నేటి రాశిఫ‌లాలు చదవండి.. మీ కష్టాలను సునాయాసంగా అధిగమించండి..!

నేటి రాశిఫ‌లాలు చదవండి.. మీ కష్టాలను సునాయాసంగా అధిగమించండి..!

ఈ రోజు (మే 16) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం..


మేషం (Aries) – ఈ రోజు మీరు చాలా బద్దకంగా ఫీలవుతుంటారు. అయితే కొత్త ప్రాజెక్ట్స్ లేదా కొత్త ఐడియాలపై పని  చేసే అవకాశం కూడా మీకు ఈ రోజు లభిస్తుంది. పనిలో అధిక సమయం గడపడం వల్ల కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని వారికి అనిపించవచ్చు. కనుక మీ బద్ధాకన్ని వీడి వారితో కూడా కాస్త గడపండి. 


వృషభం (Tarus) – మీరు చేసే పనితో మీ సహచరులు, క్లయింట్స్‌ను సంతోషపరచడమే ఈ రోజు మీరు ధ్యేయంగా పెట్టుకుంటారు. ఈ క్రమంలో అనుకోని రూపంలోనూ ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఏ విషయాన్నీ మీరు వ్యక్తిగతంగా తీసుకోకండి. అలాగే ఈ రోజు మీ స్నేహితుల నుంచి ఓ శుభవార్త వింటారు.


మిథునం (Gemini) – ఈ రోజు పరిస్థితులకు అనుగుణంగా జాగ్రత్తగా వ్యవహరించండి. వివేకంతో నిర్ణయాలు తీసుకోండి. ఎవరి అభిప్రాయాలనూ మీరు బలవంతంగా మార్చేందుకు ప్రయత్నించకండి. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి.


కర్కాటకం (Cancer) – మీకు మీరే భారీ స్థాయిలో లక్ష్యాలు పెట్టుకొని వాటిని సాధించేందుకు పగటి కలలు కంటూ శ్రమిస్తున్నారు. ఒక్కసారి వాస్తవిక పరిస్థితులకు అనుగుణంగా కూడా ఆలోచించండి. అవసరమైతే మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల సలహాలు కూడా తీసుకోండి.


సింహం (Leo) – మీరు ఒకసారి ఒక అంశంపైనే మనసు పెట్టేందుకు ప్రయత్నించండి. మీరు చేసే పనిని ఇతరులు చేసిన పనితో పోల్చడం ఆపండి. మీరు తీసుకునే నిర్ణయాలపై మీరు నమ్మకం ఉంచండి. ఈ వారం మీరు భావోద్వేగానికి గురై కొన్ని అనుకోని నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. ఈ క్రమంలో మీ లక్ష్యాల గురించి మాత్రమే ఆలోచించాలి. మీకు అక్కరకు రాని వారి గురించి ఆలోచించకుండా జాగ్రత్తపడితే.. మీరు అనుకున్న పని సవ్యంగా జరుగుతుందని గ్రహించండి.


క‌న్య (Virgo) – పనిలో మీరు ఈ రోజు చాలా ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఫలితంగా పని కాస్త నెమ్మదిగా జరగవచ్చు. అలాగే ప్రాజెక్ట్స్‌లో చివరి నిమిషంలో జరిగే మార్పుల వల్ల కూడా పనిలో జాప్యం జరగవచ్చు. కాస్త వివేకంతో ఆలోచించి వ్యవహరించడం ద్వారా ఈ పరిస్థితుల నుంచి సునాయాసంగా బయటపడచ్చు.


తుల (Libra) – పని ప్రదేశంలో మీరు ఈ రోజు.. సీనియర్స్ లేదా క్లయింట్స్ నుంచి ఒత్తిడిని ఎదుర్కోవాల్సి రావచ్చు. దీని కారణంగా కొత్త ఐడియాల కోసం మీరు ఎంత ఆలోచించినా.. మెదడు పని చేయనట్లుగా అనిపించవచ్చు. ఈ ఒత్తిడి వల్ల కలిగే అసహనాన్ని.. ఎట్టి పరిస్థితిలోనూ కుటుంబీకులపై చూపించవద్దు. అవసరమైతే ఇతరుల సలహాలు తీసుకోవడానికి కూడా వెనుకాడకండి.


వృశ్చికం (Scorpio) – కుటుంబపరమైన ఇబ్బందుల కారణంగా చేపట్టిన పనులన్నీ ఈ రోజు మీరు పూర్తి చేయకపోవచ్చు. మీరు ఒకవేళ కొత్త జాబ్ లేదా రోల్ కోసం చూస్తుంటే అందుకోసం ప్రయత్నాలు మొదలుపెట్టేందుకు ఇది చాలా అనువైన సమయం. అయితే.. ఆరోగ్యాన్ని అశ్రద్ద చేస్తూ.. పనికే ఎక్కువ సమయం కేటాయించవద్దు. 


ధనుస్సు (Saggitarius) – పని విషయంలో మీ సహచరులు లేదా క్లయింట్స్ నుంచి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. మీరు ఇతరులకు ఇవ్వాలనుకున్న బాధ్యతలను ఒకసారి సరిచూసుకోవడం మంచిది. కోపంగా ఎవరితోనూ ప్రవర్తించకండి. కుటుంబ సభ్యులు మీకు సహాయ, సహకారాలు అందిస్తారు. వీలైనంతవరకు నిశ్శబ్దంగా ఉండేందుకు ప్రయత్నించండి.


మకరం (Capricorn) – ఈ రోజు వీలైనంత యాక్టివ్‌గా, బాధ్యతాయుతంగా ఉండండి. ఇతరులను నిందించడం లేదా ఆర్డర్ వేయడం.. వంటివి చేయకండి. కుటుంబ సభ్యులు, స్నేహితులు చెప్పేది ప్రశాంతంగా వినండి. వ్యక్తిగత విషయాలైనా లేక ఉద్యోగ పరమైన అంశాల విషయంలోనైనా అత్యుత్సాహంతో వ్యవహరించకండి. నిదానంగా పనులు పూర్తిచేయండి.


కుంభం (Aquarius) – పని ప్రదేశంలో సహచరుల ఆలోచనలు.. మీ ఆలోచనలకు భిన్నంగా ఉండడంతో పని పూర్తి కావడానికి ఆలస్యం కావచ్చు. అయితే దీర్ఘకాలంలో మీకు ప్రయోజనాన్ని ఇచ్చే ఒక జాబ్ లేదా కెరీర్ ఐడియా మీకు వస్తుంది. ఈ రోజు మీ స్నేహితులు.. మీ సహాయం కోరి మీ వద్దకు వచ్చే అవకాశం కూడా ఉంది. 


మీనం (Pisces) – ఈ రోజు అనుకోకుండా మీపై పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఈ రోజు మీ లక్ష్యాలను పూర్తి చేయడం కోసం సిద్ధంగా ఉండండి. మీ తెలివితేటల వల్ల వాయిదాలో ఉన్న పని కూడా పూర్తైపోతుంది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతోనూ సమయం గడపడానికి ప్రాధాన్యం ఇవ్వండి.


Credit: Asha Shah


ఇవి కూడా చ‌ద‌వండి


ఈ రోజు రాశిఫలాలు వీక్షించండి.. మీ సమస్యలకు సత్వర పరిష్కారాలు పొందండి..!


మకర రాశి అమ్మాయిల మనస్తత్వం.. ఎలా ఉంటుందో మీకు తెలుసా..!?


సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?