ఈ రోజు రాశిఫలాలు చదవండి.. కొత్త గమ్యాలకు మార్గాలు నిర్దేశించుకోండి

ఈ రోజు రాశిఫలాలు చదవండి.. కొత్త గమ్యాలకు మార్గాలు నిర్దేశించుకోండి

ఈ రోజు (జూన్ 24) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) –  ఈ రోజు నిరుద్యోగులకు శుభదినం. పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు. ఈ రోజు మీ కుటుంబ బంధాలు కూడా పటిష్టంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి లభించే శుభ తరుణం ఇది. ముఖ్యంగా మీ ఆర్థిక సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. అయితే ఆకస్మిక ప్రయాణాలు, ఆరోగ్య విషయాలపై కాస్త జాగ్రత్త వహించండి. 

వృషభం (Tarus) – ఈ రోజు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడానికి ప్రయత్నించకండి. ఆర్థిక నష్టాలు సంభవించవచ్చు. అలాగే మిత్రులకు రుణాలు ఇచ్చే విషయంలో కూడా పునరాలోచించండి. కొన్ని విపత్కర పరిస్థితుల్లో మీకు మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఇలాంటి సమయాల్లో మీ కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు తీసుకోండి. 

మిథునం (Gemini) – ఈ రోజు మీరు ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టండి. అలాగే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఈ రోజు మీరు సామాజిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. నడు మంత్రపు సిరిలా అనుకోని సంపద మీ ఇంటికి చేరే అవకాశం ఉంది. ఈ రోజు విద్యార్థులు మరింత కష్టపడాలి. సృజనాత్మక రంగంలో పనిచేసేవారికి పురోగతి ఉంటుంది. వాహన వినియోగంలో జాగ్రత్త వహించండి.

కర్కాటకం (Cancer) – ఈ రోజు మీకు భాగస్వామితో గొడవ జరిగే అవకాశం ఉంది. కాబట్టి, తనతో కాస్త ఆచితూచి వ్యవహరించండి. అలాగే ఆర్థిక పరమైన లావాదేవీలతో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రుణాలు ఇవ్వాలన్నా, తీసుకోవాలన్నా నూటికి పదిసార్లు ఆలోచించండి. జూదం, బెట్టింగ్ లాంటి కార్యకలాపాలకు దూరంగా ఉండండి. మీ వ్యాపార హెచ్చుతగ్గుల పరిస్థితిని గమనిస్తూ ఉండండి. ఆఫీసులో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నా.. సహనంతో వ్యవహరించండి. 

సింహం (Leo) – ఈ రోజు మీ భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అలాగే ఆఫీసు రాజకీయాల్లో ఎక్కువగా తలదూర్చవద్దు. మీ సహోద్యోగులతో స్నేహంగా మెలగండి. అన్ని పనులు సమయానికి పూర్తి చేయండి. ఈ రోజు మీకు సామాజిక గౌరవం పెరుగుతుంది. అలాగే వ్యాపార రంగంలో కొత్త భాగస్వాములు లభించే అవకాశముంది. 

క‌న్య (Virgo) – ఈ రోజు మీరు ఓ శుభవార్త వింటారు. అలాగే కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశం కూడా ఉంది.  ఇంటీరియర్ డెకరేషన్ మొదలైన పనుల పట్ల ఆసక్తి చూపిస్తారు. అదేవిధంగా కొత్త  అగ్రిమెంట్లు కూడా చేసుకుంటారు. మీ ఆఫీసులో పని భారం పెరుగుతుంది. మీరు బిజీగా ఉండడం వల్ల.. కుటుంబానికి అంతగా సమయం కేటాయించలేకపోవచ్చు. కాకపోతే వీలు చూసుకొని వారికి కూడా ఆనందాన్ని పంచండి. 

ఈ కథనం కూడా చదవండి: ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట.

తుల (Libra) – ఈ రోజు మీ పాత స్నేహబంధం.. ప్రేమబంధంగా మారే అవకాశం ఉంది. అలాగే మీ కుటుంబ సంబంధాలు కూడా మెరుగుపడతాయి. మీరు మరింత ఉత్సాహంతో పనిచేస్తారు. కొన్ని పురస్కారాలు లేదా గౌరవాలు కూడా అందుకుంటారు. ఆధ్యాత్మిక విషయాలపై మీరు ఆసక్తి పెరుగుతుంది. 

వృశ్చికం (Scorpio) – ఈ రోజు మీరు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసే అవకాశాలున్నాయి. అలాగే కొన్ని వ్యాపార కార్యకలాపాలు కూడా చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని ఆఫీసు వివాదాలు సైతం మిమ్మల్ని సంకట స్థితిలో పడేస్తాయి. అయినప్పటికీ ఆత్మస్థైర్యంతో వ్యవహరించండి.  ముఖ్యంగా డబ్బు ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. 

ఈ కథనం కూడా చదవండి: ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు ఆస్తి విషయాల్లో కొన్ని కీలక చర్చలు జరుగుతాయి. కొన్ని కొత్త ఆదాయ వనరులు సమకూరే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా వ్యాపార ఒప్పందాలు లాభదాయకంగా సాగుతాయి. అయితే ఆరోగ్యపరంగా ఎదురయ్యే ప్రతికూలతలను అధిగమించండి. పెళ్లికాని వ్యక్తులు ప్రేమలో పడే అవకాశం ఉంది. 

మకరం (Capricorn) – ఈ రోజు ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడులకు సంబంధించి ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే బెటర్. అలాగే ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి. అదేవిధంగా ఆఫీసులో మీ పై అధికారులతో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమయాల్లోనే ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. కోపాన్ని నియంత్రించండి.

కుంభం (Aquarius) –  ఈ రోజు మీ కుటుంబీకుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అలాగే ఆఫీసులో మీరు పూర్తిగా బిజీ షెడ్యూల్‌లో ఉంటారు. కొన్ని అత్యవసరమైన అగ్రిమెంట్లు కూడా చేసుకుంటారు. వ్యాపారరంగంలో పనిచేస్తున్నవారు కొత్త ప్రాజెక్టులు టేకప్ చేస్తారు. అలాగే ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో కూడా పాల్గొంటారు. 

మీనం (Pisces) – ఈ రోజు మీకు కొత్త పరిచయాలు కలుగుతాయి. ముఖ్యంగా రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార రంగంలోని వ్యక్తులు కాస్త ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. 

ఈ కథనం కూడా చదవండి: సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?