13 జులై 2019, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి

13 జులై 2019, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి

ఈ రోజు (జులై 13) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు మీరు మానసిక ఒత్తిడిని అధిగమిస్తారు. అలాగే భాగస్వామి నుండి ఆశ్చర్యకరమైన బహుమతి లభిస్తుంది. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక విషయాలలో ఆచితూచి ప్రవర్తించండి.  అదేవిధంగా వివాహితులకు ఆధ్యాత్మిక విషయాల పై ఆసక్తి పెరుగుతంది. కోర్టు సమస్యలు, ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి వస్తాయి. 

వృషభం (Tarus) – ఈ రోజు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొనే ధోరణికి స్వస్తి చెప్పండి. అలాగే ఆఫీసులో ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొంటారు. వ్యాపారంలో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు మంచి అవకాశాలను కోల్పోవచ్చు. కుటుంబ సభ్యులు.. మీ లక్ష్యాన్ని చేరుకోవడంలో సహాయపడతారు. మీ భావోద్వేగాలను కొందరు పరీక్షించవచ్చు. 

మిథునం (Gemini) – కొత్త కాంట్రాక్టులు పొందడం వల్ల.. వ్యాపారవేత్తలకు లాభం వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. అలాగే సామాజిక కార్యక్రమాల్లో కూడా విరివిగా పాల్గొంటారు. మరోవైపు మీరు మీ స్నేహితుల నుండి ఆర్థిక సహకారం పొందుతారు. పోటీ పరీక్షలలో విద్యార్థులకు విజయం లభిస్తుంది. 

కర్కాటకం (Cancer) – ఉద్యోగులకు అధికారుల నుండి ఒత్తిడి ఉంటుంది.ఆఫీసులో కొన్ని ఉద్రిక్త పరిస్థితులు కూడా సంభవించవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు.. నిజాయతీతో చదవడానికి ప్రయత్నించండి. వ్యాపారస్తులకు సులభ ధనయోగం ఉంది. అలాగే వివాహితులకు తమ భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి..

సింహం (Leo) –  ఈ రోజు మీకు ఆందోళనను కలిగించే సంఘటనలు జరగవచ్చు. అలాగే ఉద్యోగులకు కూడా ఒత్తిడి బాగా పెరుగుతుంది. ముఖ్యంగా కోపాన్ని నియంత్రించండి. మీరు కెరీర్‌లో ముందుకు వెళ్లాలంటే, పనిపై దృష్టి పెట్టండి. అప్పుడే ప్రమోషన్ అవకాశాలు లభిస్తాయి. అక్కరకు రాని స్నేహాలకు దూరంగా ఉండండి. వివాహితులకు భాగస్వామి మద్దతు లభిస్తుంది. 

క‌న్య (Virgo) –  ప్రేమికులు కొన్ని విషయాలలో నిజాయతీగా వ్యవహరించడం మంచిది. వివాహితులు తమ భాగస్వామితో ఏర్పడే మనస్పర్థలను తొలిగించుకుంటారు. ఉద్యోగులు వేసుకున్న ప్రణాళికలు పూర్తవుతాయి. ఆఫీసు వాతావరణంలో కొంత మార్పు ఉండవచ్చు. వ్యాపారస్తులు ఏజెంట్లను, బ్రోకర్లను నమ్మే విషయంలో జాగ్రత్తగా ఉండండి. 

తుల (Libra) – ఈ రోజు విద్యార్థులు తమ లక్ష్యాన్ని చేరుకుంటారు. వారికి క్రీడలపై ఆసక్తి పెరుగుతుంది.  ఉద్యోగులు ఆఫీసులో అదనపు శిక్షణ లేదా ట్రైనింగ్ కార్యక్రమాలకు హాజరవుతారు. వ్యాపారస్తులకు ఈ రోజు లాభసాటిగా సాగుతుంది. రాజకీయ రంగంలోని వ్యక్తులు త్వరలోనే నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు.  అయితే వివాదాలకు దూరంగా ఉండాలి.

వృశ్చికం (Scorpio) –  ఈ రోజు ఖర్చుల విషయంలో.. ధన వినియోగంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ సహనాన్ని పరీక్షించడానికి కొందరు ప్రయత్నించవచ్చు. కనుక కోపాన్ని నియంత్రించుకోండి. వివాహితులు తమ భాగస్వామి నుండి గౌరవం మరియు ప్రేమను పొందుతారు. ప్రేమికులు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది. రాజకీయ రంగంలోని వ్యక్తులకు బాధ్యతలు పెరుగుతాయి.

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు మీరు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపించడం బెటర్. ఉద్యోగులకు అధికారుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. అలాగే వ్యాపారస్తులకు సులభ ధన యోగం ఉంది. సృజనాత్మక, మార్కెటింగ్, సినిమా రంగాల్లోని వ్యక్తులు ఫలితాలు పొందడానికి.. ఇంకా కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. వివాహితులు కొన్ని విషయాల్లో భాగస్వామితో వాదనలకు దిగకుండా ఉండడం మంచిది. 

ఈ కథనాన్ని కూడా చదివేయండి: ఈ రాశుల వ్యక్తులు.. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు.. ఎందుకంటే..? 

మకరం (Capricorn) –  ఈ రోజు కుటుంబ సమస్యలను సామరస్యంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. పని ఒత్తిడిలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. వ్యాపారస్తులకు రుణబాధ లేదా ఆర్థికపరమైన ఒత్తిడి ఉంటుంది. అయినా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లండి. మొహమాటానికి పోయి అనర్థాలను కొని తెచ్చుకోవద్దు. అలాగే దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 

కుంభం (Aquarius) – ఈ రోజు సోమరితనం మిమ్మల్ని ఆవరిస్తుంది. కోరుకున్న లక్ష్యాన్ని చేరాలంటే.. దానిని వీడాలి.  ఉద్యోగులు ప్రణాళికబద్దంగా పనిచేయాలి. వ్యాపారస్తులకు సులభ ధనయోగం ఉంటుంది. అలాగే పాత మిత్రులు మిమ్మల్ని కలుస్తారు. ప్రేమికులు తమ జీవితానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు పరీక్షలలో మంచి ఫలితాలను పొందుతారు.

మీనం (Pisces) –  ఈ రోజు మీ ఆస్తి సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. స్థిరాస్తి కొనుగోళ్ల విషయంలో కూడా మీరు బిజీగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఆఫీసులో అధికారుల మద్దతు మీకు లభిస్తుంది. వ్యాపారస్తులు కూడా ఈ రోజు తీరిక లేకుండా గడుపుతారు. కొత్త ప్రాజెక్టులను టేకప్ చేస్తారు. అయితే నిర్లక్ష్యంతో ప్రవర్తించడం వల్ల.. చిన్న చిన్న తప్పులు జరగవచ్చు. వివాహితులు ఈ రోజు ఆనందంగా గడుపుతారు.  

ఈ కథనాన్ని కూడా చదివేయండి: ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.