7 జులై, 2019, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి

7 జులై, 2019, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి

ఈ రోజు (జులై  7) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..


మేషం (Aries) – ఈ రోజు మీరు చేసే పనిపై పూర్తి ఏకాగ్రతను పెట్టండి. పొరపాటున చేసే చిన్న చిన్న తప్పిదాల మూలంగానే.. పెద్ద ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు చేసిన ఏ పనైనా ఒకటికి రెండుసార్లు సరి చూసుకోవడం చాలా మంచిది. అలాగే అధిక సమయం పనిలో గడపడం వల్ల కుటుంబంతో.. గడిపే సమయంపై ప్రభావం పడుతుంది. అయితే వారు మిమ్మల్ని ఈ విషయంలో తప్పక అర్థం చేసుకుంటారు. అదేవిధంగా ఆరోగ్యాన్ని ఏ మాత్రమూ అశ్రద్ధ చేయకండి.

వృషభం (Tarus) – ఈ రోజు మీరు మీ మనసు చెప్పింది చేయడానికి ప్రయత్నించండి. మీరు చేయాల్సిన పని గురించి మీకు స్పష్టత ఉన్నప్పటికీ.. కొన్ని విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకోలేరు. అలాగే కుటుంబ సభ్యుల విషయంలో గతంలో జరిగిన అంశాలను వర్తమానంలో ప్రస్తావించకండి. కొన్ని విషయాల్లో మీకు మీ స్నేహితులు కూడా సహాయపడతారు. వాళ్లిచ్చే సలహాలు అవసరం మేరకే తీసుకోండి.

మిథునం (Gemini) – ఈ రోజు మీరు చేసే పనిలో వేగం పుంజుకుంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులను మీరు పూర్తి చేస్తారు. ఈ క్రమంలో ఆఫీసులో మీ సహచరుల సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి. అతి విశ్వాసం ప్రదర్శిస్తే మీకు ఇబ్బందులు ఎదురుకాక తప్పదు. ముఖ్యంగా మీ భాగస్వామితో పలు విషయాలు మాట్లడేటప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి.

కర్కాటకం (Cancer) – మీరు చేయాల్సిన పని చాలా ఉన్నప్పటికీ.. దానిని పూర్తి చేసేందుకు మీ టీమ్ మీకు సహకరిస్తారు. ఈ క్రమంలో మీరు ఒకసారి ఒక పనిపైనే ఏకాగ్రత పెట్టడానికి ప్రయత్నించండి. మీ చుట్టూ ఉన్నవారి ఎమోషన్స్‌ని మీ పనిపై ప్రభావం చూపనీయకండి. అలాగే పనిలో పడి.. మీ కుటుంబాన్ని అశ్రద్ధ చేయవద్దు. వారికీ సాధ్యమైనంత సమయం కేటాయించండి.  

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి..

సింహం (Leo) – ఈ రోజు మీరు పలు కీలక నిర్ణయాలు తీసుకొనే సమయం. ఈ క్రమంలో మీకున్న ఐడియాలను అమలుపరచడానికి ఏమాత్రం వెనకాడకండి. మీ మనసులో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీ క్రియేటివిటీపై నమ్మకం ఉంచండి. అలాగే మీ కుటుంబ సభ్యులు చేసే సూచనలకు కూడా అధిక ప్రాధాన్యం ఇవ్వండి. అతి ముఖ్యంగా.. మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి.

క‌న్య (Virgo) – ఈ రోజు మీకు కాస్త పనిభారం ఉంటుంది.  ఉన్నట్లుండి మీరు చేయాల్సిన పని చాలా ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక కుటుంబ జీవితానికి వస్తే.. మీరు మీ భాగస్వామితో సెన్సిటివ్‌గా వ్యవహరించండి. అనవసర విషయాలకు ప్రాధాన్యతను ఇస్తూ.. మీ సంసార జీవితాన్ని అగాధంలో పడేసుకోవద్దు. 

