నేటి రాశిఫలాలు చదవండి.. మీ లక్ష్యాలను సులభంగా చేరుకోండి..!

నేటి రాశిఫలాలు చదవండి.. మీ లక్ష్యాలను సులభంగా చేరుకోండి..!

ఈ రోజు (మే 8) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం..


మేషం (Aries) – వ్యక్తిగత జీవితంలో ఉన్న కమిట్‌మెంట్స్ వల్ల పని పై మీరు సరైనరీతిలో దృష్టి సారించలేకపోవచ్చు. మీ చుట్టూ ఉన్నవారికి మీరు ఏదో ఒక విధంగా అవసరం అవుతారు. కాబట్టి ఆ అవసరాలను తీర్చుకోవడానికి మీ చుట్టూ డ్రామా కూడా జరగవచ్చు. కనుక కొంత జాగరూకతతో వ్యవహరించండి.


వృషభం (Tarus) – మీరు ఈ రోజు పనిపై ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. కొత్త బాధ్యతలు లేదా ప్రాజెక్ట్స్ మీ చేతికి వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి మీ శక్తిసామర్థ్యాలను కూడా వాటికి తగ్గట్టుగానే పెంచుకోవడానికి ప్రయత్నించండి.


మిథునం (Gemini) – ఈ రోజు మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నప్పటికీ.. ఏ పనీ మీరు చేసినట్లుగా అనిపించకపోవచ్చు. అయితే ఇదొక దశ మాత్రమే. అన్నీ విషయాలను వేగంగానే సర్దుకుంటాయి. 


కర్కాటకం (Cancer) – పని ప్రదేశంలో మీరు ఇన్ని రోజుల నుంచి పడిన శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అంతేకాదు.. ఓ కొత్త బాధ్యత లేదా పదవి మిమ్మల్ని వెతుక్కుంటూ రావచ్చు. కనుక ఒక పని చేసేటప్పుడు దానిపైనే ఫోకస్ పెట్టండి.


సింహం (Leo) – పని ప్రదేశంలో సహచరులు మీకు బాగా సహకరిస్తారు. ఫలితంగా ఈ రోజు చాలా వరకు పని పూర్తిగా అయిపోతుంది. అలాగే ఓ కొత్త పనిని మీ బాస్ మీకు అప్పగిస్తారు. దానికి మీరు జాగ్రత్తగా చేయాలని మాత్రం గమనించండి.


క‌న్య (Virgo) – పనిపై ఉన్న మీ దృష్టిని.. కాస్త మీ పర్సనల్ లైఫ్ పై కూడా పెట్టడం అవసరమే. ఈ విషయాన్ని మీరు గుర్తించండి. ముఖ్యంగా మీపై మీరు ఫోకస్ చేయండి. మీకేం కావాలో.. ఏం చేయాలనిపిస్తోందో అదే చేయండి. ఇతరులతో వీలైనంత స్పష్టంగా కమ్యూనికేట్ చేయండి.


తుల (Libra) – ఈ రోజు మీరు వీలైనంత వరకు నిశ్శబ్దంగా ఉండండి. ఎందుకంటే మీరు ఏం మాట్లాడినా అది ఎదుటివారు అపార్థం చేసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీ మనసులో ఏం ఉన్నా సరే.. నిశ్శబ్దంగా ఉండడమే మంచిది.


వృశ్చికం (Scorpio) – ఈ రోజు మీ పనులు నత్తనడకగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో పెండింగ్‌లో ఉన్న ఒక ప్రాజెక్ట్ విషయంలో మీకో స్పష్టత కూడా వస్తుంది. దాని పట్ల కాస్త జాగరూకతతో వ్యవహరించండి. అయితే మీ పని విషయంతో పాటు ఆరోగ్యం, వ్యక్తిగత జీవిత విషయాల్లో కూడా సమతుల్యతను పాటించడం చాలా ముఖ్యం.


ధనుస్సు (Saggitarius) – ప్రస్తుతం చేసే పని సజావుగానే సాగుతున్నప్పటికీ గతంలో చేసిన పని మళ్లీ చేయాల్సి రావచ్చు లేదా మీకున్న ఆలోచనలనే మళ్లీ క్రమబద్దీకరించుకోవాల్సి రావచ్చు. ఈ రోజు చాలా సమయం దానికే సరిపోతుంది. వీటి కారణంగా కొన్ని పనులు వాయిదా పడవచ్చు. 


మకరం (Capricorn) – మీరు చేసే పని నెమ్మదిగా జరుగుతుంది. అయినా సరే.. మీ కమిట్‌మెంట్స్‌తో పాటు పెండింగ్ పనులను కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గమనించండి. అలాగే మీకు విశ్రాంతి చాలా అవసరమనే విషయాన్ని మీరు నమ్మాలి. కాస్తా ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టండి. 


కుంభం (Aquarius) – పని ప్రదేశంలో మీకు వినిపించే ఒక శుభవార్త కారణంగా మీరు చాలా సంతోషిస్తారు. అయితే ఆఫీసులో ఎవరితోనూ గొడవపడకండి. ముఖ్యంగా కోపాన్ని నిగ్రహించుకోండి. ప్రశాంతంగా ఉంటూ పని ఎలా జరుగుతుందో.. అలాగే జరగనివ్వండి.


మీనం (Pisces) – ఈ రోజు మీరు సహనంతో వ్యవహరించండి. మీరు చేస్తున్న వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనలో ఉంటే అందుకు ఇదే సరైన సమయం. అయితే పనితో పాటు కాస్త మీ ఆరోగ్యంపై కూడా దృష్టి పెడితే మంచిది.


Credit: Asha Shah


ఇవి కూడా చ‌ద‌వండి


నేటి రాశిఫలాలు చదవండి.. మీ భవిష్యత్తుకు బాటలు వేసుకోండి..!


మకర రాశి అమ్మాయిల మనస్తత్వం.. ఎలా ఉంటుందో మీకు తెలుసా..!?


ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం