3 జులై 2019, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి

3 జులై 2019, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి

ఈ రోజు (జులై 3) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు మీ భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. అలాగే ఖర్చులు కూడా పెరుగుతాయి. మీరు  ఈ రోజంతా బిజీగా గడుపుతారు. ముఖ్యంగా మీ తల్లిదండ్రుల నుండి సహాయం పొందుతారు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అనవసర వివాదాల్లో తలదూర్చకుండా ఉంటే మంచిది. రాజకీయరంగంలోని వ్యక్తులకు బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు ఓ కొలిక్కి వస్తాయి. 

వృషభం (Tarus) –  ఈ రోజు మీకు సులభ ధనయోగం ఉంది. అలాగే పెండింగ్‌లో ఉన్న పనులన్నీ ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టులు టేకప్ చేస్తారు. ఉద్యోగస్తులు ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే.. మీ భాగస్వామితో మీకు మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమయాల్లో మీరు సహనంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించాలి.  పాత మిత్రులు మిమ్మల్ని ఈ రోజు కలుస్తారు. 

మిథునం (Gemini) – ఈ రోజు వ్యాపారస్తులు కొత్త భాగస్వాములతో కలిసి ప్రణాళికలు రచిస్తారు. అయితే ఏజెంట్లు, బ్రోకర్లతో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే కుటుంబంలో సరదా వాతావరణం ఉంటుంది. మీ భాగస్వామితో మీ బంధం కూడా బలపడుతుంది. తల్లిదండ్రులు మీకు పూర్తి సహకారాన్ని అందిస్తారు. అదేవిధంగా సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. కొత్త ఆదాయ వనరులు కూడా సమకూరుతాయి. 

కర్కాటకం (Cancer) – ఈ రోజు ఉద్యోగస్తులకు అధికారులతో విభేదాల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.  ఇలాంటి సందర్భాల్లోనే సమయస్ఫూర్తితో, వివేకంతో వ్యవహరించాలి. తొందరపడి ఏ నిర్ణయమూ తీసుకోవద్దు.వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉంటారు. అలాగే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యంగా మీ భాగస్వామితో సంబంధాలు బలంగా మారతాయి. అయితే ప్రయాణాలు చేసేటప్పుడు, వాహన వినియోగంలో జాగ్రత్తగా వ్యవహరించండి. 

సింహం (Leo) – ఈ రోజు మీరు ఖరీదైన బహుమతులు అందుకుంటారు. మీ అత్త, మామలు లేదా తల్లిదండ్రుల నుండి ఓ శుభవార్త వింటారు. వ్యాపారస్తులకు కొత్త ఆదాయ వనరులు సమకూరుతాయి. విద్యార్థులకు పరీక్షలలో విజయం సిద్ధిస్తుంది. మీ కుటుంబంలో సరదా వాతావరణం ఉంటుంది. అలాగే మీ భాగస్వామితో సంబంధాలు కూడా బలంగా మారతాయి.  అయితే మీ ఆరోగ్యం విషయంలో శ్రద్ద వహించడం అవసరం. 

క‌న్య (Virgo) –  ఈ రోజు మీ ఆఫీసులో పలు వివాదాస్పద సంఘటనలు జరిగే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకొనేటప్పుడు.. అప్రమత్తంగా ఉండాలి. సంతకాలు చేసేటప్పుడు నూటికి పదిసార్లు ఆలోచించాలి. మీరు తీసుకొనే నిర్ణయాల వల్ల మీ ఆర్థిక పరిస్థితి ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అయితే కుటుంబ సభ్యులు, మీ భాగస్వామి మీకు అన్ని విధాలుగా తమ సహాయ, సహకారాలను అందిస్తారు. 

ఈ కథనం కూడా చదవండి: ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట 

తుల (Libra) – ఈ రోజు మీ భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే ఈ రోజు మీకు కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఉద్యోగస్తులు తమ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. అలాగే మీ ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. మీ భాగస్వామితో మీకు ఏర్పడిన మనస్పర్థలు తొలిగిపోతాయి. అదేవిధంగా సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. 

వృశ్చికం (Scorpio) – ఈ రోజు మీరు మీ పాత స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. అలాగే పలు సమావేశాల్లో కూడా పాల్గొంటారు. అయితే ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ప్రత్యర్థులు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టాలని భావించినా.. అంతిమంగా మీరే విజయం సాధిస్తారు. సమాజంలో కూడా మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్టాక్ మార్కెట్ రంగంలోని వారికి ఈ రోజు కలిసొస్తుంది. 

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు నిరుద్యోగులు ఓ శుభవార్త వింటారు. అలాగే వ్యాపారస్తులకు సులభ ధనయోగం ఉంది. అదేవిధంగా మీరు ఈ రోజు పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో మీ పనులను పూర్తి చేస్తారు. కుటుంబంలో కూడా సరదా వాతావరణం ఉంటుంది. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ పాత స్నేహితులు  మిమ్మల్ని కలుస్తారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. 

ఈ కథనాన్ని కూడా చదివేయండి: ఈ రాశుల వ్యక్తులు.. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు.. ఎందుకంటే..? 

మకరం (Capricorn) – ఈ రోజు వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా కొత్త ఒప్పందాలు చేసుకొనేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. రుణాలు ఇచ్చే క్రమంలో.. తీసుకునే క్రమంలో కూడా జాగ్రత్త పడాలి. అలాగే దూర ప్రయాణాలు చేసే ఉద్దేశం ఉంటే.. వాటిని వాయిదా వేసుకోవడం బెటర్.  కుటుంబంలో కూడా కాస్త ఉద్రిక్త వాతావరణం ఉంటుంది. ఇలాంటి సమయాల్లోనే సహనంతో, సమయస్ఫూర్తితో సమస్యలను పరిష్కరించుకోవాలి. 

కుంభం (Aquarius) – ఈ రోజు అదృష్టం మీవెంటే ఉంటుంది. అయితే మీరు కొన్ని విషయాల్లో నిజాయతీగా వ్యవహరిస్తేనే.. అది మీరు కలిసొస్తుంది. అలాగే మీ ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించండి. అదేవిధంగా మీకు ఈ రోజు సృజనాత్మక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. మీకు మీ స్నేహితులు కూడా సహకరిస్తారు. అలాగే కొత్త ఆదాయ వనరులు కూడా సమకూరుతాయి. మీ భాగస్వామితో కూడా మీ బంధం బాగా బలపడుతుంది. 

మీనం (Pisces) – ఈ రోజు మీ మిత్రులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమయాల్లో కోపాన్ని నియంత్రించండి. సహనంతో వ్యవహరించండి. ఒత్తిడిని తట్టుకొని నిలబడండి. ఆఫీసులో కూడా నిజాయతీగా పని చేయండి. ఎలాంటి వివాదాల జోలికి వెళ్లవద్దు. వ్యాపారస్తులకు సులభ ధనయోగం ఉంది. అయితే కొత్త వ్యక్తులను నమ్మే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే.. మీకు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 

ఈ కథనాన్ని కూడా చదివేయండి: ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం 

 
 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.