ADVERTISEMENT
home / Family
‘మదర్స్ డే’ రోజు అమ్మకు.. మర్చిపోలేని మధుర కానుకను అందించండి..!

‘మదర్స్ డే’ రోజు అమ్మకు.. మర్చిపోలేని మధుర కానుకను అందించండి..!

అమ్మ (Mom) .. భూమిపై మనల్ని అందరికంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తి. సంతోషంగా ఉన్నప్పుడు మన ఆనందాన్ని మరింత పెంచే అమ్మే.. మనం బాధలో ఉన్నప్పుడు మనల్ని తన ఒడిలో నిద్రపుచ్చుతూ ఓదార్చుతుంది. ఈ ప్రపంచంలో తన గురించి కూడా ఆలోచించకుండా పిల్లలను అమితంగా.. అపారంగా ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అమ్మే. అందుకే ప్రతి వ్యక్తి జీవితంలో అమ్మ ఎంతో ప్రత్యేకం. 

అలాంటి అద్భుతమైన అమ్మ ప్రేమను సెలబ్రేట్ చేసుకునే రోజే ఈ మదర్స్ డే (Mother’s day). ఈ మదర్స్ డే సందర్భంగా మీ జీవితానికి ఎంతో ప్రత్యేకతను అందించి.. దాన్ని పరిపూర్ణంగా మార్చిన మీ అమ్మకు తను ఎంతో ప్రత్యేకం అనుకునేలా మంచి బహుమతిని అందించండి. ఎప్పుడూ ఇచ్చే బహుమతులు కాకుండా ఈసారి కాస్త ప్రత్యేకంగా మంచి బహుమతులను అందించండి. ఆ బహుమతుల్లోనే మీ ప్రేమను పూర్తిగా రంగరించి అందించి చూడండి. తను ఎంతో సంతోషిస్తుంది.

Also Read: Unique Gift Ideas For Father’s Day In Telugu

1. మేకప్ బాక్స్

సాధారణంగా చాలామంది అమ్మలు మేకప్ అంటే ఇష్టపడరు. కానీ లైట్‌గా కనిపించే మేకప్ వారి లుక్‌ని మరింత అందంగా మార్చుతుంది. అందుకే ఇప్పుడిప్పుడే చాలామంది మేకప్ పట్ల శ్రద్ధ చూపిస్తున్నారు. ఆ దారిలో మీరూ మీ అమ్మ కోసం చక్కటి నో మేకప్ లుక్‌కి సంబంధించిన ఉత్పత్తులు కొని.. దాన్ని అందమైన బాక్స్‌లో ఉంచి తనకు బహుమతిగా అందించండి.

ADVERTISEMENT

hand bag

2. హ్యాండ్ బ్యాగ్

సరుకులు తీసుకురావడానికో.. లేక షాపింగ్ లేదా ఇంకేదైనా పనికో అమ్మ బయటకు వెళ్లేటప్పుడు.. తనకి తోడుగా ఉండేందుకు చక్కటి టోట్ బ్యాగ్‌ని తనకు బహుమతిగా అందించండి. అన్ని బాధ్యతలు నిర్వర్తించే తనని కాస్త రెస్ట్ తీసుకోమని చెబుతూ.. ఈ చిల్ పిల్స్ బ్యాగ్ (రూ. 599) అందించండి. ఈ బ్యాగ్ మీరు లేకపోయినా సరే.. తను కాస్త రిలాక్స్ అవ్వాలన్న విషయాన్ని మీరు తనకు గుర్తుచేస్తున్నట్లుగా ఉంటుంది. కాబట్టి తనకు కాస్త రిలీఫ్‌గా అనిపిస్తుంది.

