మీ సెక్స్ లైఫ్ ని ఆనందంగా మార్చేందుకు ఈ ఆహారపదార్థాలు ఎంతో తోడ్పడతాయి..

మీ సెక్స్ లైఫ్ ని ఆనందంగా మార్చేందుకు ఈ ఆహారపదార్థాలు ఎంతో తోడ్పడతాయి..

ఆలుమగలిద్దరి జీవితాన్ని మరింత ఆనందంగా మార్చడంలో సెక్స్ (Sex) కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తమ సెక్స్ జీవితం ఆనందంగా ఉన్న జంటలు జీవితంలోనూ చాలా తక్కువ గొడవలు పెట్టుకుంటూ ఉంటారట. ఇలా సెక్స్ జీవితాన్ని ఆనందంగా మార్చుకునేందుకు చాలామంది చాలా రకాల టిప్స్ చెబుతూ ఉంటారు. కానీ సెక్స్ లైఫ్ ని ఆనందంగా కొనసాగించేందుకు కొన్ని రకాల ఆహార పదార్థాలు (foods) కూడా ఉపయోగపడతాయని మీకు తెలుసా? మీరు విన్నది అక్షరాలా నిజమే.. మరి, మీ సెక్స్ లైఫ్ ని ఆనందకరంగా మార్చేందుకు ఈ ఆహారపదార్థాలు తరచూ తీసుకోవాలి.


honey


1. తేనె


తేనె ఎంతో రుచికరంగా ఉంటుందని దాన్ని తినేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఇది కేవలం రుచికరంగా ఉండడం మాత్రమే కాదు.. దీని వల్ల సెక్స్ లైఫ్ కూడా ఆనందంగా మారుతుంది. ఇందులోని సహజ చక్కెరలు మన సెక్స్ లైఫ్ ని ఆనందమయంగా మారుస్తాయి. దీని వల్ల ఎక్కువ సమయం పాటు సెక్స్ లో యాక్టివ్ గా ఉండే వీలుంటుంది. మన దేశంలో సెక్స్ గురించి తెలుసుకోవడానికి ఉపయోగించే పుస్తకం కామసూత్ర లో కూడా తేనెను లైంగిక జీవితాన్ని ఆనందంగా మార్చడానికి ఉపయోగపడుతుందని చెప్పింది.


fish


2. చేపలు


చేపలు కేవలం ఆడవారి లైంగిక ఆరోగ్యాన్ని మాత్రమే కాదు.. మగవారి లైంగిక పటుత్వాన్ని కూడా పెంచే ఆహారం. ఇందులోని కొన్ని పోషకాలు మన లైంగిక అవయవాలకు వెళ్లే రక్త నాళాలను వెడల్పుగా మారుస్తుంది. దీని వల్ల సెక్స్ లో ఆనందం ఎక్కువగా వస్తుంది. ఇందులోని జింక్ కూడా లైంగిక ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.


banana


3. అరటి పండు


సెక్స్ చేయాలంటే చాలా శక్తి కావాల్సి ఉంటుంది. అందుకే సెక్స్ కి కొన్ని గంటల ముందు అరటి పండు తినడం వల్ల మీ శక్తి మరింత పెరుగుతుంది. దీంతో పాటు అరటి పండ్లలో ఉండే సెరటోనిన్ మీ మూడ్ ని చాలా పెంచుతుంది. దీంతో మీరు, మీ భాగస్వామి ఆనందంగా సెక్స్ లో పాల్గొనే వీలుంటుంది.


red wine


4. రెడ్ వైన్


ఒక గ్లాస్ రెడ్ వైన్ తాగడం వల్ల మీ సెక్సువల్ ఫీలింగ్స్ చాలా పెరుగుతాయి. ఎందుకంటే ఇందులో డోపమైన్ ఉంటుంది. ఇది మెదడు పనితీరును మరింత వేగవంతం చేస్తుంది. దీంతో పాటు ఉన్న కొన్ని కెమికల్స్ మనలో సెక్స్ కోరికలు కూడా పెంచుతాయట. సెక్స్ కి ముందు రెడ్ వైన్ తాగడం వల్ల మీ ఇద్దరిలో కోరికలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీలైనంత ఎక్కువ సేపు సెక్స్ లో పాల్గోనే వీలుంటుందట.


strawberry


5. స్ట్రాబెర్రీలు


చేపల్లో ఉన్నట్లే, స్ట్రాబెర్రీలోనూ జింక్ ఎక్కువగా ఉంటుంది. ఇది మగవాళ్లలో టెస్టోస్టిరాన్ స్థాయులను ఆరోగ్యకరమైన స్థాయిలో ఉండేలా చేస్తుంది. కేవలం మగవారికే కాదు.. ఆడవారికి కూడా ఇవి ఎంతో మంచివి. వీటి వల్ల వారిలో సెక్స్ కోరికలు పెరుగుతాయట. సెక్స్ కంటే ముందు కొన్ని స్ట్రాబెర్రీలు తిన్నా చాలు.. చాలా ఎక్కువ సమయం పాటు సెక్స్ లో పాల్గొనవచ్చట.


eggs


6. గుడ్లు


సెక్స్ లైఫ్ అద్భుతంగా ఉండాలంటే గుడ్లు తినడం ప్రారంభించాల్సిందే అంటారు నిపుణులు. ఎందుకంటే ఇందులోని విటమిన్ బి మన హార్మోన్లు బ్యాలన్స్డ్ గా ఉండేలా చేస్తుందట. అంతేకాదు.. ఇందులోని జింక్ ఆరోగ్యకరమైన సెక్స్ జీవితాన్ని గడిపేందుకు ఎంతో అవసరమైన పదార్థం. కాబట్టి రోజూ గుడ్లు తినడం మంచిది.


icecream


7. ఐస్ క్రీం


సెక్స్ కి ముందు వెనిలా ఐస్ క్రీం తినడం వల్ల కూడా మూడ్ బాగవుతుందట. ఇందులోని వెనిలా వాసన మన మూడ్ ని మార్చి కోరికలు పెంచుతుందట. అంతేకాదు.. ఐస్ క్రీంలో క్యాల్షియం, ఫాస్పరస్ ఎక్కువగా ఉంటుంది. ఇవి మన ఆర్గాజమ్ మరింత ఎక్కువగా ఉండేలా చేస్తాయట. మన కండరాలను కూడా బలోపేతం చేస్తుందట. అందుకే సెక్స్ కి ముందు వెనిలా ఐస్ క్రీంని తినడం మాత్రం మర్చిపోవద్దు.


carrots


8. క్యారట్లు


క్యారట్లు కేవలం సలాడ్ అందంగా కనిపించేందుకు, బరువు తగ్గించేందుకు మాత్రమే కాదు.. మీ సెక్స్ కోరికలు పెంచి మీ లైంగిక జీవితాన్ని మరింత ఆనందమయంగా మార్చేందుకు కూడా ఉపయోగపడతాయట. కావాలంటే ఒక్కసారి ప్రయత్నించి చూడండి.


ఇవి కూడా చదవండి.


తన బెడ్రూంకి సంబంధించిన.. ఓ సీక్రెట్‌ని బయటపెట్టిన ప్రియాంక..!


తొందరగా గర్భం దాల్చేందుకు.. ఈ చిట్కాలు మీకు తప్పనిసరి..


బాలీవుడ్ తారల.. వింత అలవాట్ల గురించి మీకు తెలుసా?


Images : Shutterstock