నాన్న.. ఆ పదం వింటేనే ఏదో మధురానుభూతి కలుగుతుంది. మన కోసం.. మన బాగు కోసం అహర్నిశలు కష్టపడే నాన్న.. మన బాధ్యతను మనకు గుర్తుచేసే స్ఫూర్తిప్రదాత కూడా. మన లక్ష్యం వెనుక ప్రతీ నిముషం తోడుంటూ.. మనకు ఆత్మస్థైర్యాన్ని అందించే నాన్న... అప్పుడప్పుడు మనతో కటువుగా ప్రవర్తించినా.. తన గుండె లోతుల్లో ఎంతో ప్రేమ దాగుంటుందనేది మాత్రం సత్యం.
అటువంటి నాన్నకు.. ఫాదర్స్ డే (Fathers Day) సందర్భంగా.. ఎలాంటి బహుమతులు ఇస్తే బాగుంటుందో మనమూ తెలుసుకుందామా..!
ప్రయాణాలంటే ఇష్టపడే డాడీలకు.. ఇచ్చే బహుమతులు
మీ డాడీ కోసం గ్రూమింగ్ గిఫ్ట్ ఐడియాలు
స్పోర్టీ డాడీ కోసం.. స్పెషల్ గిఫ్ట్స్
టెకీ డాడ్ కోసం.. స్పెషల్ గిఫ్ట్స్
ఫాదర్స్ డే సందర్భంగా స్పెషల్ గిఫ్ట్ ఐడియాలు
డాడీ కోసం.. హోం మేడ్ గిఫ్ట్ ఐడియాలు
ధర (రూ.499)
Also Read: ఫాదర్స్ డే కొటేషన్స్ (Amazing Father's Day Quotation)
మంచి యాత్రలు చేయాలని భావించే మీ తండ్రికి.. మీరు బహుమతిగా ఇవ్వగల మరో చిత్రమైన బహుమతి "కార్క్ బోర్డ్ మ్యాప్". యాత్ర చేసిన వ్యక్తి తాను సందర్శించిన ప్రదేశాలను ఫోటోలు తీసి.. ఈ మ్యాప్ పై పిన్ చేయవచ్చు. అలాగే ట్రావెల్ పోస్టు కార్డ్స్, టికెట్స్ మొదలైనవి కూడా ఈ మ్యాప్‌కి పిన్ చేసి.. వాటిని మధురానుభూతులుగా మలచుకోవచ్చు.
ధర (రూ.2199)
దూరప్రాంతాలకు వెళ్లే వ్యక్తులు తమ వస్తువులను భద్రపరచుకోవడానికి ఉపయోగించే బ్యాగ్.. ట్రావెల్ యాక్సెసరీస్ ఆర్గనైజర్ బ్యాగ్. ఇందులో మెడిసిన్స్, మొబైల్ ఛార్జర్స్, పవర్ బ్యాంక్, ల్యాప్ టాప్ మొదలైనవి భద్రపరచుకోవచ్చు. ఇవి చిన్న సైజుతో పాటు పెద్ద సైజులో కూడా మార్కెట్‌లో లభిస్తాయి.
ధర (రూ.999)
ఫ్రెండ్‌షిప్ డే గిఫ్ట్స్ - మీ బెస్ట్ ఫ్రెండ్ కోసం (Friendship Day Gift Ideas For Your Best Friend)
ఎక్కువగా టూరిస్ట్ ప్రాంతాలకు వెళ్లేవరు ఈ కెమెరాను వాడతారు. ఇది 35 ఎంఎం ఆటోమెటిక్ ఫోకసింగ్ కెమెరా "కాంపాక్ట్ కెమెరా". ఈ రోజుల్లో 20 మెగా పిక్సల్ సెన్సార్‌తో, 4కె రిజల్యూషన్ ఉన్న వీడియోలను కూడా ఈ కెమెరాతో తీసే టెక్నాలజీ వచ్చింది. వైఫై, ఎన్‌ఎఫ్‌సీలకు సపోర్ట్‌ను కూడా ఈ కెమెరాల తయారీదారులు అందిస్తున్నారు. ఫాదర్స్ డే సందర్భంగా ఇలాంటి లేటెస్ట్ కెమెరాను మీ నాన్నగారికి గిఫ్ట్‌గా అందివ్వచ్చు.