3. జ్యుయలరీ బాక్స్

మీ అమ్మకి నగలంటే ఇష్టమా? కేవలం బంగారం మాత్రమే కాదు.. ఫ్యాన్సీ నగలను కూడా పెట్టుకోవడానికి వీలుగా చక్కటి జ్యుయలరీ బాక్స్‌ని అందించండి. ఇంకా కావాలంటే.. తనకెంతో ఇష్టమైన అందమైన నగను కొని ఆ బాక్స్‌లో పెట్టి అందించవచ్చు.

mug

4. బెస్ట్ ఫ్రెండ్ మగ్

ఒకమ్మాయికి ఉన్న మొదటి బెస్ట్ ఫ్రెండ్ అమ్మే. రోజంతా పని చేసిన తర్వాత అమ్మతో కలిసి కూర్చొని ఓ కప్పు కాఫీ తాగడంలోని మజా మాటల్లో చెప్పలేనిది. అలా కాఫీతో పాటు ప్రపంచంలో ఉన్న అన్ని అంశాలపై చర్చించే స్నేహితులు మీరిద్దరే. ఈ క్రమంలో మీ అమ్మే మీ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేలా ఈ వీరే ఫరెవర్ మగ్ (రూ. 499) అందించండి. కేవలం కప్పు అందించడం మాత్రమేనా.. అందులోకి మంచి కాఫీని కూడా మీరే పెట్టి చక్కటి కుకీస్‌తో పాటు సర్వ్ చేయండి. తనతో కూర్చొని రోజువారీ బిజీ షెడ్యూల్లో మీరు మాట్లాడలేకపోయిన విషయాలన్నింటినీ పంచుకోండి.

5. ఫిట్ బిట్ హార్ట్ రేట్ ట్రాకర్

ఇంట్లో అందరి ఆరోగ్యం, అవసరాలతో పాటు వారు సమయానికి తిన్నారా? లేదా? వంటి విషయాలన్నింటినీ పట్టించుకునే వ్యక్తి అమ్మ. కానీ తన ఆరోగ్యం గురించి మాత్రం పట్టించుకునే తీరిక తనకు అస్సలు ఉండదు. అందుకే తను వ్యాయామం చేయాల్సిన అవసరాన్ని గురించి చెబుతూ.. అమ్మ కోసం ఓ మంచి ఫిట్ బిట్ హార్ట్ రేట్ ట్రాకర్ కొనివ్వండి. రోజూ కనీసం పదివేల అడుగులైనా వేసేలా చూసుకోమని.. తనకో టార్గెట్ పెట్టి తన ఆరోగ్యాన్ని మీరు అమ్మలా కాపాడుకోండి.

ADVERTISEMENT

cushions

6. ఇంటిని ఇష్టపడే అమ్మ కోసం..

ఇంట్లో అందమైన వస్తువులు ఉంచడం, అరుదైన వస్తువులు కలెక్ట్ చేయడం.. వాటితో ఇంటిని అలంకరించడం మీ అమ్మకి ఇష్టమా? అయితే ఈ రంగురంగుల దిండ్లను తనకు బహుమతిగా అందించి తన రూమ్‌ని మరింత అందంగా డెకరేట్ చేసుకోవడానికి తనకు సాయం చేయండి. ఈ హోమ్ కుషన్ కవర్ సెట్ (రూ.1999) మీ ఇంటికి, మీ అమ్మ ఛాయిస్‌కి బాగుంటుంది. ఓసారి ప్రయత్నించి చూడండి. ఇది తన అద్భుతమైన రంగు రంగుల డిజైన్‌తో.. మీ ఇంటి అందాన్ని మరింత పెంచుతుంది. ఈ దిండ్లను మంచి బొకేతో పాటు తన రూమ్‌లో ఉంచి తన ముఖంలో ఆనందాన్ని చూడండి.

7. బాడీ మసాజింగ్ ఛైర్

రోజంతా ఇంటి పనులన్నీ చేసి అలసిపోయే అమ్మ కోసం మీరు పనిలో ఎంత సాయం చేసినా.. మీకున్న బిజీ షెడ్యూల్లో తన పనులన్నీ పూర్తి చేయలేరు. పని మనిషిని పెట్టినా ఇంట్లో చాలా పనులు మాత్రం తనే చేసుకోవాల్సి వస్తుంది. అందుకే పనంతా చేసి అలసిపోయిన అమ్మ కోసం చక్కటి బాడీ మసాజింగ్ ఛైర్ కొనండి. పనులన్నీ పూర్తయ్యాక కాసేపు అందులో కూర్చుంటే చాలు.. తన ఒళ్లంతా నొప్పులు లేకుండా తయారవుతుంది. బిజీ షెడ్యూల్లో అమ్మ కాళ్లు నొక్కలేకుండా ఉన్న మీరు కనీసం ఒక్కరోజైనా దాన్ని చేయడం తనకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది.

