ప్రభాస్ 'సాహో' టీజర్‌లో.. మీరు చూడాలనుకునే '7' అంశాలు ఇవేనా!

ప్రభాస్ 'సాహో' టీజర్‌లో.. మీరు చూడాలనుకునే '7' అంశాలు ఇవేనా!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) తాజా చిత్రం సాహో (Saaho). ఈ సినిమా లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ప్రభాస్ అభిమానులతో పాటుగా.. తెలుగు సినీ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో సాహో టీజర్ సమాచారాన్ని చిత్ర యూనిట్ ప్రకటించింది. 


నిర్మాతలు ఈ నెల జూన్ 13వ తేదీన సాహో టీజర్‌ని విడుదల చేయనున్నారు.  జూన్ 14 నుండి ఈ టీజర్‌ను దేశవ్యాప్తంగా అనేక థియేటర్స్‌లో ప్రదర్శిస్తారని సమాచారం. ఇప్పటికే సినిమా విడుదల తేదిని ఆగష్టు 15 అని ప్రకటించగా.. టీజర్ విడుదలతో ప్రచార కార్యక్రమాలకు నాంది పలుకుతున్నారని తెలుస్తోంది. 


కాగా.. సాహో టీజర్ పై భారీ అంచనాలున్నాయి. అసలు ప్రేక్షకులు సాహో టీజర్ నుండి ఏం ఆశిస్తున్నారనే అంశంపై ఆన్‌లైన్ సర్వేలు కూడా జరిగాయి. పలువురు అభిమానులు కూడా ఈ సందర్భంగా ఈ టీజర్ పై తమ అంచనాలేమిటో తెలియజేశారు. అవి ఏంటంటే..


 
* ఇప్పటికే విడుదలైన మేకింగ్ వీడియోస్, పోస్టర్స్‌లో 'సాహో' ఒక యాక్షన్ ఎంటర్‌టైనర్ అని అర్ధమైపోగా.. ప్రభాస్ నటించిన యాక్షన్ ఎపిసోడ్‌లోని ఒక షాట్‌ని ప్రత్యేకంగా అభిమానులు అడుగుతున్నారు.


* ఈ సాహో చిత్రం కోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ పనిచేయగా.. వారి పర్యవేక్షణలో తీసిన "ఛేజ్" సన్నివేశాలలోని ఒక "బిట్"ని ఈ టీజర్‌లో కోరుతున్నారు. 


* ఇప్పటి వరకూ విడుదల చేసిన మేకింగ్ వీడియోస్‌లో.. అటు ప్రభాస్.. ఇటు శ్రద్ధ కపూర్ వేరువేరుగా ఉన్న షాట్స్ చూపెట్టారు. కాని ఇద్దరు కలిసి ఉన్న ఒక్క పోస్టర్ లేదా షాట్‌ని కూడా చూపెట్టలేదు. అందుకే వీరిద్దరూ ఉన్న షాట్ రెండు రోజుల్లో విడుదలయ్యే టీజర్‌లో ఉంటే బాగుంటుందని చెబుతున్నారు. 

* అలాగే టీజర్‌లో ప్రభాస్ పాత్ర గురించి ఏదైనా తెలిసేలా.. ఒక డైలాగ్ లేదా గెటప్ ఉండాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.* ఇక ఈ టీజర్‌లో ప్రభాస్, శ్రద్ధ కపూర్ నటించిన షాట్స్ మాత్రమే కాకుండా.. 'సాహో'లో నటిస్తున్న ఇతర నటుల షాట్స్ కూడా విడుదల చేయమని అభిమానులు కోరుతున్నారు. బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, తమిళ నటుడు అరుణ్ విజయ్ ఈ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. * ఇక అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే - టీజర్ ముగింపులో ట్రైలర్ విడుదల తేదీ ఎప్పుడు? అన్న సమాచారాన్ని కూడా ఇస్తే బాగుంటుందని భావిస్తున్నారు.* ఆఖరుగా ... ప్రభాస్ చెప్పే "పంచ్ డైలాగ్" కూడా చూపిస్తే.. అది టీజర్‌కే హైలెట్‌గా నిలుస్తుందని అంటున్నారు. ఈ పైన పేర్కొన్న 7 ప్రధానమైన అంశాలు 'సాహో' టీజర్‌లో ఉంటాయని అభిమానులు అంచనా వేస్తుండగా... ఇంతకీ సాహో టీజర్‌లో ఈ పాయింట్స్ ఉంటాయో లేదో అనేది తెలియాలంటే జూన్ 13 వరకు ఆగాల్సిందే....


ఇక ఈ సినిమా విషయానికి వస్తే, కొంత ప్యాచ్ వర్క్, రెండు పాటల షూటింగ్ మినహా సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తయింది. దర్శకుడు సుజీత్ ఎక్కడా కూడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. నిర్మాతలు వంశీ - ప్రమోద్‌లు కూడా సినిమా‌ని చాలా భారీ వ్యయంతో నిర్మించడం జరిగింది.సాహో చిత్రాన్ని ఏక కాలంలో ఇటు తెలుగు, తమిళంతో అటు హిందీలో కూడా తెరకెక్కిస్తున్నారు.  ఒకరకంగా చెప్పాలంటే ఈ మూడు భాషల్లో అతిపెద్ద చిత్రంగా సాహో విడుదల కాబోతుంది.ప్రభాస్‌కి హిందీలో ఇది ఎంట్రీ కానుండగా.. శ్రద్ధ కపూర్‌కి తెలుగు, తమిళంలో ఇది ఎంట్రీ కానుంది.


పైగా సాహో హిందీ వెర్షన్ కోసం ప్రభాస్ హిందీ భాషను నేర్చుకుంటుండగా.. శ్రద్ధ కపూర్ తెలుగు భాష పైన పట్టు తెచ్చుకునేందుకు తనవంతు ప్రయత్నాలు చేయడం విశేషం. మొత్తానికి సాహో టీజర్ విడుదల తేదీ వెలువడడంతో.. ఈ సినిమా రిలీజ్‌కు రంగం సిద్ధమవుతుందని భావించాలి. 


మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. సాహోలో శ్రద్ధాకపూర్‌కి సంబంధించిన కొత్త పోస్టరును నిన్నే విడుదల చేశారు.


 


ఇవి కూడా చదవండి


'సాహో'లో సల్మాన్ ఖాన్ ఎంట్రీ పై.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు..!


#15AugWithSaaho సాహో సినిమాపై ఆసక్తిని.. మరింత పెంచే విశేషాలు మీకోసం..!


యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్ 'సాహో' చిత్రంపై... స్పెషల్ ఫోటో ఫీచర్..!