100 లవ్ కోటేషన్స్ : ప్రియమైన నీకు.. ప్రేమతో.. ప్రేమగా రాయునది ఏమనగా..! (Love Quotes In Telugu)

100 లవ్ కోటేషన్స్ : ప్రియమైన నీకు.. ప్రేమతో.. ప్రేమగా రాయునది ఏమనగా..! (Love Quotes In Telugu)

ప్రేమ అంతులేని అందమైన భావన. అందుకేనేమో ఆ భావాన్ని మాటల్లో వర్ణించడం కష్టం. మనసులోని ప్రేమను ఇష్టపడిన వ్యక్తికి చెప్పాలనుకొంటే నోరు పెగలదు. మాట రాదు. మరి మనసులో ఉన్న మాటను వారికి తెలియజేసేదెలా? అందమైన అక్షరాలుగా మలిచి ప్రేమ సందేశాన్ని తయారు చేస్తే..?


బాగానే ఉంటుంది కానీ.. మాకు అంత కవితాత్మకంగా రాయడం రాదే..? మరేం ఫర్వాలేదు. సందర్భానికి తగినట్లుగా పంపించేలా సుమారుగా వంద ప్రేమ సందేశాలు(love quotes) మీకు అందిస్తున్నాం. మీ ప్రియమైన వారికి వాటిని పంపించి వారి ప్రేమను, వారి మనసును గెలుచుకోండి.


అబ్బాయికి అమ్మాయి ప్రేమతో రాయునది


ఆమె కోసం అతడు ప్రేమతో


సమయానికి తగు ఉపాయము


ఫన్నీ లవ్ కోట్స్


ఇన్స్పిరేషనల్ లవ్ కోట్స్


రొమాంటిక్ లవ్ కోట్స్


క్యూట్ లవ్ కోట్స్


సాడ్ లవ్ కోట్స్


సినిమా పాటల్లోని ప్రేమ సందేశాలు


అబ్బాయికి అమ్మాయి ప్రేమతో రాయునది (Best Love Quotes For Him)


తాను ప్రేమిస్తున్న వ్యక్తి గురించి ఎంతగానో ఊహించుకొంటుంది అమ్మాయి. అతడిని తానెంతగా ప్రేమిస్తున్నానో చెప్పాలని అనుకొంటుంది. కానీ ఆ క్షణంలో ప్రేమతో ఆమె నోరు మూగబోతుంది. చాలా సందర్భాల్లో మీక్కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యే ఉంటుంది.


అలాంటి సమయాల్లో ఈ ప్రేమ సందేశాలను పంపించడం ద్వారా అతనికి మీ ప్రేమను క్లుప్తంగా, అర్థవంతంగా తెలియజేయవచ్చు. పైగా అమ్మాయిల్లాగా అబ్బాయిలు కూడా తమ ప్రేయసి నుంచి అందుకొన్న సందేశాన్ని పదే పదే చదువుకొంటూ మురిసిపోతుంటారు.


Also Read: సంతోషానికి సంబంధించి 50 ప్రముఖ కొటేషన్లు (50 Famous Quotations On Happiness)


5-Love Quotes In Telugu


1.నీ మీద నాకు వచ్చే భావనలన్నీ నిజమైనవే. ఎందుకింత నమ్మకంగా  చెబుతున్నానంటే.. నా కంటే ఎక్కువ నీ గురించే ఆలోచిస్తాను.


2. నువ్వు లేని జీవితం నేను ఊహించలేను. నువ్వు నన్ను పరిపూర్ణ వ్యక్తిగా మార్చావు. నా ప్రపంచం అంతా నీ చుట్టూ నేను అల్లుకొన్నాను.


3. నాకోసం నువ్వు చేసిన త్యాగాలకు, నాకోసం నువ్వు ఇష్టంగా చేస్తున్న ప్రతి పనిని చూసి నీకు థ్యాంక్స్ చెప్పాలనుకొంటా. కానీ నీ ప్రేమలో మైమరచిపోయి చెప్పడం మరచిపోతుంటా. నా జీవితాన్ని రంగులమయంగా, ఆనందాల హరివిల్లుగా మార్చిన నీకు ప్రేమపూర్వక ధన్యవాదాలు.


4. నా హృద‌యాన్ని తాకిన నీ అనురాగం నీతో ప్రేమలో పడిపోయేలా చేసింది.


5. సూర్యుని వెలుగు కంటే నీ నవ్వులోని వెలుగే నా జీవితాన్ని ప్రకాశవంతంగా మార్చేస్తుంది.