gifting %285%29

8. అందమైన చీర

చీరలంటే ఇష్టం లేనిది ఎవరికి చెప్పండి? మీ అమ్మకు కూడా చీర అంటే ఇష్టం అయితే తనకిష్టమైన ఓ మంచి పట్టు లేదా ఫ్యాన్సీ చీరను బహుమతిగా ఇవ్వండి. మీ సెలెక్షన్ పై మీకు నమ్మకం లేకపోతే.. తననే తీసుకెళ్లి వేరే వాళ్లకి అని చెప్పి మరీ కొనుగోలు చేయొచ్చు. ఎవరికో అని చెప్పిన చీరను తనకు ప్రజెంట్ చేయడం చూసి తను ఆశ్చర్యపోవడంతో పాటు ఆనందిస్తుంది కూడా.

9. పర్సనలైజ్డ్ పిక్చర్ ఫ్రేమ్

కొన్ని మధురానుభూతులు ఎప్పటికీ మర్చిపోలేనివి. మీ అమ్మతో మీకు కూడా అలాంటి మంచి అనుభూతులే ఉంటే వాటిని ఎప్పటికీ గుర్తుపెట్టుకొనేలా చేయాల్సిందే. అందుకే చాలామంది తమ తల్లులతో తీసుకున్న ఫొటోలను ఫ్రేమ్ కట్టించి పెట్టడం మనం చూస్తుంటాం. కానీ ఇలా ఫ్రేమ్ చేయించినా.. మహా అయితే పదేళ్లు అందంగా ఉంటాయి. ఆ తర్వాత అవి పాడైపోతాయి. దీనికి బదులుగా ఒక మంచి ఉడెన్ ఫ్రేమ్ పై మీ ఇద్దరి బొమ్మని చిత్రంగా గీయగలిగితే ఎంతో అందంగా ఉంటుంది కదా. అలాంటి అనుభవం మీ అమ్మకు కూడా అందించండి. మీ ఇద్దరు కలిసి దిగిన అందమైన ఫొటోను వుడెన్ ఫ్రేమ్‌గా లేదా ఫ్రిజ్ మాగ్నెట్‌గా చేసి తనకు అందించండి

ADVERTISEMENT

phone case

10. అందమైన ఫోన్ కేస్

ఇటీవలి కాలంలో స్మార్ట్ ఫోన్ ఉపయోగించని వాళ్లు చాలా అరుదైపోయారు. మీ అమ్మ కూడా స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తుంటే తన కోసం ఓ అందమైన ఫోన్ కేస్‌ని తీసుకోండి. పర్సనలైజ్డ్ అయితే.. దానిపై మీ ఇద్దరి ఫోటోలు వచ్చేలా చేయచ్చు. మీ దగ్గర అంత టైం లేదంటే.. తను మీకెంతో ప్రత్యేకం అని చాటేలా ఓ ఫోన్ కవర్‌ని కొని ఇవ్వండి. ఇటు ఇంటి పనులు, అటు బయట పనులతో సతమతమవ్వడం ఏ తల్లికైనా అలవాటే. వర్కింగ్ మదర్ విషయంలో కూడా.. అదనంగా ఆఫీస్ పనులు కూడా ఉంటాయి. అయితే ఇలా రోజంతా పనులతో క్షణం కూడా తీరిక లేకుండా గడిపే.. మీ అమ్మ కోసం మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే.. ఈ బిజీ ఆస్ ఎ బీ ఫోన్ కవర్ (రూ.499) బెస్ట్ ఛాయిస్ అని చెప్పచ్చు.

