ఈ రోజు (జూన్ 28) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం
మేషం (Aries) – ఈ రోజు మీ కెరీర్‌కు సంబంధించి నిర్ణయాలు తీసుకొనే విషయంలో నిజాయతీగా వ్యవహరించండి. మీ ఆఫీసులో కొన్ని గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. అయినా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లండి. అధికారుల నుండి మీకు ఒత్తిడి కూడా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. కొన్ని విషయాల్లో మీరు మీ భాగస్వామి సలహాలు, సూచనలు తీసుకోండి.
వృషభం (Tarus) – ఈ రోజు మీ ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ చూపండి. కొన్ని పనులను వాయిదా వేస్తే మంచిది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీపై మీకున్న విశ్వాసాన్ని కోల్పోవద్దు. అలాగే మీ కుటుంబానికి సమయం కేటాయించడం మరిచిపోవద్దు. ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ప్రత్యర్థులతో వాదించే విషయంలో కాస్త సంయమనం పాటించండి. మీ భాగస్వామి మద్దతు మీకు లభిస్తుంది. అదేవిధంగా ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపిస్తారు.
మిథునం (Gemini) – ఈ రోజు మీరు శుభవార్తలు వింటారు. అలాగే కుటుంబ వివాదాలు కూడా పరిష్కార దశకు వస్తాయి. కొన్ని సమస్యలను పరిష్కరించుకోవడానికి.. మీరు మీ సన్నిహితులు లేదా భాగస్వామి సహాయం తీసుకోండి. అదేవిధంగా మీ చుట్టూ ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. వాహన వినియోగంలో జాగ్రత్త వహించండి. విద్యార్థులకు ఇది శుభ సమయం. కష్టపడి విజయాన్ని కైవసం చేసుకోండి.
కర్కాటకం (Cancer) – ఈ రోజు మీకు మీ ఆఫీసులో సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది. మీ కెరీర్‌కు సంబంధించి కొన్ని సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే ఆదాయ వనరులు పెరుగుతాయి. వ్యాపార రంగంలోని వారికి కూడా ఇది శుభ సమయం. కోర్టు కేసులు లేదా చట్టపరమైన లావాదేవీలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. మీరు విదేశీ ప్రయాణాలు చేసే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సమాజంలో మీకు గౌరవం కూడా పెరుగుతుంది.
సింహం (Leo) – కొన్ని ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టే విషయంలో ఆచితూచి వ్యవహరించండి. అలాగే ఈ రోజు మీకు ఆర్థిక భారం ఎక్కువగా ఉంటుంది. ఆఫీసులో లేదా ఇంటిలో ఓ ఉద్రిక్త వాతావరణాన్ని చూస్తారు. అయినా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లి.. శాంతంగా సమస్యలను పరిష్కరించుకోండి. అయితే కొన్ని నిర్ణయాలు తీసుకొనే ముందు.. మీ భాగస్వామితో చర్చించండి. కొందరు ముఖ్య స్నేహితులు ఈ రోజు మిమ్మల్ని కలుస్తారు.
కన్య (Virgo) – ఈ రోజు నుండి మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపడం చాలా మంచిది. యోగా చేయడం లేదా జిమ్‌లో చేరడానికి ప్రయత్నించండి. అలాగే ఈ రోజంతా మీరు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. మీ భాగస్వామితో కలిసి కొన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు. అయితే ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అప్పులు ఇవ్వడం లేదా తీసుకొనే విషయంలో కాస్త వివేకంతో ఆలోచించండి.
ఈ కథనం కూడా చదవండి: ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట
తుల (Libra) – ఈ రోజు మీ కుటుంబ విషయాలలో.. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా చూసుకోండి. ఏ సమస్య వచ్చినా.. మీ భాగస్వామి సహాయంతో మీరే పరిష్కరించడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా కోప, తాపాలకు దూరంగా ఉండండి. అలాగే ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపండి. మీ వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది. కొత్త ప్రాజెక్టులు టేకప్ చేయడానికి కూడా మీరు ప్రయత్నిస్తారు.
వృశ్చికం (Scorpio) – ఈ రోజు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తుంది. అదేవిధంగా ఖర్చులు కూడా పెరుగుతాయి. అయితే ఉద్యోగ, వ్యాపార విషయాల్లో మీరు తీసుకొనే నిర్ణయాలు సంచలనాత్మకంగా మారతాయి. ప్రత్యర్థులు సైతం మిమ్మల్ని ప్రశంసిస్తారు. అయితే ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించండి. పలు రాజకీయ కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటారు.
ధనుస్సు (Saggitarius) – రియల్ ఎస్టేట్ లేదా బ్యాంకింగ్ రంగంలో పనిచేసే వారికి ఈ రోజు బాగా కలిసొస్తుంది. అలాగే కుటుంబంతో ఈ రోజు మీరు హాయిగా గడుపుతారు. పాత వివాదాలు అన్ని కూడా సమసిపోతాయి. ఈ రోజు మీ పై మీకున్న నమ్మకం, విశ్వాసం వెయ్యి రెట్లు పెరుగుతాయి. అయితే అత్యుత్సాహంతో అనాలోచితమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మంచిది. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు.
ఈ కథనాన్ని కూడా చదివేయండి: ఈ రాశుల వ్యక్తులు.. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు.. ఎందుకంటే..?
మకరం (Capricorn) – ఈ రోజు మీ భాగస్వామిని అపార్థం చేసుకొనే పరిస్థితి తలెత్తవచ్చు. అయితే ఈ సమస్యను మీరు వేగంగానే పరిష్కరిస్తారు. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలకు ప్లాన్ చేస్తారు. అదేవిధంగా స్నేహితుల సహాయం కూడా మీకు అందుతుంది. కోర్టు లావాదేవీలు లేదా కేసులు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే రాజకీయాల్లో బాధ్యతలు కూడా పెరుగుతాయి. మీ ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది.
కుంభం (Aquarius) – ఈ రోజు మీరు బద్ధకం లేదా నిజాయతీగా వ్యవహరించకపోవడం వల్ల.. పలు అవకాశాలు చేజారిపోయే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా వ్యవహరించండి. ఆత్మస్థైర్యంతో ముందుకువెళ్లండి. అలాగే ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కనుక కాస్త సంయమనం పాటించండి. అలాగే ఆర్థిక భారం కూడా పెరుగుతుంది. అయితే కొందరు స్నేహితుల మద్దతు మీకు లభిస్తుంది.
మీనం (Pisces) – ఈ రోజు మీరు ఆస్తి అమ్మకాలు లేదా కొనుగోళ్ల లావాదేవీల్లో ఎక్కువ సేపు గడుపుతారు. అలాగే మీకు ధన, వాహన యోగం కూడా ఉంది. అదేవిధంగా కొన్ని శుభవార్తలు కూడా వింటారు. ఆఫీసులో అధికారుల మద్దతు లభిస్తుంది. అంతకు మించి సంఘంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి.
ఈ కథను కూడా చదివేయండి: ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు
అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.