6. నువ్వు నా ఎదురుగా ఉంటే నిన్ను అలానే చూస్తూనే ఉంటా. ఒక్క సారి కూడా నా రెప్పను వాల్చను. ఎందుకంటే.. నిన్ను ఒక్క క్షణం కూడా మిస్సవాలనుకోను.


7. నాకు ఏ స్వర్గసుఖాలు అక్కర్లేదు. నేను ఊహల్లో విహరించాల్సిన అవసరమూ లేదు. ఎందుకంటే.. నాకు తోడుగా నువ్వు ఉన్నావు.


8. శ్వాస తీసుకోవడం, నిన్ను ప్రేమించడం ఈ రెండిటిలో ఏదో ఒకటి ఎంచుకోమంటే.. నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికే చివరి శ్వాస తీసుకొంటాను.


9. సూర్యోదయాన్ని నేను చాలా ఇష్టపడతాను. ఎందుకంటే మరొక రోజు నీతో గడిపే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. ఆ విషయాన్ని ప్రతి రోజూ నాకు గుర్తు చేస్తున్నందుకు.


10. ఒక రోజు నాకు తెలియకుండా నేను తెగ నవ్వుకొంటున్నాను. నేనెందుకు అలా నవ్వుకొంటున్నాని ఆలోచించా. ఆ తర్వాత తెలిసింది. నీ గురించి ఆలోచిస్తున్నానని.


11. నిన్ను కలిసిన ఆ తొలి క్షణం నుంచి నీ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నా. అలా ఎందుకు చేస్తున్నానా అని గమనిస్తే అప్పుడు తెలిసింది నువ్వు నా మనసంతా నిండిపోయావని


12. నా హఈదయాన్ని నువ్వు దొంగిలించావు. ఫర్వాలేదులే దాన్ని నీ దగ్గరే ఉంచుకో.


13. నువ్వు నన్ను తాకిన మొదటి క్షణంలోనాకేమి అనిపించిందో తెలుసా? నువ్వు నాకోసమే పుట్టావని.


Also Read: 'నాన్న'కి ఫాదర్స్ డే విషెస్ తెలిపే.. 20 స్పెషల్ కొటేషన్స్ (20 Special Fathers Day Quotations)


ఆమె కోసం అతడు ప్రేమతో (Love Quote For Her)


2-Love Quotes In Telugu


అమ్మాయిలు అల్ప సంతోషులు. తాను ఇష్టపడిన అబ్బాయి చిన్న కీచైన్ ఇచ్చినా సరే దాన్ని  విలువైన ఆభరణం కంటే భద్రంగా దాచుకొంటారు. అతడి నుంచి వచ్చిన ప్రతి సందేశాన్ని మళ్లీ మళ్లీ  చదువుకొంటూ అతనిపై మరింతగా ప్రేమను పెంచుకొంటుంది. కాబట్టి అబ్బాయిలు.. ఆమె మనసును మరింత హత్తుకొనే ప్రేమ సందేశాలను పంపించండి.


1.నీ గురించి ఆలోచిస్తే మెలకువ వచ్చేస్తుంది. నీ గురించి కలలు కంటే నిద్ర వచ్చేస్తుంది. నువ్వు కనిపిస్తే నా ప్రాణం లేచి వస్తుంది.


2. నువ్వు వందేళ్లు బతికితే.. నీకంటే ఒక రోజు ముందే నేను చచ్చిపోతాను. ఎందుకంటే నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా నేను బతకలేను.


3. కాలాన్ని వెనక్కి తిప్పే వీలుంటే.. నిన్ను ఇంతకంటే ముందే నా జీవితంలోకి వచ్చేలా చేస్తా. ఎక్కువ కాలం ప్రేమిస్తా.


4. నీకు నేను చాలాసార్లు ఇంటికి జాగ్రత్తగా వెళ్లు, త్వరగా నిద్రపో, భోంచేయ్ అని చెబుతూ ఉంటా కదా.. ఆ సమయంలో నీకు ఏం చెప్పాలనుకొంటానో తెలుసా? ఐ లవ్యూ అని.


5. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అంటే దానర్థం నీ రూపాన్ని ప్రేమిస్తున్నానని కాదు. నీ మనసును, నీ గుణాన్ని, నీ అలవాట్లను, నీ లోపాలను అన్నింటినీ ప్రేమిస్తున్నాను.


6. నా తుదిశ్వాస విడిచేవరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. మరో జన్మంటూ ఉంటే ఆ జన్మలోనూ నిన్నే ప్రేమిస్తా.


7. నిన్ను చూసినప్పుడు నీతో మాట్లాడటానికి భయపడ్డాను. నీతో మాట్లాడిన తర్వాత నిన్ను తాకడానికి భయపడ్డాను. తాకిన తర్వాత ప్రేమించడానికి భయపడ్డా. ప్రేమించిన తర్వాత నువ్వు నాకెక్కడ దూరమైపోతావోనని భయపడుతున్నా. ప్లీజ్ నన్ను వదిలి వెళ్లకు.


8. నీతో సమయం గడుపుతున్నప్పుడు అందమైన పూదోటలో సుమనోహారాలను ఆస్వాదిస్తున్నట్టనిపిస్తుంది. నాలో చైతన్యం నింపిన నువ్వే నా ప్రియమైన దేవతవు.


9. నీ మీద నాకున్న ప్రేమకు అంతం లేదు. ఆరంభమూ లేదు. నా శరీరంలో అతి ముఖ్యమైన, నా ప్రాణం నిండిన అవయవంగా మారిపోయావు. నీ నుంచి ప్రేమను తప్ప ఇంకేమీ ఆశించడం లేదు. నీ మనసులో స్థానాన్ని మాత్రమే కోరుకొంటున్నాను. నా బలహీనత, బలం రెండూనువ్వే.


10. నీ గురించి ఎదురు చూసీ చూసీ చచ్చిపోతానేమో డార్లింగ్. భయపడకు. ఎన్ని వేల సంవత్సరాలైనా సరే నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటా బంగారం.


వాట్సాప్ స్టేటస్ ఏం పెట్టాలని ఆలోచిస్తున్నారా? మీ కోసమే ఈ 160 కొటేషన్లు


సమయానికి తగు ఉపాయము (Best Love Quotes In Telugu To Make Him/Her Smile)


భార్యాభర్తలు, ప్రేయసీప్రియుల మధ్య కోపతాపాలు, చిన్న చిన్న అలకలు, గొడవలు సహజంగా జరిగేవే. మరి మీ భాగస్వామి అలక తీర్చి మునుపటిలా ఆమె లేదా అతడి ముఖంపై చిరునవ్వు విరిసేలా చేయాలంటే మాత్రం ఈ క్యూట్ లవ్ మెసేజ్ లు పంపించాల్సిందే.


Also Read నేను నా కుమార్తె కోట్లను ప్రేమిస్తున్నాను


గొడవ పడినప్పడు (When There Is A Conflict)


3-Love Quotes In Telugu


1.‘ఎప్పుడైనా నీకు నేను ఐలవ్యూ మోర్ అని చెబితే దాని అర్థం నన్ను నువ్వు ప్రేమిస్తున్నదానికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నానని కాదు. మనిద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగితే.. దానికంటే నువ్వే నాకు ముఖ్యమని. మనిద్దరి మధ్య పెరుగుతున్న దూరం కంటే నువ్వే నాకే ఎక్కువని. మనిద్దరి మధ్య ఎలాంటి అడ్డుగోడ ఏర్పడినా సరే.. దాన్ని పడగొట్టి మరీ నీ దగ్గరకు వస్తా. ఎందుకంటే నువ్వే నా ఊపిరి


2. నువ్వు నాకు చాలా కోపం తెప్పిస్తున్నావు. నేను అనుకొన్నదానికంటే నువ్వునాకు చాలా చిరాకు తెప్పిస్తున్నావు. ఊహించని విధంగా మనిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నా ప్రతి క్షణం నీతోనే గడపాలనిపిస్తుంది. దానికి కారణం ఏంటో నీకు తెలుసా?


3. ప్రతి రోజూ నేను నీతో ప్రేమలో పడుతూనే ఉన్నా. నిన్న మాత్రం నీమీద ప్రేమకు బదులు కోపం వచ్చింది. ఆ కోపం పెరగడానికి నువ్వే కదా కారణం. ఇప్పుడు నువ్వే ఆ కోపాన్ని తగ్గించు.


4. నేను కోపంగా ఉన్నా, చిరాకు ప్రదర్శించినా నన్ను ప్రేమిస్తున్నందుకు థ్యాంక్స్.


5. మనం ఎంత ఎక్కువగా గొడవపడితే అంత ఎక్కువగా మనిద్దరి మధ్య బంధం బలపడుతుంది.


6. ఎవరినో పొగిడే కంటే నీతో గొడవ పడటానికే నేను ఇష్టపడతాను. ఎందుకంటే నువ్వంటే నాకిష్టం కాబట్టి.


7. నాకు చాలా బాధగా ఉంది. నా మీద నాకే కోపం వస్తుంది. కంట్లోంచి నీరు వస్తున్నాయి. నీకు ప్రేమ పంచాల్సిన నేను నిన్ను నిందించడం నాకు నచ్చలేదు. నన్ను క్షమించు.


8. నిన్ను వదిలిపెట్టి వెళ్లిపోవడానికి అందరూ కలసి లక్ష కారణాలు వెతకొచ్చు. నేను మాత్రం నీతో కలసి గడపడానికి కారణాలు వెతుకుతాను.


9. నిజమైన బంధంలో గొడవలు రావడం సహజం. మనిద్దరం కొట్టుకొందాం. కానీ ఆ తగాదా తర్వాత ఒకరినొకరు క్షమించుకొందాం. తిరిగి ప్రేమలో పడదాం, ఆనందంగా గడుపుదాం,


10. నా దగ్గర టైం మిషన్ ఉంటే.. వెంటనే కాలాన్ని వెనక్కి తిప్పేస్తా. నును అన్న మాటలకు బదులుగా నీకు ఐలవ్యూ చెప్తా. కానీ ఏం చేస్తాం. కాలాన్ని వెనక్కి తిరిగేలా చేసే శక్తి నా దగ్గర లేదు. నేనన్న మాటలను వెనక్కీ తీసుకోలేను. నన్ను క్షమించు. మనం మునుపటిలా ఆనందంగా గడుపుదాం.


Also Read వర్షంలో నృత్యం


ప్రేమించినవారికి దూరంగా ఉన్నప్పుడు(వేర్వేరు చోట్ల ఉన్న ప్రేమికులకు) (For Long Distance Relationships)


1.నీతో గడిపే ప్రతి క్షణం నాకు చాలా విలువైనది. అవన్నీ నాకు మధురమైన జ్నాపకాలే. ఈ క్షణం కూడా నువ్వు నా పక్కన ఉంటే బాగుండుననిపిస్తుంది. కానీ కొన్ని రోజులు ఇలా తప్పదు డియర్. మిస్ యూ అండ్ లవ్యూ.


2. జీవితంలో చిన్న చిన్న విషయాలు చాలా సంతోషాన్నిస్తాయంటారు. అది నిజమని ఈ క్షణం వరకు నాకు అనిపించలేదు. నువ్వు దగ్గరున్నప్పుడు చాలా చిన్న విషయాలుగా అనిపించినవే ఇప్పుడు నేను మిస్సవుతున్నాను. నీ చేతి వంట, నువ్వు చేసిన కాఫీ చాలా మిస్సవుతున్నాను. అందుకే వీలైనంత వరకు ఎక్కువ సమయం నీతో గడపడానికి కేటాయిస్తాను.


3. నువ్వు నా జీవితంలోకి ఎంత సంతోషాన్ని తీసుకొచ్చావో.. నీకు దూరంగా ఉన్న ఈ నాలుగు రోజుల్లో నాకు తెలిసింది. నువ్వు నా పక్కన లేకపోతే నా జీవితం ఇంత శూన్యంగా ఉంటుందా అనిపిస్తుంది.


4. నువ్వు దూరంగా ఉన్న ప్రతి క్షణం చాలా భారంగా అనిపిస్తోంది. రెక్కలు కట్టుకొని నీ దగ్గరకు వచ్చి వాలిపోవాలని ఉంది. క్షణమొక యుగమంటే ఏంటో ఇప్పుడు తెలిసొచ్చింది.


5. నన్ను నిజంగా ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే. నేనెంత కోపంగా ఉన్నా.. ఎంత పిచ్చిగా ప్రవర్తించినా.. నీతో గొడవపడినా.. నాపై నీకున్న ప్రేమలో ఎలాంటి మార్పు ఉండదు. నీమీద నాకున్న ప్రేమ కూడా ఏ మాత్రం తగ్గదు.


6. నువ్వు నా జీవితంలోకి అడుగు పెట్టిన మొదటి క్షణమే నాకు అర్థమైంది. నువ్వే నా ప్రపంచమని. నా ప్రపంచం ఎప్పటికీ నాకు దూరంగా ఉండదు. తన ప్రేమ ఎప్పుడూ నాతోనే ఉంటుంది.


7. ఇద్దరు వ్యక్తుల మధ్య నిజమైన ప్రేమ ఉంటే..  ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఆ ప్రేమను నిలబెట్టుకొంటారు. మనిద్దరి మధ్య ఉన్న ఈ దూరం తాత్కాలికమే. ఇది మన ప్రేమకు పరీక్షలాంటిది. ఆ పరీక్షలో ఇద్దరూ కలసి పాసవడానికి ట్రై చేద్దాం.


8. ప్రేమ భరించే శక్తినిస్తుంది. ప్రేమ నమ్మకాన్నిస్తుంది. ప్రేమ ఆశలు చిగురింప చేస్తుంది. అలాంటి ప్రేమ తోడుగా ఉన్నంత వరకు మనిద్దరి మధ్య ఎంత దూరం ఉన్నా.. ఆ దూరాన్ని ఇట్టే కరింగేచేస్తుంది.


9. ఎలాంటి పరిస్థితులెదురైనా సరే.. నేనెంత దూరంలో ఉన్నా సరే.. నువ్వు బాధపడుతున్నావనిపిస్తే చాలు నీ దగ్గరకు వచ్చి వాలిపోతా. ఎందుకంటే నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను.


10. నిజమైన సంతోషం గుండెల్లో దాగి ఉంటుందంటారు. నిజమే.. నా సంతోషం నా గుండెల్లోనే దాగి ఉంది. నా సంతోషం నువ్వే కదా.


Read More: Inspirational Quotes In Telugu


ఫన్నీ లవ్ కోట్స్ (Funny Love Quotes In Telugu)


ప్రేయసీప్రియులు లేదా భార్యాభర్తలు ఇద్దరూ సరదాగా ఉన్నప్పుడే వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ మరింత పెరుగుతుంది. మీ భాగస్వామి చాలా సరదాగా ఉండే వ్యక్తి అయితే వారికి ఈ ఫన్నీ ప్రేమ సందేశాలను పంపించండి. వారి ముఖంలో నవ్వులు విరబూయడం ఖాయం.


1.ప్రేమంటే ఏంటో  నీకు తెలుసా? చంపేయాలన్నంత కోపం ఉన్న వ్యక్తితో కలసి జీవితం పంచుకోవడం. చంపేస్తే వారిని మిస్సవుతాం కదా. ఏమంటావు మై డియర్ లవ్?


2. ప్రేమ నడుం నొప్పి లాంటిది. అది ఎక్స్ రే, స్కానింగ్ లో కనిపించదు. అనుభవించేవారికే నొప్పి తెలుస్తుంది. ప్రేమ కూడా అంతే. అందులో మునిగిన వారికే ఆ మాధుర్యం తెలుస్తుంది.


3. చాక్లెట్, నిన్ను రెండింటినీ పక్కపక్కనే పెట్టి ఏది కావాలంటే కాసేపు ఆలోచించైనా సరే నిన్నే ఎంచుకొంటా. ఏం చేస్తాం తప్పదు కదా మరి.


4. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. వరల్డ్  కప్ సీజన్లో కూడా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను.


5. చాక్లెట్ కేక్ ను నేను ఎంత ఇష్టంగా చూసుకొంటానో.. అంతే ఇష్టంగా నన్ను చూసుకొనేవాడు నాకు బాయ్ ఫ్రెండ్ గా కావాలి. నువ్వు నా బాయ్ ఫ్రెండ్ గా ఉంటావా?


6. అందంగా, స్నేహపూర్వకంగా, సెక్సీగా, కేరింగ్ గా, తెలివిగా వ్యవహరించే వాళ్లు దొరకడం ఈ రోజుల్లో చాలా అరుదు. కాబట్టి నన్ను దూరం చేసుకోవద్దు.


7. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎ) అవును బి)ఎ సి)బి ఈ ఆప్షన్లలో ఏది ఎంచుకొంటావో చెప్పు. ఫర్లేదు కాస్త టైం తీసుకో.


8. నువ్వు నా సొంతం. రిఫండ్ చేసే అవకాశమే లేదు.


9. నీ కుళ్లు జోకులు, పనికిరాని కబుర్లు, నీ చెత్త ఆలోచనలు, ఇవన్నీ నాకు అస్సలు నచ్చవు. అయినా వాటి వల్లే నేను నిన్ను ప్రేమించాను.


10. నాకు తెలిసి నీకు ఓ విటమిన్ లోపం ఉన్నట్టుంది. ఆ విటమిన్ నేనే. కాబట్టి నన్ను ఎప్పుడూ నీతో పాటు వెంట తీసుకెళ్లడం మరచిపోవద్దు.


Read More: Good morning quotes in telugu


4-Love Quotes In Telugu


ఇన్స్పిరేషనల్ లవ్ కోట్స్ (Inspirational Love Quotations)


కొన్ని సందర్భాల్లో మన భాగస్వామి మానసికంగా కుంగుబాటుకు గురవుతుంటారు. దీనికి ఎన్నో కారణాలుండవచ్చు. ఆ సమయంలో మీరు వారికి మానసికంగా అందించే తోడ్పాటే వారిని తిరిగి మామూలు మనుషుల్ని చేస్తుంది. అందుకే ఆ సమయంలో వారిని సముదాయించేలా ఉండటంతో పాటు కాస్త ఇన్స్పైర్ చేసేలా మీ మెసేజ్ ఉంటే బాగుంటుంది. దానికోసమే ఈ ఇన్స్పిరేషనల్ సందేశాలు.


1. ప్రేమించడానికి చాలా ధైర్యం కావాలి. ఆ ప్రేమను సాకారం చేసుకొనేందుకు మనం పడే ఇబ్బందులు, బాధ, తపన అన్నీ మనల్ని ధైర్యవంతులుగా చేస్తాయి. ఆ ధైర్యం నీలో ఉంది. నాలో ఉంది. మనిద్దరం కలసి ఏదైనా సాధించగలం.


2. ప్రేమ ముందు ఏ అడ్డంకి నిలవలేదు. నా జీవిత గమ్యమైన నిన్ను చేరుకోవడానికి ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొంటాను. నీ కోసం ఎంత కష్టమైనా భరిస్తాను.


3. ప్రేమంటే ఏంటో తెలుసా? నీ సంతోషంలో నా సంతోషాన్నిచూడటం. నీ బాధని నా బాధగా అనుకోవడం. నువ్వు సంతోషంగా ఉంటావా? బాధపడుతూనే ఉంటావా?


4. ప్రేమలో స్నేహం, అర్థం చేసుకొనే గుణం, ఆత్మవిశ్వాసం, పంచుకొనే తత్వం, క్షమాగుణం అన్నీ ఉంటాయి. ఆనందంలోనూ, బాధలోనూ మనకు తోడు ఉంటుంది. నీలో ఉన్న బలహీనతను కూడా ఇష్టపడుతుంది.


5. ఎవరైనా మనల్ని ప్రేమిస్తే మనకు చాలా స్ట్రెంగ్త్ వస్తుంది. మనం ఎవరినైనా ప్రేమిస్తే మనకు ధైర్యం వస్తుంది.


6. ఏ అనుబంధంలోనూ అన్నీ మంచి రోజులే ఉండవు. తుఫానులా చుట్టేసే కష్టం ఎదురొచ్చినా సరే ఒకే గొడుగు కింద ఉండి దాన్ని ఎదుర్కొందాం. ఆ శక్తి మనకు ప్రేమ అందిస్తుంది.


రొమాంటిక్ లవ్ కోట్స్ (Romantic Quotes For Your Love)


1. నీ నవ్వులో చందమామను మించిన అందాన్ని, నక్షత్రాలను మించిన మెరుపును చూస్తున్నాను.


2. నీటిలో మునిగిపోతున్న వ్యక్తి ప్రాణం నిలబడటానికి ఆక్సిజన్ ఎంత అవసరమో.. నా ప్రాణం నిలబడటానికి నీ ప్రేమ అంత అవసరం.


3. నిన్ను మొదటిసారి కలిసినప్పడే నీ దగ్గర నాకు కావల్సిందేదో ఉందనిపించింది. ఎంత ఆలోచించినా అదేంటో నాకు అర్థం కాలేదు. చివరికి నాకు కావాల్సింది నువ్వేనని అర్థమయింది.


4. ఎవరూ మార్చలేని విషయం నీకొకటి చెప్దా. ఆ విషయం నీకెప్పటికీ గుర్తుండిపోతుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను.


5. నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో తెలుసా? సముద్రంలో ఉన్న నీరంత. ఎడారిలో  ఉన్న ఇసుక రేణువులంత. ఆకాశంలో ఉన్న నక్షత్రాలంత.


6. మనిద్దరం కలసి బతకడం చాలా కష్టం. విడిగ బతకడం అంతకంటే కఠినం.


7. నేనెక్కడకి వెళ్లినా నీ మనసు నాతోనే ఉంటుందని నాకు తెలుసు. అందుకే నా మనసుని నీ దగ్గర ఉంచి వచ్చా.


8. ఇప్పటికి నేను కొన్ని వేల సార్లు ప్రేమలో పడ్డా. అన్ని సార్లూ నీతోనే ప్రేమలో పడటం విచిత్రంగా అనిపిస్తోంది.


9. ప్రేమ గురించి ఆలోచించిన ప్రతిసారీ నీ రూపమే నా కళ్ల ముందు మెదులుతోంది.


10. నువ్వు నాతో ఉన్నంత సేపు నేను ఆనందం గురించి ఆలోచించను. ఎందుకంటే నా ఆనందమే నువ్వు కదా.


1-Love Quotes In Telugu


క్యూట్ లవ్ కోట్స్ 


1. నీకెప్పుడైనా భయం అనిపిస్తే.. నన్ను కొంచెం గట్టిగా హత్తుకో. నేను నీతోనే ఉంటాను కదా.. అస్సలు భయపడకు. నీకు తోడుగా నేనున్నాగా.


2. నా భవిష్యత్తు ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ ఆ భవిష్యత్తులో మాత్రం నువ్వు కచ్చితంగా ఉంటావు.


3. మనిద్దరం కలసి బ్రతకలేని రోజంటూ వస్తే నీ గుండెలో నన్ను దాచుకో. అప్పుడు మనిద్దరం ఎప్పటికీ విడిపోం.


4. నన్ను గట్టిగా హత్తుకో. అప్పుడు నేనేం చేస్తానో తెలుసా? నీ బాడీ హీట్ దొంగిలించేస్తా.


5. నువ్వు నాకు బాయ్ ఫ్రెండ్ కంటే ఎక్కువ. నువ్వు నా స్నేహితుడివి, నా సహాయకుడివి. నా స్వీట్ హార్ట్ వి. అసలు నువ్వు నాకు ఏమవుతావో చెప్పడానికి అసలు మాటలు చాలవు.


6. నాకు పర్ఫెక్ట్ బాయ్ ఫ్రెండ్ అక్కర్లేదు. సరదాగా ఉంటూ సిల్లీగా బిహేవ్ చూస్తూ.. నన్ను అన్నింటికంటే ఎక్కువగా ప్రేమించే వాడు కావాలి. వాడు నువ్వే కావాలి.


7. వందేళ్లు ఒంటరిగా బతికే కంటే.. ఒక్క రోజు నీతో కలసి బతికితే చాలు.


8. ఒక్కసారి నా కళ్లారా నిన్ను చూస్తే చాలు నా భవిష్యత్తు ఎంతో అందంగా కనిపిస్తోంది.


9. నువ్వు ఎలా ఉన్నా సరే నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను.


10. నాకు వంద హఈదయాలున్నా సరే నీపై నాకున్న ప్రేమను అవి మోయలేవు.


సాడ్ లవ్ కోట్స్ (Sad Quotes For Your Love)


1. నిన్ను మరచిపోలేనంత కాలం లేదా నువ్వు నన్ను మరచిపోలేవని తెలిసేంత వరకు నీకోసం ఎదురు చూస్తూనే ఉంటాను. ఆ తర్వాత నేను ఒక్క క్షణం కూడా ఎదురు చూడాల్సిన అవసరం రాదు.


2. ఒంటరిగా ఉండటం పెద్ద కష్టమైనదేమీ కాదు. కానీ క్షణమొక యుగంలా భావిస్తూ గడపడం చాలా కష్టం. ప్రేమ దూరమైనప్పుడు అది మరీ కష్టం.


3. నువ్వు నా జీవితంలో ఉన్నా లేకపోయినా రోజులు వాటంతట అవే గడిచిపోతాయి. కానీ ఆ జీవితంలోనే నేను ఉండను.


4. కొన్ని సార్లు మనసు మూగగా రోదిస్తుంది. ప్రేమకు దూరమైనప్పుడే ఇలా జరుగుతుంది.


5. విడిపోయేంత వరకు ప్రేమ లోతెంతో.. దాని విలువేంటో తెలియదు.


6. ప్రేమకు చావు లేదంటారు. కానీ నా ప్రేమ చచ్చిపోయింది. దానికి కారణమేంటో తెలుసా? అర్థం లేని తగాదాలు, చిన్న చిన్న పొరపాట్లు, వాటిని సరిదిద్దుకోలేనితనం.


7. బరువెక్కిన హృద‌యం వానొచ్చే ముందు మేఘం లాంటిది. వర్షిస్తేనే కానీ తేలికబడదు.


8. కొన్నిసార్లు మళ్లీ చిన్నతనంలోకి వెళ్లిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే పగిలిన హృద‌యం కంటే విరిగిన మోకాళ్లు త్వరగా అతుక్కుంటాయి కదా.


9. ప్రేమ ఆర్థమెటిక్స్ అనుకొన్నప్పుడు.. ఇద్దరు కలిస్తే ఒకటవుతారు. ఇద్దరు విడిపోతే ఏదీ మిగలదు.


10. ప్రేమ అద్దం లాంటిది ఒకసారి విరిగిపోతే తిరిగి అతుక్కోవడం అసాధ్యం.