పర్సనలైజ్డ్ గిఫ్ట్స్

అందరూ ఇచ్చే బహుమతులు కాదు.. నేనేమైనా ప్రత్యేకంగా ఇవ్వాలనుకుంటున్నా.. అంటారా? లేక మా అమ్మకు బహుమతి కొనివ్వడానికి నా దగ్గర అంతగా డబ్బు లేదు అంటారా? అయితే మీరే సొంతంగా కొన్ని పర్సనలైజ్డ్ గిఫ్ట్స్‌ని మీ అమ్మకు అందించవచ్చు.

అవేంటంటే..

ex2

1. అందమైన ఉత్తరం

మీ అమ్మ మీకు చాలా స్పెషల్. చిన్నతనం నుంచి మీరు ప్రతి విషయంలోనూ తన తోడు తీసుకోవాల్సిందే. అలాంటి అమ్మకు చిన్నతనం నుండి మీరు చెప్పాలనుకున్న మాటలు.. తనకు చెప్పాలనుకొని చెప్పలేని మాటలు.. తన ప్రభావంతో మీరు చేసిన మంచి పనులు అన్నీ వివరిస్తూ ఓ మంచి లేఖ రాయండి. దీన్ని అందంగా గిఫ్ట్ ప్యాక్ చేసి ఓ అందమైన బొకేతో పాటు మీ అమ్మకు కనిపించేలా ఉంచండి. మీ మనసులో తనపై ఉన్న ప్రేమ గురించి తెలుసుకొని మీ అమ్మ ఎంతో సంతోషిస్తుంది.

ADVERTISEMENT

gifting %283%29

2. మీ చేతి వంట

ప్రపంచంలో ఎంత పెద్ద ఛెఫ్ అయినా సరే.. అమ్మ చేతి వంట కంటే అద్బుతంగా వండలేరన్నది అక్షర సత్యం. అలాంటి అమ్మకు కూడా అప్పుడప్పుడూ రుచికరమైన వంట తినాలనిపిస్తుంది కదా.. ఆ వంట ఏదో హోటల్ ది కాదు.. మీ చేతితో వండిన వంట. మీ అమ్మకి ఇష్టమైన వంటకాలన్నీ గుర్తుచేసుకొని వాటిని తన కోసం వండి తనకు సర్ ప్రైజ్ ఇవ్వండి. మీకు వంట రాకపోయినా యూట్యూబ్ లో వంటకాలు చూస్తూ ప్రయత్నించి చూడండి. మీ చేతి వంట ఎలా ఉన్నా చాలా బాగుంది అంటూ వాటిని అమ్మ తినడం ఖాయం. 

3. అందమైన అనుభవాల ఎక్స్ ప్లోజన్ బాక్స్

ప్రతిఒక్కరి జీవితంలో ఎన్నో మధురమైన అనుభవాలుంటాయి. అలాంటి చాలా అనుభవాలను మనం ఫొటోల రూపంలో బంధించి దాచుకుంటాం. అలా మీరు దాచుకున్న అనుభవాలన్నింటితో పాటు మీ అమ్మకు సంబంధించిన ఫొటోలను మరికొన్నింటిని సేకరించి వాటన్నింటినీ కొన్ని నోరూరించే చాక్లెట్లతో కలిపి ఎక్స్ ప్లోజన్ బాక్స్‌గా చేసి తనకు అందించండి. ఈ పర్సనలైజ్డ్ గిఫ్ట్‌ని తను జీవితంలో మర్చిపోలేదు.

gifting %284%29

4. పర్సనలైజ్డ్ సక్యులెంట్ గార్డెన్

మీ అమ్మకు గార్డెనింగ్ అంటే ఇష్టమా? అయితే తన కోసం మంచి తోటను ఏర్పాటు చేయండి. మీ చిన్న ఇంట్లో అంత పెద్ద స్థలం ఎక్కడుందని అనుకుంటున్నారా? అంత ఎక్కువ స్థలం లేకపోయినా మీ టెర్రస్‌లో లేదా బాల్కనీలోనే చక్కటి సక్యులెంట్ (ఎడారి మొక్కలు) లేదా మంచి బోన్సాయి గార్డెన్ ఏర్పాటు చేయండి. ఇవేవీ వద్దనుకుంటే కుండీల్లో తనకు ఇష్టమైన పూల మొక్కలను ఉంచి అందించండి. తక్కువ స్థలంలోనే ఎక్కువ మొక్కలు అందంగా పెంచడానికి తగిన ఏర్పాట్లు చేయడం ఇప్పుడు చాలా సులభమే మరి..

