ఈ రోజు రాశిఫలాలు వీక్షించండి.. మీ సమస్యలకు సత్వర పరిష్కారాలు పొందండి..!

ఈ రోజు రాశిఫలాలు వీక్షించండి.. మీ సమస్యలకు సత్వర పరిష్కారాలు పొందండి..!

ఈ రోజు (మే 14) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..


 


మేషం (Aries) – ఏ కార‌ణం లేకుండానే మీకు అల‌సిపోయిన‌ట్లు లేదా ఆందోళ‌న‌గా ఉన్న‌ట్లు అనిపిస్తోందా? మీలో ఉన్న శ‌క్తి, సామ‌ర్థ్యాలు త‌గ్గిపోవ‌డం కూడా అందుకు ఒక కార‌ణం కావ‌చ్చు. కాబ‌ట్టి కాస్త విరామం తీసుకోండి. తిరిగి శ‌క్తిని పుంజుకోండి. ఆత్మ స్థైర్యంతోనే విజయాన్ని సాధించగలమనే విషయాన్ని నమ్మండి.  


వృషభం (Tarus) – కొన్ని కొన్ని ప‌ద్ధ‌తులు త‌ర‌త‌రాలుగా వ‌స్తూ మ‌న‌కు అల‌వాటైపోతూ ఉంటాయి. అయితే వాటిలో అన్నీ స‌రైన‌వి కాక‌పోవ‌చ్చు. కాబ‌ట్టి ఇప్పుడు వాటి నుంచి బ‌య‌ట‌కు రావాల్సిన స‌మ‌యమైంద‌ని గుర్తించండి. కొత్త తరానికి అనుగుణంగా మీరు మీ ఆలోచనలను మార్చుకోవాల్సి ఉంటుంది. మిథునం (Gemini) – ఇత‌రుల కోసం మీరేమీ న‌టించాల్సిన అవ‌స‌రం లేదు. అందుకు ఇది స‌మ‌యం కూడా కాదు. కాబ‌ట్టి మీ మ‌న‌సులో ఉన్న భావాల‌ను స్ప‌ష్టంగా వారికి తెలియ‌జేయండి. నిజాయతీగా ఇతరులతో మీకున్న వివాదాలను పరిష్కరించుకోండి. కర్కాటకం (Cancer) – మీకు మీరు పెట్టుకున్న హ‌ద్దుల‌ను దాటి కాస్త బ‌య‌ట‌కు రండి. ప్ర‌తి విష‌యంలోనూ మీ బెస్ట్ ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నించండి. మీకు అద్భుత‌మైన జీవితం ల‌భిస్తుంది. మీరు అనుకున్న‌వి సాధిస్తారు. అలాగే సంఘంలో కూడా పేరు, ప్రఖ్యాతులు పెరుగుతాయి. సింహం (Leo) – మీ శ‌క్తి, సామ‌ర్థ్యాల‌ను తిరిగి పొందే స‌మ‌యం ఇది. ఆ దైవ‌శ‌క్తిని ప్రార్థిస్తూనే మీ శ‌క్తి, సామ‌ర్థ్యాల‌ను పొందేందుకు మీ వంతు ప్రయ‌త్నం మీరు మొద‌లుపెట్టండి. అవ‌స‌ర‌మైతే ఇత‌రుల స‌హాయం కోరండి.క‌న్య (Virgo) – మీ సంతోషం గురించి ప‌ని చేయాల్సిన స‌మ‌యం ఇది. ప్రేమ‌తో, ఏదైనా సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో సంతోషంగా ప‌ని చేయండి. త‌ప్ప‌కుండా స‌త్ఫ‌లితాలు పొందుతారు.


 


తుల (Libra) – భ‌యాన్ని విడిచిపెట్టి, ఆత్మ‌విశ్వాసంతో ముంద‌డుగు వేయండి. అప్పుడే మీరు అనుకున్న‌వి సాధించ‌గ‌లుగుతారు. ఏవేవో కార‌ణాల వ‌ల్ల భ‌య‌ప‌డుతూ మీ కంఫ‌ర్ట్ జోన్ నుంచి బ‌య‌ట‌కు రాక‌పోతే మీ జీవితంలో మీరు కోరుకున్న మార్పు రాదు. అందుకే ధైర్యంతో ముందుకు సాగండి. వృశ్చికం (Scorpio) – మీకు ఏం కావాలో మీరు తెలుసుకొని దానిని సాధించ‌డానికి ప్ర‌య‌త్నించండి. ఒక్క‌సారి మీరు ప్ర‌య‌త్నించడం ప్రారంభిస్తే త‌గిన అవ‌కాశాలు మిమ్మ‌ల్ని వెతుక్కుంటూ వ‌స్తాయి. కాబట్టి మొద‌ట మీరు అనుకున్న‌ది సాధించ‌డానికి ప్ర‌యత్నం మొద‌లుపెట్టండి.ధనుస్సు (Saggitarius) – మీరు ఏం చేయాల‌ని అనుకుంటున్నారో అది చేయండి. ఒక‌సారి విఫ‌లం చెందినంత‌మాత్రాన అక్క‌డే ఆగిపోవాల్సిన అవ‌స‌రం లేదు. ఇలాంటి విషయాన్ని సన్నిహితులైన కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవడంలో కూడా తప్పులేదు. మకరం (Capricorn) – ప‌రిస్థితుల‌ను విశాల దృక్ప‌థంతో కాస్త భిన్నంగా చూడండి. మీ క‌ల‌ల‌ను సాకారం చేసుకోవ‌డానికి గ‌ల అనేక మార్గాలు మీకు క‌నిపిస్తాయి. అనేక అవ‌కాశాలు మీ వ‌ద్ద‌కు వ‌స్తాయి.
 
కుంభం (Aquarius) – అవ‌స‌రార్థం లేదా ప‌రిస్థితుల దృష్ట్యా మీరు ఏమైనా పొర‌పాట్లు చేసి ఉంటే వాటికి ఇప్పుడు క్షమాప‌ణ కోరుకోండి. లేదంటే అవి మీ బంధాల‌ను త‌ప్ప‌క ప్ర‌భావితం చేస్తాయ‌ని గుర్తుంచుకోండి.మీనం (Pisces) – ప్రేమ‌ను ఇచ్చేందుకు, పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండండి. గ‌తంలో ఎదురైన ప్రేమ మీకు చేదు అనుభ‌వాలు క‌లిగించినా వాటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ధైర్యంగా అంద‌రినీ ప్రేమించండి.


Credit: Asha Shah


ఇవి కూడా చదవండి


సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?


ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం


మకర రాశి అమ్మాయిల మనస్తత్వం.. ఎలా ఉంటుందో మీకు తెలుసా..!