ఈ రోజు రాశిఫలాలు చదవండి.. మీ సమస్యలకు సులభంగా పరిష్కారాలు తెలుసుకోండి..

ఈ రోజు రాశిఫలాలు చదవండి.. మీ సమస్యలకు సులభంగా పరిష్కారాలు తెలుసుకోండి..

ఈ రోజు (జూన్ 13) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం..


మేషం (Aries) – ఈ రోజు చాలా విషయాల మధ్య మీ ఫోకస్ కొట్టుమిట్టాడుతుంది. పనిలో ఎలాంటి మార్పు లేకపోయినప్పటికీ అందులో జరిగే ఆలస్యం కారణంగా మీకు చిరాకుగా అనిపించవచ్చు. ఇతరుల సమస్యలకు ప్రాధాన్యం ఇచ్చి వాటిని పరిష్కరించడంలో మీరు బిజీగా ఉంటారు కాబట్టి కుటుంబ జీవితంపై దాని ప్రభావం కనిపిస్తుంది. కాబట్టి మీ పరిస్థితులను చక్కదిద్దుకునేందుకు కూడా కాస్త సమయం కేటాయించుకోండి.


వృషభం (Tarus) – పనిభారం అధికంగా ఉన్న కారణంగా ఒత్తిడిగా అనిపించవచ్చు. చివరి నిమిషంలో ఇచ్చే డెడ్ లైన్స్ కారణంగా ఇతరులకు, మీకు మధ్య మనస్పర్థలు తలెత్తవచ్చు. ఏ విషయాలను మీ మనసుకి తీసుకోకండి. మీ కుటుంబ సభ్యులు కూడా మీకు అన్ని విషయాల్లోనూ సహాయ, సహకారాలు అందిస్తారు.


మిథునం (Gemini) – మీ చుట్టూ చాలా జరుగుతోంది. మీరు ఇతరుల మనసుల్లో ఏముందో తెలుసుకోవడానికి వారిని ప్రశ్నించకండి. మీ మనసులో ఉన్న అపార్థాన్ని తొలగించేందుకు మీ స్నేహితులొకరు ప్రయత్నిస్తారు. కాస్త విశ్రాంతి తీసుకొని నిదానంగా ఉండడానికి ప్రయత్నించండి.


కర్కాటకం (Cancer) – ఈ రోజు మీకు ఉన్న క్రియేటివ్ ఐడియాస్, ఎనర్జీతో పనిని చాలా బాగా ముందుకు నడిపిస్తారు. అలాగే కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూసేవారికి మంచి ఫలితాలు అందుతాయి. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం కాస్త దెబ్బతినవచ్చు. ఫలితంగా మీ మనసుకి ప్రశాంతత లోపించవచ్చు.


సింహం (Leo) – పనిలో పెద్దగా మార్పు ఏమీ ఉండదు. కానీ మీరు సంతకం చేయాలనుకుంటున్న కాంట్రాక్ట్ లేదా త్వరగా పూర్తి చేయాలనుకుంటున్న పనుల్లో కాస్త జాప్యం జరగవచ్చు. అలాగే కొత్త వ్యక్తులతో కలిసి పని చేయాల్సిరావచ్చు. మీ భాగస్వామి కూడా అధికంగా ఒత్తిడికి గురి కావచ్చు. కాబట్టి ఇంటి దగ్గర మీరు సహనంతో ఉండాలి. మీ స్నేహితులు మీకు ఆ బలాన్ని అందిస్తారు.


క‌న్య (Virgo) – ఈ రోజు మీరు చేయాల్సిన పని చాలానే ఉంది. కానీ రోజు క్రమంగా గడిచే కొద్దీ మీరు డల్ గా అయిపోతారు. అలాగే కన్ ఫ్యూజ్ కూడా అవుతారు. కాబట్టి మీ మైండ్ ని ఫ్రెష్ గా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. పని చేసే క్రమంలో మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోండి. ఫలితంగా అధిక సమయం పనిలో గడిపినా దాని ప్రభావం మీపై ఉండకపోవచ్చు. మీకు సంతోషాన్నిచ్చే పని చేయడానికి ప్రాధాన్యం ఇవ్వండి.


తుల (Libra) – పనిలో జరిగే ఆలస్యాలు, ఇబ్బందులు మిమ్మల్ని కాస్త చిరాకు, అసహనానికి గురి చేస్తాయి. ఈ రోజు మీరు వీలైనంత వరకు ప్రాక్టికల్ గా వ్యవహరిస్తూ మీ ఎమోషన్స్ ని అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇతరుల సమస్యల్లోకి మీరు వెళ్లకండి. మిమ్మల్ని అర్థం చేసుకోవడం కాస్త కష్టమైన కారణంగా కుటుంబ జీవితంలోనూ మీకు ఒత్తిడి ఉంటుంది. ఈ క్రమంలో మీకు మీ స్నేహితులు సహాయం చేస్తారు. వారిని చేయనీయండి.


వృశ్చికం (Scorpio) – పనిలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. కానీ మీరు కాస్త వెనక్కి ప్రయాణిస్తూ ఇతరులకు ఉన్న సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. మీకు ఏది ముఖ్యమూ దాని పైనే ఫోకస్ చేయడానకి ప్రయత్నించండి. కుటుంబ జీవితంలో కాస్త ఒత్తిడి ఉండవచ్చు. ఈ కారణంగా మీరు ప్రేమించే వ్యక్తితో మీకు గొడవలు జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే సాయంత్రానికల్లా అవన్నీ సర్దుకునేలా చేస్తారు.


ధనుస్సు (Saggitarius) – సమావేశాల్లో జరిగే జాప్యం కారణంగా పని ఆగిపోయినట్లుగా అనిపిస్తుంది. మీ టీం మెంబర్ ఒకరి ప్రవర్తన కారణంగా మీరు కాస్త నిరుత్సాహానికి గురవుతారు. మీ కమ్యూనికేషన్ మీకు చాలా కీలకంగా మారుతుంది. మీరు పూర్తి చేయాల్సిన పనులు చాలా ఉన్న కారణంగా కుటుంబ జీవితం ప్రభావితం అవుతుంది.


మకరం (Capricorn) – మీరు చేపట్టిన పని చాలా బాగా పూర్తి చేస్తారు. మీ మనసుని, చుట్టూ ఉన్నవారిని సంతోషపెడుతూ బ్యాలన్స్డ్ గా వ్యవహరిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి చేసుకున్న ప్లాన్స్ లో చివరి నిమిషంలో మార్పులు జరగవచ్చు. ఒకవేళ ఏదైనా మీకు ఫేవర్ గా జరగకపోతే దాని గురించి చింతించకండి. దాని బదులు మీ స్నేహితులతో కాస్త సమయం గడపండి.


కుంభం (Aquarius) – మీకు ఉన్న స్పష్టత, కమ్యూనికేషన్.. వంటి వాటి కారణంగా పనిలో వేగం పుంజుకుంటుంది. మీరు కొత్త వ్యక్తులతో కలిసి పని చేస్తుంటే వారి పట్ల సహనంతో వ్యవహరించండి. కుటుంబపరంగా ఎలాంటి మార్పులు లేకపోయినప్పటికీ పనికి సంబంధించిన కొన్ని విషయాల్లో స్పష్టత కోసం మీరు ఇతరులను కలిసి మాట్లాడతారు.


మీనం (Pisces) – పనిలో ఈ రోజు అధిక సమయం గడపాల్సి వచ్చినప్పటికీ వాటి ఫలితాలు మీరు కోరుకున్న విధంగానే వస్తాయి. ప్రయోగాలు చేసేందుకు, తగిన నిర్ణయాలు తీసుకునేందుకు మీకు స్వతంత్రం ఉంటుంది. మీ కుటుంబ సభ్యులు ఒకరు ఎమోషనల్ గా డల్ గా ఉంటారు. వారికి మీ సహాయం అందించండి. మీ పరిస్థితిని మరింత చక్కదిద్దేందుకు మీ స్నేహితులు ఒకరు మీకు సహకరిస్తారు.


ఇవి కూడా చ‌ద‌వండి


ఈ రోజు రాశిఫలాలు చదవండి.. మీ భవిష్యత్తును గురించి తెలుసుకోండి..!


ఈ రాశుల వ్యక్తులు.. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు.. ఎందుకంటే..?


సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?