ధర (రూ.24,490)
మీ నాన్నగారు అంతర్జాతీయ టూర్స్‌కు వెళ్తున్నారా..? అయితే తనకు మంచి పర్సనలైజ్డ్ పాస్ పోర్టు కవర్‌ను కానుకగా ఇచ్చేయండి. నేడు రకరకాల డిజైన్స్‌తో పాస్ పోర్టు కవర్స్ మనకు మార్కెట్‌లో అందుబాటులోకి వస్తున్నాయి.
ధర (రూ.499)
మీరు మా డాడీకి ఫాదర్స్ డే బహుమతిగా మంచి పర్సనలైజ్డ్ టీషర్టును గిఫ్ట్‌గా ఇవ్వచ్చు. మంచి కొటేషన్ లేదా సూక్తి ఆ టీషర్టు మీద ప్రింట్ చేయించి కూడా తనకు బహుమతిగా అందించవచ్చు.
ధర (రూ.1599)
అన్న కోసం చెల్లెలి కానుక(Rakhi Gift Ideas For Brother)
టూర్స్‌కి వెళ్లేవారికి.. సూర్యరశ్మి బారి నుండి కళ్లను కాపాడుకోవడానికి సన్ గ్లాసెస్ అనేవి చాలా ముఖ్యం. నేడు అవి అనేక డిజైన్లలో కూడా లభిస్తున్నాయి. రూ.1000 నుండి రూ.20,000 ధర వరకు కూడా అవి అందుబాటులో ఉన్నాయి. మీరు కూడా ఈ ఫాదర్స్ డే సందర్భంగా.. మంచి స్టైలిష్ సన్ గ్లాసెస్‌ను మీ తండ్రికి బహుమతిగా అందించండి.
ధర (రూ.3199)
మంచి తీపి గుర్తులను, జ్ఞాపకాలను నిక్షిప్తం చేసుకోవడానికి.. మంచి ఛాయాచిత్రాలను బంధించడానికి.. మంచి క్వాలిటీ ఫోటో ఫ్రేమ్ అనేది చాలా ముఖ్యం. మీరు కూడా ఈ ఫాదర్స్ డే సందర్భంగా అలాంటి ఓ మంచి ఫోటో ఫ్రేమ్‌ను.. మీ ప్రియమైన తండ్రికి బహుమతిగా అందించేయండి.
ధర (రూ. 1099)
మీ డాడీ బాగా షేవ్ చేసుకొని.. హ్యాండ్‌సమ్‌గా అందరికీ కనిపించాలని భావిస్తున్నారా.. అయితే తనకు మంచి చార్కోల్ గ్రూమింగ్ కిట్‌ను కానుకగా ఇవ్వండి. ఈ కిట్‌లో పురుషులకు సంబంధించిన బాడీ వాష్, షాంపూ, ఫేస్ స్క్రబ్, క్లె్న్సింగ్ జెల్, సోప్ బార్) మొదలైనవి అందుబాటులో ఉంటాయి.
ధర (రూ. 2239)
ఇంటికి బాగా అలసిపోయి వచ్చే మీ నాన్నగారికి కాస్త ఉపశమనం కలిగించడానికి.. తన పాదాలకు కాస్త సున్నితతత్వాన్ని అందించడానికి.. మంచి ఫుట్ రెస్ట్‌ను కానుకగా ఇవ్వండి. మెత్తగా ఉండే ఆ ఫుట్ రెస్ట్ మీ కాళ్లు పెట్టి.. మీ డాడీ హాయిగా రిలాక్స్ అయితే.. మీకు కూడా ఆనందమే కదా.
ధర (రూ. 499)
ఉదయమంతా పని చేసి.. ఏ అపరాత్రో ఆఫీసు నుండి ఇంటికి చేరే మీ నాన్నకు.. కాస్త రిలాక్సింగ్ ఇవ్వాలని భావిస్తున్నారా.. అయితే మంచి మసాజ్ సెంటర్‌కు తనకు తీసుకెళ్లి.. బాడీ మసాజ్ చేయించండి. తన శరీరంతో పాటు మైండ్ కూడా ఫ్రెష్ అయ్యేలా చేయండి.
ధర (రూ.1500)
అలాగే మీ డాడీ కోసం మీరు.. తను ఇష్టపడే మంచి పెర్ఫ్యూమ్ బాటిల్‌ను కూడా కానుకగా ఇవ్వచ్చు. పురుషుల కోసమే ప్రత్యేకంగా.. అనేక బ్రాండ్స్‌లో నేను పెర్ఫ్యూమ్స్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.
