ఈ రోజు రాశిఫలాలు వీక్షించండి.. మీ గమ్యాలను నిర్దేశించుకోండి

ఈ రోజు రాశిఫలాలు వీక్షించండి.. మీ గమ్యాలను నిర్దేశించుకోండి

ఈ రోజు (మే 22) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..


 


మేషం (Aries) – ఈ రోజు ముగిసే సమయానికి మీ సహచరుల నుంచి మీరు శుభవార్త వినే అవకాశాలున్నాయి. మీ కుటుంబ సభ్యులెవ్వరితోనూ మీరు అనవసరంగా గొడవపడకండి. అది మీకు ఏ విధంగానూ ఉపయోగపడదు. వివేకంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. 


వృషభం (Tarus) –  మీరు కాస్త నిదానంగా ఆలోచించాల్సి ఉంటుంది. లేదంటే పని ప్రదేశంలో మీ కారణంగా ఇతరులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏది అవసరమో దాని మీదే ఫోకస్ చేయండి. ఏదేదో ఊహించుకుంటూ సమయం వృధా చేయకండి. స్నేహితులను కలిసి వారితో కాసేపు సరదాగా గడపండి.


మిథునం (Gemini) – ఈ రోజు కాస్త ప్రశాంతంగా గడుస్తుంది. అయితే చేయాల్సిన పని అధికంగా ఉన్నప్పటికీ దానిని మీరు సకాలానికి పూర్తి చేస్తారు. కానీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఎంత డిమాండ్ చేసినా వారికి కేటాయించేందుకు మీ వద్ద అస్సలు సమయం ఉండదు. కాబట్టి పని పూర్తైన తర్వాత ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి.


కర్కాటకం (Cancer) –  మీ సీనియర్స్ లేదా సహచరుల నుంచి సహాయం అందుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. ఓవర్ కాన్ఫిడెన్స్ పనికి రాదని గ్రహించండి. మీ భావోద్వేగాలను నియంత్రించుకోండి. మీ సందేహాలను నివృత్తి చేయడంలో మీ కుటుంబ సభ్యులు మీకు సహాయపడతారు. ఈ రోజు పలు విషయాలు మీకు గందరగోళంగా అనిపిస్తాయి.


సింహం (Leo) –  మీకున్న క్రియేటివ్ ఆలోచనలను అందరితోనూ పంచుకునేందుకు ఈ రోజు మీరు ప్రయత్నిస్తారు. అయితే వాటికి సంబంధించిన ఫలితాలు రాత్రికి రాత్రే వచ్చేస్తాయని ఊహించకండి. అలాగే ఏ పనినీ వాయిదా వేయకండి. అది మీ కెరీర్ పై ప్రభావం చూపవచ్చు. అదేవిధంగా దూరంగా ఉన్న స్నేహితులను కలుసుకునే అవకాశాలున్నాయి.


క‌న్య (Virgo) –  మీకు చాలా క్రియేటివ్ ఐడియాస్ ఉన్నాయి. వాటిని వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకురావాలని మీరు భావిస్తున్నారు. అయితే ఈ విషయంలో ప్రాక్టికల్‌గా ఆలోచించేందుకు ప్రయత్నించండి. లేదంటే భవిష్యత్తులో మీరే పశ్చాత్తాప పడాల్సి ఉంటుంది.


తుల (Libra) –  ఈ రోజు అన్నీ మీరు అనుకున్న ప్రకారమే జరుగుతాయి. కొత్త భాగస్వామ్యాలు దీర్ఘకాలంలో మీకు ప్రయోజనాలను చేకూరుస్తాయి. స్నేహితులు మిమ్మల్ని కలిసేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా చివరి నిమిషంలో జరిగే మార్పులు లేదా క్యాన్సిలేషన్స్ కారణంగా అది సాధ్యపడదు.


వృశ్చికం (Scorpio) –  మీకున్న కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ రోజు చాలా సాదాసీదాగా గడిచిపోతుంది. మీ భాగస్వామితో వాగ్వాదానికి దిగకండి. అది మీ ప్రశాంతతకు భంగం కలిగేలా చేయచ్చు. మీకున్న ఒత్తిళ్ల కారణంగా వచ్చే చిరాకుని కుటుంబ సభ్యులపై చూపకండి. తర్వాత మీరే పశ్చాత్తాపపడాల్సి రావచ్చు.


ధనుస్సు (Saggitarius) –  గతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనులు ఏవైతే మీకు ఒత్తిడిని కలిగిస్తున్నాయో వాటిని పూర్తి చేసే విషయంలో మీ సహచరుల్లో ఒకరు మీకు సహాయపడతారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టాలన్నా.. ఇంటర్వ్యూలకు వెళ్లాలన్నా ఈ రోజు చాలా మంచిది.  


మకరం (Capricorn) –  కొన్ని కారణాల వల్ల పనులు ఈ రోజు వాయిదా పడే సూచనలున్నాయి. పని విషయంలో ఎవరైనా డిమాండింగ్‌గా మాట్లాడినప్పుడు వారితో వీలైనంతవరకు సహనంగా వ్యవహరించండి. లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబపరమైన కమిట్‌మెంట్స్ కారణంగా కూడా ఈ రోజు తీరిక లేనట్లుగా అనిపించవచ్చు. అలాగే మీ స్నేహితులు మీ సలహాలు తీసుకుంటారు. 


కుంభం (Aquarius) –  పనిలో బిజీగా ఉన్న కారణంగా ముఖ్యమైన కుటుంబ చర్చలు లేదా సమావేశాలకు మీరు హాజరుకాలేకపోవచ్చు. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల కారణంగా తలెత్తే పరిస్థితులు మీ ఆత్మవిశ్వాసాన్ని తక్కువ చేయవచ్చు. ఈ ఫ్యామిలీ డ్రామాకు మీరు సిద్ధంగా ఉండండి.


మీనం (Pisces) –  నిన్నటితో పోలిస్తే ఈ రోజు పని విషయంలో మీకు అంతా మంచే జరుగుతుంది. మీకున్న ఆలోచనలు, మీరు తీసుకునే యాక్షన్స్‌కు అనుగుణంగా ప్రణాళికను రూపొందించుకోవాల్సి ఉంటుంది. అలాగే పలువురు స్నేహితులు తమ కెరీర్ విషయంలో మీ సలహా తీసుకుంటారు.


Credit: Asha Shah


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో లభ్యమవుతోంది: ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ మరియు బెంగాలీ


కలర్ ఫుల్‌గా, క్యూట్‌గా ఉండే వస్తువులను మీరూ ఇష్టపడతారా? అయితే సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ ఇంకా మరెన్నో.. వాటికోసం POPxo Shop ని సందర్శించండి !


ఇవి కూడా చ‌ద‌వండి


మకర రాశి అమ్మాయిల మనస్తత్వం.. ఎలా ఉంటుందో మీకు తెలుసా


ధనురాశి అమ్మాయిల ప్రత్యేకతలు ఏమిటో ఆంగ్లంలో చదివేయండి


సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?