14 జులై, 2019 (ఆదివారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

14 జులై, 2019 (ఆదివారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (జులై 14) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు మీ కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. కనుక సహనంతో వ్యవహరించండి.  వ్యాపారస్తులు చాలా బిజీగా గడుపుతారు. విద్యార్థులు మరింత ప్రేరణను పొందాల్సి ఉంది. వివాహితులు సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెంచుకుంటారు. ప్రేమికులు నిర్ణయాలు తీసుకొనే ముందు ఆలోచించుకోవాలి. 

వృషభం (Tarus) –  ఈ రోజు ఆర్థిక పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండవచ్చు. కొత్త ఆదాయ వనరులు సృష్టించ బడతాయి. ఆఫీసులో మీకు అధికారుల మద్దతు లభిస్తుంది.  ప్రేమికులు రొమాంటిక్ స్టాండ్ తీసుకోవచ్చు. వ్యాపారస్తులు ప్రమాదకర నిర్ణయాలకు దూరంగా ఉండండి. వాహన వినియోగంలో జాగ్రత్త వహించండి. 

మిథునం (Gemini) –  ప్రేమ వ్యవహారాలలో పరిణితితో నిర్ణయాలు తీసుకోండి. వివాహితులు భాగస్వామి ప్రేరణ, సహకారంతో వ్యాపారాలు చేసే అవకాశం ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లలు సాధించిన విజయాల విషయంలో గర్వపడతారు. ఆఫీసులో  మీరు చేసే పనిలో మార్పులు సంభవిస్తాయి. అయితే ప్రమోషన్ అవకాశాలు లభిస్తాయి.

కర్కాటకం (Cancer) –  ఈ రోజు కొన్ని నిర్ణయాలు తీసుకొనేటప్పుడు ఎవరి మాట వినవద్దు. మీ మనసు చెప్పే మాటనే వినండి. అలాగే వ్యాపారస్తులకు ఆర్థిక సంబంధాలు బలంగా ఉంటాయి. వివాహితులు పాత విషయాలను మరచిపోయి.. వర్తమానంలో జీవించడానికి ప్రయత్నిస్తున్నారు. అది మంచిదే. ఉద్యోగులు సోమరితనం వీడి కష్టించి పనిచేస్తారు.

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి..

సింహం (Leo) – ఈ రోజు ఆఫీసు పనిలో కొంత ఒత్తిడి ఉంటుంది. అలాగే వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారస్తులు వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసే అవకాశం ఉంది. కొన్ని విషయాలలో కోపాన్ని నియంత్రించుకోండి.  సృజనాత్మక, మార్కెటింగ్, సినిమా రంగాలలో వారికి పురోగతి ఉంటుంది. స్నేహితుల సహకారంతో అనుకున్న పనులు పూర్తిచేస్తారు. 

క‌న్య (Virgo) – ఈ రోజు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపించండి.  ఆఫీసులో కొంత అసౌకర్యానికి గురవుతారు. బదిలీలు, ట్రాన్స్‌ఫర్లు జరిగే అవకాశం ఉంది.  స్నేహితులతో వివాదాలు, విభేదాలు పెరిగే అవకాశం ఉంది. భాగస్వామితో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి. రాజకీయ రంగానికి చెందిన వ్యక్తులకు కీలక పదవులు లభించే అవకాశం ఉంది. 

తుల (Libra) – ఈ రోజు వృత్తిపరంగా మీకు అంతా అనుకూలంగా జరుగుతుంది. మీ పని శైలి మీకు కార్యాలయంలో ప్రమోషన్ అవకాశాలను కల్పిస్తుంది. వ్యక్తిగత జీవితానికి వస్తే.. మీకు ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా సాగుతుంది. వ్యాాపారస్తులకు సులభ ధన యోగం ఉంటుంది. 

వృశ్చికం (Scorpio) –  ఈ రోజు ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు లాభసాటిగా గడుస్తుంది. ప్రేమికులు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం బెటర్. వివాహితులకు సంసార బాధ్యతలు మరింత పెరుగుతాయి. విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంలో సరదా వాతావరణం ఉంటుంది.  కోర్టు కేసులు, లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి.

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆదాయ-వ్యయంలో సమ తుల్యతను పాటించండి. మీ ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఆఫీసులో కూడా  పని భారం పెరుగుతుంది. వ్యాపారంలో ప్రత్యేక ఒప్పందాలు చేసుకుంటారు. 

ఈ కథనాన్ని కూడా చదివేయండి: ఈ రాశుల వ్యక్తులు.. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు.. ఎందుకంటే..? 

మకరం (Capricorn) – ఈ రోజు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచండి. ఆఫీసులో కొన్ని విషయాల్లో సహోద్యోగులు మీకు సహాయం చేస్తారు. అలాగే మీ నిజాయతీకి తగిన ఫలితం దక్కుతుంది. విద్యార్థులు నిర్లక్ష్య ధోరణిని వీడి.. నిజాయతీగా చదవడం ప్రారంభించాలి. కోర్టు విషయాలు, ఆర్థికపరమైన లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి. 

కుంభం (Aquarius) –మీ లోగుట్టు తెలుసుకోవడానికి.. ప్రత్యర్థులు మీతో సన్నిహితంగా ఉంటారు.  మీ మొండి పట్టుదల, దూకుడు ప్రవర్తన వల్ల అనర్థాలు కొనితెచ్చుకోవద్దు. వ్యాపారస్తులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ప్రత్యర్థులు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టవచ్చు. వ్యర్థ ఖర్చులను మానుకోండి. ఇంట్లో కూడా టెన్షన్ పడే సందర్భాలు వచ్చే అవకాశముంది. 

మీనం (Pisces) –  ఈ రోజు మీరు పలు విషమ పరిస్థితులను ఎదుర్కొంటారు. అయినా సహనంతో, సమయస్ఫూర్తితో, సానుకూలతతో వ్యవహరించండి.  ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించండి. వ్యాపారంలో ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండండి. ఎన్ని సమస్యలున్నా.. గందరగోళానికి గురికావద్దు. రాజకీయ రంగంలోని వ్యక్తులు శుభవార్తలు వింటారు. 

ఈ కథనాన్ని కూడా చదివేయండి: ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.