ఈ రోజు (జులై 4) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం
మేషం (Aries) – ఈ రోజు వ్యాపార భాగస్వాముల మధ్య అభిప్రాయ భేదాలు రావచ్చు. కనుక జాగ్రత్తగా ఉండండి. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే.. పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపండి. అలాగే అక్కరరాని స్నేహాలకు దూరంగా ఉండండి. అదేవిధంగా ఆఫీసులో వివాదాస్పద విషయాల్లో మీరు జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆధ్యాత్మిక విషయాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు, ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు.
వృషభం (Tarus) – ఈ రోజు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపండి. అలాగే వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. ఉద్యోగస్తులకు తమ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. ముఖ్యంగా తమ నిజాయతీతో ఆఫీసులో అధికారులను ప్రభావితం చేస్తారు. అలాగే సంఘంలో కూడా గౌరవ, మర్యాదలను పొందుతారు. ఈ రోజు కోర్టు కేసులు, ఆస్తి లావాదేవాలు ఒక కొలిక్కి వస్తాయి.
మిథునం (Gemini) – ఈ రోజు మీరు కొత్త పనులు ప్రారంభిస్తారు. అలాగే ఉల్లాసంగా, ఉత్సాహంగా పనిచేస్తారు. ముఖ్యంగా మీ ఆర్థిక సమస్యలు అన్నీ దూరమవుతాయి. రాజకీయ రంగంలోని వ్యక్తులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. రియల్ ఎస్టేట్, మార్కెటింగ్ రంగంలోని వ్యక్తులకు ఈ రోజు బాగా కలిసొస్తుంది. అలాగే దూర ప్రయాణాలు కూడా చేస్తారు. కుటుంబ జీవితానికి వస్తే.. మీకు మీ భాగస్వామి సహకారం పూర్తిగా లభిస్తుంది.
కర్కాటకం (Cancer) – ఈ రోజు మీకు కుటుంబంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. అలాగే ఆఫీసులో కొన్ని విషయాలు మీకు చికాకును కలిగించవచ్చు. అయినా సానుకూలంగా ముందుకు వెళ్లండి. విద్యార్థులు ఈ రోజు ఓ శుభవార్తను వింటారు. అలాగే మీ పాత మిత్రులు మిమ్మల్ని కలిసే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కొత్త భాగస్వాములతో ఒప్పందాలు చేసుకుంటారు. కుటుంబ జీవితం కూడా చాలా బాగుంటుంది.
సింహం (Leo) – ఈ రోజు మీ ఆఫీసులో పలు వివాదాస్పద సంఘటనలు జరిగే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా ఉండండి. నిజాయతీగా మీ పని మీరు చేసుకొని వెళ్లండి. విద్యార్థులకు ఈ రోజు శుభదినం. మంచి అవకాశాలు మీ తలుపు తట్టే ఆస్కారం ఉంది. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఏజెంట్లతో జాగ్రత్తగా వ్యవహరించండి. రాజకీయ రంగంలోని వ్యక్తులు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు.
కన్య (Virgo) – ఈ రోజు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవారికి.. అనూహ్య ఫలితాలు లభిస్తాయి. అలాగే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులకు కూడా ఈ రోజు బాగా కలిసొస్తుంది. ఈ రోజు మీకు ఖరీదైన బహుమతులు లభించే అవకాశం కూడా ఉంది. అయితే అక్కరకు రాని స్నేహాలకు దూరంగా ఉండండి. ప్రత్యర్థులు కొందరు మిమ్మల్ని ఇరకాటంలో పడేసే పరిస్థితులను కల్పించవచ్చు. అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లండి.
