ఈ రోజు రాశిఫలాలు వీక్షించండి.. మీ జీవిత సమస్యలకు పరిష్కారాలు పొందండి

ఈ రోజు రాశిఫలాలు వీక్షించండి.. మీ జీవిత సమస్యలకు పరిష్కారాలు పొందండి

ఈ రోజు (మే 6) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..


 


మేషం (Aries) –  ఇతరుల కారణంగా పని విషయంలో కాస్త జాప్యం జరగవచ్చు. అది మీకు కాస్త ఇబ్బంది కలిగించి చిరాకు పెట్టినా.. అందులో మీరు చేయగలిగింది ఏమీ లేదని గ్రహించండి. కేవలం పని విషయంలోనే కాదు.. ఆరోగ్యం విషయంలోనూ మీరే ఛార్జ్ తీసుకోండి.


వృషభం (Tarus) –  చేసిన పనినే మీరు మళ్లీ చేయాల్సి రావచ్చు. అది మిమ్మల్ని నిరుత్సాహానికి గురి చేయచ్చు. అలాగే మీరు చేసే పని వేరొకరికి నచ్చకపోవచ్చు. ఇవన్నీ మీరు అర్థం చేసుకొని ఆత్మవిశ్వాసంతో పని చేయడానికి ప్రయత్నించండి.


మిథునం (Gemini) –  మీరు చేసే పని ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అందులో ఏమంతగా మార్పు లేకపోవచ్చు. మీ సహచరులు మీ పనిని గుర్తించిన కారణంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీలో ఉన్న క్రియేటివిటీని బయటకు రానీయండి.


కర్కాటకం (Cancer) –  పని అంతగా ముందుకు వెళ్లకపోవచ్చు. కానీ కొత్త ప్రాజెక్ట్స్‌లో మీ రోల్ ఎంత వరకు ఉంటుందో మీకో స్పష్టత వస్తుంది. కొన్ని పనుల్లో జాప్యం జరిగినా చివరకు అన్నీ మీకు ఫేవర్‌గానే జరుగుతాయి.


సింహం (Leo) – మిమ్మల్ని మీరు కాస్త కంట్రోల్ చేసుకోవడం మంచిది. లేదంటే ఇతరులకు మీరు అర్థం కారు. మీకు మీరుగా మరిన్ని బాధ్యతలు స్వీకరించి వాటిని నిర్వర్తించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించండి.


క‌న్య (Virgo) –  మీరు చేయాలనుకున్న పని క్రమంగా ముందుకు సాగుతుంది. అలాగే కొత్త ప్రాజెక్ట్స్, ఐడియాలు కూడా మీకు వస్తాయి.అలాగే సలహాలు, సూచనలు అందించే స్నేహితులు కూడా ఎక్కువవుతారు. ఇలాంటి సమయంలో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి వివేకంతో నిర్ణయాలు తీసుకోవడం మంచిది. 


తుల (Libra) –  ఈ రోజు మీరు పని చేసే స్టైల్ కాస్త మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ బాస్ మీ నుండి ఏదో కొత్తదనాన్ని ఆశించే అవకాశం ఉంది. ఈ క్రమంలో మీకు మీ సహచరులు కూడా సహాయపడతారు. అయితే కుటుంబ సభ్యులకు సమయం కేటాయించడం కూడా అవసరమే అని గుర్తించండి.


వృశ్చికం (Scorpio) – ఈ రోజు మీకు పనిపై ఏకాగ్రత కుదరకపోవచ్చు. అయినా సరే.. నిర్ణీత సమయానికి అనుకున్న విధంగా పని పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకోసం మీరు అదనంగా కష్టపడి పని చేయాల్సి రావచ్చు. అవసరమైతే ఇతరుల సహాయం కోరండి. నలుగురితో కలిసి సమయం గడపడం వల్ల ప్రయోజనం ఉండచ్చు.


ధనుస్సు (Saggitarius) – మీరు ఈ రోజు కొత్త ప్రాజెక్ట్స్ నిమిత్తం పని చేస్తుండవచ్చు. అయితే  పని ఒత్తిడి మీ ఆరోగ్యం పై కూడా ప్రభావం చూపించే అవకాశం కూడా ఉంది. అలాగే మీ పని ప్రభావం మీ కుటుంబంపై కూడా పడే అవకాశం ఉంది. కనుక కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడిపే సమయంలో విషయంలో.. ఎదుటివారి ఫీలింగ్స్‌కి కూడా విలువివ్వండి.


మకరం (Capricorn) – మీరు చేయాల్సిన పని చాలా ఉన్నప్పుడు.. దానిని ఎక్కడి నుంచి ప్రారంభించాలో మీకు తెలియనప్పుడు ప్రశాంతంగా ఆలోచించండి. మీ కూల్‌నెస్‌ని మీరు పోగొట్టుకోవద్దు. నిశ్శబ్దంగా ఉంటూనే మరింత సమర్థంగా మీ పనులు మీరు పూర్తి చేయండి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సమయం గడపండి.


కుంభం (Aquarius) –  మీరు చేసే పనులు, ఆలోచనలు.. ఆఖరికి మీ జీవిత భాగస్వామి నుంచి కూడా కాస్త దూరం జరిగి మీకంటూ ఏకాంత సమయం కేటాయించుకోవడం తప్పేమీ కాదు. అప్పుడే మీ ప్రాధాన్యాలను ఒకసారి సరిచూసుకొని ముందుకెళ్లే వీలుంటుంది.


మీనం (Pisces) –  ఇతరుల వల్ల లేదా సమావేశాల్లో చివరి నిమిషంలో జరిగే మార్పుల కారణంగా.. మీ పని పైనే మీ పూర్తి సమయం కేటాయించాల్సి వస్తుంది. ఫలితంగా కుటుంబంతో గడిపే సమయం తగ్గవచ్చు. అలాగే స్నేహితులను కలిసే వీలు కూడా ఉండకపోవచ్చు.


Credit: Asha Shah


ఇవి కూడా చ‌ద‌వండి


ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం


సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?


మకర రాశి అమ్మాయిల మనస్తత్వం.. ఎలా ఉంటుందో మీకు తెలుసా