ఈ రోజు (జూలై 24) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం
మేషం (Aries) – ఈ రోజు సృజనాత్మక రంగంలోని వ్యక్తులకు అనుకోని ఛాలెంజింగ్స్ ఎదురవుతాయి. అలాగే రాజకీయ నాయకులకు బాధ్యతలు పెరుగుతాయి. ఇక వ్యాపారస్తులకు ఆర్థికంగా బలంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యం పై శ్రద్ధ వహించండి. కోర్టు వ్యవహారాల్లో వివేకంగా ఆలోచించండి. వాహన వినియోగంలో జాగ్రత్తగా ఉండండి.
వృషభం (Tarus) – ఈ రోజు రియల్ ఎస్టేట్ రంగంలోని వ్యక్తులకు లాభసాటిగా ఉంటుంది. అలాగే ఈ రోజు ఈ రాశివారికి బహుమతులు లేదా ఖరీదైన కానుకలు అందుతాయి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు విజయం సిద్ధిస్తుంది. ప్రేమికులు ఈ రోజు హాయిగా, ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది.
మిథునం (Gemini) – ఈ రోజు వ్యాపారస్తులకు చాలా సాధారణంగా గడుస్తుంది. అలాగే ఉద్యోగస్తులకు ఆఫీసులో కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అలాగే వివాహితులు ఓ శుభవార్త వింటారు. సృజనాత్మక, మార్కెటింగ్, సినిమా రంగాల్లో వారికి ఈ రోజు కలిసొస్తుంది. విద్యార్థులు ఇంకా బాగా కష్టపడి చదవాలి. కోర్టు వ్యవహారాలలో కాస్త వివేకంతో వ్యవహరించండి.
కర్కాటకం (Cancer) – ఈ రోజు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే ఉద్యోగస్తులు ఆఫీసులో ఎలాంటి ఒత్తిడి లేకుండా హాయిగా పనిచేసుకుంటారు. వ్యాపారస్తులకు బిజినెస్ విషయంలో హెచ్చుతగ్గుల పరిస్థితి అలాగే ఉంటుంది. వివాహితులకు కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.
సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?
సింహం (Leo) – ఈ రోజు మీరు ఇతరుల సహాయం తీసుకోవడంలో విజయవంతమవుతారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో గౌరవం, ప్రతిష్ట పెరుగుతాయి. వ్యాపారస్తులకు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వివాహితులకు కుటుంబ సమస్యల నుండి కాస్త ఉపశమనం లభిస్తుంది. అయితే దూర ప్రయాణాలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి.
కన్య (Virgo) – ఈ రోజు పోటీ పరీక్షలకు అటెండ్ అయ్యే విద్యార్థులకు విజయం లభిస్తుంది. ఉద్యోగులు జాబ్ మారే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఇది శుభ పరిణామం. తాము ప్రారంభించిన ప్రాజెక్టు విజయవంతమవుతుంది. అలాగే వివాహితులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు కూడా బలంగా ఉంటాయి. ప్రేమికులు కూడా తమ బంధం పై ఒక స్పష్టత తెచ్చుకుంటారు.
తుల (Libra) – ఈ రోజు బిజినెస్ చేసేవారు చాలా ఛాలెంజింగ్స్ ఎదుర్కొంటారు. వ్యాపార ఒప్పందాన్ని రద్దు చేయడం వల్ల ఆర్థిక నష్టం జరుగుతుందని భావిస్తారు. అలాగే వాహన నిర్వహణలో ఖర్చులు పెరగవచ్చు. అలాగే ఉద్యోగులు నిజాయతీగా పనిచేయడానికి ప్రయత్నించాలి. ప్రత్యర్థులు కూడా చురుకుగా ఉంటారు. ముఖ్యంగా వివాదాలకు దూరంగా ఉండాలి.
వృశ్చికం (Scorpio) – ఈ రోజు మీరు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. అలాగే పెండింగ్ పనులన్నీ కూడా ఈ రోజు ఒక కొలిక్కి వస్తాయి. రాజకీయ నాయకులకు సామాజిక గౌరవం పెరుగుతుంది. అలాగే ఆర్థికంగా కూడా ఈ రోజు ఈ రాశివారికి బాగుంటుంది. వ్యాపారస్తులకు సులభ ధనయోగం ఉంటుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది.
ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం
ధనుస్సు (Saggitarius) – ఈ రోజు బంధువులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అయినా సహనంతో వ్యవహరించండి. కొన్ని సమస్యలను సమయస్ఫూర్తితో పరిష్కరించుకోండి. అదేవిధంగా వ్యాపారస్తులు ఏజెంట్లు లేదా బ్రోకర్లతో డీల్ చేసేటప్పుడు అప్రమత్తతతో వ్యవహరించండి. అలాగే వివాహితులకు ఈ రోజు ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది.
మకరం (Capricorn) – ఈ రోజు తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో కాస్త శ్రద్ధ చూపించండి. అలాగే కుటుంబంలో ఈరోజు ఈ రాశివారికి సరదా వాతావరణం ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు పని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రత్యర్థులు మీ తప్పులను ఎంచేందుకు సిద్ధమవుతున్నారు. విద్యార్థులకు కళలు, సాహిత్యంపై ఆసక్తి పెరుగుతుంది.
ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి..
కుంభం (Aquarius) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు పలు శుభవార్తలు వింటారు. అలాగే కుటుంబంలో వివాహితులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో అనుకోని ప్రాజెక్టులు లభిస్తాయి. అలాగే గౌరవం కూడా పెరుగుతుంది. వ్యాపారస్తులకు సులభ ధనయోగం ఉంటుంది. అయితే ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి.
మీనం (Pisces) – ఈ రోజు మీ ఆర్థిక స్థితి అనుకోని మలుపు తిరుగుతుంది. మీ స్నేహితులు లేదా సోదరులు మిమ్మల్ని ఆదుకుంటారు. అలాగే కుటుంబంలో సరదా వాతావరణం బాగుంటుంది. అయితే ప్రత్యర్థులు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా ఉండండి. అలాగే వ్యాపారస్తులు దూర ప్రయాణాలు చేస్తారు.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు
అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.