అద్భుతమైన అనుభవాలు..

బహుమతులంటే కేవలం చేతికి అందించేవి మాత్రమే కాదు.. ఎన్నో మధురమైన అనుభూతులను మనం కానుకలుగా ఇవ్వచ్చు. తద్వారా అవతలివారిని ఆనందంలో ముంచెత్తవచ్చు. అలాంటివాటిలో కొన్ని మీకోసం..

ADVERTISEMENT

1. తన పేరుతో నక్షత్రం..

ఆకాశంలో కొన్ని కోట్ల తారలుంటాయి. అందులో మీ అమ్మ పేరుతో ఓ నక్షత్రం ఉంటే ఎంతో బాగుంటుంది కదా. ఎప్పటికీ అది అలా నిలిచిపోతుంది. అందుకే ఇలా నక్షత్రాలకు పేర్లు పెట్టే అవకాశాన్ని ఇంటర్నేషనల్ స్టార్ ఏజెన్సీ అందిస్తోంది. ఈ అవకాశాన్ని మీరూ సద్వినియోగం చేసుకోండి. రెండు నుంచి మూడు వేల మధ్యలో ఉండే ధరతోనే మీ అమ్మ పేరును ఓ నక్షత్రానికి పెట్టి.. ఆ తారను మీ అమ్మకు చూపుతూ తనని ఆనందంలో ముంచెత్తండి.

spa

2. లగ్జరీ స్పా ట్రీట్మెంట్

ఇంటి పనులు, బాధ్యతల బరువుతో ఎప్పుడూ శారీరకంగానే కాదు.. మానసికంగా కూడా అలసిపోయి ఉంటుంది అమ్మ. అందుకే తను శారీరకంగా, మానసికంగా తిరిగి పునరుత్తేజం పొందేందుకు మంచి స్పా ట్రీట్ మెంట్‌ని తనకు బహుమతిగా అందించడం చక్కటి పద్ధతి. మీ దగ్గర అంత డబ్బు లేకపోతే అందమైన సెంటెడ్ క్యాండిల్స్ సెట్ (రూ.909) అయినా కొని.. మీరే స్వయంగా మీ అమ్మకు స్పా ట్రీట్‌మెంట్ అందివ్వచ్చు.

gifting %281%29

3. అందమైన ట్రిప్

మీ అమ్మకు ఎప్పటినుంచో ఏదైనా ప్రదేశానికి వెళ్లాలి అనిపించినా.. కుటుంబ బాధ్యతలు, ఇతర ఖర్చులన్నీ లెక్కేసుకుంటూ వెళ్లలేకపోయి ఉండవచ్చు. లేదా వెళ్లేందుకు ఆసక్తి చూపించకపోవడం వంటివి జరుగుతుండొచ్చు. అలా మీ అమ్మ మనసులో ఏముందో ఓ స్నేహితురాలిగా తెలుసుకొని తనకు తెలియకుండా ఓ సర్ ప్రైజ్ ట్రిప్ ప్లాన్ చేసి ఆ టికెట్లతో తనని సర్ ప్రైజ్ చేయండి.

అయితే ఈ ప్లానింగ్‌కి ముందు మీ అమ్మను.. ఆ ప్రదేశానికి తీసుకెళ్లేందుకు సరైన తేదీ ఏదో మీరే గుర్తించాల్సి ఉంటుంది. అలాగే ఆ సీజన్‌ని కూడా గుర్తు పెట్టుకోవాలి. ఉదాహరణకు మీ అమ్మకు వేడిగా ఉండే ప్రదేశానికి (ఉదా: రాజస్థాన్ )  వెళ్లాలని ఉంటే చలికాలంలో.. షిమ్లా, కశ్మీర్ వంటి చలి ప్రదేశాలకు ఎండా కాలంలో పంపడం మంచిది. పంపేముందు ఆ ప్రాంతాల వాతావరణం.. మీ తల్లి ఆరోగ్యానికి సెట్ అవుతుందో లేదో కూడా ఆలోచించాలి. 

