కళ్లను మరింత అందంగా.. మార్చేసే కాటుకలు ప్రత్యేకంగా మీకోసం..!

కళ్లను మరింత అందంగా.. మార్చేసే కాటుకలు ప్రత్యేకంగా మీకోసం..!

మన ముఖంలో ఎదుటివారికి ఆకర్షణీయంగా కనిపించేవి కళ్లు (eyes) . ముఖానికి మేకప్ అప్పుడప్పుడూ వేసుకుంటామేమో కానీ.. రోజూ కళ్లకు కాటుక (kajal) మాత్రం తప్పనిసరిగా పెట్టుకుంటాం. అయితే మనం ఉపయోగిస్తున్న కాటుక మంచిదేనా? దాని వల్ల కళ్లకు ఎలాంటి హాని కలగదనే గ్యారంటీ ఉందా? ఎందుకంటే వాటిలో ఉపయోగించే కొన్ని రసాయనాల వల్ల కంటి చూపు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అలాగని కాటుక పెట్టుకోవడం మానేస్తే ఎలా?


అందుకే ఇటీవలి కాలంలో మార్కెట్లోకి హెర్బల్ (Herbal) కాటుకలు వస్తున్నాయి. వాటిని ఉపయోగిస్తే ఎలాంటి ఇబ్బంది ఎదురవదు. పైగా వాటి ధర కూడా అందుబాటులోనే ఉంటుంది. అలాంటి కొన్ని బ్రాండ్లకు చెందిన కాటుకల గురించి తెలుసుకుందాం.


1. బ్లూ హెవెన్ కాజల్


1-blue-heaven-kajal


ఈ కాటుక చాలా క్రీమీగా, సాఫ్ట్‌గా ఉంటుంది. కాబట్టి అప్లై చేసుకోవడం సులభం. దీనిలో వెన్న, తేనె, బాదం నూనె మిళితమై ఉంటాయి. పైగా ఈ కాటుక కరిగిపోకుండా రోజంతా నిలిచి ఉంటుందట. అలాగని ధర ఎక్కువ అనుకుంటే పొరపాటే. చాలా తక్కువ ధరలోనే ఈ కాజల్ అందుబాటులో ఉంటుంది.


ధర: రూ. 57. ఇక్కడ కొనండి.


2. జోవీస్ కాజల్


2-jovees-kajal


త్రిఫల, ఇతర ఆయుర్వేద మూలికలు, బాదం నూనె, కార్భన్ మొదలైన పదార్థాలతో ఈ కాటుక తయారు చేశారు. దీన్ని వాడటం వల్ల మనకు రెండు ప్రయోజనాలు ఏకకాలంలో అందుతాయి. మొదటిది కళ్లు చాలా అందంగా కనిపిస్తాయి. రెండోది.. కనురెప్పలు (eye lashes) కాస్త ఒత్తుగా పెరుగుతాయి.


ధర: రూ. 135. ఇక్కడ కొనండి.


3. బయోటిక్ కాజల్


3-biotique-kajal


క్రీమీగా ఉండే ఈ కాటుక అప్లై చేసుకోవడం చాలా సులభం. ఈ కాటుక మీ కళ్లకు స్మోకీ లుక్ ఇస్తుంది. సహజసిద్ధమైన నూనెలతో తయారైన ఈ కాటుక కనురెప్పలకు పోషణ ఇచ్చి వాటిని బాగా పెరిగేలా కూడా చేస్తుంది. అంతేకాదు.. కళ్ల చుట్టూ ఉన్న చర్మానికి సైతం పోషణను అందిస్తుంది.


ధర: రూ. 109. ఇక్కడ కొనండి.


4. హిమాలయ హెర్బల్స్ కాజల్


4-himalaya-kajal


ఈ కాటుకలో ఐదు రకాల సహజసిద్ధమైన ఉత్పత్తులున్నాయి.  బాదం నూనె, ఆముదం, గులాబీ, త్రిఫలాలు, కర్పూరం మొదలైనవాటిని దీన్ని తయారు చేయడానికి ఉపయోగిస్తారు. దీన్ని అప్లై చేసుకోవడం చాలా ఈజీ. ఇది కళ్లను ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంది. పైగా దీనిలో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కళ్ల వాపు, ఎరుపెక్కడం లాంటి సమస్యలను తగ్గిస్తాయి. అంతేకాదు.. ఈ కాటుక కళ్లను ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండేలా చేస్తుంది.


ధర: రూ.108. ఇక్కడ కొనండి.


5. ఫాబ్ ఇండియా ఆల్మండ్ కాజల్


5-fab-india-kajal


రోజువారిగా కాటుక ఉపయోగించేవారికి.. ఈ ఐటమ్ సరిగ్గా నప్పుతుంది. దీనిలో షియా బటర్, బీస్ వ్యాక్స్, త్రిఫల, పారఫిన్ వ్యాక్స్, బాదం నూనె, ఆక్టైల్డోడెకనాల్ మొదలైనవి ఉంటాయి. ఒక్కసారి అప్లై చేసుకొంటే.. ఇది ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో మీకే తెలుస్తుంది. ఇది అప్లై చేసుకొన్న తర్వాత కళ్లు చల్లదనం తగిలి.. చాలా హాయి కలుగుతుంది కూడా. పైగా ఇది కరిగిపోకుండా కూడా ఉంటుంది.


ధర: రూ. 190. ఇక్కడ కొనండి.


6. లోటస్ హెర్బల్స్ నేచురల్ కాజల్


6-lotus-natural-kajal


కర్పూరం, బాదం నూనె, ఇతర సహజసిద్ధమైన పదార్థాలతో ఈ లోటస్ హెర్బల్ నేచురల్ కాజల్ తయారైంది. ఇవి ఐలాషెస్ పెరగడానికి కూడా దోహదపడతాయి. ఇది ఎక్కువ సమయం నిలిచి ఉండటంతో పాటు కరిగిపోకుండా ఉంటుంది.


ధర: రూ 134. ఇక్కడ కొనండి.


7. ఇబా హలాల్ కేర్ ప్యూర్ ఐస్ నేచురల్ కాజల్


7-iba-halal-kajal


కార్బన్, విటమిన్ ఇ, కలబంద, బాదం, నల్ల జీలకర్ర వంటి వాటితో ఈ కాజల్ తయారవుతుంది. సాధారణంగా కింది కనురెప్పలకు చాలా సులభంగా మనం కాటుక పెట్టుకొంటాం. కానీ పై రెప్పలకు పెట్టుకోవాలంటే కాస్త కష్టపడాల్సిందే. కానీ ఈ కాటుకతో చాలా ఈజీగా ఆ పని పూర్తి చేయొచ్చు. కళ్ల చుట్టూ డ్రై స్కిన్ ఉన్నవారు దీన్ని ఉపయోగించడం ద్వారా మంచి ఫలితం పొందవచ్చు.


ధర: రూ 105. ఇక్కడ కొనండి.


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.


క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.


Feature Image: Shutterstock