ఈ రోజు (జూలై 28) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం
మేషం (Aries) – ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో మీకు మనస్పర్థలు ఏర్పడవచ్చు. కనుక కాస్త జాగ్రత్తగా ఉండండి. వివేకంతో, సమయస్ఫూర్తితో సమస్యలను పరిష్కరించుకోండి. అలాగే గతంలో జరిగిన చేదు సంఘటనలు.. మళ్లీ మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తాయి. అలాగే వ్యాపారస్తులకు ఈ రోజు లాభసాటిగా ఉంటుంది. ఇదే క్రమంలో దూర ప్రయాణాలను వాయిదా వేసుకుంటే మంచిది. అలాగే మీ తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపించండి.
వృషభం (Tarus) – వివాహితులు ఈ రోజు.. తమ భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. అదేవిధంగా పెట్టుబడులు పెట్టే విషయంలో తస్మాత్ జాగ్రత్త. అలాాగే ఈ రోజు మీకు ఆధ్యాత్మిక విషయాలపై కూడా ఆసక్తి పెరుగుతుంది. అయితే కోర్టు వ్యవహారాలు, ఆస్తి సంబంధిత లావాదేవీలలో జాగ్రత్తగా ఉండండి.
మిథునం (Gemini) – ఈ రోజు మీకు అనుకోని విధంగా ధనం కలిసొస్తుంది. మీ పూర్వీకుల ఆస్తికి సంబంధించిన లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే మీకు ఈ రోజు ఖరీదైన బహుమతులు లభిస్తాయి. వ్యాపారస్తులకు ఆర్థికంగా బాగుంటుంది. దిగుమతి-ఎగుమతి వ్యాపారాలు చేసే వారికి బాగా కలిసొస్తుంది. అదేవిధంగా విద్యార్థులకు కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
కర్కాటకం (Cancer) – ఈ రోజు ప్రేమికులకు అనువైన దినం. తమ బంధాన్ని గురించి ఇంట్లో చెప్పడానికి శుభ తరుణమిదే. అలాగే అవివాాహితులు పెళ్లి ప్రయత్నాలు చేయడానికి.. ఈ రోజు మంచిరోజు. తల్లిదండ్రులు ఈ రోజు పలు క్లిష్టమైన విషయాలలో.. పిల్లల సహాయాన్ని పొందుతారు. అదేవిధంగా విద్యార్థులు అధ్యయనంలో ఉన్న అడ్డంకులను అధిగమించగలుగుతారు.
సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?
సింహం (Leo) – ఈ రోజు నిరుద్యోగులకు శుభదినం. కొన్ని అనుకోని అవకాశాలు తలుపు తడతాయి. అలాగే విద్యార్థులు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండడం మంచిది. ముఖ్యంగా ఈ రోజు మీ ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించే సంఘటనలు.. ఎదురుకావచ్చు. ఇలాంటి సమయంలోనే సహనంతో వ్యవహరించాలి. వివాహితులు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకొనేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి.
కన్య (Virgo) – ఈ రోజు డబ్బు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రుణాలు ఇచ్చేటప్పుడు.. తీసుకొనేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇదే అనువైన సమయం. నిరుద్యోగులు కొన్ని విషయాలలో అసంతృప్తితో ఉన్నా.. ఎట్టకేలకు విజయం సాధిస్తారు. అలాగే ఆస్తి లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి.
తుల (Libra) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. కొన్ని విషయాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మాని.. ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. విద్యార్థులు కోచింగ్ నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. వివాహితులకు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. అలాగే వ్యాపారస్తులు కీలక నిర్ణయాలు తీసుకొనేటప్పుడు.. జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చికం (Scorpio) – ఈ రోజు మీరు ఆరోగ్య విషయంలో పూర్తి శ్రద్ధ తీసుకోండి. ఏ మాత్రం ఏమరపాటు పనికిరాదు. అలాగే వ్యాపారస్తులు ఆదాయ-వ్యయంపై నియంత్రణ ఉంచండి. ముఖ్యంగా అప్పులు ఇచ్చే విషయంలో లేదా తీసుకొనే విషయంలో జాగరూకతతో వ్యవహరించండి. అలాగే నిరుద్యోగులకు ఈ రోజు శుభదినం. మంచి అవకాశాలు మీ తలుపు తడతాయి.
ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం
ధనుస్సు (Saggitarius) – ఈ రోజు ప్రేమికుల సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. అదేవిధంగా వ్యాపారస్తులకు సులభ ధన యోగం ఉంటుంది. వివాహితులకు కుటుంబంలో సరదా వాతావరణం ఏర్పడుతుంది. విద్యార్థులకు కొత్త స్నేహితులు పరిచయమవుతారు. కొత్తగా పెళ్లైన వ్యక్తులు.. భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.
మకరం (Capricorn) – ఈ రోజు మీ పనులన్నీ అనుకున్న సమయానికి.. అనుకున్న విధంగా పూర్తవుతాయి. అయితే కొన్ని విషయాలలో విద్యార్థులు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారస్తులు భవిష్యత్తు కార్యాచరణ నిమిత్తం.. కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. వివాహితులు భాగస్వామితో ప్రేమగా ఉంటే బెటర్. కొన్ని విషయాలలో సంయమనం పాటించాలి.
ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి..
కుంభం (Aquarius) – ఈ రోజు వివాహితులు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాలలో సమస్యలను నిర్లక్ష్యం చేయడం వల్ల ఆందోళన పెరుగుతుంది. కనుక పెరుగుతున్న ఖర్చులను భర్తీ చేయండి. అలాగే రుణాల విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. అలాగే వ్యాపారస్తులు ఏజెంట్లను నమ్మే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వివేకంతో వ్యవహరించాలి.
మీనం (Pisces) – ఈ రోజు మీరు ఆరోగ్యం విషయంలో శ్రద్ధగా ఉండాలి. ముఖ్యంగా ఆహారపు అలవాట్ల విషయంలో కొంత నియంత్రణ అవసరం. అలాగే వ్యాపారస్తులు ఈ రోజు ఆదాయ, వ్యయాల మధ్య సమతుల్యం పాటించాలి. తెలియని వ్యక్తులను నమ్మకపోవడం బెటర్. అలాగే ప్రేమికులు కొన్ని నిర్ణయాలు తీసుకొనేటప్పుడు.. ఆచితూచి వ్యవహరించాలి.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు
అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.