ఈ కథనం కూడా చదవండి: ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట
తుల (Libra) – ఈ రోజు విద్యార్థులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మిమ్మల్ని తప్పుదోవ పట్టించే సంఘటనలు జరగవచ్చు. అలాగే వ్యాపారస్తులకు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. రాజకీయ రంగంలోని వ్యక్తులు సంక్షోభ పరిస్థితుల్లో చిక్కుకోవచ్చు. ఇక కుటుంబ జీవితానికి వస్తే.. చిన్న చిన్న మనస్పర్థలు వచ్చినప్పటికీ మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకుంటారు.
వృశ్చికం (Scorpio) – ఈ రోజు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించండి. వ్యాపారస్తులకు కూడా ఈ రోజు బాగా కలిసొస్తుంది. ముఖ్యంగా కొత్త ప్రాజెక్టులు టేకప్ చేస్తారు. ఉద్యోగస్తులు కూడా ఒత్తిడిని తట్టుకొని నిలబడతారు. తమ ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొంటారు. కుటుంబ జీవితానికి వస్తే.. కొన్ని అభిప్రాయ భేదాల వల్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలోనే కాస్త సహనంతో వ్యవహరించండి.
ధనుస్సు (Saggitarius) – ఈ రోజు మీరు మీ తోబుట్టువులతో హాయిగా గడుపుతారు. కొన్ని దూర ప్రయాణాలు కూడా చేస్తారు. ఉద్యోగస్తులకు కూడా ఈ రోజు బాగా కలిసొస్తుంది. వారికి తమ అధికారుల మద్దతు లభిస్తుంది. వ్యాపారస్తులు కొత్త భాగస్వామ్యాలను ఏర్పరచుకుంటారు. విద్యార్థులు కష్టపడి చదివితే.. మంచి ఫలితాలను కచ్చితంగా పొందుతారు. అయితే వాహన వినియోగంలో జాగ్రత్తగా వ్యవహరించండి.
ఈ కథనాన్ని కూడా చదివేయండి: ఈ రాశుల వ్యక్తులు.. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు.. ఎందుకంటే..?
మకరం (Capricorn) – ఈ రోజు మీరు సామాజిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. అలాగే ఆఫీసులో ఎలాంటి ఒత్తిడి లేకుండా సాఫీగా మీ పనులు చేసుకుంటారు. మీరు చేసే పనులకు ప్రశంసలు కూడా పొందుతారు. వ్యాపారస్తులు కూడా నూతన ఉత్సాహంతో లావాదేవీలను పూర్తిచేస్తారు. ఓ శుభవార్తను కూడా వింటారు. రాజకీయరంగంలోని వారికి తొలుత కొన్ని ఎదురుదెబ్బలు తగిలినా.. ఎట్టకేలకు విజయానికి చేరువవుతారు. సృజనాత్మకత రంగంలోని వారికి ఈ రోజు మంచి ఫలితాలు సిద్ధిస్తాయి.
కుంభం (Aquarius) – ఈ రోజు వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. అలాగే ఆర్థిక ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంది. ఈ క్రమంలో రుణాలు ఇచ్చే విషయం లేదా తీసుకొనే విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. ఉద్యోగస్తులకు కూడా టార్గెట్స్ పెరుగుతాయి. కుటుంబ జీవితానికి వస్తే.. మీకు మీ భాగస్వామి సహకారం పూర్తిగా లభిస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం కూడా పెరగడానికి వారు అన్ని విధాలుగా సహకరిస్తారు.
మీనం (Pisces) – ఈ రోజు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మిమ్మల్ని కలవరపాటుకి గురి చేయవచ్చు. కనుక జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆఫీసులో పని ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. వ్యాపారస్తులు కొత్త నిర్ణయాలు తీసుకొనేటప్పుడు నూటికి పదిసార్లు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఖర్చులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయండి. విద్యార్థులు, నిరుద్యోగులు తమ కెరీర్‌కు సంబంధించి ఆఖరి నిముషం వరకూ వేచి చూడకుండా.. ముందుగానే ప్రణాళికలు వేసుకుంటే మంచిది.
ఈ కథనాన్ని కూడా చదివేయండి: ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు
అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.