పెళ్లైన కొన్నేళ్ల తర్వాత.. సెక్స్ జీవితం ఎలా ఉంటుందంటే..!

పెళ్లైన కొన్నేళ్ల తర్వాత.. సెక్స్ జీవితం ఎలా ఉంటుందంటే..!

పెళ్లైన కొత్తలో సెక్స్‌కు (sex)  సంబంధించి అమ్మాయిలకు అనేక సందేహాలు ఉండడం సహజం. ఈ కారణంగానే చాలా భయంభయంగా తమ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఓ వైపు పట్టరానంత సంతోషంగా ఉన్నప్పటికీ తమ జీవితంలోకి ప్రవేశించిన.. ఓ కొత్త వ్యక్తితో శారీరకంగా కలిసేందుకు ఇబ్బందిపడుతూ ఉంటారు. అయితే పెళ్లైన కొద్ది రోజుల తర్వాత ఈ సమస్యలన్నీ క్రమంగా సర్దుకుని ఆలుమగలిద్దరూ సంతోషంగా తమ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటారు.


మరి, పెళ్లైన కొన్ని సంవత్సరాల తర్వాత భార్యాభర్తల మధ్య సెక్స్ జీవితం ఎలా ఉంటుందో మీకు తెలుసా?? ఇది ఒక్కొక్క జంటలోనూ ఒక్కోలా ఉంటుంది. అంటే.. కొందరు సెక్స్ అనేదానిని రొటీన్‌గా భావించి తమ జీవితాన్ని కొనసాగిస్తుంటే.. ఇంకొందరు మాత్రం దాంపత్య జీవితంలోనూ కొత్త భంగిమలను ఆస్వాదిస్తూ తమ వైవాహిక జీవితాన్ని మరింత సంతోషంగా మార్చుకుంటారు.


అంతేకాదు.. పెళ్లైన కొత్తలో భాగస్వామి గురించి, వారి ఇష్టాయిష్టాల గురించి అంతగా తెలీదు కాబట్టి.. వారితో ఏం మాట్లాడాలన్నా కాస్త బెరుకుగా, ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ రోజులు గడిచేకొద్దీ భార్యాభర్తలిద్దరూ ఒకరి గురించి మరొకరు పూర్తిగా తెలుసుకోవడమే కాదు..  వారి అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకునేందుకు ప్రయత్నిస్తారు. తద్వారా తమ బంధాన్ని మరింత బలపరుచుకోవాలని ఆశిస్తారు. అయితే పెళ్లై ఏళ్లు గడిచే కొద్దీ దాంపత్య జీవితంలో వచ్చే మార్పులు కొన్ని ఉంటాయి. అవేంటంటే..


మరింత సులభంగా..


పెళ్లైన కొత్తలో మీ భాగస్వామి మీ నుంచి ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవడం కాస్త కష్టంగానే అనిపిస్తుంది. కానీ రోజులు గడిచే కొద్దీ ఆలుమగల మధ్య సాన్నిహిత్యం పెరిగి, ఒకరి నుంచి మరొకరు ఏం కోరుకుంటున్నారు? భాగస్వామిలో లైంగికపరమైన ఆసక్తిని రేకెత్తించడం ఎలా??.. వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటారు. కాబట్టి దాంపత్య జీవితాన్ని మరింత ఆనందంగా గడిపే వీలుంటుంది. ముఖ్యంగా మీ భాగస్వామి కోరికలను తీర్చేందుకు మీ వంతు ప్రయత్నం చేసేందుకు అవకాశం ఉంటుంది.


gif1


కొత్త ప్రయోగాలు..


ఒక్కసారి భార్యాభర్తలిద్దరూ శారీరకంగా దగ్గరై, మానసికంగానూ ఒకరితో మరొకరు బలమైన బంధం ఏర్పరుచుకున్న తర్వాత.. దాంపత్య జీవితంలో వారు ఎలాంటి ప్రయోగాలు చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. ముఖ్యంగా భాగస్వామిపై ఉన్న నమ్మకంతో ప్రయోగాలు చేసేందుకు ధైర్యంగా ముందడుగు వేస్తారు. ఈ క్రమంలోనే కొత్త కొత్త భంగిమలతో పాటు, రిస్క్ అనిపించే విధానాల్లోనూ సెక్స్‌లో పాల్గొనేందుకు మొగ్గు చూపిస్తారు.


మీపై మీకు ధ్యాస తగ్గుతుంది..


