ADVERTISEMENT
home / Astrology
25 జులై 2019, (గురువారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

25 జులై 2019, (గురువారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (జూలై 25) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు సోమరితనాన్ని వీడి ఉద్యోగులు పనిచేయాల్సి ఉంటుంది. అప్పుడే మీ పనికి తగిన గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. అలాగే ఈ రోజు మీ స్నేహితులు.. మిమ్మల్ని ఓ విషయంలో ఆదుకొనే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఈ రోజు సులభ ధనయోగం ఉంటుంది. అయితే దూర ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది.  

వృషభం (Tarus) –  ఈ రోజు వ్యాపారస్తులకు, ఏజెంట్లకు అనుకోని అదృష్టం కలిసొస్తుంది. విద్యార్థులు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కూడా శుభవార్తలు వింటారు. షేర్ మార్కెట్, మార్కెటింగ్ రంగాలలోని వ్యక్తులకు.. తమ కార్యకలాపాలలో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు మెండుగా ఉన్నాయి. వివాహితులు తమ భాగస్వామితో కలిసి పార్టీలు లేదా ఫంక్షన్లకు హాజరవుతారు. 

మిథునం (Gemini) –  వివాహితులకు ఈ రోజు.. తమ భాగస్వామి నుండి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి.  అలాగే వ్యాపారస్తులు నమ్మకం కుదిరే చోటున మాత్రమే పెట్టుబడి పెట్టడం మంచిది.  అయితే కోర్టు లావాదేవీలు, ఆస్తి వ్యవహారాల్లో మాత్రం చాలా అప్రమత్తతతో వ్యహరించాలి. రాజకీయ రంగంలోని వ్యక్తులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి.  

ADVERTISEMENT

కర్కాటకం (Cancer) –   ఈ రోజు కుటుంబ లావాదేవీలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకొనేటప్పుడు.. చాలా జాగ్రత్తగా ఉండండి.  విద్యార్థులకు హార్డ్ వర్క్ అవసరం. స్టాక్ మార్కెట్ రంగంలోని వారికి పురోగతి ఉంటుంది. మీకు మీ ప్రత్యర్థుల నుండి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వాహన వినియోగంలో జాగ్రత్తగా వ్యవహరించండి

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

సింహం (Leo) – ఈ రోజు మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అలాగే వివాహితులు అత్తమామల నుండి ఖరీదైన బహుమతులు పొందే అవకాశం ఉంది.  విద్యార్థులు లేదా పోటీ పరీక్షలకు హాజరయ్యేవారు.. విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో చాలా ఒత్తిడి ఉంటుంది. వ్యాపారస్తులు ఏజెంట్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.

క‌న్య (Virgo) – విద్యార్థులు తమ సమయాన్ని వృథా చేయకుండా ఉంటే బెటర్. ఉద్యోగస్తులకు ఆఫీసులో పని ఒత్తిడి ఉంటుంది. అయినా మీరు ఆత్మస్థైర్యంతో, సమయస్ఫూర్తితో నెగ్గుకొస్తారు. వ్యాపారస్తులకు సులభ ధనయోగం ఉంటుంది . కొన్ని విషయాల్లో మీరు నిర్లక్ష్యాన్ని వీడండి. వివాహితులకు భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. 

ADVERTISEMENT

తుల (Libra) – ఈ రోజు  అనవసరమైన ఖర్చులు మీకు మానసిక ఒత్తిడిని కలిగిస్తాయి.పనులు పెండింగ్‌లో ఉండడం వల్ల మీకు చిరాకుగా ఉంటుంది. అలాగే ఈ రోజు మీరు కొన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మంచిది. అలాగే ఆఫీసులో అధికారులతో సంబంధాలు మెరుగ్గా ​​ఉంటాయి. యువత రాజకీయ రంగంపై మక్కువ చూపిస్తారు. 

వృశ్చికం (Scorpio) – ఈ రోజు స్నేహితులు, బంధుమిత్రులతో మీ ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది. అలాగే పిల్లల కదలికలను గమనిస్తూ ఉండండి.  వివాహితులకు తమ భాగస్వామితో సంబంధాలు బలంగా ఉంటాయి. వ్యాపార భాగస్వామ్యంలో ప్రయోజనం ఉంటుంది. అయితే ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) –  నిరుద్యోగులు ఈ రోజు శుభవార్తలు వింటారు. వ్యాపారస్తులు తమ బిజినెస్ విస్తరించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించవచ్చు. లేదా బదిలీలు సంభవించవచ్చు. రాజకీయ నాయకులకు సామాజిక ప్రతిష్ట, సంపద పెరుగుతాయి.అలాగే పాత మిత్రులు మిమ్మల్ని ఈ రోజు కలుస్తారు. కుటుంబంలో కూడా సరదా వాతావరణం ఉంటుంది. 

ADVERTISEMENT

మకరం (Capricorn) – ఈ రోజు మీరు పాత పనులు ఒక కొలిక్కి రాకుండా.. కొత్త పనులను ప్రారంభించకుండా ఉంటే మంచిది. అలాగే ఖర్చులను ట్రాక్ చేయండి. వ్యాపారస్తులకు ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండండి. సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగాలలో వారికి పురోగతి ఉంటుంది. వివాహితులకు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి..

కుంభం (Aquarius) – ఈ రోజు మీ ఆరోగ్య సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే కుటుంబ సమస్యలు అన్నీ కూడా సమసిపోతాయి. వ్యాపారస్తులు బిజినెస్‌లో మంచి ఫలితాలను పొందుతారు.  అలాగే పాత మిత్రులు మిమ్మల్ని కలుస్తారు. ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి. నిజాయతీతో పని చేసుకుంటూ వెళ్లాలి. ప్రత్యర్థులు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. 

మీనం (Pisces) –  వివాహితులు తమ భాగస్వామితో బంధాన్ని పటిష్టపరచుకోవలసి ఉంటుంది. తన మనోభావాలను ఎట్టి పరిస్థితిలోనూ గాయపరచవద్దు. అలాగే పిల్లల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండంది. సాఫ్ట్‌వేర్, ఇంజనీరింగ్ రంగాల్లో పురోగతి ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు నూటికి పదిసార్లు ఆలోచిస్తే బెటర్. 

ADVERTISEMENT

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.

24 Jul 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT