11 జులై 2019, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి

11 జులై 2019, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి

ఈ రోజు (జులై 11) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు మీకు సులభ ధనయోగం ఉంది. అలాగే పలు శుభవార్తలు కూడా వింటారు. కొత్త ప్రణాళికలు విజయవంతమవుతాయి. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపండి. రాజకీయ రంగంలోని వారికి సామాజిక కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభిస్తాయి.

వృషభం (Tarus) –  ఈ రోజు అత్యవసర పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఆఫీసులో అధికారులతో పలు వివాదాలు ఏర్పడతాయి. వ్యాపారస్తులు దూర ప్రయాణాలు చేస్తారు. వివాహితులకు భాగస్వామితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటప్పుడే సహనంతో వ్యవహరించండి.  కోపాన్ని నియంత్రించుకోండి. సామరస్యంతో సమస్యలను పరిష్కరించండి. 

మిథునం (Gemini) – మీ తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. వ్యాపారంలో సమస్యలు అధిగమించబడతాయి. ఆఫీసులో ఉద్రిక్త పరిస్థితులు ఎదురైనా... ఆఖరికి అన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. వివాహితులకు ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ పాత మిత్రులు మిమ్మల్ని కలిసే అవకాశం ఉంది. 

కర్కాటకం (Cancer) – ఈ రోజు మీకు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ప్రేమికుల మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశముంది. కనుక ఇలాంటప్పుడే సహనంతో వ్యవహరించండి. ఆఫీసులో మీ పనికి ప్రాధాన్యం పెరుగుతుంది. అలాగే వ్యాపారస్తులకు సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. రాజకీయ రంగంలోని వ్యక్తులు.. కోరుకున్న విజయాన్ని సాధించే అవకాశం ఉంది. 

సింహం (Leo) – నిరుద్యోగులు ఈ రోజు తమ కెరీర్‌కు సంబంధించి శుభవార్తలు వింటారు. వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టులు టేకప్ చేస్తారు. ఉద్యోగస్తులు తమ వాక్చాతుర్యంతో.. అధికారులను ఆకట్టుకుంటారు. అదేవిధంగా మీకు సామాజిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. సృజనాత్మక, మార్కెటింగ్, సినిమా రంగాల్లోని వ్యక్తులకు ఈ రోజు పురోగతి ఉంటుంది.

క‌న్య (Virgo) – ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ముఖ్యంగా ధనం, విలువైన వస్తువులను బయటకు తీసుకెళ్లకుండా.. ఇంట్లో భద్రపరచడమే శ్రేయస్కరం. అలాగే ఈ రోజు ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి.  ఉద్యోగస్తులు నిజాయతీతో వ్యవహరించడం మంచిది. మీ మంచితనమే మీకు శ్రీరామరక్షగా ఉంటుంది.  వ్యాపారస్తులు ఏజెంట్లు, బ్రోకర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 

ఈ కథనం కూడా చదవండి: ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట 

తుల (Libra) –  ఈ రోజు దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం లభిస్తుంది. వివాహితులు  దూరప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆఫీసులో వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారస్తులకు ఈ రోజు సులభ ధనయోగం ఉంది.  రాజకీయాల్లోని వ్యక్తులకు పరపతి పెరుగుతుంది. ఉద్యోగస్తులు ప్రస్తుతం అదనపు కెరీర్ అవకాశాల గురించి ఆలోచించకపోవడం బెటర్. 

వృశ్చికం (Scorpio) – ఈ రోజు మీ కుటుంబంలో మనస్పర్థలు లేదా అభిప్రాయ బేధాలు చోటు చేసుకోవచ్చు. వ్యాపారస్తులు ఆర్ఠిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ప్రత్యర్థులను ఓ కంట కనిపెడుతూ ఉండండి.  విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి. సృజనాత్మక, మార్కెటింగ్, సినిమా రంగాల్లో వారికి పురోగతి ఉంటుంది. వివాహితులకు భాగస్వామి నుండి భావోద్వేగ మద్దతు లభిస్తుంది.

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు మొత్తం బిజీగా గడుస్తుంది. వ్యాపారస్తులు బ్రోకర్లతో డీల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాహన వినియోగంలో జాగ్రత్త వహించండి. విద్యార్థులకు విజయం సిద్ధిస్తుంది. పాత స్నేహితులు మిమ్మల్ని ఈ రోజు కలుస్తారు. వివాహితులకు సులభ ధనయోగం ఉంది. అలాగే ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 

ఈ కథనాన్ని కూడా చదివేయండి: ఈ రాశుల వ్యక్తులు.. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు.. ఎందుకంటే..? 

మకరం (Capricorn) – వ్యాపారస్తులకు ఈ రోజు కొత్త ఆదాయ వనరులు సమకూరుతాయి. అలాగే ఖరీదైన బహుమతులు పొందే అవకాశం ఉంది. అయితే పలు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. విద్యార్థులకు పరీక్షలలో విజయం సిద్దిస్తుంది. అలాగే క్రీడలపై కూడా ఆసక్తి పెరగుతుంది. ఉద్యోగస్తులు దూర ప్రయాణాలు చేస్తారు. అయితే ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టడం అవసరం. 

కుంభం (Aquarius) –  ఈ రోజు మీరు పలు సమావేశాలు, చర్చల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులు ఒత్తిడికి తలొగ్గి పనిచేయాల్సి ఉంటుంది. వ్యాపారస్తులకు ఆర్థిక పరిస్థితులు బలంగా ఉంటాయి. షెడ్యూల్ చేసిన ప్రణాళికలు సకాలంలో పూర్తవుతాయి. వివాహితులకు భాగస్వామి వల్ల ఒక లాభం చేకూరుతుంది. అయితే ఆదాయ-వ్యయ వ్యవహారాలపై నియంత్రణ ఉంచండి.

మీనం (Pisces) – ఈ రోజు ఆఫీసులో మీకు కొన్ని ప్రతికూల సంఘటనలు ఎదురుకావచ్చు. కానీ మీరు వివేకంతో ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకోవచ్చు. ఈ క్రమంలో ప్రత్యర్థుల సవాళ్లను కూడా స్వీకరించడానికి ప్రయత్నించండి. వ్యాపారస్తులు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాల్సిన సమయం. అలాగే కోర్టుకేసులు, ఆస్తి తగాదాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. అయితే కొన్ని విషయాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. 

ఈ కథనాన్ని కూడా చదివేయండి: ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.