సామాను తీసుకురా. బయల్దేరావా? లేదా? ఇంకా ఎంత టైం పడుతుంది..” ఇలా ఉదయం నుంచి సాయంత్రం వరకూ రోజూ మెసేజ్‌లు వస్తూనే ఉంటాయి.

10. కొత్త విషయాల కోసం మీకు ఫోన్లు వస్తుంటాయి..

కేవలం మెసేజ్‌లు మాత్రమే కాదు.. వాట్సాప్‌లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి తల్లులకూ కలగవచ్చు. అందుకే వాటి గురించి తెలుసుకునేందుకు మీకు ఫోన్లు చేయడం, మెసేజ్ చేయడం, లేదా మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం అమ్మకు తప్పనిసరి. “అరె బంగారం.. ఆంటీ ఈ ఎమోజీ పంపింది.. దీనికి అర్థం ఏంటి” అని ఓసారి.. “నాన్నా.. టీటీవైఎల్ అంటే ఏంటి?” అని మరోసారి.. “చిన్నారీ.. వాయిస్ మెసేజ్ ఎలా చేయాలి” అంటూ మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. కానీ విసుక్కోకుండా చెప్పండి. ఎందుకంటే చిన్నతనంలో మీకు అన్ని విషయాలు తను అంతే ఓపికతో చెప్పింది మరి.

ADVERTISEMENT

ఇవి కూడా చదవండి.

‘మదర్స్ డే’ రోజు అమ్మకు.. మర్చిపోలేని మధుర కానుకను అందించండి..!

డియర్ మమ్మీ… నా మనసు చెప్పే మాటలు వింటావా ప్లీజ్..?

కూతురితో పోటీ పడి మరీ.. పీహెచ్‌డీ చేసిన ఓ అమ్మ కథ..!

ADVERTISEMENT
09 May 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT