లైంగిక జీవితంలో.. ఈ సలహాలు అస్సలు పట్టించుకోవద్దు..!

లైంగిక జీవితంలో.. ఈ సలహాలు అస్సలు పట్టించుకోవద్దు..!

సెక్స్ (sex).. ఈ విషయం అందరూ ప్రతి ఒక్కరికీ తెలిసిందే అనుకుంటారు. అయినా అది ఎవరికీ తెలియని విషయమే. అవును.. సెక్స్‌కి సంబంధించిన సలహాల (Advice) కోసం మ్యాగజైన్లు, స్నేహితులపై ఆధారపడుతుంటారు చాలామంది ఉంటారు. అయితే వాటిలో కొన్ని మాత్రమే పనికి వచ్చేవి ఉంటాయి. మరికొన్ని సలహాలు మాత్రం కచ్చితంగా పనికిరానివని... అశాస్త్రీయమైనవని కచ్చితంగా చెప్పవచ్చు. అందుకే సెక్స్ గురించి కొంతమంది చెప్పే అవగాహనా రాహిత్యంతో కూడిన విషయాలను పట్టించుకోకూడదు. వాటిని పరిగణనలోకి తీసుకొని పాటించడం వల్ల ఒక రకంగా మనకే రిస్క్. అందుకే ఈ సలహాలు మాత్రం పట్టించుకోకుండా వాటికి దూరంగా ఉండండి.


1. ఓరల్ సెక్స్‌లో అలా చేయద్దు..


ఓరల్ సెక్స్ చేసే సమయంలో మీ మునిపంటితో కొరకడం వల్ల.. అవతలి వ్యక్తికి మూడ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని చెబుతుంటారు. కానీ ఇది అందరి విషయంలోనూ సరికాదు. కొందరికి ఇలా చేయడం నొప్పిని కలిగించి.. లైంగిక జీవితంలో ఆనందాన్ని దూరం చేయచ్చు. అందుకే దీన్ని పట్టించుకోవద్దు.


ss2


2. ఫోర్ ప్లే ఎక్కువయినా మంచిది కాదు..


ఫోర్ ప్లే సెక్స్‌కి ముందు చాలా మంచిది. ఇది మీ మూడ్‌ని పెంచి.. సెక్స్ సమయంలో ఆనందాన్ని ఎక్కువగా అందుకునేలా చేస్తుంది. కానీ మరీ ఎక్కువ సమయం ఫోర్ ప్లే చేయడం కూడా.. మీ ఇద్దరిలో ఎవరో ఒకరికి ఆసక్తిని తగ్గించి సెక్స్‌లో ఆనందం పొందకుండా చేస్తుంది. అందుకే మూడ్ కోసం కాసేపు ఫోర్ ప్లే చేసి.. వెంటనే అసలు ప్రక్రియ ప్రారంభించడం మంచిది.


3. వ్యాక్సింగ్ తప్పనిసరేమీ కాదు..


చాలామంది సెక్స్‌లో పాల్గొనేందుకు ముందు.. తప్పనిసరిగా ఫలానా ప్రదేశంలోని వెంట్రుకలను తొలగించాలని చెబుతుంటారు. కానీ ఇది కూడా మీ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. మీకు కావాలంటే ట్రిమ్ చేయడం లేదా వెంట్రుకలు అలాగే ఉంచడం ఏదైనా చేయవచ్చు. దీనికి సెక్స్‌లో మూడ్ రావడానికి, ఆనందం పొందడానికి ఎలాంటి సంబంధం ఉండదు.


ss3


4. మీరూ ప్రారంభించవచ్చు..


ప్రతిసారీ అబ్బాయిలే సెక్స్ విషయంలో ముందడుగు వేయాలని చాలామంది సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ ఇది సరి కాదు. ఇలా చేయడం వల్ల మీకు ఆసక్తి లేదేమో అనిపించే ప్రమాదం ఉంటుంది. అప్పుడప్పుడూ వారికి చిరాకుగా కూడా అనిపించే వీలుంటుంది. అందుకే అప్పుడప్పుడూ మీరు కూడా ముందడుగు వేయడం వల్ల వారికి మూడ్ ఎక్కువగా వచ్చే వీలుంటుంది.


5. సెక్స్ వల్ల సమస్యలు తీరవు..


కొన్ని కొన్ని సమస్యలు సెక్స్ వల్ల తీరిపోవచ్చు. చిన్న చిన్న గొడవలకు దీని వల్ల పరిష్కారం దొరకవచ్చు. కానీ అన్ని సమస్యలు దానితోనే తీరిపోతాయంటే అది సరికాదు. గొడవలున్నప్పుడు మీలో ఒకరు సెక్స్ చేయడానికి ప్రయత్నించడం వల్ల అవతలి వ్యక్తికి వారిపై ఉన్న ప్రేమ మరింత తగ్గే వీలుంటుంది.


6. కండోమ్ అవసరమే..


కండోమ్ లేకుండా సెక్స్ చేయడం వల్ల మూడ్ త్వరగా వస్తుంది. సెక్స్‌లో ఆనందం కూడా ఎక్కువగా దక్కుతుంది.. అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇది నిజమే అయినా.. ప్రొటెక్షన్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అందుకే కండోమ్‌తో సెక్స్ చేసినా.. మంచి ఆనందం దక్కుతుంది. కాబట్టి రక్షణ లేకుండా అస్సలు సెక్స్‌లో పాల్గొనవద్దు.


beach


7. బీచ్ సెక్స్ రొమాంటిక్ కాదు..


బీచ్‌లో సెక్స్ చేస్తే చాలా రొమాంటిక్‌గా ఉంటుందని.. ఆనందం దక్కుతుందని చాలామంది చెబుతారు. కానీ దొరికిపోతే అంతకంటే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పడిపోతారు. బీచ్ లేదా పబ్లిక్ ప్లేసుల్లో సెక్స్‌లో పాల్గొనడం చట్టవిరుద్ధం. ఇలాంటివి చేస్తే ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.


8. క్యాండిల్స్ రొమాన్స్‌కి చిహ్నం కాదు..


గదిలో క్యాండిల్స్ వెలిగించి చీకటిలో సెక్స్ చేయడం వల్ల మూడ్ బాగా వస్తుందని చాలామంది భావిస్తారు. కానీ క్యాండిల్స్, కర్టెన్స్ వంటివన్నీ మీ రొమాన్స్‌లో ఆనందం నింపడంతో పాటు.. కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వాటికి మంటలు అంటుకునే ప్రమాదం కూడా ఉంటుంది.


ss4


9. షవర్ సెక్స్ ఇబ్బంది కలిగిస్తుంది.


బాత్రూంలో షవర్ చేస్తున్నప్పుడు సెక్స్ చేయడం బాగుంటుందని చాలామంది చెబుతారు. కానీ ఇది చాలా ఇబ్బందికరమైనది. బాత్రూంలో సెక్స్ చేయడం వల్ల కాలు జారి పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక మీ ఇద్దరికీ ఎత్తులో తేడా ఉంటే అది మరింత ఇబ్బంది కలిగిస్తుంది.


10. అలా చేస్తేనే ఆనందం దక్కదు..


చాలామంది అమ్మాయి పైన ఉంటే ఎక్కువ ఆనందం దక్కుతుందని భావిస్తారు. అవును. నిజమే కానీ అన్నిసార్లు కాదు.. అమ్మాయిలు మరీ అంత నొప్పిని తట్టుకోలేరు. బరువును మోయలేరు. కాబట్టి మరీ మూడ్ ఉన్నప్పుడు కాసేపు సరే కానీ ఎప్పుడూ అంటే ఇది సరికాదు.


ఇవి కూడా చదవండి.


ఈ శృంగార భంగిమలు వారికి ఎంతో ప్రత్యేకం.. ఎందుకంటే..?


అదో అందమైన రొమాంటిక్ మజిలీ.. మా ఆలుమగలకు చాలా ప్రత్యేకమైంది..!


మీ సెక్స్ మూడ్‌ని.. రొమాంటిక్‌గా మార్చే విషయాలివే..!


Images : Giphy