మంచు ముక్కలు మీ బరువును.. ఎంత సులువుగా తగ్గించేస్తాయో తెలుసా?

మంచు ముక్కలు మీ బరువును.. ఎంత సులువుగా తగ్గించేస్తాయో తెలుసా?

బరువు (weight).. ఇప్పుడు ఎంతోమందిని ఇబ్బంది పెడుతోన్న సమస్య. బరువు తగ్గేందుకు వివిధ రకాల  రకరకాల డైట్లు, వ్యాయామాలు పాటించడం ఇలా ఎన్నెన్నో చేస్తుంటారు. కానీ కొన్ని సులువైన చిట్కాలతో బరువు తగ్గించుకోవడం సులభం అని మీకు తెలుసా?

అందులో ముఖ్యమైనది ఐస్ (Ice). అదేనండీ మంచు ముక్కలు. ఇప్పటివరకూ ఐస్‌ని జ్యూసులు, షేక్స్‌లో కలుపుకొని తాగడానికి.. దెబ్బతగిలినప్పుడు గాయాలకు రాయడానికి మాత్రమే ఉపయోగిస్తూ ఉన్నాం. కానీ ఐస్‌ని బరువు తగ్గించేందుకు కూడా ఉపయోగించవచ్చట తెలుసా? అదెలా అనుకుంటున్నారా? అయితే మంచు ముక్కలతో బరువు ఎలా తగ్గించవచ్చో మనమూ తెలుసుకుందాం రండి.. 

Shutter stock

ఐస్ ముక్కలను నీళ్లు లేదా కూల్ డ్రింక్స్ వంటివి చల్లబర్చేందుకు ఉపయోగిస్తుంటారు. కానీ దానివల్ల కొవ్వు కూడా కరుగుతుంది. దీన్నే వైద్య పరిభాషలో ఐస్ థెరపీ అంటారట. ఈ థెరపీ.. బరువు ఎక్కువగా ఉన్నవారు ఎన్ని వ్యాయామాలు చేసినా తగ్గని తమ శరీరంలోని మొండి కొవ్వు‌ను కరిగిస్తుంది. బరువు తగ్గడానికి వ్యాయామాలు, డైట్‌తో పాటు దీన్ని కూడా పాటించడం మంచిదే అంటున్నారు నిపుణులు. ఈ థెరపీ వల్ల బరువు తగ్గడంతో పాటు చర్మం బిగుతుగా మారడం వంటి ప్రయోజనాలు ఉంటాయట. మరి ఈ ఐసీ స్పైసీ థెరపీని మీరూ ఓసారి ప్రయత్నించి చూడండి.

Shutter stock

దీన్ని ఎలా చేయాలంటే.. తొలుత ఐస్ ముక్కలను ఓ మందపాటి గుడ్డలో లేదా ప్లాస్టిక్ బ్యాగ్‌లో వేయాలి. తర్వాత ఆ గుడ్డ లేదా బ్యాగుతో కొవ్వు ఎక్కువగా ఉన్న పొట్ట లేదా తొడలు వంటి ప్రదేశాల్లో మసాజ్ చేయాలి. దాదాపు అరగంట పాటు.. ఇలా మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు కొందరు నిపుణులు. అయితే  ఈ ప్రాసెస్ ప్రారంభించడానికి ముందు..  ముల్తానీ మట్టితో చర్మాన్ని శుభ్రం చేసుకోవాలట. అలాగే వేగంగా ఫలితం పొందాలంటే.. ఐస్ ముక్కల్లో రోజ్ మేరీ, ఇవీ, గ్రీన్ టీ, కాఫీ వంటివి వేయడం మంచిదట. అయితే ఐస్ ముక్కలను డైరెక్ట్‌గా చర్మంపై మాత్రం పెట్టకూడదని చెబుతున్నారు. దీనివల్ల చర్మ రుగ్మతలు రావచ్చు. అందుకే కేవలం గుడ్డ లేదా బ్యాగుతో మాత్రమే మసాజ్ చేయాలి. ఇలా ఐస్ థెరపీ చేయడం వల్ల అస్సలు కరగని.. కొవ్వు తగ్గే అవకాశం ఉంది. అదెలా అనుకుంటున్నారా?

shutter stock

సాధారణంగా మనుషుల్లో రెండు రకాల ఫ్యాటీ టిష్యూస్ ఉంటాయి. అందులో ఒకటి వైట్ ఫ్యాట్. దీనివల్లే పొట్ట లావుగా మారడం, తొడలు లావెక్కడం వంటివి జరుగుతుంటాయి. ఈ తరహా కొవ్వు రక్తనాళాల్లో ప్రయాణించి కండరాలు పనిచేయడానికి ఉపయోగపడుతుంది. ఇక మరో రకమైన కొవ్వు బ్రౌన్ ఫ్యాట్. ఇది శరీరంలో వేడిని పుట్టించడానికి ఉపయోగపడుతుంది. మన శరీరం ఎంత చల్లగా మారితే.. అంత బ్రౌన్ ఫ్యాట్ మన శరీరం నుంచి తగ్గిపోతుంది. దీనికి కారణం కూడా వెల్లడిస్తున్నారు నిపుణులు. మన శరీరం చల్లబడినప్పుడు బ్రౌన్ ఫ్యాట్ కరుగుతూ శరీరాన్ని వేడెక్కిస్తుంది. సరైన బ్రౌన్ ఫ్యాట్ లేకపోతే ఆ ప్రాంతంలోని వైట్ ఫ్యాట్ కూడా బ్రౌన్ ఫ్యాట్‌గా మారిపోతుంది.

Shutter stock

ఈ థెరపీ ప్రారంభించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. రాత్రి పడుకునే ముందు కొన్ని ఐస్ ముక్కలను ఓ జిప్ లాక్ పౌచ్‌లో వేసి పొట్ట పై పెట్టుకోవాలి. లేదంటే ఐస్ ప్యాక్ కోసం ప్రత్యేకంగా జెల్స్ మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. దీన్ని డీప్ ఫ్రిజ్‌‌లో పెట్టి బాగా చల్లబడిన తర్వాత.. కొవ్వు ఎక్కువగా ఉన్న చోట్ల పెట్టుకోవచ్చు. పైగా దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవట.

దీనివల్ల మరికొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటంటే.. డెలివరీ తర్వాత బాలింతల చర్మం తిరిగి సాధారణ స్థితికి రావడానికి ఈ ఐస్ మసాజ్ ఎంతో తోడ్పడుతుంది.  ఇది శరీరాన్ని డీటాక్స్ చేయడానికి కూడా ఎంతో తోడ్పడుతుంది.
చర్మంపై భాగంలో ఇబ్బంది పెట్టే సెల్యులైట్‌ని తొలగిస్తుంది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

ఇవి కూడా చదవండి. 

బరువు తగ్గించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ ఇంటి చిట్కాలు పాటించండిబరువు సులభంగా తగ్గాలంటే.. ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే..!ఇలా చేస్తే జిమ్ అవ‌స‌రం లేకుండానే.. బ‌రువు త‌గ్గొచ్చు..