home / Astrology
27 జులై 2019, (శనివారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

27 జులై 2019, (శనివారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (జూలై 27) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) –  ఈ రోజు ఉద్యోగులను కొన్ని ప్రతికూల అంశాలు ప్రభావితం చేసే అవకాశం ఉంది. అలాగే వివాహితులకు అనుకోని బహుమతులు లభిస్తాయి.అదేవిధంగా కుటుంబంలో సరదా వాతావరణం ఉంటుంది. వ్యాపారస్తులు ఏర్పాటు చేసుకున్న సమావేశాలు ఫలప్రదంగా ముగుస్తాయి. ఈ రోజు సృజనాత్మక రంగంలోని వారికి లాభసాటిగా ఉంటుంది. 

వృషభం (Tarus) –  ఈ రోజు మీ కుటుంబ సమస్యలు.. మీకు ఒకవిధమైన మానసిక ఒత్తిడిని కలిగించవచ్చు. అయినా సహనంతో వ్యవహరించండి. కోపాన్ని నియంత్రించుకోండి. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించండి. ప్రేమికులు కొన్ని నిర్ణయాలు తీసుకొనేటప్పుడు.. ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. అలాగే కోర్టు వ్యవహారాలు, చట్టపరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండండి.                                               

మిథునం (Gemini) –  ఈ రోజు  మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆర్థికపరమైన విషయాలలో అప్రమత్తతతో వ్యహరించండి. మీ స్నేహితులు కొన్ని విషయాలలో మీకు పూర్తి సహకారం అందిస్తారు. అదేవిధంగా ఆఫీసులో వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. అన్నింటికన్నా మించి వృత్తి భాగస్వామ్యం వల్ల మీకు అనుకోని ప్రయోజనం కలుగుతుంది.  

కర్కాటకం (Cancer) –   ఈ రోజు విద్యార్థులు లేదా నిరుద్యోగులు సోమరితనాన్ని వీడాల్సి ఉంది. అవే మీ విజయానికి ప్రతిబంధకాలుగా నిలుస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులు ఆదాయ-వ్యయంలో సమతుల్యతను పాటించడం మంచిది. ఉద్యోగస్తులు ఈ రోజు పెండింగ్ పనులను పూర్తి చేయడం మంచిది. లేదా అవే పనులు.. మీ కెరీర్ పై ప్రభావం చూపిస్తాయి. 

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

సింహం (Leo) – ఈ రోజు మీ కుటుంబంలో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. కనుక సహనంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించండి. సాధ్యమైనంత వరకు ఓపికగా ఉండండి. అలాగే మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా మీ సమస్యలను పరిష్కరించుకుంటే బెటర్. ఇక ఉద్యోగులు ఆఫీసులో ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొంటారు. అలాగే వివాహితులకు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. 

క‌న్య (Virgo) – ఈ రోజు ఉద్యోగస్తులు మంచి వార్తలు వింటారు. మీ కెరీర్‌కు సంబంధించి కొత్త అవకాశాలను పొందుతారు. అలాగే వ్యాపారస్తులకు సులభ ధనయోగం ఉంటుంది. అదేవిధంగా మీరు తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. స్నేహితుల నుండి కూడా మీకు సాధ్యమైనంత మద్దతు లభిస్తుంది. ప్రేమికులకు పరిస్థితి నిరాశజనకంగా ఉంటుంది. అయినా పట్టుదలను వీడకుండా.. ఆత్మస్థైర్యంతో ముందుకువెళ్లండి. నిజాయతీగా వ్యవహరించండి. 

తుల (Libra) – ఈ రోజు అదృష్టదేవత మీ తలుపు తడుతుంది. వ్యాపారస్తులకు ధన,వస్తు,వాహన యోగం ఉంటుంది. అలాగే వివాహితులు తమ భాగస్వామి నుండి ఖరీదైన బహుమతులను పొందుతారు. అదేవిధంగా ఎప్పటి నుండో తీరకుండా ఉండిపోయిన మీ చిరకాల కోరిక నెరవేరుతుంది. అయితే విద్యార్థులకు, పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఇది సవాళ్లను ఎదుర్కొనే సమయం. 

వృశ్చికం (Scorpio) – ఈ రోజు మీరు పాజిటివ్‌గా ఆలోచించండి. మీ సానుకూల ధోరణే మీకు మరిన్ని అవకాశాలను అందిస్తుంది. అలాగే ఉద్యోగస్తులు  అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి నిజాయతీగా వ్యవహరించాలి. నిరుద్యోగులు, పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు విజయాన్ని కాంక్షించాలంటే.. ప్లానింగ్ అనేది ముఖ్యమని తెలుసుకోవాలి. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) –   ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆనంద డోలికల్లో తేలియాడుతారు. కుటుంబంలో సరదా వాతావరణం ఉంటుంది. భాగస్వామితో రొమాంటిక్‌గా గడుపుతారు. ఉద్యోగస్తులు కూడా ఉత్సాహంతో పనిచేస్తారు. వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టులు టేకప్ చేస్తారు. ప్రేమలో విఫలమైనవారు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. అన్నింటికన్నా మించి ఈరోజు మీలో ఆత్మవిశ్వాసం వెయ్యిరెట్లు పెరుగుతుంది.  

మకరం (Capricorn) – ఈ రోజు ఉద్యోగులకు బాగా కలిసొస్తుంది. తమ బాస్ నుండి ప్రశంసలు కూడా అందుకుంటారు. వ్యాపారులు దూర ప్రయాణాలు చేస్తారు. కొత్త వ్యక్తులను కలుస్తారు. వివాహితులు తమ భాగస్వామి సహాయంతో రుణబాధ నుండి విముక్తులవుతారు. అయితే కోర్టు వ్యవహారాలు, ఆస్తి లావాదేవీలు మొదలైన విషయాలలో వివేకంతో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి..

కుంభం (Aquarius) – ఈ రోజు నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. కొత్త ఉపాధి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. విద్యార్థులకు కళలపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు మానసిక ఒత్తిడి ఉన్నా.. ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొంటారు. వ్యాపారస్తులకు అంతా లాభసాటిగా ఉంటుంది. ప్రేమికులు నిజాయతీగా వ్యవహరించడం మంచిది. వివాహితులు భాగస్వామికి తెలియకుండా కీలక నిర్ణయాలు తీసుకోకపోవడం బెటర్. 

మీనం (Pisces) –  ఈ రోజు ఉద్యోగస్తులకు మంచి రోజు. ప్రమోషన్ అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే వ్యాపారస్తులకు సులభ ధనయోగం ఉంది. వివాహితులు విదేశీయానం చేసే అవకాశం ఉంది. అలాగే తల్లిదండ్రులు పిల్లల గురించి మంచి విషయాలు వింటారు. ప్రేమికుల సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. అయితే కొన్ని విషయాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.

26 Jul 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this