9 జులై 2019, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి

9 జులై 2019, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి

ఈ రోజు (జులై 9) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు మీ భాగస్వామి ఆరోగ్యం మీకు ఆందోళనను కలిగించవచ్చు. అలాగే ఈ రోజు మీకు శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ప్రయాణ ఒత్తిడి కూడా ఉంటుంది. అలాగే  ఖర్చులు కూడా పెరుగుతాయి. వ్యాపారస్తులకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.  మీరు ఈ రోజు మీ తల్లిదండ్రుల సహాయం తీసుకొనే అవకాశం ఉంది. అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది. 

వృషభం (Tarus) – ఈ రోజు తల్లిదండ్రులు మీకు అన్ని విషయాల్లోనూ నైతిక మద్దతు ఇస్తారు. అలాగే వ్యాపారంలో పురోగతి ఉంటుంది. కుటుంబ వాతావరణం సరదాగా ఉంటుంది. ఆఫీసులో మరిన్ని బాధ్యతలు పెరుగుతాయి. అయితే ఆరోగ్యం విషయంలో కాస్త శ్రద్ధ చూపండి. అలాగే కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు.

మిథునం (Gemini) –  ఈ రోజు నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు విజయం సాధించే అవకాశం ఉంది. సృజనాత్మక, మార్కెటింగ్ రంగంలో వారికి లాభసాటిగా ఉంటుంది.  రాజకీయ రంగంలోని వారికి అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వివాహితులు తమ భాగస్వామితో హాయిగా, ఆనందంగా గడుపుతారు. ప్రేమికులు కొన్ని నిర్ణయాలు ఆలోచించి తీసుకోవడం మంచిది. 

కర్కాటకం (Cancer) – ఈ రోజు మీకు సరికొత్త సవాళ్లు ఎదురవుతాయి. అలాగే ఒత్తిడి కూడా ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ డబ్బు తీసుకొని బయటకు వెళ్లవద్దు. మిమ్మల్ని మోసం చేయడానికి పలువురు ప్రయత్నించే అవకాశం ఉంది.  వ్యాపారస్తులు ఏజెంట్లు, బ్రోకర్లను నమ్మే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలుమగల మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు రావచ్చు. 

సింహం (Leo) –  సుదీర్ఘ అనారోగ్యంతో బాధపడుతున్న వారికి,  ఈ రోజు ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబంలో కూడా వాతావరణం చాలా సరదాగా ఉంటుంది. వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టులు టేకప్ చేస్తారు. ఉద్యోగస్తులు నిజాయతీగా వ్యవహరించాలి. దాని వల్ల భవిష్యత్తులో ప్రయోజనం పొందుతారు. అలాగే పెండింగ్ పనులు ఈ రోజు పూర్తి అవుతాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు క్రీడల పై ఆసక్తి పెరుగుతుంది. 

క‌న్య (Virgo) – ఈ రోజు ఆలుమగలు లేదా ప్రేమికుల మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి విషయాల్లో మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా సమస్యల పరిష్కారానికి ప్రయత్నించండి. అలాగే ఈ రోజు మీ పాత మిత్రులు మిమ్మల్ని కలుస్తారు. వ్యాపారస్తులు కొత్త భాగస్వాములతో కలిసి.. నూతన ప్రాజెక్టులు టేకప్ చేస్తారు. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. 

ఈ కథనం కూడా చదవండి: ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట 

తుల (Libra) – తల్లిదండ్రులు ఈ రోజు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వారిని ఓ కంట కనిపెట్టడం మంచిది.  అలాగే మీ మనసుకు బాధ కలిగించే సంఘటనలు ఎదురుకావచ్చు. ఇలాంటి సందర్భాల్లోనే సహనంతో, సంయమనంతో వ్యవహరించాలి. విద్యార్థులకు సాహిత్యం లేదా సంగీతంపై ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారస్తులు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగస్తులకు కూడా తమ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. 

వృశ్చికం (Scorpio) – ఈ రోజు మీరు పలు శుభవార్తలు వింటారు. అలాగే మొండి బాకీలు వసూలయ్యే అవకాశం ఉంది.  కొత్త వ్యక్తులను కూడా కలుస్తారు.  వ్యాపారంలో పురోగతి ఉంటుంది. స్నేహితుల నుండి విలువైన బహుమతులను అందుకుంటారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆలుమగలు సంతోషంగా గడుపుతారు. అయితే దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. 

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు మీకు ఎంతో ఇష్టమైన వ్యక్తిని కలుస్తారు.  పాత స్నేహాలు మెరుగుపడతాయి. కుటుంబంలో కొన్ని ప్రధాన అంశాలు చర్చకు వస్తాయి. అలాగే  ఈ రోజు మీరు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యర్థులు మిమ్మల్ని ఇరకాటంలో పడేయాలని చూస్తారు. ఇలాంటి సమయాల్లోనే వివేకంతో వ్యవహరించాలి. వ్యాపారస్తులకు సులభ ధనయోగం ఉంది. ఉద్యోగస్తులకు అధికారుల అండదండలు లభిస్తాయి. 

ఈ కథనాన్ని కూడా చదివేయండి: ఈ రాశుల వ్యక్తులు.. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు.. ఎందుకంటే..? 

మకరం (Capricorn) –  విద్యార్థులు చదువు విషయంలో.. అదనపు శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. ఈ రోజు వ్యాపారం లేదా ఉద్యోగంలో అనుకోని సమస్యలు వస్తాయి. కనుక జాగ్రత్తగా ఉండండి.  ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్త పడండి. అలాగే అక్కరకు రాని స్నేహాలకు దూరంగా ఉండడం మంచిది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. మీకు మీ భాగస్వామి మద్దతు లభిస్తుంది.

కుంభం (Aquarius) –  ఈ రోజు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. అప్పులు ఇచ్చేటప్పుడు.. తీసుకొనేటప్పుడు వివేకంతో వ్యవహరించండి. బ్రోకర్లు, ఏజెంట్లతో జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులు సాధ్యమైనంత వరకూ కొత్త వ్యక్తులను నమ్మకపోవడమే మంచిది. విద్యార్థులకు సంగీతం లేదా సాహిత్య అంశాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సృజనాత్మక, మార్కెటింగ్ రంగాల్లో వారికి ఈ రోజు లాభసాటిగా సాగుతుంది. 

మీనం (Pisces) – ఈ రోజు నిరుద్యోగులు, విద్యార్థులు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. మీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి కొందరు ప్రయత్నిస్తారు. అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లండి. మీ భాగస్వామితో మీ బంధాలు మరింత మెరుగుపడతాయి. అలాగే ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రేమికులు కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే బెటర్. 

ఈ కథనాన్ని కూడా చదివేయండి: ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.