మహిళలు ఇంకా మహారాణులు కాలేదు..

మహిళలు ఇంకా మహారాణులు కాలేదు..

ప్రస్తుతం మహిళలు(women) అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. వ్యాపార రంగంలోనూ రాణిస్తూ తమదైన ముద్ర వేస్తున్నారు. తమ కార్యదక్షతతో గుర్తింపు తెచ్చుకొంటున్నారు. మరి, నిర్ణయాలు తీసుకొనే విషయంలో స్వతంత్రంగా వ్యవహరించగలుగుతున్నారా? లేదా వారు తీసుకొనే నిర్ణయాన్ని ఎవరైనా ప్రభావితం చేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోవడానికే డీఎస్పీ డబ్ల్యూఇన్వెస్టార్ పల్స్ 2019 పేరుతో ఓ సర్వే చేశారు. డీఎస్పీ మ్యూచువల్ ఫండ్స్, రీసెర్చి ఏజెన్సీ నీల్సన్ సంయుక్తంగా ఈ సర్వే చేపట్టాయి. ఈ సర్వేలో పెట్టుబడుల రంగంలో మహిళల నిర్ణయాధికారం గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు తెలిశాయి.


పెట్టుబడుల రంగంలో ఉన్న స్త్రీపురుషులిద్దరి లక్ష్యాలు ఒకే విధంగా ఉన్నాయి. పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం, వారికి మంచి భవిష్యత్తునివ్వడం, అప్పుల భారం లేకుండా హాయిగా జీవితాన్నికొనసాగించడం, సొంత ఇల్లు కట్టుకోవడం.. ఇవే వారి లక్ష్యాలుగా ఉన్నాయి. అయితే వాటిని సాకారం చేసుకొనే క్రమంలో వీరిద్దరికీ ఎంతో తారతమ్యం కనిపిస్తోంది. ముఖ్యంగా ఇల్లు, వాహనాలు, భూమి కొనుగోలు చేసే విషయంలో మహిళలు స్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్నారు. వారిపై భర్త లేదా తండ్రి ఆధిపత్యం కనబడుతోంది. అదే బంగారం కొనుగోలు చేయడం, నిత్యావసర వస్తువుల, గృహాలంకరణ వస్తువుల కొనుగోలు విషయంలో మాత్రం మహిళలే స్వయంగా నిర్ణయం తీసుకొంటున్నారు.


పెట్టుబడుల రంగంలో పురుషుల కంటే మహిళలే అధికంగా ఉన్నారు. ఫండ్ మేనేజర్లుగా మహిళలు తమ సత్తా చాటుతున్నారు. కానీ వారి శ్రమకు తగిన గుర్తింపు రావడం లేదనే  చెప్పుకోవాలి. ఈ రంగంలో అసలు వారిని పట్టించుకొనేవారే కరవవుతున్నారు. పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు(investment decisions) తీసుకొనే విషయంలో మహిళలకు స్వతంత్రత లేదు. 33 శాతం మంది మాత్రమే ఈ విషయంలో నిర్ణయం తీసుకోగలుగుతున్నారు. మిగిలిన వారు మాత్రం పురుషుల నిర్ణయానికే తలొగ్గాల్సి వస్తోంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పెట్టుబడుల రంగంలోకి అడుగుపెట్టిన మహిళలు మిగిలిన వారితో పోలిస్తే చాలా స్వతంత్రంగా వ్యవహరించగలుగుతున్నారు. 13 శాతం మంది మహిళలు తమకు ఇష్టం లేకపోయినా పెట్టుబడులు విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని సర్వేలో తేలింది. దీనికి వారి భర్త లేదా తండ్రి చనిపోవడమే కారణమట.


మరో ఆసక్తికరమైన విషయమేంటంటే.. తండ్రులతో పోలిస్తే భర్తలే మహిళలను పెట్టుబడులు పెట్టమని ప్రోత్సహిస్తున్నారట. తమ కుమార్తెలను ప్రోత్సహించే తండ్రులు 27 శాతం ఉంటే.. భర్తలు మాత్రం 40 శాతం ఉన్నారు.


ఈ సర్వే ముంబయి, కోల్ కతా, ఢిల్లీ, బెంగళూరు, ఇండోర్, కొచ్చి, లూథియానా, గువాహటీ నగరాల్లో జరిగింది. ఈ సర్వేలో 25-60 ఏళ్ల మధ్య వయసున్న 1853 మంది పురుషులు, 2160 మంది మహిళలు పాల్గొన్నారు.


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ


క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.


ఇవి కూడా చదవండి:


#POPxoWomenWantMore మ‌హిళా శ‌క్తిని గుర్తించండి.. సాధికార‌త దిశ‌గా వారిని ప్రోత్స‌హించండి..!


‘ప్లీజ్ వెక్కిరించకండి’.. బాడీ షేమింగ్ గురించి కన్నీరు పెట్టుకొన్న విద్యాబాలన్


ఈ ఆస్కార్ .. భారతీయ మహిళలకే అంకితం.. ఎందుకంటే..?