ఈ రోజు (జూన్ 30) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం
మేషం (Aries) – ఈ రోజు విద్యార్థులు బాగా కష్టపడాల్సిన సమయం. ముఖ్యంగా సోమరితనాన్ని వీడి.. ఇంకా బాగా శ్రమించాల్సి ఉంటుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలి. ఇక ఉద్యోగస్తులకు ఈ రోజు ప్రతికూలమైన ఫలితాలు ఎదురు కావచ్చు. మనో ధైర్యంతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టులు టేకప్ చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి.
వృషభం (Tarus) – ఈ రోజు మీరు కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకొనే అవకాశాలు ఉన్నాయి. అయితే అప్పులు ఇచ్చే విషయంలో లేదా తీసుకొనే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే వ్యవసాయ రంగంలోని వారికి ఈ రోజు ప్రయోజనం చేకూరుతుంది. అదేవిధంగా ఉద్యోగస్తులకు బదిలీలు జరిగే అవకాశం ఉంది. ప్రేమ బంధంలో ఉన్నవారు.. పలు ఇబ్బందులను ఎదుర్కొంటారు.
మిథునం (Gemini) – ఈ రోజు విద్యార్థులకు కష్టకాలం. నిర్లక్ష్యాన్ని, సోమరితనాన్ని వీడకపోతే పరిణామాలు సీరియస్‌గా ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఒత్తిడి ఉంటుంది. అయినా మనోధైర్యంతో ముందుకు వెళ్లండి. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే.. పలు కుటుంబ వివాదాలు మిమ్మల్ని వేధిస్తాయి. అయినా సహనంతో వ్యవహరించి.. సామరస్యంతో వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయండి.
కర్కాటకం (Cancer) – ఈ రోజు మీ ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది. అలాగే మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి కొందరు ప్రయత్నిస్తారు. అదేవిధంగా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. వ్యక్తిగత జీవితానికి వస్తే.. మీకు ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. మీ భాగస్వామి మీకు అన్ని విధాలుగా సహకరిస్తారు. మీ బాధల్లో పాలుపంచుకుంటారు. పలువురు పాత మిత్రులు కూడా మిమ్మల్ని కలిసే అవకాశం ఉంది.
సింహం (Leo) – ఈ రోజు మీరు మీ కుటుంబంతో హాయిగా, ఆనందంగా గడుపుతారు. అలాగే ప్రేమికులకు ఈ రోజు బాగా కలిసొస్తుంది. మీ బంధం గురించి పెద్దవాళ్లతో చెప్పడానికి ఇదే అనువైన రోజు. వ్యాపార రంగంలోని వ్యక్తులు కొత్త ప్రాజెక్టులు టేకప్ చేస్తారు. విద్యార్థులు తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. అయితే ఈ రాశివారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి.
కన్య (Virgo) – ఈ రోజు మీరు చాలా బిజీగా గడుపుతారు. అలాగే విద్యార్థులు తాము కోరుకున్న లక్ష్యాలు చేరుకుంటారు. వ్యాపారస్తులకు కూడా ఈ రోజు చాలా అనువైనది. కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి సరైన సమయం. ఉద్యోగస్తులకు కూడా అదనపు ఆదాయ వనరులు లభిస్తాయి. అయితే ఈ రాశి వ్యక్తులు కుటుంబ జీవితంలో కొన్ని ఆటుపోట్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. కనుక కాస్త సహనంతో, సంయమనంతో వ్యవహరించండి.
ఈ కథనం కూడా చదవండి: ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట
తుల (Libra) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం. ముఖ్యంగా విలువైన వస్తువులను లేదా ధనాన్ని పోగొట్టుకొనే అవకాశం ఉంది. అలాగే మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే పలు సంఘటనలు ఎదురుకావచ్చు. ఇలాంటి సమయంలోనే వివేకంతో వ్యవహరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా కోపాన్ని నియంత్రించుకోవాలి. సహనంతో వ్యవహరించాలి. అలాగే పలు విషయాల్లో మీ భాగస్వామి లేదా స్నేహితుల సలహాలు కూడా తీసుకోండి.
వృశ్చికం (Scorpio) – ఈ రోజు మీ కుటుంబీకుల ఆరోగ్యం.. మిమ్మల్ని కలవరపాటుకు గురిచేస్తుంది. అలాగే స్థిరాస్తి కొనుగోళ్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. మీ పనిలో అవరోధాలు ఎదురైనా.. ఆత్మస్థైర్యంతో ముందుకువెళ్లండి. మీరు నిజాయతీగా చేసే కొన్ని పనుల వల్ల.. సమాజంలో మీ గౌరవం, ప్రతిష్ట పెరుగుతాయి. అలాగే కోర్టు కేసులు, వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగస్తులకు కెరీర్ పరంగా ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.
ధనుస్సు (Saggitarius) – ఈ రోజు మీ ఇంట్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా వ్యవహరించండి. మీ ప్రత్యర్థులు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి సమయంలోనే సమయస్ఫూర్తితో, వివేకంతో వ్యవహరించాలి. అలాగే వాహన వినియోగంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు కూడా నూటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.
ఈ కథనాన్ని కూడా చదివేయండి: ఈ రాశుల వ్యక్తులు.. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు.. ఎందుకంటే..?
మకరం (Capricorn) – ఈ రోజు మీరు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచండి. అలాగే మీరు కొన్ని రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. కొందరు వ్యక్తులు మిమ్మల్ని ఇరకాటంలో పడేయడానికి ప్రవరిస్తారు. ఇలాంటి సమయాల్లో వివేకంతో వ్యవహరించండి. ఎలాంటి వాదోపవాదాలకు దిగవద్దు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వ్యక్తిగత జీవితానికి వస్తే.. మీకు మీ భాగస్వామి మద్దతు పూర్తిగా లభిస్తుంది.
కుంభం (Aquarius) – ఈ రోజు మీకు ధనయోగం ఉంది. అలాగే పాత రుణాలు కూడా తిరిగి వసూలయ్యే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కూడా తమ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఉద్యోగస్తులు కొంచెం కష్టపడితే.. కెరీర్ పరంగా తాము అనుకున్న లక్ష్యాలను చేరుకునే అవకాశముంది. అలాగే పాత మిత్రులు ఈ రోజు మిమ్మల్ని కలుస్తారు. రాజకీయ రంగంలోని వ్యక్తులు తాము ఊహించని వార్తలు వింటారు.
మీనం (Pisces) – ఈ రోజు మీకు అన్ని విధాలుగా బాగా కలిసొచ్చే రోజు. మీ వ్యాపార సంబంధాలు బలపడతాయి. అలాగే ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. ముఖ్యంగా కుటుంబ సంబంధాల్లో మార్పు వస్తుంది. కొన్ని ఊహించని వార్తలు వింటారు. సులభ ధన, వాహన యోగం ఉంటుంది. విద్యార్థులకు కూడా ఈ రోజు బాగా కలిసొస్తుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశముంది.
ఈ కథనాన్ని కూడా చదివేయండి: ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు
అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.