5 జులై 2019, ఈ రోజు రాశిఫలాలు చదవండి

5 జులై 2019, ఈ రోజు రాశిఫలాలు చదవండి

ఈ రోజు (జులై 5) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు మీరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. అలాగే కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో కొత్త పథకాలను అమలు చేస్తారు. విద్యార్థులు కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు ఒత్తిడిని తట్టుకొని పని చేయాల్సి ఉంటుంది. నిజాయతీగా పనిచేస్తే.. అధికారుల నుండి ప్రశంసలు కూడా అందుకొనే అవకాశం ఉంది. అదేవిధంగా  రాజకీయరంగంలో పనిచేసే వ్యక్తులకు క్రియాశీలత పెరుగుతుంది.

వృషభం (Tarus) –  ఈ రోజు మీ కుటుంబీకుల్లో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలోనే సహనంతో వ్యవహరించాలి. తొందరపడి తీసుకొనే నిర్ణయాల వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదు. వ్యాపారస్తులకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అదేవిధంగా కారణం లేకుండా.. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. విద్యార్థులకు ఈ రోజు బాగా కలిసొస్తుంది. 

మిథునం (Gemini) –  ఈ రోజు పని విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని చూపించవద్దు. నిజాయతీతో వ్యవహరించండి. అదే మిమ్మల్ని కాపాడుతుంది. అలాగే మిమ్మల్ని తప్పుదోవ పట్టించడానికి పలువురు ప్రయత్నించవచ్చు. అలాంటి వారికి దూరంగా ఉండండి. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు.. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. అదేవిధంగా ఈ రోజు సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు.

కర్కాటకం (Cancer) –  ఆస్తి లావాదేవీలు, కోర్టు కేసులు ఈ రోజు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే మీరు ఈ రోజు ఓ శుభవార్త వింటారు. ఉద్యోగస్తులకు ఈ రోజు బాగా కలిసొస్తుంది. ముఖ్యంగా ఆఫీసులో పదోన్నతులు పొందే అవకాశం ఉంది. విద్యార్థులు ఉన్నత విద్య కోసం స్కాలర్‌షిప్ పొందవచ్చు. మీ పాత స్నేహితులతో సంబంధాలు మెరుగుపడతాయి. మార్కెటింగ్ రంగంలోని వ్యక్తులకు ఈ రోజు లాభసాటిగా గడుస్తుంది. 

సింహం (Leo) – ఈ రోజు మీరు పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే అవివాహితులకు కళ్యాణ ఘడియలు దగ్గర పడతాయి. ప్రేమికులకు ఈ రోజు బాగా కలిసొస్తుంది. వివాహితులకు భాగస్వామితో సంబంధాలు బలంగా మారతాయి. వ్యాపార భాగస్వామ్యంలో ప్రయోజనం ఉంటుంది. ప్రత్యర్థుల ఎత్తుగడలను మీరు తిప్పికొడతారు. రాజకీయాల్లో బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులకు అనుకోని అవకాశాలు తలుపుతడతాయి.

క‌న్య (Virgo) – పని నిర్లక్ష్యం కారణంగా మీకు ఈ రోజు కొత్త సమస్యలు తలెత్తవచ్చు. జాగ్రత్త వహించండి. అలాగే మీరు దూర ప్రయాణాలు చేసే సూచనలు  కనిపిస్తున్నాయి. పలు కోర్టు కేసులు, ఆస్తి లావాదేవీల విషయంలో ఫలితాలు అంత ఆశాజనకంగా లేకపోవచ్చు. అయినా ఆత్మ విశ్వాసంతో ముందుకువెళ్లండి. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే.. మీకు ఈ రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 

ఈ కథనం కూడా చదవండి: ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట 

తుల (Libra) – ఈ రోజు మీ కెరీర్‌లో మార్పులు సంభవిస్తాయి. ఇతర రాష్ట్రాలు లేదా విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా లభిస్తాయి. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ రోజు బాగా కలిసొస్తుంది. అయితే కొత్త పెట్టుబడులు ఆహ్వానించే విషయంలో జాగ్రత్త వహించండి. ఏజెంట్లు, బ్రోకర్లతో డీల్ చేస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండండి.  సృజనాత్మక పనులు పెరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

వృశ్చికం (Scorpio) – ఈ రోజు మీకు ఆఫీసులో ఒత్తిడి అధికంగా ఉంటుంది. వ్యాపారస్తులకు కొన్ని అనుకోని అవాంతరాలు ఎదురవుతాయి. కొందరు మీ సహనాన్ని పరీక్షించే ప్రయత్నం చేయవచ్చు. ఇలాంటి సమయాల్లోనే కోపాన్ని నియంత్రించండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. రాజకీయ రంగంలోని వారికి వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు ఇంకా కష్టపడాల్సి ఉంటుంది. 

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు మీ కుటుంబీకుల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఖర్చులను కూడా ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఉండండి. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మీరు ఎక్కువగా పాల్గొంటారు. మీ కష్టనష్టాల్లో కూడా మీ భాగస్వామి పూర్తిస్థాయి మద్దతు ఇస్తారు. ఇక ఆఫీసు విషయాలకు వస్తే.. మీకు పూర్తి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మీరు చేసే పనులకు ప్రశంసలు కూడా లభిస్తాయి. 

ఈ కథనాన్ని కూడా చదివేయండి: ఈ రాశుల వ్యక్తులు.. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు.. ఎందుకంటే..? 

మకరం (Capricorn) – ఈ రోజు పరిస్థితులన్నీ మీ భావోద్వేగాలతో ముడిపడి ఉంటాయి. అలాగే అత్యవసరమైన పనులకే తొలి ప్రాధాన్యం ఇవ్వండి. అదేవిధంగా కొత్త పరిచయాలు కలుగుతాయి. వివాదాస్పద కేసులు పరిష్కరించబడతాయి. కుటుంబంలో సరదా వాతావరణం ఉంటుంది. అలాగే మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. సామాజిక గౌరవం కూడా కలుగుతుంది. అలాగే ప్రముఖులతో కలిసి సమావేశాల్లో పాల్గొంటారు. 

కుంభం (Aquarius) – నిరుద్యోగులకు ఈ రోజు అనుకోని అవకాశాలు లభిస్తాయి. అయితే మీ సమయస్ఫూర్తిని బట్టే ఆ అవకాశాలు నిలబడతాయి. వ్యాపారవేత్తలు పలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. విద్యార్థులకు క్రీడల పై ఆసక్తి పెరుగుతుంది. ప్రేమికులు తమ సమస్యల పరిష్కారదిశగా ఆలోచిస్తారు. ఓ సరికొత్త నిర్ణయం తీసుకుంటారు. ఆలుమగలు ప్రయాణాల పట్ల మొగ్గు చూపుతారు. 

మీనం (Pisces) – ఈ రోజు ఆఫీసులో మీరు పడిన కష్టానికి ఫలితం లభిస్తుంది. కెరీర్ పరంగా కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి. విద్యార్థులలో కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారస్తులకు సులభ ధన యోగం ఉంది. ప్రేమికులు ఒక అనుకోని సంఘటనను ఎదుర్కొంటారు. ఆలుమగలు తమ మధ్య విభేదాలు ఏర్పడినా.. ఆ తర్వాత ఆ సమస్యలను వేగంగా పరిష్కరించుకుంటారు. సృజనాత్మక రంగంలోని వారికి పురోగతి ఉంటుంది

ఈ కథనాన్ని కూడా చదివేయండి: ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.