10 జులై 2019, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి

10 జులై 2019, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి

ఈ రోజు (జులై 10) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు విద్యార్థులు మరింత శ్రద్ధగా చదవాలి. అందివచ్చిన అవకాశాలను వినియోగించుకోవాలి. ఉద్యోగస్తులకు పనిలో చాలా ఒత్తిడి ఉంటుంది. ఆఫీసులో పలు వివాదాస్పద సంఘటనలు జరిగే అవకాశాలున్నాయి. వ్యాపారస్తులకు సులభ ధన యోగం ఉంటుంది. ప్రేమికులు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. వివాహితులు ఈరోజు ఓ శుభవార్తను వింటారు. 

వృషభం (Tarus) –  ఈ రోజు మీ భాగస్వామి ఆరోగ్యం పై శ్రద్ధ చూపించండి. గృహ సమస్యలు మిమ్మల్ని బాధించే అవకాశం ఉంది. ఇలాంటి సమయాల్లోనే సహనంతో వ్యవహరించండి. మీ దినచర్యలో పలు మార్పులు చేర్పులు చేసుకుంటే మంచిది సృజనాత్మక, మార్కెటింగ్, సినిమా రంగాల్లో వారికి ఈ రోజు అనువైనది. రాజకీయ రంగంలోని వారికి బాధ్యతలు మరింత పెరుగుతాయి. అలాగే పాత మిత్రులు మిమ్మల్ని ఈ రోజు కలుస్తారు. 

మిథునం (Gemini) – ఈ రోజు మీకు మీ భాగస్వామి నుండి ఊహించని బహుమతి లభిస్తుంది. అలాగే భావోద్వేగాలను పరీక్షించే కొన్ని ఘటనలు జరుగుతాయి. ఆఫీసులో మీ ప్రత్యర్థుల నుండి సవాళ్లు ఎదుర్కొంటారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి పెరుగుతుంది. రాజకీయ రంగంలోని వ్యక్తులు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే మీరు విదేశీ ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. 

కర్కాటకం (Cancer) – ఈ రోజు క్రమశిక్షణతో పనిచేయడానికి ప్రయత్నించండి. విజయం మిమ్మల్ని వరిస్తుంది. వ్యాపారస్తులు కొత్త ప్రణాళికలను రచిస్తారు. ఉద్యోగస్తులు అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. విద్యార్థులు, నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వివాహితులు గృహ వినియోగ వస్తువులను కొనుగోలు చేయవచ్చు. చట్టపరమైన వివాదాలన్నీ కూడా పరిష్కార దశకు వస్తాయి. 

సింహం (Leo) –  ఈ రోజు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిచండి. ముఖ్యంగా అప్పులు ఇచ్చే విషయం లేదా పుచ్చుకొనే విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే వాహన నిర్వహణ ఖర్చులు పెరగవచ్చు. మీకు మీ తల్లిదండ్రుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. అలాగే ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. అదేవిధంగా వివాహితులకు భాగస్వామితో సంబంధాలు బలంగా మారతాయి. ఉద్యోగస్తులకు బదిలీలు సంభవించే అవకాశముంది. 

క‌న్య (Virgo) – ఈ రోజు ఇంట్లో పనిచేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. మోకాలి నొప్పులు లేదా కీళ్ల నొప్పులు మిమ్మల్ని వేధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ దినచర్యను క్రమబద్ధీకరించండి. రాజకీయ రంగంలోని వ్యక్తులు ఊహించని సంఘటనలు ఎదుర్కొంటారు.. వ్యాపారంలో ఉన్న అడ్డంకులు తొలగించబడతాయి. కోర్టు కేసులు, వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. 

ఈ కథనం కూడా చదవండి: ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట 

తుల (Libra) – ఈ రోజు వివాహితులు తమ భాగస్వామితో సాధ్యమైనంత ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. తన మనసులో భావాలను తెలుసుకోండి. మీ మధ్యనున్న మనస్పర్థలను తొలిగించుకోవడానికి ఇదే మంచి అవకాశం. అలాగే వ్యాపారస్తులకు ఈ రోజు లాభసాటిగా గడుస్తుంది. ఉద్యోగస్తులకు తమ నిజాయతే వారి లక్ష్యాన్ని సాధించడంలో తోడ్పడుతుంది. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండండి. నిరుద్యోగులు ఓ శుభవార్తను వింటారు. 

వృశ్చికం (Scorpio) – ఈ రోజు వాతావరణ మార్పులు మిమ్మల్ని ప్రభావితం చేయవచ్చు. కనుక దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే ఆఫీసులో మీకు అధికారుల మద్దతు లభిస్తుంది. అయినా ప్రత్యర్థుల నుండి పోటీని తట్టుకొని పనిచేయాల్సి రావచ్చు. అలాగే పోటీ పరీక్షలలో విద్యార్థులు విజయం సాధించే అవకాశం ఉంది. వివాహితులు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. 

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు మీరు ఖరీదైన బహుమతులను అందుకుంటారు. స్థిరాస్థి రంగంలోని వారికి లాభసాటిగా ఉంటుంది. అలాగే సమాజంలో పేరు, ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. వివాహితులు తమ భాగస్వామితో సరదాగా గడుపుతారు. సృజనాత్మక, మార్కెటింగ్ రంగంలోని వారికి పురోగతి ఉంటుంది. మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలకు ఈ రోజు పరిష్కారం లభిస్తుంది. 

ఈ కథనాన్ని కూడా చదివేయండి: ఈ రాశుల వ్యక్తులు.. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు.. ఎందుకంటే..? 

మకరం (Capricorn) – ఈ రోజు నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. వివాహితులు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు సులభ ధనయోగం ఉంది. రాజకీయ రంగంలోని వారికి కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. విద్యార్థులకు కూడా విజయం సిద్ధిస్తుంది. ముఖ్యంగా కోర్టుకేసులు, ఆస్తికి సంబంధించిన లావాదేవీలన్నీ ఈ రోజు ఒక కొలిక్కి వస్తాయి. 

కుంభం (Aquarius) –  ఈ రోజు కొత్త ఉద్యోగ ప్రయత్నాలను వాయిదా వేసుకుంటే బెటర్. ఆఫీసులో మీ ప్రత్యర్థుల కదలికలను ఓ వైపు కనిపెడుతూ ఉండండి. మీరు తీసుకొనే అనాలోచిత నిర్ణయాలు.. మీ జీవితాన్ని ప్రభావితం చేయవచ్చు. కనుక జాగ్రత్తగా ఉండండి. వివాహితులకు ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారస్తులు ఏజెంట్లు, బ్రోకర్లను నమ్మే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమికులు తమ భాగస్వామి భావాలను అర్థం చేసుకోండి. ఈ  రోజు మీ పాత స్నేహితులు మిమ్మల్ని కలుస్తారు. 

మీనం (Pisces) – ఈ రోజు మీ ఆస్తి వివాదాలన్ని ఒక కొలిక్కి వస్తాయి. మీకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు మొండీ బాకీలు వసూలు అవుతాయి. అలాగే కొత్త ఒప్పందాలు కూడా చేసుకుంటారు. వివాహితులు సంతానం విషయంలో ఓ శుభవార్తను వింటారు. ఉద్యోగస్తులు పదోన్నతి పొందే అవకాశం ఉంది. రాజకీయ రంగంలోని వారికి సామాజిక గౌరవం పెరుగుతుంది. 

ఈ కథనాన్ని కూడా చదివేయండి: ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.