"కళ్యాణ వైభోగం" సీరియల్ కథానాయిక మేఘనా లోకేష్.. పెళ్లి ముచ్చట్లు మీకోసం

"కళ్యాణ వైభోగం" సీరియల్ కథానాయిక మేఘనా లోకేష్.. పెళ్లి ముచ్చట్లు మీకోసం

'కళ్యాణ వైభోగం; సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి మేఘనా లోకేష్ (Meghana Lokesh). ఇటీవలే ఆమె వివాహం స్వరూప్ భరద్వాజ్‌తో బెంగళూరులో చాలా నిరాడంబరంగా జరిగింది. అయితే ఇండస్ట్రీకి సంబంధించిన బాగా సన్నిహితులను మాత్రమే మేఘన తన పెళ్లికి ఆహ్వానించారు. వీరిది ప్రేమ వివాహం కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్నాయి. 'కళ్యాణ వైభోగం' సీరియల్‌లో మంగతయారు పాత్ర ద్వారా బాగా పాపులరైన మేఘన.. ఆ తర్వాత మరిన్ని టీవీ షోల్లో కూడా నటించారు. 

ఈ కథనం కూడా చదివేయండి: ప్రియాంక చోప్రా వెడ్డింగ్ గౌన్.. నిజంగానే అదుర్స్

Meghana Lokesh

కర్ణాటకలోని మైసూర్ ప్రాంతానికి చెందిన మేఘనా లోకేష్ తెలుగుతో పాటు కన్నడ ప్రేక్షకులకు కూడా సుపరిచితం.  ఈమె నటించిన "శశిరేఖ పరిణయం" సీరియల్ 'స్టార్ మా' ఛానల్‌లో ఒక ట్రెండ్ సెట్టింగ్ సీరియల్‌గా నిలిచింది. మేఘన తండ్రి ఓ ఇంజనీర్. అలాగే తల్లి కన్నడ భాష, సాహిత్యాన్ని బోధించే ప్రొఫెసర్. కన్నడ అమ్మాయి అయినా మేఘన తెలుగు బాగా మాట్లాడుతుంది. 8 సంవత్సరాల వయసు నుండే ఆమెకు నాటకాల్లో, థియేటర్ గ్రూపుల్లో నటించిన అనుభవం ఉంది. కానీ తన టీవీ కెరీర్ మాత్రం 'జీ కన్నడ' ఛానల్ ద్వారా ప్రారంభమైంది. 

ఈ కథనం కూడా చదివేయండి: ప్రేమ వివాహం.. ప్రేమతో మీకు నేర్పించే విషయాలు ఇవే..

Meghana and Swaroop Bharadwaj

మేఘన టీవీ సీరియల్స్‌తో పాటు పలు షార్ట్ ఫిలిమ్స్, సినిమాల్లో కూడా నటించింది. ఎమోషన్, బ్యూటీఫుల్ లైఫ్ అనే పేర్లతో విడుదలైన ఈమె నటించిన లఘు చిత్రాలు యూట్యూబులో అందుబాటులో ఉన్నాయి. అలాగు ఇదే మా ప్రేమకథ (2017), అమీర్ పేట టు అమెరికా (2018) అనే రెండు తెలుగు చిత్రాలలో కూడా మేఘన నటించింది. ఇవే కాకుండా కన్నడంలో దేవి, పవిత్ర బంధన, పురుషోత్తమ అనే టీవీ సీరియల్స్‌‌లో కూడా నటించింది. ప్రస్తుతం 'రక్త సంబంధం' అనే తెలుగు సీరియల్‌లో కూడా నటిస్తోంది. అలాగే డ్యాన్స్ జోడీ డ్యాన్స్‌కు మెంటర్‌గా కూడా ఆమె వ్యవహరిస్తోంది. 

Youtube

గతంలో కొన్ని ఇంటర్వ్యూల్లో మేఘన పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. తను నటనా రంగంలోకి అడుగుపెట్టకుండా ఉంటే.. తప్పకుండా కెమిస్ట్రీ లెక్చరర్ అయ్యుండేదానన్ని అంటారామె. ల్యాబ్‌లో ఆప్రాన్ వేసుకొని.. పరిశోధనలు చేయడమంటే తనకు ఎంతో ఇష్టమని చెబుతుంటారామె. అయినా సీరియల్స్‌లో నటించడం ప్రారంభించాక.. తనకు చదువుకోవడానికి టైమ్ ఉండేది కాదని అన్నారు.

తాను కన్నడ అమ్మాయినైనా.. తెలుగు ప్రేక్షకులు తనని ఆదరించిన విధానం చాలా బాగా నచ్చిందని.. తాను మరిన్ని తెలుగు చిత్రాలలో నటించాలని కోరుకుంటున్నానని తెలిపారు మేఘన. తాను బెంగళూరు లేదా మైసూరులో ఉన్నా.. అక్కడ కూడా తెలుగు ప్రేక్షకులు తనను గుర్తుపడుతూ ఉంటారని.. పలకరిస్తూ ఉంటారని.. అది తనకు చాలా సంతోషాన్ని కలిగించే విషయమని చెబుతుంటారు మేఘన. కళ్యాణ వైభోగం సీరియల్‌లో మేఘన, సన్నీ లవ్ పెయిర్.. హిట్ పెయిర్‌గా ప్రేక్షకులను అలరించింది. ఇదే సీరియల్ తమిళంలో కూడా ప్రసారమవుతోంది. 

 

ఈ కథనం కూడా చదివేయండి: దేశాంతర వివాహాలు చేసుకున్న.. మన క‌థానాయిక‌లు వీరే..!