ఈ రోజు రాశిఫ‌లాలు చదవండి.. భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోండి..!

ఈ రోజు రాశిఫ‌లాలు చదవండి.. భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోండి..!

ఈ రోజు (మే 23) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం..


మేషం (Aries) – ఈ రోజు ముందు మీరు పెండింగ్‌లో ఉన్న పని పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే కొత్త ప్రాజెక్ట్ లేదా పని విషయంలో మీరు ముందడుగు వేయలేరు. అలాగే ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. కొత్త ప్రాజెక్ట్స్ లేదా కాంట్రాక్ట్స్ అంగీకరించేటప్పుడు మిస్ కమ్యూనికేషన్ లేకుండా జాగ్రత్తపడండి.


వృషభం (Tarus) – పని నిదానంగా జరుగుతుంది. ఆఫీసులో ఇతరులతో పని చేయించేందుకు కాస్త కష్టపడాల్సి వస్తుంది. ఇంతకుముందు చేసిన పనికి సంబంధించి కూడా విమర్శలు ఎదురుకావచ్చు. పనితో పాటు మీ కుటుంబ సభ్యులకు కూడా ప్రాధాన్యం ఇవ్వండి. వారికి కాస్త సమయం కేటాయించండి. స్నేహితులతో మాట్లాడండి. కాస్త ఒత్తిడి తగ్గుతుంది.


మిథునం (Gemini) – ఈ పని ఎక్కువగా ఉన్నప్పటికీ అంతగా ఉత్పాదన కనిపించదు. ఏ విషయంలోనూ నిర్ణయాలు మీరు తీసుకోలేకపోవచ్చు. స్పష్టత వచ్చేంత వరకు వేచి ఉండి ఆ తర్వాతే ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది. కాబట్టి ఈ విషయంలో అస్సలు తొందరపడద్దు. మీరు తీసుకునే నిర్ణయాన్ని ఇతరులు తప్పకుండా సమర్థిస్తారు. 


కర్కాటకం (Cancer) – మీ మెదడును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఎంత ఎక్కువగా ఆలోచించినా చేయాల్సిన పని ముందుకు జరిగే సూచనలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఆఫీసులో ఎవరితోనూ గొడవపడకండి. మానసికపరమైన ఒత్తిడి కారణంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు.


సింహం (Leo) – ఈ రోజు పని పూర్తి చేయడానికి ఏకాగ్రత కలిగి ఉండడం చాలా అవసరం. అయితే మీరు తొందరగా పని పూర్తి చేయాలని భావించినప్పటికీ.. దాని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి కాస్త సమయం పడుతుంది. కుటుంబ సభ్యులకు కూడా ప్రాధాన్యం ఇస్తూ వారికీ తగినంత సమయం కేటాయించండి.


క‌న్య (Virgo) – చేయాల్సిన పని గురించి స్పష్టత ఉన్న కారణంగా చాలా త్వరగా, కచ్చితంగా మీ పనిని పూర్తి చేస్తారు. అయితే సరిగ్గా నిద్ర లేని కారణంగా అలసిపోయినట్లుగా మీకు అనిపించవచ్చు. దీని నుంచి బయటపడడానికి మీ స్నేహితులను కలిసి, వారితో సమయం గడిపేందుకు ప్రయత్నించండి.


తుల (Libra) – మీరు ముందుగా నిర్దేశించుకున్న ప్రణాళిక కారణంగా పని నిదానంగా, ఆలస్యంగా జరిగే అవకాశాలున్నాయి. అలాగే చేసే పనిపై దృష్టి పెట్టేందుకు కూడా మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీతో మీరు చాలా సహనంతో వ్యవహరిస్తూ వీలైనంత ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. మీ భాగస్వామితో అస్సలు గొడవపడకండి.


వృశ్చికం (Scorpio) – మీరు కొత్త జాబ్ లేదా ప్రాజెక్ట్స్ లేదా అవకాశాల గురించి వెతుకుతున్నట్లైతే ఈ రోజు ఆ అవకాశాలు మిమ్మల్ని పలకరిస్తాయి. ఇతరులతో మీరు చేయాల్సిన పని గురించి చర్చించకండి. మీ భాగస్వామి లేదా కుటుంబ సభ్యులతో చివరి నిమిషంలో ప్లాన్ చేసే ఈవెంట్స్ చాలా సరదాగా జరుగుతాయి.


ధనుస్సు (Saggitarius) – మీరు ప్రస్తుతం చాలా ఫోకస్‌తో వ్యవహరించాల్సి ఉంటుంది. మీరు చేయాల్సిన పని చాలా ఉన్నప్పటికీ వాటి కోసం తగిన ఐడియాస్ రావాలంటే కాస్త సమయం పడుతుంది. అవసరమైతే ఈ విషయంలో మీరు ఇతరుల సహాయం తీసుకోవడం కూడా మంచిదే. మీరు చేయాల్సిన పనులను ప్రాధాన్యం ఆధారంగా క్రమపద్ధతిలో చేయడం శ్రేయస్కరం.


మకరం (Capricorn) – ఈ రోజు మీరు చేయాల్సిన పని చాలానే ఉంటుంది. అలాగే మీకున్న నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం కూడా మీకు లభిస్తుంది. మీకు స్పష్టత ఉన్న కారణంగా పలు విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడం మీకు చాలా సులభంగా ఉంటుంది. అవసరమైతే ఇతరుల సహాయం తీసుకోవడం కూడా మంచిదే.


కుంభం (Aquarius) – ఈ రోజు పని నిదానంగా జరుగుతుంది. అయితే పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్స్ గురించి మీకు ఓ స్పష్టత వస్తుంది. వీలైనంత వరకు ప్రతి విషయంలోనూ సెన్సిటివ్‌గా వ్యవహరించండి. లేదంటే మీ కారణంగా ఇంకొకరు బాధపడచ్చు. పని విషయంలో సలహాలు తీసుకోవడానికి మీ స్నేహితులు మిమ్మల్ని సంప్రదిస్తారు.


మీనం (Pisces) – మీ ప్రణాళిక ప్రకారం నేడు పనులు జరగకపోవచ్చు. పెండింగ్‌లో ఉన్న పనిని పూర్తి చేసేందుకు మీరు బాగా శ్రమించాల్సి వస్తుంది. అలాగే పనిని బ్యాలన్స్ చేసేందుకు కూడా కష్టపడాల్సి ఉంటుంది. ఈ పని ఒత్తిడిని ఇంటికి తీసుకెళ్లకండి. మీ మనసులో ఉన్న ఆలోచనలను స్పష్టంగా ఎదుటివారికి చెప్పండి. సహనంతో వ్యవహరించండి.


Credit : Asha Shah


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీక్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.


ఇవి కూడా చ‌ద‌వండి


ఈ రోజు రాశిఫలాలు వీక్షించండి.. మీ గమ్యాలను నిర్దేశించుకోండి


మకర రాశి అమ్మాయిల మనస్తత్వం.. ఎలా ఉంటుందో మీకు తెలుసా..!?


సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?