తుల (Libra) – ఈ రోజు మీరు చేయాల్సిన పనిలో పెద్దగా మార్పు ఉండదు. కానీ కొత్త పనులు చేసేందుకు లేదా చేయాల్సిన పనులను విస్తరించుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. అలాగే మీరు కొత్త వ్యక్తులతో కలిసి పని చేయాల్సి రావచ్చు. మునుపటి కంటే మీ కుటుంబ జీవితం కూడా ప్రస్తుతం బాగుంటుంది. కానీ మరికొన్ని ఇతరత్రా కారణాల వల్ల మీ మనసులో అభద్రతాభావం కలగవచ్చు.

వృశ్చికం (Scorpio) – ఈ రోజు అన్నీ మీరు ప్లాన్ చేసుకున్నట్లుగానే జరుగుతాయి. ముఖ్యంగా పని విషయంలో ఎలాంటి సందేహాలు ఉండవు. గతంలో పూర్తి చేసిన పనికి సంబంధించి ప్రశంసలు లేదా క్రెడిట్ కూడా అందుకుంటారు. అయితే మీ కుటుంబ సభ్యులు మాత్రం పలు విషయాల్లో.. కాస్త మీకు ఇబ్బందిని కలిగించవచ్చు. మీకు ఏది ముఖ్యమో.. దానిపైనే  ఫోకస్ చేయండి.

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

ధనుస్సు (Saggitarius) – ఈ రోజంతా మీరు చేయాల్సిన పనులతో చాలా బిజీగా గడుపుతారు. మీ చుట్టూ ఉన్నవారు కూడా పని కోసం మిమ్మల్ని డిమాండ్ చేస్తారు. ఫలితంగా మీరు కూడా కొత్తగా ఏమైనా చేయడానికి ఆసక్తి చూపిస్తారు. అందుకు తగిన అవకాశాలు కూడా మీకు లభిస్తాయి.  ఇవి భవిష్యత్తులో మీకు మరిన్ని ప్రయోజనాలను చేకూరుస్తాయి. అయితే పని ఒత్తిడిలో పడి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. తగినంత విశ్రాంతి తీసుకోవడం కూడా అవసరమే అని గ్రహించండి.

మకరం (Capricorn) – మీరు కొత్త వ్యక్తులతో కలిసి పని చేయాలని భావిస్తుంటే.. ఆ అవకాశం మీకు ఈ రోజు కచ్చితంగా లభిస్తుంది. సరైన వ్యక్తితో కలిసి మీరు ఈ రోజు పని చేస్తారు. మీ కుటుంబ సభ్యులతో కలిసి ప్లాన్ చేసుకున్న వాటికి కచ్చితంగా కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చివరి నిమిషంలో ఆ ప్లాన్స్‌లో మార్పులు జరగవచ్చు. కాస్త సమయం కేటాయించుకొని మీ మెదడు, మనసుని ప్రశాంతపరుచుకోండి.

కుంభం (Aquarius) –  ఈ రోజు మీరు చేయాల్సిన పనితో పాటు మాట్లాడే మాటల్లో కూడా స్పష్టత కలిగి ఉండడం చాలా అవసరం. ఈ రోజు మీరు పాల్గొనే కొన్ని ముఖ్యమైన సమావేశాల్లో జాప్యం జరగవచ్చు. మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని ఇబ్బందిపెట్టినా వారిపై చిరాకు ప్రదర్శించకండి. దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాగే మీ కుటుంబ జీవితం కూడా కాస్త గందరగోళంగా ఉంటుంది. ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండండి. ఏ విషయాన్నీ వ్యక్తిగతంగా తీసుకోకండి.

మీనం (Pisces) – మీరు కొత్త పని మొదలుపెట్టడానికి ముందే పెండింగ్‌లో ఉన్న పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది. మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలనే తొందర ఉన్నప్పటికీ ..మీ మనసులో ఎక్కడో కాస్త అభద్రతాభావం కూడా ఉంది. కాబట్టి నిదానంగా వ్యవహరించండి. మీ కుటుంబ సభ్యులు కూడా మీకు సహాయసహకారాలు అందిస్తారు.

ఈ రాశుల వ్యక్తులు.. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు.. ఎందుకంటే..?

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.