పెళ్లైన కొత్తలో భాగస్వామిని ఆకర్షించేందుకు లేదా వారి కంటికి అందంగా, ఆకర్షణీయంగా కనిపించేందుకు చాలామంది భార్యలు తమ గురించి తాము అధికంగా శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. కానీ కాలక్రమేణా మహిళలు పలు బాధ్యతల కారణంగానో లేక ఇతరత్రా కారణాల వల్లనో తమపై తాము చూపించే శ్రద్ధను క్రమంగా తగ్గించేస్తారు. శరీరాకృతి ఎలా ఉంది, నోటి నుంచి ఎలాంటి వాసన వస్తోంది.. ముఖంపై ఉన్న మొటిమలు, మచ్చలను తొలగించుకునే విధానాలు ఏవి.. ఇలాంటివేవీ పట్టించుకోరు. అయితే ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా ఆలుమగల దాంపత్య జీవితంపై ప్రభావం చూపిస్తాయని అస్సలు మరచిపోకూడదు.


Gif2


అంతగా ఆసక్తి చూపకపోవడం..


లైంగికపరమైన కలయికకు ఆలుమగలిద్దరూ ఆసక్తి చూపడం కూడా చాలా అవసరం.  పెళ్లైన కొత్తలో భార్యాభర్తలిద్దరూ ఒకరితో మరొకరు లైంగికంగా కలిసేందుకు ఆసక్తి చూపడం మామూలే. కానీ కాలక్రమేణా భాగస్వామిని లైంగికపరమైన కలయికకు ప్రేరేపించకుండా కేవలం వారు ఆసక్తి చూపించినప్పుడు మాత్రమే నామమాత్రంగా శృంగారంలో పాల్గొంటూ ఉంటారు చాలామంది. భర్త దృని ఆకర్షించేందుకు అందంగా తయారు కాకపోవడం, భర్తపై తమకు ఉన్న ప్రేమను చూపించకపోవడం.. వంటి కారణాలు కూడా దాంపత్య జీవితాన్ని ప్రభావితం చేసే అంశాలే.


తక్కువసార్లు కావచ్చు..


సాధారణంగా వివాహమైన కొత్తలో భార్యాభర్తలిద్దరూ ఎప్పుడెప్పుడు శారీరకంగా ఒకటవుదామా అని ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తుంటారు. వీలు చిక్కినప్పుడల్లా రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొని ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తారు. అయితే పెళ్లై ఏళ్లు గడిచే కొద్దీ ఆసక్తి తగ్గిన కారణంగా చాలా తక్కువగా లైంగిక చర్యలో పాల్గొంటూ ఉంటారు.


దీనికి కారణం పెళ్లై చాలా రోజులు కావడం కాకపోవచ్చు.. మారుతున్న జీవనశైలి కూడా దీనికి ప్రధాన కారణం కావచ్చు. పగలంతా తీరిక లేని షెడ్యూల్స్‌తో బిజీగా గడపడం.. రాత్రయ్యాక నిద్రపోవడం ఈ రోజుల్లో కామన్‌గా మారిపోయింది. ఈ అలసట కారణంగా సెక్స్ గురించి ఆలోచించని దంపతులు ఎంతోమంది ఉంటున్నారు.


Gif3


కమ్యూనికేషన్ మెరుగవుతుంది


సెక్స్ గురించి పెళ్లైన మొదట్లో మాట్లాడాలంటే చాలామంది ఇబ్బందిపడుతూ ఉంటారు. కానీ కొన్ని ఏళ్లు గడిచేసరికి ఆలుమగల మధ్య బలమైన బంధం ఏర్పడి ఎలాంటి విషయాల గురించైనా నిర్భయంగా, నిర్మొహమాటంగా చర్చించుకునే స్థాయికి చేరుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ బాగా మెరుగవుతుంది. సంతోషకరమైన దాంపత్య జీవితానికి ఇది చాలా కీలకం.


అదే ఆతురుత..


పెళ్లై ఎన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ శృంగారంలో పాల్గొన్న ప్రతిసారీ ఆతురుత మాత్రం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. అయితే ఇది మీ బంధాన్ని మరింత బలపరచాలంటే మాత్రం మీ వంతు పాత్ర మీరు పోషించాల్సి ఉంటుంది.


Gif4


Images: Giphy, Unsplash


ఇవి కూడా చదవండి


ఆరోగ్యకర దాంపత్యానికి.. ఈ అలవాట్లు చాలా ముఖ్యం..!


ఆ సౌఖ్యాన్ని పెంచే లూబ్రికెంట్ గురించి.. తెలుసుకోవాల్సిన విషయాలు..!


నవ్వు తెప్పించే ఈ సెక్స్ మీమ్స్.. మీ భాగస్వామితో పంచుకోండి..!