ఈ రోజు రాశిఫలాలు వీక్షించండి.. మీ జీవితంలో రాబోయే మార్పులను తెలుసుకోండి..!

ఈ రోజు రాశిఫలాలు వీక్షించండి.. మీ జీవితంలో రాబోయే మార్పులను తెలుసుకోండి..!

ఈ రోజు (మే 5) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం


 


మేషం (Aries) –  మానసికంగా మీరు చాలా ఒత్తిడితో సతమతమవుతూ ఉండచ్చు. ఇప్పుడు మీరు మీ ఆలోచనలన్నీ పక్కన పెట్టి మనస్ఫూర్తిగా విశ్రాంతి తీసుకోండి. లేదంటే ఆ ఒత్తిడి మీ ఆలోచనలను ప్రభావితం చేయవచ్చు. 


వృషభం (Tarus) – కుటుంబపరమైన ఒత్తిళ్ల కారణంగా మీరు ఈ రోజు చాలా ఎమోషనల్‌గా ఉంటారు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఒంటరిగా సమయం గడపండి. ఈ రోజు మీకు మీరే మంచి కంపెనీ అని భావించండి. మౌనంగా మీ పని మీరు చేసుకొని వెళ్లండి. 


మిథునం (Gemini) –  రోజు ప్రారంభంలో మీకు కాస్త అలసిపోయినట్లుగా అనిపించినా.. ఆ తర్వాత మధ్యాహ్న సమయానికి అన్నీ సర్దుకుంటాయి. మీకున్న చాలా ఆలోచనలను మీ కుటుంబ సభ్యులతో పంచుకుంటే బాగుంటుందని వారు ఆశిస్తున్నారు. కనుక ఏవైనా వ్యక్తిగత సమస్యలుంటే వాటిని కుటుంబ సభ్యులతో పంచుకోండి.


కర్కాటకం (Cancer) – ఉదయం నిద్ర లేచే సమయానికే మీకు కాస్త ఇబ్బందిగా, చిరాగ్గా అనిపించవచ్చు. మీరు చేయాల్సిన పనులు చాలానే ఉన్నా.. ఆసక్తి లేని కారణంగా వాటిని అలానే వదిలేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది.


సింహం (Leo) – పుస్తకాలు, సంగీతంతో పాటు ఎంతగానో ఇష్టపడే లేక ప్రేమించే వ్యక్తులతో గడిపే సమయం ఎంత ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. మీరు ఈ రోజు ఈ ఆనందాన్ని పొందుతారు. అయితే మీ అభిప్రాయాలను ఇతరులపై రుద్దకండి.


క‌న్య (Virgo) –  నిద్ర లేచే సమయానికి అలసిపోయినట్లుగా, చిరాగ్గా అనిపించవచ్చు. అంతేకాదు.. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తొచ్చి డల్‌గా ఉండచ్చు. వాటిని అక్కడితో వదిలేయడం మంచిది. కాస్త తెలివితో వ్యవహరించండి. పాత విషయాలను పక్కన పెట్టి.. ఈ రోజు మీ కుటుంబతో ఆనందంగా గడపడానికి ప్రయత్నించండి


తుల (Libra) –  మీ మనసులో ఉన్న భావాలు, మీ ఎమోషన్స్ గురించి ఇతరులకు తెలియజెప్పేందుకు మీ సహజ ధోరణిని మీరు వదిలిపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. మీ భాగస్వామితో కలిసి సమయం గడపండి. ఏ విషయంలోనైనా ఎదుటివారు చెప్పింది పూర్తిగా విని, బాగా ఆలోచించిన తర్వాతే రియాక్ట్ కావడం మంచిది.


వృశ్చికం (Scorpio) – ముందుగా మీరు వేసుకున్న ప్రణాళికల ప్రకారం ఈ రోజంతా మీకు తీరిక లేకుండా గడుస్తుంది. వీటికి తోడు కుటుంబ సభ్యులు, స్నేహితులు.. ఇలా ఎవరికి వారి సమయం కేటాయించాల్సి వస్తుంది. కాబట్టి పగలంతా బిజీగా గడిపి రాత్రి పూర్తిగా విశ్రాంతి తీసుకోండి.


ధనుస్సు (Saggitarius) – ఈ రోజు మీరు మరింత జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. మీ ఎమోషన్స్ మీలోనే దాచేసుకోకుండా ఇతరులతో పంచుకోండి. మరింత ఆత్మవిశ్వాసంతో మాట్లాడండి.


మకరం (Capricorn) – ఆరోగ్యం విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు ఈ రోజు మీ జీవితంలో మార్పులను చూసే అవకాశం ఉ:ది. ఇష్టపడేవారితో ఇంట్లోనే సమయం గడపడం లేదా నిద్రపోవడం వంటివి చేయండి. పని గురించి అతిగా ఆలోచించకండి.


కుంభం (Aquarius) – ఈ రోజు మీరు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో చాలా సరదాగా సమయం గడుపుతారు. ముఖ్యంగా మీ జీవితంలో బాగా ముఖ్యమని భావించే వ్యక్తులతో గడపడం ద్వారా వారి ఎమోషన్స్ తెలుసుకొని వారితో మీ బంధాన్ని మరింత బలపరుచుకునేందుకు ప్రయత్నిస్తారు.


మీనం (Pisces) – ఈ రోజు మీరు చాలా రిలాక్స్డ్‌గా సమయం గడుపుతారు. తగినంత విశ్రాంతి తీసుకుంటారు. అయితే మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంపై మీరు కాస్త శ్రద్ధ వహించాల్సి రావచ్చు. అలాగే మిమ్మల్ని ప్రేమించే వారి కోసం సమయం కేటాయించండి.


Credit: Asha Shah


ఇవి కూడా చ‌ద‌వండి


ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం


సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?


మకర రాశి అమ్మాయిల మనస్తత్వం.. ఎలా ఉంటుందో మీకు తెలుసా