సినిమా పాటల్లోని ప్రేమ సందేశాలు (Love Messages From Movies)


సినిమాల్లోని కొన్ని పాటలు ప్రేమ కావ్యాలుగా ఎప్పటికీ నిలిచిపోయి ఉంటాయి. అలాంటి కొన్ని పాటల్లోని భాగాలు లవ్ మెసేజ్ లుగా మీ బాయ్ ఫ్రెండ్ కి పంపిస్తే మీ మనసుని, ప్రేమను అర్థం చేసుకోవడంతో పాటు మిమ్మల్ని మరింత ప్రేమగా చూసుకొంటారు. మరెందుకు ఆలస్యం ఈ సినీ ప్రేమ సందేశాలను అప్పుడప్పుడూ అతనికి పంపించండి.(ఈ మెసేజ్ లు అబ్బాయిలు అమ్మాయిలకు కూడా పంపించొచ్చు.)


1.ఏనాటిదో ఈ బంధం ఎద చాలని మధురానుబంధం నేనేడు జన్మలు ఎత్తితే.. ఏడేడు  జన్మలకు ఎదిగే బంధం ఇది వీడరాని బంధం మమతానురాగబంధం – చిత్రం – కుమార్ రాజా


2.కళ్లల్లోన నిన్ను దాచినా ఊహల్లోన ఊసులాడినా.. స్వప్నంలోన  ఎంత చూసినా విరహమేతీరదే. జాజి కొమ్మ గాని ఊగినా కాలి మువ్వ గాని మోగినా చల్లగాలి నన్ను తాకినా నీవనే భావమే. – నువ్వు నేను


3.నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే నాదన్నది ఏమున్నది నాలో. నీవేనాడో మలిచావు ఈ రాతిని నేనీనాడు పలికాను ఈ గీతిని – కోకిలమ్మ


4.నువ్వంటు పుట్టినట్టు నా కొరకు ఆచూకి అందలేదు ఇంతవరకూ
వచ్చిందిగాని ఈడు ఒంటివరకూ వేధించలేదు నన్ను జంట కొరకు
చూసాక ఒక్కసారి ఇంత వెలుగు నా వంక రాను అంది కంటి కునుకు
ఈ అల్లరీ ఈ గారడీ నీ లీల అనుకోనా నీ పేరు ప్రేమ ఔనా ఇవాళే నిన్ను పోల్చుకున్నా – పెళ్లి


5.గోరువెచ్చని ఊసుతో చిన్న ముచ్చట వినిపించనీ, ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకొని చిగురించనీ, - అంత:పురం


6.నీ ప్రేమలో ఆరాధనై నేనిండుగా మునిగాక నీ కోసమే రాశానుగా నా కళ్లతో ప్రియలేఖ చేరునో చేరదో తెలియదు ఆ కానుక ఆశనే వీడక వెనక పడెను మనసుపడిన మనసే – మజిలీ


7. రా ఇలా రాజులా నన్నేలగా.. రాణిలా మది పిలిచెనుగా.. గీతనే దాటుతూ చొరవగా.. ఒక ప్రణయపు కావ్యము లిఖించరా.. మన ఇరువురి జత గీతగోవిందంలా. - గీతగోవిందం


8. మండే ఎండల్లో వెండి వెన్నెలనే ముందే నేనెపుడూ చూడలే చీకట్లో కూడా నీడలా నీవెంటే నేను ఉండగా.. వేరే జన్మంటూ నాకే ఎందుకులే నీతో ఈ నిముషం చాలులే - హుషారు


9. నీ కన్నుల్లో ఆనందం వస్తుందంటే నేనెన్నో యుద్దాలు చేస్తానులే నీ చిరునవ్వుకై నేను గెలుపొంది వస్తాను హామీ ఇస్తున్నానులే - ఛలో


10. నువ్వంటే నా నవ్వు నేనంటేనే నువ్వు నువ్వంటూ నేనంటూ లేమని
అవునంటు మాటివ్వు నిజమంటు నే నువ్వు నే రాని దూరాల్ని నువు పోనని - కృష్ణగాడి వీర ప్రేమగాథ


Images: Shutterstock


ఇవి కూడా చదవండి:


కమ్మని ఈ ప్రేమలేఖలే రాసింది హృద‌య‌మే.. ఇవి అత‌నికి న‌చ్చే ప్రేమ‌లేఖ‌లు..


మధురమే... మధురమే... ఈ ప్రేమ జ్ఞాపకాలు ఎప్పటికీ మధురమే..


చూపులతోనే మాటలు.. పుస్తకాల్లో ప్రేమలేఖలు.. ఆనాటి ప్రేమ అద్భుతం..