ఈ రోజు రాశిఫలాలు చదవండి.. మీ సమస్యలను సులభంగా పరిష్కరించుకోండి..!

ఈ రోజు రాశిఫలాలు చదవండి.. మీ సమస్యలను సులభంగా పరిష్కరించుకోండి..!

ఈ రోజు (జూన్ 7) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..


మేషం (Aries) – ఈ రోజు మీరు చేసే పనిలో.. క్రియేటివిటీకి తొలి ప్రాధాన్యాన్ని ఇస్తారు. మీ పాత క్లయింట్స్ కూడా మళ్లీ కలిసి.. మీకు కాంట్రాక్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు, కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభించే వారికి కూడా ఈ రోజు చాలా మంచిది. అయితే ఏదైనా ఒక నిర్ణయం తీసుకొనే ముందు.. మీరు మీ కుటుంబ సభ్యులతో చర్చించడం మంచిది. 


వృషభం (Tarus) – ఈ రోజు పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు మీరు మీ పనిని నిజాయతీగా చేయడానికి ప్రయత్నించడంతో.. సమయం కూడా అనుకోకుండా అలాగే గడిచిపోతుంది. మీ ప్రవర్తన కొన్ని వివాదాలకు దారి తీసే అవకాశం కూడా ఉంది. కనుక కాస్త వివేకంతో వ్యవహరించండి. ఆఫీసులో ఏవైనా వివాదాలుంటే.. వాటిని పరిష్కరించుకోవడానికి ఈ రోజే సరైన సమయం. 


మిథునం (Gemini) – ఈ రోజు పెండింగ్‌లో ఉన్న పనంతా మీరు పూర్తి చేస్తారు. అలాగే ఆఫీసులో మీ సీనియర్ ఒకరికి మీ ఐడియాలు, పనితనం బాగా నచ్చి.. వాటిని అమలుపరిచేలా మిమ్మల్ని ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ రోజు మీ మొదటి ప్రాధాన్యం పనికే ఉంటుంది. అందుకే ఎక్కడ ఉన్నా పని గురించే ఆలోచిస్తారు. కానీ పనిలో పడి.. కుటుంబానికి సమయం కేటాయించడం మర్చిపోవద్దు. మీ కెరీర్‌కు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రోజు సరైన సమయం. మీ జీతభత్యాలు లేదా ప్రమోషన్స్ గురించి.. మీ యాజమాన్యంతో మాట్లాడడానికి  ఈ రోజే సరైన సమయం. 


కర్కాటకం (Cancer) – మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని వేచి చూసేలా చేయడం వల్ల.. ఈ రోజు మీ పనిలో జాప్యం జరగవచ్చు. అయితే ఇదే సమయంలో పెండింగ్‌లో ఉన్న.. పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించండి. లేకపోతే అవే పనులు రేపొద్దున మీకు అదనపు భారం అవుతాయి.  అలాగే కాంట్రాక్ట్స్ పై సంతకాలు చేసే విషయంలోనూ కాస్త జాగ్రత్తగా ఉండండి. జయాపజయాల విషయంలో నిరుత్సాహపడకండి. వ్యాపారానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకోవాలన్న ఆలోచన ఉంటే.. అందుకు ఈ రోజే సరైన సమయం. 


సింహం (Leo) – ఈ రోజు మీరు మీ కుటుంబం విషయంలో కీలక నిర్ణయాలు తీసుకొనేందుకు సరైన సమయం. అలాగే మీరు తీసుకునే కొన్ని ముఖ్యమైన నిర్ణయాల కారణంగా.. ప్రస్తుతం చేస్తున్న పనులు కొన్నింటిని తాత్కాలికంగా పక్కన పెడతారు. ముఖ్యంగా మీ కుటుంబంలోని మనస్పర్థలను దూరం చేసుకోవడానికి.. సమస్యలను ఒక కొలిక్కి తీసుకురావడానికి ఈ రోజే సరైన సమయం. 


క‌న్య (Virgo) – ఈ రోజు మీరు చేస్తున్న పనిలో ఎలాంటి మార్పూ ఉండదు.  మీరు ఎమోషనల్‌గా కూడా బాగా అలసిపోయినట్లు ఫీలవుతారు. ఒకవేళ పని చేయాల్సి వచ్చినా ఆటో పైలట్ మోడ్‌లో పని చేస్తారు. కాబట్టి ఈ రోజు అన్ని పనులకు దూరంగా ఉంటూ ఒంటరిగా సమయం గడపండి. మిమ్మల్ని అందరూ అర్థం చేసుకోవాలని భావించకండి. ఈ రోజు ఎలాంటి కొత్త నిర్ఱయాలూ తీసుకోకపోవడం మంచిది. 


తుల (Libra) – ఈ రోజు మీకు అవసరమైన సహాయం.. మీ స్నేహితుల నుండి అందుతుంది. అయితే ఒకసారి ఒక పని ప్రారంభిస్తే దాని పైనే మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మీ భాగస్వామితో సమయం గడిపేందుకు మీరు అధిక ప్రాధాన్యం ఇస్తారు. అలాగే కుటుంబ సభ్యుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉండండి. మీ భాగస్వామితో ఏర్పడిన మనస్పర్థలను దూరం చేసుకోవడానికి.. ఈ రోజు సరైన సమయం. కనుక మీ మనసులోని భావాలను తనతో నిజాయతీగా పంచుకోండి. 


వృశ్చికం (Scorpio) – మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు ఒకరు మీ నుంచి ప్రేరణ పొందుతారు. అయితే వారు కాస్త ముభావంగా ఉండడం వల్ల.. మీరే వారిలో ఉత్సాహాన్ని కూడా నింపాల్సి ఉంటుంది. పనికి సంబంధించిన విషయాల్లో కూడా మీ సలహా తీసుకునేందుకు.. మీ సహచరులు లేదా స్నేహితులు ఆసక్తి చూపిస్తారు. వారికీ సమయం కేటాయించండి. ముఖ్యంగా మీ వ్యాపార లబ్ధి కోసం కొత్త స్నేహాలను ఆహ్వానించేందుకు.. ఈ రోజు అనువైనది. 


ధనుస్సు (Saggitarius) – ఆరోగ్యం సరిగా లేని కారణంగా మీరు ప్రారంభించిన ప్రతి పనినీ మీరు ముగించలేకపోవచ్చు. మీ కుటుంబ సభ్యులు కూడా మీ ఆరోగ్యం గురించి చింతిస్తూ ఉండవచ్చు. కనుక, మీ ఆరోగ్యం గురించి ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటే.. దానికి ఈ రోజే అనువైనదని భావించండి. అలాగే, కొన్నాళ్లు మీ పనులకు స్వస్తి పలికి.. కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి. 


మకరం (Capricorn) – మీకు ఈ రోజు కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ వచ్చే సూచనలున్నాయి. అయితే మీ భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికల గురించి.. మీ ఐడియాల గురించి ఎవ్వరితోనూ పంచుకోకండి. ముఖ్యంగా పని ప్రదేశంలో వాటి గురించి చర్చించవద్దు. దాని వల్ల వారితో పాటు.. మీలో కూడా అభద్రతాభావన పెరగవచ్చు. 


కుంభం (Aquarius) – ఆఫీసులో మీ సహచరుల మనసులో ఏముందో.. మీకు నిదానంగా అర్థమవుతుంది. రోజులో మొదటి సగభాగం నెమ్మదిగా గడిచినప్పటికీ.. రెండో భాగం మొదలయ్యేసరికి మీరు తీసుకునే నిర్ణయాలు, ఐడియాలు పూర్తిగా మీ కంట్రోల్‌లోనే ఉంటాయి. అయితే ఏ విషయంలోనూ అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. 


మీనం (Pisces) – ప్రస్తుతం మీ క్లయింట్స్..  మీ పనితీరు పట్ల సంతృప్తిగానే ఉన్నారు. అయితే వారితో ఆర్థికపరమైన లావాదేవీలు జరుగుతున్నప్పుడు.. కాస్త వివేకంతో వ్యవహరించండి. మీ చుట్టూ ఉన్నవాళ్లు మిమ్మల్ని ఇబ్బందిపెట్టడానికి ఎంత ప్రయత్నించినా.. రాజీ పడకపోవడం మంచిది. మీ మనసు చెప్పిందే చేయండి.


Credit: Asha Shah


ఇవి కూడా చదవండి


నేటి రాశిఫలాలు చదవండి.. మీ లక్ష్యాలను సునాయాసంగా సాధించండి..!


మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలని భావిస్తే.. ఈ చిత్రమైన చైనీస్ జ్యోతిష్యం చదివేయండి..!


సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?