ధర (రూ. 3700)
ఎప్పుడూ అవే పాత చెప్పులు లేదా బూట్లు వాడే మీ నాన్నగారికి.. ఈ ఫాదర్స్ డే సందర్భంగా ఊహించని కానుక ఇవ్వండి. మంచి స్పోర్ట్స్ షూల జతను తనకు బహుమతిగా ఇవ్వండి. తన కాళ్లకు ఎలాంటి షూ అయితే మ్యాచ్ అవుతుందో ఆలోచించి.. దానిని బట్టి డిజైనును సెలెక్ట్ చేయండి.
ధర. (రూ.4995)
నేడు రాత్రిళ్లు పడుకొనే ముందు లుంగీలు కట్టుకొనే వారు తక్కువయ్యారు. ట్రాక్స్ వాడేవారు ఎక్కువయ్యారు. మీరు కూడా మీ డాడీకి మంచి ట్రాక్ ప్యాంట్స్‌ను ఈ ఫాదర్స్ డే సందర్భంగా బహుమతిగా ఇవ్వాలని భావిస్తున్నారా..? అయితే ఇంకెందుకు ఆలస్యం.. మంచి బ్రాండెడ్ ట్రాక్స్‌ను తనకు కానుకగా ఇచ్చేయండి.
ధర (రూ. 659)
మీ డాడీ ఫిట్‌నెస్ కోసం అదనపు కేర్ తీసుకుంటున్నారా..? ఇలాంటి సందర్భంలో మీరు కూడా మీ నాన్నగారికి సహాయం అందించాలని భావిస్తే.. ఓ మంచి జిమ్మింగ్ కిట్‌ను తనకు గిఫ్ట్‌గా ఇచ్చేయండి. తద్వారా తనను ఆశ్చర్యంలో ముంచెత్తండి.
ధర (రూ.5,999)
మీ డాడీ మంచి ఫిట్‌నెస్ ఫ్రీక్ అని మీరు భావిస్తున్నారా.. అయితే తనకు ఓ లేటెస్ట్ ఫిట్‌నెస్ జెర్సీని బహుమతిగా ఇవ్వండి. ఈ జెర్సీని ట్రైనింగ్ క్యాంపులతో పాటు ఇంట్లో కూడా ధరించవచ్చు.
ధన (రూ. 320)
మీ నాన్నగారికి మ్యూజిక్ అంటే ఎంతో ఇష్టమా..? అయితే ఇంకెందుకు ఆలస్యం. తనకు లేటెస్ట్ స్మార్ట్ స్పీకర్ ఒకటి గిఫ్ట్‌గా ఇచ్చేయండి. జస్ట్ వాయిస్ సహాయంతో తనకు నచ్చిన పాటలను విని ఆస్వాదించే సౌలభ్యాన్ని కలిగించండి.
ధర (రూ. 14,999)
మీ నాన్నగారికి పుస్తకాలంటే చాలా ఇష్టమా. అయితే తనకు ఆన్ లైన్ ద్వారా.. తనకు నచ్చిన పుస్తకాలను చదువుకొనే సౌలభ్యాన్ని కలిగించండి. అమెజాన్ కిండెల్‌ను తనకు పరిచయం చేయండి. తనకోసం మీరే సబ్‌స్క్రిప్షన్ కట్టండి.
ధర. (రూ. 7,999)
మీ డాడీ వాడుతున్న పాత మొబైల్ మీరు తీసుకొని.. తనకు ఓ మంచి కొత్త మొబైల్‌ను ఈ సంవత్సరం ఫాదర్స్ డే కానుకగా తనకు అందివ్వండి. ఆ మొబైల్‌తో పాటు తన సౌకర్యం కోసం బ్లూటూత్ హెడ్ సెట్‌ను కూడా కానుకగా అందివ్వండి.
ధర (రూ. 1899)
మీ డాడీకి విస్కీ సేవించే అలవాటు ఉందా..? అయితే అప్పుడప్పుడు తను తన విస్కీని ఇంకాస్త బాగా ఎంజాయ్ చేయడానికి.. బుల్లెట్ చిల్లింగ్ క్యూబ్స్‌ను కానుకగా అందివ్వండి. ఐస్ క్యూబ్స్‌కు ప్రత్యమ్నాయం ఈ చిల్లింగ్ క్యూబ్స్. బుల్లెట్ ఆకారంలో ఉండే ఈ క్యూబ్స్‌ను 2 నుండి 3 గంటల పాటు ఫ్రీజ్ చేసి బయటకు తీశాక.. వాటిని విస్కీ పై చిల్ చేసుకొని తాగితే వచ్చే కిక్కే వేరట. ఇందులోని స్పెషల్ జెల్ టెంపరేచర్‌ను తగ్గిస్తుందట.
ధర (రూ. 1599)
మీ నాన్నగారికి పాత పాటలంటే అమితమైన ఇష్టమా. అయితే తనకోసం పార్టుబల్ డిజిటల్ మ్యూజిక్ ప్లేయర్‌ను కానుకగా అందివ్వండి.
ధర (రూ.6390)
ఇది ఓ చిత్రమైన ఫ్లాస్క్. కెమెరా ఆకారంలో ఉండే ఈ మినీ ఫ్లాస్క్‌ను, మెడలో వేసుకొని స్టైల్‌గా తిరగొచ్చు. ఈ ఫ్లాస్క్‌కు ఒక మూత కూడా ఉంటుంది. చాలామంది ఈ ఫ్లాస్క్‌లో తమను నచ్చిన ఆల్కహాలిక్ డ్రింక్స్ నింపి.. స్టైల్‌గా తాగుతూ ఉంటారు. వినడానికే చాలా చిత్రంగా ఉంది కదా.. ఇలాంటి వైరైటీ బహుమతిని కూడా మీరు మీ తండ్రికి ఫాదర్స్ డే కానుకగా ఇవ్వచ్చు.
ధర. (రూ.1299)
ఫాదర్స్ డే సందర్భంగా.. మీ నాన్న గారికి మీరే స్వయంగా ఒక సరికొత్త గ్రీటింగ్ కార్డ్ తయారుచేసి.. తనకు కానుకగా ఇవ్వండి. మీ క్రియేటివిటీని చూసి తను కూడా ఎంతో మురిసిపోతారు.
ఫాదర్స్ డే సందర్భంగా.. మీరు మీ నాన్నగారికి మీ స్వహస్తాలతో చేసిన భోజనం తినిపించండి. మీలోని మాస్టర్ చెఫ్‌ని బయటకు తీయండి. మీ టాలెంట్‌తో మీ నాన్నగారు మురిసిపోయేలా చేయండి.
మీ నాన్నగారి చిన్నప్పటి ఫోటోలు.. అలాగే తన జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలకు సంబంధించిన ఫోటోలు అన్ని కూడా ఒక కొలాజ్‌లా తయారుచేసి.. తనకు బహుమతిగా అందివ్వండి. తను తప్పకుండా ఆశ్చర్యపోతారు.
చలికాలం ఉదయమే మీ నాన్నగారు వణుకుతూ లేచి తయారై.. డ్యూటీకి వెళ్లడం చూసి మీరు కూడా ఫీలవుతూ ఉంటారు కదా. అయితే ఇంకెందుకు ఆలస్యం. మీ స్వహస్తాలతో ఒక స్వెటర్ అల్లి.. తనకు ఫాదర్స్ డే కానుకగా అందివ్వండి.
మీలో మంచి పెయింటర్ దాగున్నారా.. అయితే ఫాదర్స్ డే సందర్భంగా.. మీరే స్వయంగా తండ్రి ప్రేమను తెలియజేసే ఓ మంచి పెయింటింగ్ వేసి తనకు బహుమతిగా ఇవ్వండి. ఆ విధంగా తనను ఆశ్చర్యంలో ముంచెత్తండి.
Images: Shutterstock, Pixabay
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో లభ్యమవుతోంది: ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ మరియు బెంగాలీ
కలర్ ఫుల్‌గా, క్యూట్‌గా ఉండే వస్తువులను మీరూ ఇష్టపడతారా? అయితే సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ ఇంకా మరెన్నో.. వాటికోసం POPxo Shop ని సందర్శించండి !
ఇవి కూడా చదవండి
నాన్న ప్రేమలో మాధుర్యాన్ని తెలుసుకోవాలంటే.. ఈ ఛాయాచిత్రాలు చూడాల్సిందే
#ToMaaWithLove "మదర్స్ డే" సందర్భంగా.. ఈ తెలుగు సినిమాలు మీకు ప్రత్యేకం
మా అమ్మ, నాన్న విడిపోవడం బాధాకరమే: కమల్‌హాసన్ కుమార్తె అక్షర