ADVERTISEMENT

4. ఫైవ్ స్టార్ హోటల్ డిన్నర్

మనలో చాలామంది ఫైవ్ స్టార్ హోటల్‌కి వెళ్లాలని ఆశిస్తూ ఉంటారు. కానీ ఇది మనందరి బడ్జెట్‌కి బయట ఉన్న విషయం అని చెప్పి వెళ్లకుండా దూరంగా ఉంటాం. కానీ ఒక్కసారి మాత్రం అమ్మ కోసం బడ్జెట్‌ని పక్కన పెట్టి.. తనకు ఆ ఫైవ్ స్టార్ హోటల్‌లో ట్రీట్ ఇచ్చి.. తనకు అద్భుతమైన అనుభూతిని దక్కేలా చేయండి. అక్కడికి వెళ్లి భోజనం లేదా టిఫిన్ చేసి ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేసి రండి. దీని వల్ల తనకు జీవితాంతం గుర్తుండిపోయే మధురమైన అనుభవం సొంతమవుతుంది.

gifting %282%29

5. స్నేహితులను కలపండి.

ఇప్పుడంటే మనకు ఫేస్‌బుక్‌లు, వాట్సాప్‌లు ఉన్నాయి. గ్రూప్స్‌లో అందరం కలిసే అవకాశం ఉంది కాబట్టి.. మన స్నేహితులతో ఎప్పుడూ టచ్‌లో ఉండేందుకు వీలవుతుంది. కానీ మన తల్లిదండ్రుల కాలంలో అలాంటివేవీ లేవు. కానీ స్కూల్లో లేదా కాలేజీలో తనతో పాటు చదువుకొని.. తమ అనుభవాలన్నీ పంచుకున్న స్నేహితులు మాత్రం ఉండే ఉంటారు. ఎలాగైనా ప్రయత్నించి వారిని పట్టుకొని మీ అమ్మతో కలిపే ప్రయత్నం చేయండి. వారిని సడన్‌గా తీసుకొచ్చి అమ్మను ఆశ్చర్యంలో ముంచెత్తండి.

చూశారుగా.. మదర్స్ డేకి అమ్మకు ఇవ్వడానికి వీలున్న బహుమతులు. అయితే కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే కాదు.. మిగిలిన రోజులలో కూడా.. తనకు మీరు ప్రేమను అందిస్తుంటేనే.. మదర్స్ డేకి  సరైన ప్రాధాన్యానిస్తూ అమ్మను ప్రేమించినట్లు అవుతుంది. ఒక్క రోజు విషెస్ చెప్పి మిగిలిన రోజులు మీరు అమ్మను పట్టించుకోకపోతే ఈ రోజు మీరు ఎంత చేసినా అది వ్యర్థం అనే చెప్పుకోవాలి. 

అద్భుత‌మైన వార్త‌.. ఇప్పుడు POPxo షాప్ ఓపెన్ అయింది. చ‌క్క‌టి మ‌గ్స్, ఫోన్ క‌వ‌ర్స్‌, కుష‌న్స్‌, లాప్‌టాప్‌ స్లీవ్స్ ఇంకా మ‌రెన్నో ఇక్క‌డ 25 శాతం డిస్కౌంట్‌తోనే ల‌భిస్తున్నాయి. POPXOFIRST అనే కూప‌న్ కోడ్‌ని ఉప‌యోగించండి. దీంతో మ‌హిళ‌ల‌కు ఆన్‌లైన్ షాపింగ్ ఎంతో సులువైపోతుంది.

ADVERTISEMENT

ఇవి కూడా చదవండి.. 

కూతురితో పోటీ పడి మరీ.. పీహెచ్‌డీ చేసిన ఓ అమ్మ కథ..!

అమ్మ‌నే కానీ నాకూ అన్నీ తెలియ‌వు: మాతృమూర్తులకు సోనాలీ సందేశం

డియర్ మమ్మీ… నా మనసు చెప్పే మాటలు వింటావా ప్లీజ్..?

ADVERTISEMENT

Images : POPxo shop, Shutterstock

07 May 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT