సాధారణంగా కొందరు తమకు సంబంధించిన ఏ వేడుకలైనా.. సింపుల్‌గా జరుపుకోవాలని భావిస్తారు. అలాంటివారిలో నా బాయ్ ఫ్రెండ్ (Boyfriend) కూడా ఒకరు. మేం ప్రేమించుకున్న ఈ మూడేళ్లలో తన పుట్టినరోజు (Birthday) ఎప్పుడూ సింపుల్‌గానే జరిగేది.
కానీ ఈ ఏడాది మాత్రం తన పుట్టినరోజు నెలరోజులుందనగానే మునుపటిలా కాకుండా.. కాస్త ప్రత్యేకంగా జరపాలని నిర్ణయించుకున్నా. అందుకే.. తన కోసం సర్‌ప్రైజ్ బర్త్ డే పార్టీ ప్లాన్ చేశా. అనుకున్నదే తడవుగా.. స్నేహితుల సాయంతో తన కోసం డిఫరెంట్ పార్టీని ఏర్పాటు చేశాను. అది నా బాయ్ ఫ్రెండ్‌కి నచ్చింది కూడా.
మరి, నేను తన పుట్టినరోజు కోసం ఏం ప్లాన్ చేశానో.. అది తనని ఎంతగా సంతోషంలో ముంచెత్తిందో మీకూ తెలియాలిగా. అందుకే నేను చేసిన ఏర్పాట్ల నుంచి.. ఇచ్చిన సర్‌ప్రైజ్ వరకూ అన్నీ మీకు చెప్పేస్తాను.
ముందుగా తన కోసం సర్‌ప్రైజ్ బర్త్‌డే పార్టీ ఏర్పాటు చేయాలని అనుకోగానే.. అతని స్నేహితులతో పాటు.. నా స్నేహితులకు కూడా ఫోన్ చేసి చెప్పాను. వారి నుంచి కూడా కొన్ని ఐడియాలు తీసుకున్నాను. అలాగే నెల రోజుల ముందుగానే.. తన పుట్టినరోజు ప్లానింగ్ కోసం ఓ వాట్సాప్ గ్రూప్‌ని కూడా క్రియేట్ చేశాం. ఆ గ్రూపు ద్వారా ఎవరెవరు ఏమేం పనులు చేయాలో నిర్ణయించుకున్నాం.
ఫ్రెండ్ పుట్టినరోజు అనగానే నా స్నేహితులు, అతని స్నేహితులు కూడా తలా ఓ పని చేయడానికి ముందుకొచ్చారు. నేను మాత్రం పార్టీ ఆర్గనైజర్ అవతారం ఎత్తేశా. ఎన్నో తర్జనభర్జనల తర్వాత.. అర్ధరాత్రి పన్నెండు గంటలకు మా ఇంట్లో చిన్న పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం.
ఆ పార్టీ జరిగే సమయానికి మా అమ్మా, నాన్న వూళ్లో ఉంటారు. ఇక్కడున్న ఇంట్లో నేను, తమ్ముడు మాత్రమే ఉంటున్నాం. కనుక.. ఈ పార్టీకి అడ్డుచెప్పే వారు ఉండకపోవడం అనేది మా లక్ ఫ్యాక్టర్? దీంతో మా ఇంట్లోనే పార్టీ ప్లాన్ చేయడానికి నిశ్చయించుకున్నాం.
పార్టీ లుక్ అదిరిపోయేలా కనిపించడానికి.. వారం రోజుల ముందే ఇంటిని పూర్తిగా డెకరేట్ చేయాలని అనుకున్నాం. అందుకోసం మంచి డెకరేటివ్ పీసెస్ అన్నీ ఆర్డర్ చేశాను. అలాగే ఇల్లు అద్భుతంగా కనిపించేలా ప్లాన్ చేసుకున్నా. పార్టీ మా ఇంట్లో జరుగుతోంది కాబట్టి.. మా ఇంట్లో ఏ ప్రదేశానికి ఎలాంటి అలంకరణ వస్తువులైతే బాగుంటాయో నాకు బాగా తెలుసు. కాబట్టి అవన్నీ ఆర్డర్ చేశా. అందులో భాగంగానే.. ఇంటిని అలంకరించేందుకు మంచి ఫెయిరీ లైట్స్ ఆర్డర్ చేశాను. ఆ ప్రత్యేకమైన సాయంత్రాన ఇంటి డెకరేషన్ అందంగా కనిపించేందుకు.. ఇది చక్కటి పద్ధతిగా నాకు అనిపించింది.
అయితే ఈ ఫెయిరీ లైట్లతో పాటు అందమైన సెంటెడ్ క్యాండిల్స్ కూడా పెడితే.. అటు మంచి సువాసన ఇటు అందమైన లుక్ కూడా సొంతం అవుతుంది. అందుకే POPxo shop నుంచి మంచి సెంటెడ్ క్యాండిల్స్ ఆర్డర్ చేశాను.
వీటితో పాటు మా ఇంట్లో ఉన్న ఫర్నిచర్ మొత్తం చెక్కతో చేసింది కాబట్టి.. వాటిపై మరకలు పడితే అమ్మ వూరుకోదని నాకు తెలుసు. అందుకే డ్రింక్స్ పెట్టుకోవడానికి POPxo shop నుంచి కోస్టర్స్ కూడా కొన్నా. మిగిలిన డెకరేటివ్ ఐటమ్స్‌తో.. అవి కూడా చేరి పార్టీకి మరింత అందాన్ని తీసుకొచ్చాయి.
అందరికీ సమయం, తేదీతో పాటు అడ్రస్ కూడా చెబుతూ మరోసారి పర్సనల్‌గా మెసేజ్ చేశాను. సర్‌ప్రైజ్ పార్టీ కాబట్టి.. దీని గురించి నా బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడొద్దని కూడా చెప్పాను.
ఫైనల్‌గా ఆ రోజు వచ్చేసింది. తన పుట్టినరోజు ఈసారి శనివారం వచ్చింది. అందుకే శుక్రవారం రాత్రి పన్నెండు గంటలకు.. ఓ మంచి రెస్టరంట్‌కి వెళ్లి డిన్నర్ చేసి పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పాను. మేం ప్రతిసారి అలాంటిదే చేస్తుంటాం. కాబట్టి తనకు కూడా పెద్దగా డౌట్ రాలేదు. ఆ రోజు రాత్రి కాస్త ఆలస్యం చేసి.. చివరికి రాత్రి పదకొండు గంటలకు తనని కలిశాను. ఈలోపు ఇంట్లో అంతా సిద్ధం చేసి ఉంచాం.
పదకొండు గంటలకు నేను తనని తీసుకురావడానికి వెళ్తే.. మా స్నేహితులు మాత్రం ఇంట్లో ఫైనల్ టచప్స్ చేస్తూ ఉండిపోయారు. క్యాండిల్స్ వెలిగించడం, కేక్ తీసి పెట్టడం.. పూలతో అలంకరించడం వంటివన్నీ చేశాను. ఆ తర్వాత అటూ, ఇటూ తిరిగి రెస్టరెంట్‌కి ఎందుకు.. ఇంట్లోనే పుట్టినరోజు చేసుకుందామంటూ తనని కన్విన్స్ చేసి ఇంటికి తీసుకొచ్చా. మేం వచ్చే ముందే వాళ్లకు మెసేజ్ చేశా కాబట్టి.. వాళ్లు సోఫా వెనుక దాక్కున్నారు. మేం తాళం తీసి ఇంట్లోకి అడుగుపెట్టగానే ఫెయిరీ లైట్లు ఆన్ అయ్యాయి. వాళ్లందరూ ఒక్కసారిగా లేచి సర్‌ప్రైజ్ అని అరిచేశారు.
ఆ తర్వాత తను కేక్ కట్ చేశాడు. ఆ కేక్ తన ముఖానికి కూడా పూశారు. బర్త్ డే బమ్స్ కూడా కొట్టారు. ఆ తర్వాత.. మేమందరం రుచికరమైన భోజనం చేసి డ్రింక్స్ తాగాం. మొత్తంగా చెప్పాలంటే ఆ రాత్రి చాలా అద్బుతంగా గడిచింది. ఆ రోజు పార్టీని తను చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇదంతా చేసినందుకు నాక్కూడా చాలా ప్రశంసలే దక్కాయనుకోండి. కానీ తన ముఖంలో చిరునవ్వు కంటే నాకు అవి ఎక్కువగా అనిపించలేదు.
Image: Shutterstock
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో లభ్యమవుతోంది: ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ మరియు బెంగాలీ
కలర్ ఫుల్‌గా, క్యూట్‌గా ఉండే వస్తువులను మీరూ ఇష్టపడతారా? అయితే సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ ఇంకా మరెన్నో.. వాటికోసం POPxo Shop ని సందర్శించండి !
ఇవి కూడా చదవండి.
ఈ లక్షణాలుంటే మీ బాయ్ ఫ్రెండ్.. మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నట్లే..!
పిరియడ్స్ సమయంలో.. అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్ నుంచి ఏం ఆశిస్తారంటే..?
మీ బాయ్ ఫ్రెండ్‌కి గడ్డం ఉందా? అయితే ముద్దుపెట్టే ముందు మరోసారి ఆలోచించండి..!
Images : Shutterstock, Unsplash