'సాహో'లో సల్మాన్ ఖాన్ ఎంట్రీ పై.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు..!

'సాహో'లో సల్మాన్ ఖాన్ ఎంట్రీ పై.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు..!

'సాహో' సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan)  గెస్ట్ ఎప్పీరియన్స్ ఇస్తున్నారనే వార్తల్లో నిజం లేదని.. ఆ చిత్ర దర్శకుడు సుజీత్ క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి వార్తలన్నీ కూడా  వదంతులని.. అభిమానులు నమ్మాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. సినిమా షూటింగ్ పూర్తి అవుతున్న సందర్భంలో.. ఇలాంటి పుకార్లు రావడం సర్వసాధారణమని కూడా  సుజీత్ (Sujeeth) వివరణ ఇచ్చారు.


'సాహో' (Saaho) చిత్రంలో బాలీవుడ్ కథానాయిక శ్రద్దా కపూర్‌తో పాటు.. మరో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. శంకర్‌-ఎహసాన్‌- లాయ్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అరుణ్ విజయ్, ఎవిలిన్ శర్మ, మందిరా బేడీ, జాకీ ష్రాఫ్, వెన్నెల కిషోర్, ఆదిత్య శ్రీవాస్తవ, మురళీ శర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
 

 

 


View this post on Instagram


Hope you liked it! 🤗🤗 #Shadesofsaaho 2 #Saaho #GunsNGoons https://youtu.be/Z6WlMvYEc3Q


A post shared by Sujeeth (@sujeethsign) onపెద్ద చిత్రాలు విడుదల అయ్యేటప్పుడు ఇలాంటి పుకార్లు రావడం సహజం. అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ చిత్రంలో హాలీవుడ్ నటి జెన్నిఫర్ లోపేజ్ నటిస్తుందని పుకార్లు వచ్చాయి. అలాగే.. రామ్ చరణ్ బాలీవుడ్‌లో ఓ మల్టీస్టారర్‌లో నటిస్తున్నారనే పుకార్లు కూడా వచ్చాయి.


అలాగే టాలీవుడ్ నటి రాశి ఖన్నా.. క్రికెటర్ బుమ్రాతో ప్రేమలో పడిందని.. అదేవిధంగా హీరో రానాకి కిడ్నీ ఆపరేషన్ కూడా జరిగిందని వదంతులు వచ్చాయి. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఇలాంటి పుకార్లు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. ఈ గాసిప్స్ ఆధారంగా కూడా పలు మీడియా సంస్థలు వార్తలు రాయడం గమనార్హం.


అయితే తాజాగా 'సాహో' విషయంలో వచ్చిన వదంతులను మాత్రం.. అనేకమంది అభిమానులు నమ్మేశారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే.. బాలీవుడ్ హీరోలు  ఇంతకు క్రితం టాలీవుడ్‌లో నటించిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు, నటుడు సంజయ్ దత్, నాగార్జున నటించిన "చంద్రలేఖ" చిత్రంలో అప్పట్లో అతిథి పాత్ర పోషించారు.


అలాగే అమితాబ్ బచ్చన్ కూడా "మనం" చిత్రంలో ఓ చిన్న పాత్రలో కనిపించడం విశేషం.ప్రస్తుతం ఆయన చిరంజీవి నటించిన "సైరా" చిత్రంలో కూడా ఓ ముఖ్య పాత్రను పోషించారు. ఇక ఒకప్పుడు బాలీవుడ్ టాప్ హీరోగా వెలుగొందన జాకీ ష్రాఫ్.. పలు తెలుగు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. అందుకే... సల్మాన్ కూడా ఓ తెలుగు చిత్రంలో అతిథి పాత్రను పోషిస్తున్నారు అనగానే అభిమానులు కూడా.. ఆ వార్తను పెద్ద పుకారుగా పరిగణించలేదు. అయితే దర్శకుడు క్లారిటీ ఇచ్చాక కానీ.. ఇప్పుడు అసలు విషయం జనాలకు తెలియలేదు.


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ


క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.


ఇవి కూడా చదవండి


సాహో విడుదల తేదీని.. స్టైలిష్‌గా ప్రకటించిన ప్రభాస్..!


ప్రభాస్ కోసం.. హైదరాబాద్‌కి తరలి వస్తున్న రోమ్ నగరం..!


ప్రభాస్ అభిమానులకు పండగే.. సాహో రిలీజ్ డేట్ తెలిసిపోయిందిగా..?