12 జులై, 2019 - ఈ రోజు రాశిఫలాలు చదివేయండి

12 జులై, 2019 - ఈ రోజు రాశిఫలాలు చదివేయండి

ఈ రోజు (జులై 12) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు మీరు మీ మానసిక ఒత్తిడిని అధిగమిస్తారు. అలాగే భాగస్వామి నుండి బహుమతులు పొందుతారు. అదేవిధంగా డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక విషయాలలో జాగరూకతతో వ్యవహరించండి. మనోధైర్యం కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనండి. అలాగే, కోర్టు కేసులు, ఆస్తి లావాదేవీల నుండి విముక్తి పొందుతారు. 

వృషభం (Tarus) – ఈ రోజు ఆఫీసులో ఒత్తిడిని తట్టుకొని పనిచేయాల్సి ఉంటుంది. అలాగే ప్రత్యర్థుల సవాళ్లను స్వీకరిస్తారు. వ్యాపారంలో హెచ్చుతగ్గుల పరిస్థితి ఉంటుంది. కేవలం నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు చాలా మంచి అవకాశాలను కోల్పోవచ్చు. అందుకే కష్టపడడం మంచిది. వివాహితులకు తమ భాగస్వామి మద్దతు, సహకారం లభిస్తాయి. 

మిథునం (Gemini) –  ఈ రోజు వ్యాపారస్తులు కొత్త కాంట్రాక్టులు చేపడతారు. అలాగే సులభ ధనయోగం కూడా ఉంటుంది. ఉద్యోగస్తులు కొత్త ప్రణాళికలు వేస్తారు. వివాహితులకు భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది. అలాగే ఈ రోజు మీకు ఏదో బహుమతి లభించే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే సామాజిక గౌరవం కూడా పెరుగుతుంది.  పోటీ పరీక్షలలో విద్యార్థులకు విజయం సిద్ధిస్తుంది. 

కర్కాటకం (Cancer) –  ఈ రోజు ఆఫీసులో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవచ్చు. కనుక జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యంగా వివాదాల జోలికి పోవద్దు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు.. శక్తివంచన లేకుండా చదవాల్సి ఉంటుంది. వ్యాపారస్తులకు సులభ ధనయోగం ఉంది. వివాహితులు సంసారంలో ఆనందాన్ని చవిచూస్తారు.  

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

సింహం (Leo) –  ఈ రోజు మీకు ఆందోళనకరంగా ఉంటుంది. అయినా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లండి. మీ నిజాయతీ మాత్రమే మీకు శ్రీరామరక్ష. ఉద్యోగస్తులకు ఆఫీసులో ఒత్తిడి కూడా పెరుగుతుంది. అయినా సహనాన్ని కోల్పోవద్దు. కోపాన్ని నియంత్రించండి. మీరు కెరీర్‌లో ముందుకు వెళ్లాలంటే, పనిపై దృష్టి పెట్టండి. ప్రమోషన్ అవకాశాలు లభిస్తాయి. 

క‌న్య (Virgo) –  ఈ రోజు ప్రేమికులు ఒకరితో ఒకరు నిజాయతీగా వ్యవహరించాలి. అప్పుడే కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. వివాహితులు కూడా మీ మనసులోని భావాలను మీ భాగస్వామితో పంచుకోండి. ఉద్యోగస్తులు బద్దకాన్ని వీడి.. కష్టపడి పనిచేయడానికి ప్రయత్నించండి. వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టులు టేకప్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు ఫెయిల్యూర్ భయాన్ని వీడి.. ధైర్యంగా ముందుకు వెళ్లాలి. 

ఈ కథనం కూడా చదవండి: ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట 

తుల (Libra) – ఈ రోజు విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకుంటారు. ఉద్యోగస్తులకు తమ ఆలోచనలను అధికారులకు చెప్పే అవకాశం లభిస్తుంది. వ్యాపారస్తులు నూతన భాగస్వాములతో కీలక ఒప్పందాలు చేసుకుంటారు. అయితే డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. 

వృశ్చికం (Scorpio) – ఈ రోజు సాధ్యమైనంత వరకూ ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. అలాగే కోపాన్ని నియంత్రించుకొని.. కొన్ని సందర్బాల్లో సంయమనంతో మెలగండి. అవివాహితులకు త్వరలో నిశ్చితార్థం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే రాజకీయ రంగంలోని వారికి అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వివాహితులకు భాగస్వామితో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలోనే సహనంతో వ్యవహరించండి. 

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు మీ ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపించండి. ఉద్యోగస్తులకు తమ అధికారుల నుండి పూర్తి సహాయ, సహకారాలు లభిస్తాయి. వ్యాపారస్తులు ఏజెంట్లను నమ్మేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం బెటర్. సృజనాత్మక, మార్కెటింగ్, సినిమా రంగాల్లోని వారికి ఈ రోజు బాగా కలిసొస్తుంది. 

మకరం (Capricorn) – ఈ రోజు మీ కుటుంబ సమస్యలను చర్చలతో పరిష్కరించుకోండి. అలాగే ఉద్యోగస్తులు పని ఒత్తిడిలో పడి.. భాగస్వామికి సమయం కేటాయించడం మరిచిపోవద్దు. వ్యాపారస్తులు వివాదాస్పద విషయాలలో తల దూర్చకపోవడం మంచిది. అదేవిధంగా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అవివాహితులు శుభవార్తలు వినే అవకాశం ఉంది. 

కుంభం (Aquarius) – ఈ రోజు మీరు సోమరితనాన్ని వీడాలి. అప్పుడే పనులు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారస్తులు తమ ప్రణాళికలను నిజాయతీగా అనుసరించడం మేలు. అదేవిధంగా స్థిరాస్తి కొనుగోళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. డబ్బు చేబదులు ఇచ్చే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం బెటర్. విద్యార్థులు కాస్త కష్టపడితే.. అనుకున్న గమ్యాన్ని చేరుకోగలుగుతారు. 

మీనం (Pisces) – ఈ రోజు ఆస్తి లావాదేవీల విషయంలో  మీకు లాభం చేకూరుతుంది. కొత్త ఇల్లు కొనాలనే మీ కల పూర్తవుతుంది. వ్యాపారస్తులకు కూడా ఈ రోజంతా లాభసాటిగా గడుస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లేదా బదిలీలు సంభవించే అవకాశముంది. విద్యార్థులు ఇంకా బాగా కష్టపడి చదవాలి. ప్రేమికులు ఒకరి మీద ఒకరు నమ్మకాన్ని పెంచుకోవాలి. వివాహితులు ఓ శుభవార్తను వింటారు. 

ఈ కథనాన్ని కూడా చదివేయండి: ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.