నేటి రాశిఫలాలు చదవండి.. మీ భవిష్యత్తుకు బాటలు వేసుకోండి..!

నేటి రాశిఫలాలు చదవండి.. మీ భవిష్యత్తుకు బాటలు వేసుకోండి..!

ఈ రోజు (మే 7) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం..


మేషం (Aries) – చివరి నిమిషంలో జరిగే మార్పుల కారణంగా పనిఒత్తిడి ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. చిన్న చిన్న పొరపాట్లు కూడా పెద్ద పరిణామాలకు దారితీయవచ్చు. కనుక అవి జరగకుండా ఏకాగ్రతతో పని చేయాల్సి ఉంటుంది. లేదంటే సీనియర్ల నుంచి ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. మీ ఆర్థిక వ్యవహారాలను కూడా కాస్త జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది.


వృషభం (Tarus) – మరిన్ని బాధ్యతలు చేపట్టే ముందు పెండింగ్‌లో ఉన్న పనిని పూర్తి చేయండి. ఎమోషన్స్ ద్వారా మీ ఆలోచనలు ప్రభావితం కాకుండా చూసుకోండి. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్థలు తొలగించుకోవడానికి ప్రయత్నించండి.


మిథునం (Gemini) – పని ప్రదేశంలో పరిస్థితులు కాస్త సంక్లిష్టంగా ఉన్నట్లుగా అనిపించవచ్చు. చిన్న పని చేయడానికి కూడా అతిగా ఆలోచించాల్సి రావచ్చు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు.


కర్కాటకం (Cancer) – పని ప్రదేశంలో ఎవరితోనూ గొడవపడకండి. ఒక కొత్త ప్రాజెక్ట్ లేదా పనికి సంబంధించి స్పష్టత వస్తుంది. మీరు సాధించిన విజయాల కారణంగా గర్వంతో ఉప్పొంగిపోకండి. చేయాల్సిన పని గురించి ఆలోచించి జాగ్రత్తగా ముందుకు వెళ్లండి.


సింహం (Leo) – ఈ రోజు ఎదురయ్యే పరిస్థితులకు మీరే ఛార్జ్ తీసుకోండి. వాటిని ఇతరులపై వదిలేయకండి. మీటింగ్స్ ఆలస్యం అయినా లేదా వాయిదా పడినా నిరుత్సాహపడకండి. అలాగే ఆహారం అతిగా తీసుకోకండి.


క‌న్య (Virgo) – మీ మనసులో ఉన్న అభద్రతాభావం, భయం వల్ల పనిని ఎంజాయ్ చేయలేరు. మీ టీం మేట్స్‌కి మీ సహాయం అవసరం కావచ్చు. అలాగే కుటుంబం విషయంలో కాస్త శ్రద్దగా పెట్టండి. అప్పుడే సంసారిక జీవితం సాఫీగా ముందుకు వెళ్తుంది.


తుల (Libra) – పని విషయంలో మీరు కాస్త కోపంగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రవర్తన అందరితోనూ సరికాదు. వారిని వారి పని చేయనీయండి. అన్నింటినీ కంట్రోల్ చేయడానికి ప్రయత్నించకండి.


వృశ్చికం (Scorpio) – పని నెమ్మదిగా జరిగినా భవిష్యత్తుకి ప్రయోజనకరంగా ఉండే ఆలోచనలు చేస్తారు. మీ ఆర్థిక వ్యవహారాలను క్రమపద్ధతిలో ఉండేలా చూసుకోండి. మీ కుటుంబ సభ్యులంతా మీపై ప్రేమ కురిపిస్తారు.


ధనుస్సు (Saggitarius) – కొత్త ప్రాజెక్ట్స్ కూడా వచ్చి చేరడం వల్ల పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉంటుంది. పని పూర్తి చేయాల్సిన సమయం దగ్గర పడుతున్నా ఇతరులపై మీరు ఒత్తిడి తీసుకురారు. నాణ్యతతో కూడిన పనే మీ లక్ష్యం. కమ్యూనికేషన్ స్పష్టంగా ఉండేలా చూసుకోండి.


మకరం (Capricorn) – మీకు ఈ రోజు మీ కుటుంబమే తొలిప్రాధాన్యం. అందుకు అనుగుణంగానే మీ మీటింగ్స్, పనులను కూడా ప్లాన్ చేసుకుంటారు. వీలైనంత స్పష్టంగా కమ్యూనికేట్ చేయడం చాలా అవసరం. అదే సమయంలో మీ మనసులో ఉన్న భయం, అభద్రతాభావాల ప్రభావం ఇతరులపై పడనీయకండి.


కుంభం (Aquarius) – ఆఫీసులో అనుకోకుండా మీకు ఎక్కువగా పనిభారం ఎదురుకావచ్చు. ముందుగా తెలియకపోవడం వల్ల దానికి మీరు సంసిద్ధులుగా కూడా ఉండరు. కాబట్టి మీరు మరింత ఎక్కువ ఫోకస్ పెట్టి పని చేయాల్సి ఉంటుంది. కాస్త ఒత్తిడిగా అనిపించినా ఫలితాలు పాజిటివ్‌గానే వస్తాయి.


మీనం (Pisces) – మీరు ఈ రోజు ఏవేవో చేయాలనుకున్నా అవి కార్యరూపం దాల్చవు. అలాగే కొన్ని విషయాల్లో నిర్ణయాలు కూడా తీసుకోలేరు. మీ సహచరులతో కాస్త మనస్పర్థలు వచ్చే అవకాశాలున్నాయి. రోజు కాస్త నెమ్మదిగా గడుస్తుంది.


Credit: Asha Shah


ఇవి కూడా చ‌ద‌వండి


ఈ రోజు రాశిఫలాలు వీక్షించండి.. మీ జీవిత సమస్యలకు పరిష్కారాలు పొందండి


ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం


మకర రాశి అమ్మాయిల మనస్తత్వం.. ఎలా ఉంటుందో మీకు తెలుసా..!?